దివ్యదేశ వైభవ ప్రకాశికా/తిరునిన్ఱవూర్

89. తిరునిన్ఱవూర్ 16

శ్లో. వృద్ధ:క్షీర తరజ్గిణీ తటగతే శ్రీ నిన్ఱవూర్ పట్టణే
   ప్రాప్తే వారుణ పద్మినీ స్థితిలసన్ శ్రీ శ్రీనివాసాలయ:|
   ప్రాగాస్యో భువి భక్తవత్సల విభు ర్మన్మాతృదేవీ పతి:
   యాదోనాథ నిరీక్షితో విజయతే శ్రీ మత్కలిఘ్నస్తుత:||

వివ: భక్తవత్సలన్(పత్తరావిపెరుమాళ్)-నన్నుగన్నతల్లి(ఎన్న పెత్తతాయ్)-వృద్దక్షీరనది-వరుణ పుష్కరిణి-శ్రీనివాస విమానము-తూర్పు ముఖము-నిలచున్నసేవ-వరుణునకు ప్రత్యక్షము-తిరుమంగై ఆళ్వార్ కీర్తించినది.

విశే: తిరుమంగై ఆళ్వార్ తిరునీర్మలై క్షేత్రమును సేవించి ఈ తిరునిన్ఱవూర్ క్షేత్రమునకు వేంచేసిరి. కానీ ఇచట భక్తవత్సలస్వామి దివ్యమహిషీ ప్రణయ భోగలాలసుడై ఆళ్వార్లను కన్నెత్తియైన కటాక్షించలేదు. వెంటనే ఆళ్వార్లు స్థలశయన క్షేత్రమునకు వేంచేసి అచట స్వామి విషయమై "పారాయదు" అను దశకమును(తిరుమొழி 2-5) ప్రారంభించిరి. ఇది యంతయు గమనించిన పిరాట్టిమార్లు(తాయార్లు) "ఆళ్వార్లచే స్తుతింపబడు అవకాశము మన క్షేత్రమునకు లేకపోయినే! వారెచట వేంచేసి యున్ననూ ఈ క్షేత్రమునకు తోడ్కొనిరండని" స్వామిని పంపగా స్థల శయనక్షేత్రమునకు వేంచేసి ఆళ్వార్ల ఎదుట నిలచిరి. ఆళ్వార్లును ఆ క్షేత్రము నందుండియే "నిన్ఱవూర్ నిత్తిలత్తై తొత్తార్ శోలై" అని తిరునిన్ఱనూర్ స్వామికి మంగళాశాసనము చేసిరి. మీనం శ్రవణం తీర్థోత్సవము-బ్రహ్మోత్సవము మాడవరోజు ఉదయం గరుడసేవ. ఈసన్నిధికి తిరుమలై పెద్దజీయర్ స్వామి నిర్వాహములో నున్నది.

మార్గము: శెన్నై-అరక్కోణం రైలుమార్గములో ఉన్నది. శెన్నై తిరువళ్లూరు మార్గములో కలదు. రైల్వే స్టేషన్ నుండి 2 కి.మీ. బండిమీద వెళ్లవలెను.

పా. పూణ్డవత్తమ్‌ పిఱర్కడైన్దు తొణ్డుపట్టు
         ప్పాయ్ న్నూలై మెయ్‌న్నూ లెనెన్ఱు మోది
   మాణ్డు; అవత్తమ్‌ పోగాదే వమ్మినెన్దై
         యెన్ వణజ్గప్పడువానై; క్కణజ్గళేత్తుమ్‌
   నీణ్డవత్తై క్కరుముగిలై యెమ్మాన్ఱన్నై
         నిన్ఱవూర్ నిత్తిలత్తై త్తొత్తార్ శోలై
   కాణ్డవత్తై క్కనలెరివాయ్ పెయ్ విత్తానై
         క్కణ్డదునాన్ కడన్మల్లై త్తల శయనత్తే.
         తిరుమంగై ఆళ్వార్-పెరియతిరుమొழி 2-5-2

108

90. తిరువెవ్వుళ్ళూరు 17

(తిరువళ్ళూరు)

శ్లో. శ్రీ హృత్తాప వినాశ తీర్థరుచిరే శ్రీ వెవ్వుళూర్ పట్టణే
   వీక్షారణ్య మితి ప్రసిద్ధి విభవే శ్రీ శాలిహోత్రేక్షిత:|
   ప్రాగాస్యో వర వీరరాఘవ విభు స్సౌవర్ణవల్లీ పతి:
   భోగేన్ద్రే జయకోటి మందిరగత: శేతే కలిఘ్నస్తుత:||

వివ: వీరరాఘవపెరుమాళ్-కనకవల్లితాయార్-హృత్తాప నాశతీర్థం వీక్షారణ్యం-తూర్పు ముఖము-భుజంగశయనము-విజయకోటి విమానము-శాలి హోత్రులకు ప్రత్యక్షము-తిరుమழிశై ఆళ్వార్-తిరుమంగై ఆళ్వార్ కీర్తించినది.

విశే: సర్వేశ్వరుడు శాలిహోత్రమునికి ప్రత్యక్షమై నివసింపదగిన స్థలము? అని అడిగిరట. కావుననే ఈ క్షేత్రమునకు "తిరు ఎవ్వుళ్‌వూర్" (కింగృహ)క్షేత్రమని పేరువచ్చినదని పెద్దలు చెప్పుదురు. మేషం పునర్వసు మొదలు పది దినములు బ్రహ్మోత్సవము జరుగును. మకర మాసం పూర్వాభాద్ర అవసానముగా పది దినములు బ్రహ్మోత్సవము జరుగును. ప్రతి అమావాస్యకు ప్రార్థన చెల్లించుటకై భక్తులు వత్తురు. ఈసన్నిధి అహోబిల మఠం జీయర్ స్వామివారి నిర్వాహములో నున్నది. సన్నిధిలో ప్రసాదము లభించును. సన్నిధి వీధిలో అహోబిల మఠము కలదు. సమస్త వసతులు కలవు.

మార్గము: శెన్నై-అరక్కోణం రైలు మార్గములో తిరువళ్లూరు స్టేషన్ నుండి 5 కి.మీ. మద్రాసు నుండి అన్ని ప్రధాన పట్టణముల నుండి బస్ సౌకర్యము కలదు. ఆంధ్రాలో సూళ్లూరుపేట నుండి, తిరుపతి నుండి బస్ సౌకర్యము కలదు.

పా. వన్దిరుక్కుమ్‌ మెల్ విరలాళ్; పావై పనిమలరాళ్,
   వన్దిరుక్కుమ్మార్; వన్ నీలమేని మణివణ్ణన్;
   అన్దరత్తిల్ వాழுమ్‌ వానోర్; నాయగనాయమైన్ద;
   ఇన్దిరఱ్కుమ్‌ తమ్బెరుమా; నెవ్వుళ్ కిడన్దానే.
         తిరుమంగై ఆళ్వార్-పెరియ తిరుమొழி 2-2-9


మంచిమాట

ఆత్మకు అహంకారము ఆవరించి యుండుటచే నిజస్వరూపమును తెలియక మిట్టిపడును. ఆ అహంకారము తొలగినచో "దాసుడను" అని తన సహజ స్వరూపముతోనే వ్యవహరింపబడును.

"వడక్కుత్తిరువీధి ప్పిళ్లై"

                                                   109