దివ్యదేశ వైభవ ప్రకాశికా/తిరువాట్టార్

68. తిరువాట్టార్ 10

శ్లో. శ్రీ వాట్టారు పురే భుజంగ శయన శ్శ్రీరామ తీర్థాంచితే
   త్వష్టాంగాహ్వయ మాదికేశవ విభు ర్వైమాన మాప్త శ్రియమ్‌|
   దేవీం మారతకోన పూర్వలతికాం సంప్రాప్య పశ్చాన్ముఖ:
   స్తుత్య: చంద్ర పరాశరాక్షి విషయో రేజే శఠారేర్మునే:||

వివ: ఆదికేశవ పెరుమాళ్-మరకతవల్లి తాయార్(పద్మిని)-శ్రీరామ పుష్కరిణి-అష్టాంగ విమానము-పశ్చిమ ముఖము-భుజంగ శయనము-చంద్రునకు, పరాశర మహర్షికి ప్రత్యక్షము-నమ్మాళ్వార్లు కీర్తించినది.

విశే: ఈ క్షేత్రమునకు పరశురామ క్షేత్రమని పేరు. ఈ దివ్య దేశమునకు రెండువైపుల రెండు నదులు ప్రవహించుటచే తిరువట్టారు అను పేరు గల్గినది. తిరువనంత పురములో వలెనే ఇచటకూడ స్వామి మూడు ద్వారములలో సేవ సాదింతురు. ఇచట సాయంకాల సూర్యకిరణములు స్వామి తిరుముఖ మండలమును సృశించును. ఈక్షేత్రమునకు "వళుం మికునది" (మిక్కిలి సంపదగల దివ్యదేశము) యను తిరునామము కలదు. ఈ దివ్యదేశ విషయమై నమ్మాళ్వారు 10 వ శతకమున "అరుళ్ పెరువారడియార్" అను దశకమును అనుగ్రహించిరి. తిరువిరుత్తము మొదలు ఈ దశకము వరకు ఆళ్వార్లు అనుగ్రహించిన ప్రబంధములో స్వామిని పొందుటకై తాను పడిన పాటులను త్వరను ప్రదర్శించిరి. కానీ ఈ దశకము నుండి ఆళ్వార్లును పొందుటకై సర్వేశ్వరుడు పడుపాట్లను ప్రకాశింపజేయుచున్నారు. అనగా ఆశ్రిత పారతంత్ర్యగుణమును "నమదు విదివగైయే" (నేను విధించినట్లే యగును) అను స్థలమున వివరించిరి. ఈ పాశురమునకు భగవద్రామానుజుల వారి అర్ధ నిర్ణయము కలదు.

మార్గము: త్రివేండ్రం-నాగర్‌కోయిల్ బస్‌లో "తొడివెట్టి" వద్ద దిగి వేరు బస్‌లో 10 కి.మీ. దూరములో సన్నిధి చేరవచ్చును. వసతులు స్వల్పము.

పా. అరుళ్ పెఱువారడియార్;తమ్మడియనేఱ్కు;ఆழிయాన్
   అరుళ్ తరువానమై గిన్ఱా;నదు నమదు విదివగైయే;
   ఇరుళ్ తరుమా--లత్తు;ళినిప్పిఱవియాన్ వేణ్డేన్;
   మరుళొழிనీ మడనె--; వాట్టత్తా పడివణజ్గే.

   నణ్ణినమ్‌ నారాయణనై; నామజ్గళ్ పలశొల్లి
   మణ్ణులగిల్ వళమ్మిక్క; వాట్టాత్‌తాన్ వన్దిన్ఱు,
   విణ్ణులగమ్‌ తరువానాయ్; విరైగిన్ఱాన్ విదివగైయే,
   ఎణ్ణినవాఱాగా; విక్కరుమజ్గళెన్నె--
            నమ్మాళ్వార్లు-తిరువాయిమొழி 10-6-1,3

85