దివ్యదేశ వైభవ ప్రకాశికా/తిరుక్కడిగై
95. తిరుక్కడిగై (చోళసింహపురము) 22
శ్లో. చోళ సింహ పురే యోగ సింహనామా విరాజతే|
అమృతాహ్వయ తీర్థాడ్యే సింహకోష్ట విమానగ:||
దేవీమమృత వల్లాఖ్యా మాశ్రిత: ప్రాజ్ముఖాసన:|
ప్రత్యక్షో మారుతై శార్జ్గ నందకాంశ మునిస్తుత:||
వివ: యోగ నరసింహ స్వామి(అక్కారక్కన్)-అమృతవల్లి త్తాయార్-అమృత తీర్థము-సింహకోష్ట విమానము-తూర్పుముఖము-కూర్చున్నసేవ-ఆంజనేయస్వామికి ప్రత్యక్షము-కలియన్; పేయాళ్వార్ కీర్తించినది.
విశే: చోళ సింహపురమునకు(చోళంగిపురము) 3 కి.మీ. దూరములో కొండపాలెము కలదు. ఇచట పెద్దకొండపై నృసింహస్వామి, అమృతవల్లితాయార్ల సన్నిధి కలదు. ప్రతి శుక్రవారము స్వామికి విశేషముగా తిరుమంజనము జరుగును. చిన్నకొండపై ఆంజనేయస్వామి వేంచేసియున్నారు. ఇచట ఆంజనేయస్వామివారు చతుర్బుజములతో శంఖ చక్రములతో యోగ ముద్రతో వేంచేసి యుండుట విశేషము. ఈక్షేత్రము విశేషప్రార్థనా స్థలము. దీర్ఘవ్యాదులు కలవారు, గ్రహపీడితులు, మానసిక రోగులు వేలాదిగా వచ్చి ప్రార్థనలు చేతురు. చోళసింహపురములో భక్తవత్సలన్ (ఉత్సవమూర్తి) వేంచేసియున్నారు. వీరి సన్నిధి వెనుక ఆదికేశవర్ వేంచేసి యున్నారు. ఎఱుంచి అప్పా అవతార స్థలము అగు ఎరుంబి అగ్రహారము ఈ క్షేత్రమునకు సమీపముననే కలదు. మణవాళ మహామునులు ఈ క్షేత్రమునకు వడ శ్రీరంగమనియు ఇచ్చటగల పుష్కరిణికి తిరుక్కావేరి అనియు తిరునామముంచిరి.
మార్గము: తిరుత్తణి/ అరక్కోణంకు 30 కి.మీ.
పా. మిక్కానై మఱై యాయ్ విరిన్ద విళక్కై; ఎన్నుళ్
పుక్కానై ప్పుగழ்శేర్ పొలిగిన్ఱ పొన్ మలై యై
తక్కానై క్కడిగై త్తడజ్కున్ఱిన్ మిశై యిరున్ద;
అక్కారక్కనియై; అడైన్దుయ్‌న్దు పోనేనే.
తిరుమంగై ఆళ్వార్-పెరియ తిరుమొழி 8-9-4
ఉత్తరదేశ తిరుపతులు
శ్లో. ఇదానీ ముత్తరే దేశే స్థితా దేశా: రమాపతే:|
పర్ణ్యంతే యతిరాజాంఘ్రి ప్రభావాత్సన్ముదే మయా||
శ్రీభగవత్ రామానుజుల వారి శ్రీపాద ప్రభావముచే ఇకపై ఉత్తరదేశమున గల దివ్యదేశములను వర్ణింతును.
