దివ్యదేశ వైభవ ప్రకాశికా/తిరుమెయ్యమ్

43. తిరుమెయ్యమ్‌ 3

శ్లో. రమ్యే మెయ్యపురే కదంబ సరసీ సత్యాఖ్య తీర్థాంచితే
    సత్యాద్ర్యాఖ్య విమాన మాప్య వనన క్షోణీరుహాలంకృతే|
    దేవస్సత్యగిరి ప్రభు ర్విజయతే దేవ్యోయ్యవన్తాళితి
    ప్రాగాస్యో వర సత్యదేవ నయనానన్ద:కలిఘ్న:స్తుత:||

వివ: సత్యగిరినాథన్-ఉయ్యవందాళ్ తాయార్-కదంబపుష్కరిణి-సత్యపుష్కరిణి-సత్యగిరి విమానము-పనసవృక్షము-తూర్పు ముఖము-నిలుచున్న సేవ-సత్యదేవతకు ప్రత్యక్షము-తిరుమగై ఆళ్వార్ కీర్తించినది.

విశే: ఇచ్చట శ్రీరజ్గనాథునివలె పెరియ(పెద్ద)తిరుమేనితో, పవళించిన స్వామి కలరు. వృషభమాసం ధనిష్ఠ తీర్థోత్సవము. దీనిని సత్యవ్రత క్షేత్రమనియు అందురు. తిరుమెయ్యపు రాజగు ఊమైయ్యన్ దాగియుండిన ప్రదేశము చూడదగినది.

మార్గము: ఈక్షేత్రము పుదుక్కోట్టైకు 20 కి.మీ. దూరములో గలదు. పుదుక్కోట్టై-కారైక్కుడి రైలు మార్గము.

పా. నిలయాళా! నిన్‌వణజ్గ వేణ్డాయే యాకిలు; మెన్
    ములైయాళ వొరునాళున్న కలత్తారాళాయే
    శిలైయాళా!మరమెయ్‌త తిఱలాళా!-తిరుమెయ్య
    మలైయాళా! నీయళ వళై యాళ మాట్టోమే
              తిరుమంగై ఆళ్వార్-పెరియ తిరుమొழி 3-6-9

    కలయాళా!వకలలకుల్ కనవళై యుమ్‌ కైయాళా! వెన్ శెయ్‌గేన్ నాన్|
    విలైయాళా!వడియేనై వేణ్డుదియో వేణ్డాయో వెన్నుమ్‌;మెయ్య
    మలైయాళన్ వానవర్ దమ్‌ తలై యాళన్ మరామరమే ழைయ్‌దవెన్ఱి
    చ్చిలైయాళన్, ఎన్ మగళై చ్చెయ్‌దనక ళెజ్జనమ్‌ నాన్ శిన్దిక్కేనే.
              తిరుమంగై ఆళ్వార్-పెరియ తిరుమొழி 5-5-2

    అరువిశోర్ వేజ్గడమే నీరమలై యెన్ఱువాయ్,
    వెరువినాళ్, మెయ్యమ్‌ వినవియిరుక్కిన్ఱాళ్
    పెరుగుశీర్ క్కణ్ణపురమెన్ఱు పేశినాళ్
    ఉరుగినాళ్, ఉళ్‌మెలిన్దాళ్ ఇదువెన్గొలో.
               తిరుమంగై ఆళ్వార్-పెరియతిరుమొழி 8-2-3

                                       55