దివ్యదేశ వైభవ ప్రకాశికా/తిరువరగుణమంగై

55. తిరువరగుణమంగై 15 (నత్తం)

శ్లో. శ్రీమత్యాం వరగుణమంగై నామ పుర్యాం ప్రాప్తాయాభి రుచిరం సుతీర్థమగ్నే:|
   నాయక్యా వరగుణమంగై నామ సత్యా ప్రాగాస్యాసన రుచిరోగ్ని దృష్టరూప:|
   విజయకోటి విమాన వరస్థిత శ్శఠరిపూత్తమ భవ్య వచ: ప్రియ:|
   సుజన సేవిత పాద సరోరుహ: విజయతే ధరణౌ విజయాసన:||

వివ: విజయాసన పెరుమాళ్-వరగుణమంగై తాయార్-అగ్నితీర్థం-విజయకోటి విమానం-తూర్పు ముఖము-కూర్చున్న సేవ-అగ్నిహోత్రునకు ప్రత్యక్షము-నమ్మాళ్వార్ కీర్తించినది.

విశే: ఆకలిగొన్నవాడు అన్నము పచనమగు వరకు అచటనే నిలబడి, కూర్చుండి, పరుండి, అన్నమునకై ఎదురుచూచునట్లుగా భక్తునకు పరమ భక్తి రూపమగు పరిపక్వ దశ వచ్చు వరకు సర్వేశ్వరుడు కూడ పై విధముగా త్వరపడుచుండునట. ఆళ్వారుల విషయమై సర్వేశ్వరునకు గల ఈ "భోగ్యపాకత్వరను" ఆళ్వార్లు "పుళిజ్గుడి" యను క్షేత్రమున శయనించి; తిరువరగుణ మంగై యను క్షేత్రమున కూర్చుండి, శ్రీవైకుంఠ క్షేత్రమున నిలబడి" యని ప్రకాశింపజేసిరి.

సూచన: తిరువారాధన కాలమందు పోయి సేవింపవలెను. లేకున్న అర్చక స్వాములను ముందుగా కలసి ఏర్పాటు చేసికొనవలెను.

మార్గము: శ్రీవైకుంఠము నుండి తూర్పుగా 2 కి.మీ దూరమున గలదు. "నత్తం" అనియే చెప్పవలెను. వసతులు స్వల్పము.

పా. పుళిజ్గుడిక్కిడన్దు వరగుణమంగై యిరన్దు; వైకున్దత్తుళ్ నిన్ఱు;
    తెళిన్ద వెన్‌శిన్దై యగజ్కழிయాదే; యెన్నైయాళ్వా యెనక్కరుళి;
    నళిర్‌న్ద శీరులగమ్‌ మూన్ఱుడన్ వియప్ప; నాజ్గళ్ కూత్తాడి నిన్ఱార్ప
    పళిజ్గునీర్ ముగిలిన్ పవళమ్బోల్ కనివాయ్ శివప్ప; నీ కాణవారాయే.
            నమ్మాళ్వార్-తిరువాయిమొழி 9-2-4


మంచిమాట

భక్తుడు భగవంతుని సంతోషింప చేయవలయునని ప్రయత్నించును.

భగవంతుడు ప్రపన్నులను సంతోషింప చేయ ప్రయత్నించును.

55. విజయాసనర్-తిరువరగుణమంగై.

Vijayasanar - Tiru Varakuna Mangai

56. మాయాక్కూత్తన్-తిరుక్కుళందై.

Mayakkuttan - Tirukkulandai

57.A. వైష్ణవ నంబి-తిరుక్కురుంగుడి.

Vaishnavanambi - Tirukkurungndi

57.B. తిరుప్పార్‌కడల్ నంబి-తిరుక్కురుంగుడి.

Tirupparkadalnambi - Tirukkurungudi

56. తిరుక్కుళందై 16 (తెన్‌కుళన్దై)

(పెరుంకొళమ్‌)

శ్లో. శ్రీమత్కుళంద నగరేతు పెరుంకొళాఖ్య
   తీర్థే కుళంద లతికా నయనాబ్జ భృజ్గ:|
   ప్రాగాసన స్థితి రసౌ గురుసేవితాంగ
   శ్రీమత్పరాజ్కుశ మునీంద్ర పరిస్తుతాత్మా||

శ్లో. ఆనంద నిలయాఖ్యాస విమానస్థో మహీయతే|
   మాయానట విభుర్భక్త పరిరక్షణ దీక్షిత:||

వివ: మాయక్కూత్తన్-కుళందవల్లి తాయార్-పెరుంకుళ తీర్థం-ఆనందనిలయ విమానము-తూర్పు ముఖము-నిలుచున్నసేవ-బృహస్పతికి ప్రత్యక్షము-నమ్మాళ్వార్ కీర్తించినది.

విశే: ఇచ్చట పెరుమాళ్ల ప్రక్కగా పెరియ తిరువడి (గరుత్మంతులు) వేంచేసియున్నారు. "అత్యంత ప్రీతితో తనను జేరిన వారి స్త్రీ సహజ ధర్మములను పోగొట్టి తన అద్బుత ఆశ్చర్య చేష్టిత గుణములను ప్రకాశింపజేసిన స్వామి" యని "పల్ వళై యార్ మున్ పరిశழிన్దేన్, అను పాశురమున (తిరువాయి మొழி 8-2-4)నమ్మాళ్వార్ భగవంతుని అద్భుత చేష్టిత గుణమును ప్రకాశింపజేసిరి.

సూచన: ఇచటి అర్చకస్వాములు తొలవిల్లి మజ్గలం క్షేత్రమునకు పోవుదురు. వారుండు సమయమును ముందుగా తెలిసికొని సేవింపవలెను.

మార్గము: ఈక్షేత్రమును పెరుజ్కొళమనియే చెప్పవలెను. తిరుప్పుళిజ్గుడి నుండియు, శ్రీవైకుంఠము నుండియు పోయి సేవింపవచ్చును. ఆక్షేత్రములకు 10 కి.మీ. దూరములో గలదు.

పా. కూడచ్చెన్ఱే నినియెన్ కొడుక్కేన్;కోల్వళై నె--త్తుడక్కు మెల్లామ్‌;
    పాడత్తొழிయ విళై న్డువైగల్;పల్వళై యార్ మున్ పరిశழிన్దేన్,
    మాడక్కొడి మదిళ్ తెన్ కుళన్దై; వణ్ కుడపాల్ నిన్ఱమాయ క్కూత్తన్;
    ఆడల్ పఱవై యుయర్‌త్త వెల్పో; రాழிపలవనై యాదరిత్తే.||
          నమ్మాళ్వార్-తిరువాయిమొழி 8-2-4.


మంచిమాట

ఈ ఆత్మకు సర్వేశ్వరుడు కట్టిన మంగళసూత్రమే తిరుమంత్రము.

"పిళ్లై తిరునరయూర్ అరయర్"