దివ్యదేశ వైభవ ప్రకాశికా/తిరుక్కళ్వనూర్

ముఖచిత్రం

85. తిరుక్కళ్వనూర్ (కాంచీ) 12

శ్లో. నిత్యపుష్కరిణీ యుక్తే కళ్వనూర్ నగరే స్థిత:
   విమానే వామనే త్వాదివరాహాంజలి వల్లికామ్‌
   ప్రాప్త: పశ్చిమ దిగ్వక్త్ర:కలిజన్ముని కీర్థిత:
   అశ్వత్ధోస పదఖ్యాత నారాయణ మునీక్షిత:||

వివ: ఆదివరాహ పెరుమాళ్-అ-లైవల్లి త్తాయార్-నిత్యపుష్కరిణి-వామన విమానము-పశ్చిమ ముఖము-నిలచున్నసేవ-అశ్వత్థ నారాయణునకు ప్రత్యక్షము-తిరుమంగై ఆళ్వార్ కీర్తించినది.

విశే: ఈ సన్నిధి కంచి కామాక్షి అమ్మన్ కోవెలలో ఉన్నధి. తాయార్; తీర్థం లేవు. "కళ్వా" అను సంబోదన తప్ప వేరు పాశురము లేదు.

పా. నీరగత్తాయ్ నెడువరైయి నుచ్చి మేలాయ్
           నిలాత్తిజ్గళ్ తుణ్డత్తాయ్ నిఱైన్దకచ్చి
   ఊరగత్తాయ్, ఓణ్ తుఱైనీర్ వెஃకావుళ్ళాయ్
           ఉళ్ళువారుళ్ళత్తాయ్; ఉలగ మేత్తుమ్‌
   కారగత్తాయ్ కార్‌వానత్తుళ్ళాయ్ కళ్వా
           కామరుపూజ్కావిరియన్ తెన్బాల్ మన్ను
   పేరగత్తాయ్, పేరాదెన్నె-- నుళ్ళాయ్
          పెరుమానున్ తిరువడియే పేణినేనే.
          తిరుమంగై ఆళ్వార్లు-తిరునెడున్దాణ్డగమ్‌ 8


మంచిమాట

     జ్ఞానము నిచ్చువాడు ఆచార్యుడు.
 ఆ జ్ఞానమును వృద్ధిపొందించువారు శ్రీవైష్ణువులు.
 ఆ జ్ఞానమునకు విషయభూతుడు సర్వేశ్వరుడు.
   జ్ఞానమునకు ఫలము భగవత్కైంకర్యము.
    దానికి భోగ్యత భాగవత కైంకర్యము.

104

86. పవళవణ్ణన్-కాంచీ

Pavalavannar - Kanchi

87. వైకుంఠనాథన్-పరమేశ్వరవిణ్ణగరమ్‌(కాంచి)

Vaikuntanadhan - Kanchi

88. విజయరాఘవన్-తిరుప్పుళ్‌కుళి.

Vijaya Raghavan - TiruppulKoil

89.పత్తరావి పెరుమాళ్-తిరునిన్ఱవూర్.

Bhaktavastalam - Tiruninnavur

90. వీరరాఘవన్-తిరువళ్ళూర్.

Veera Raghavan - Tiruvallur

91. నీర్ వణ్ణన్-తిరునీర్మలై

Neer Vannan - Tiruneer Malai

86. పవళవణ్ణమ్‌ (కాంచీ) 13

శ్లో. శ్రీమత్పవళవాణ్ణఖ్యే పురేచక్ర సరోంచితే
   ప్రవాళవర్ణ భగవాన్ ప్రవాళాఖ్య విమానగ:|
   ప్రవాళవల్లీ నాయక్యా పశ్చిమాసన సంస్థిత:
   ఉమాశ్విదేవతా దృష్టో రాజతే కలిహస్తుత:||

వివ: పవళవణ్ణ పెరుమాళ్-ప్రవాళవల్లి త్తాయార్-ప్రవాళ విమానము-చక్రపుష్కరిణి-పశ్చిమ ముఖము-నిలచున్నసేవ-పార్వతీదేవికి అశ్వనీదేవతలకు ప్రత్యక్షము-తిరుమంగై ఆళ్వార్ కీర్తించినది.

కామాక్షి ఆలయమునకు 1 కి.మీ దూరములో గలదు. ఈ సన్నిధి ఎదురు వీధిలో పచ్చవణ్ణర్ సన్నిధి కలదు.

పా. వజ్గత్తాళ్ మామణి వన్దున్దు మున్నీర్
          మల్లైయాయ్;మదిళ్ కచ్చి యూరాయ్ పేరాయ్,
   కొజ్గుత్తార్ వళజ్గొన్ఱె యలజ్గళ్ మార్వన్;
          కులవరై యన్ మడప్పానై యిడప్పాల్ కొణ్డాన్;
   పజ్గత్తాయ్ పాఱ్కడలాయ్ పారిన్ మేలాయ్;
          పనివరై యినుచ్చియాయ్ పవళవణ్ణా!,
   ఎజ్గుற்றா యెమ్బెరుమా నునైనాడి,
          యేழைయే ని-నమే యుழிతరుగేనే.
          తిరుమంగై ఆళ్వార్-తిరునెడున్దాణ్డగమ్‌-9


మంచిమాట

శిష్య లక్షణము

సద్బుద్ధి సాధుసేవ సముచిత చరిత స్తత్వబోధాభిలాషే
శుశ్రూషు స్త్వక్తమాన: ప్రణిపతనేపర:ప్రశ్నకాల ప్రతీక్ష:
శాన్తో దాన్తోవ సూయు:శరణ ముపగత శ్శాస్త్ర విశ్వాన శాలీ
శిష్య:ప్రాప్త:పరీక్షాం కృత విదభిమత:తత్త్వత:శిక్షణీయ:||

మంచి విషయములందు ఆసక్తిగల బుద్ధి కలిగినవాడు, సాధుసేవాతత్పరుడు, సదనుష్ఠాన సంపన్నుడు, తత్త్వజ్ఞానమును పొందగోరువాడు, ఆచార్యశుశ్రూషాతత్పరుడు, దురభిమానమును విడచినవాడు, దండవత్ ప్రణామపరుడు, ప్రశ్నకాలమును నిరీక్షించువాడు, ఇంద్రియనిగ్రహము, మనోనిగ్రహము కలవాడు, అసూయలేనివాడు, శరాణాగతుడు, శాస్త్ర విషయములందు విశ్వాసము కలవాడు, నగు శిష్యుడులభించినచో వానిని స్వీకరించి తత్వవజ్ఞానమును ఉపదేశింపవలెను.

                                            105