115 (మంచిమాట)
బ్రహ్మవిద్యలు
సంసార సాగరమునబడి దరిగానక దు:ఖించు చేతనులను జూచి సర్వేశ్వరుడు కృపతో ఉద్దరింపదలచి వేదమును అనుగ్రహించెను. అందు వేద ఉత్తర భాగమున అధికారానుగుణ్యముగా బ్రహ్మ విద్యాత్మకములైన ఉపాసనములు తెలుపబడినవి. ఇవి ముప్పది రెండు. ఈ ముప్పది రెండు ఉపాసనములు వ్యాస మహర్షిచే బ్రహ్మసూత్రము లందు పేర్కొనబడినవి. <poem> 1. ఈశావాస్య విద్య 2. సద్విద్య 3. ఆనందమయవిద్య 4. అంతరాదిత్యవిద్య 5. ఆకాశవిద్య 6. ప్రాణ విద్య 7. పరంజ్యోతి విద్య 8. ప్రతర్దన విద్య 9. శాండిల్య విద్య 10. నాచికేత విద్య 11. ఉపకోసల విద్య 12. ఉద్దాలకాంతర్యామి విద్య 13. అక్షరసర విద్య 14. వైశ్వానర విద్య 15. భూమ విద్య 16. గార్గ్యక్షర విద్య 17. సత్యకామ విద్య 18. దహర విద్య 19. అంగుష్ఠ ప్రమిత విద్య 20. మధు విద్య 21. సంపర్గ విద్య 22. అజా విద్య 23. జ్యోతిషాంజ్యోతిర్విద్య 24. బాలాకి విద్య 25. మైత్రేయీ విద్య 26. రుద్ర విద్య 27. చతుర్ముక విద్య 28. పంచాగ్ని విద్య 29. ఆదిత్య మండలస్థ సత్యబ్రహ్మ విద్య 30. అక్షిస్థ సత్య బ్రహ్మ విద్య 31. పురుష విద్య 32. ఉసస్తికహాళ విద్య
ఇవియును గాక ఇంకా కొన్ని కామవిద్యలు కూడా నిందు ప్రస్తావించబడినవి.
116 95.B. భక్తవత్సలన్-తిరుక్కడిగై
Bhaktavastlan - Sholinger
95.C. యోగాంజనేయర్-తిరుక్కడిగై
Yoganjaneyar - Sholingar 96.A. తిరువేజ్గడముడయాన్-అలర్‌మేల్‌మంగై-తిరుమలై
Tiruvengadamudayan - Alarmel - Tirumalai 96. తిరువేంగడమ్ (తిరుమలై-తిరుపతి) 1
శ్లో. శ్రీమద్వేంకట శైలరాజ శిఖరే శ్రీ శ్రీనివాసో హరి:
శ్రీమత్ స్వామి సరోవర ప్రభృతిభి: పుణ్యైరనేకైర్యుతే
తీర్థై:ప్రాజ్ముఖ సంస్థితి ర్విజయతే శ్రీతొండమానాదిభి:
దృష్ట: శ్రీ నవసూరి సంస్తుత వపు స్త్వాలింగ్య పద్మావతీమ్||
శ్రీ వేంకట గిరీశోయం అలర్ మేల్ మంగనాయకీమ్|
ఆశ్రితో రాజతే నిత్యం ఆనంద నిలయాలయ:||
వివ: శ్రీవేంకటేశ్వరుడు(తిరువేంగడ ముడయాన్)-అలర్‌మేల్ మంగై తాయార్(పద్మావతి)-స్వామిపుష్కరిణి మున్నగు పలుతీర్థములు-తూర్పుముఖము-నిలచున్నసేవ-ఆనందనిలయ విమానము-తొండమాన్ చక్రవర్తి మున్నగువారికి ప్రత్యక్షము-తొండరడిప్పొడి యాళ్వార్ తప్ప మిగిలిన యాళ్వార్లు ఆండాళ్ కీర్తించిన స్థలము.
విశే: "కలౌవేంకటనాయక:" అని ప్రసిద్ధి చెందిన క్షేత్రము.వడవానై(ఉత్తరదిగ్గజము) అని తిరుమంగై యాళ్వార్ల వర్ణనము. "వడక్కుత్తిరుమలై" యని(వడ తిరువేంగడం) "మణ్ణోర్ విణ్ణోర్ వైప్పు" అని సాంప్రదాయక తిరునామములు గలవు. ఈక్షేత్రమునకు పుష్పమంటపమనియు తిరునామము కలదు. అనంతాళ్వాన్ అను మహాత్ములు పుష్కరిణిని నిర్మించిరి. కురుబరుత్తనంబి స్వామికి ఆంతరంగికులు. పెరియ తిరుమలై నంబి గారు ఈమలై మీద వేంచేసి స్వామి కైంకర్యము నిర్వహించెడివారు.
అష్ట స్వయం వ్యక్త క్షేత్రములలో తిరుమల యొకటి. శ్రీ వైష్ణవులు అత్యంతము అభిమానించి సేవించు నాల్గుక్షేత్రములలో "తిరుమలై" రెండవది.
మాయావీ పరమానందం త్యక్త్వా వైకుంఠ ముత్తమమ్
స్వామిపుష్కరిణీ తీరే రమయా సహమోదతే.
శ్రీమన్నారాయణుడు పరమానంద స్వరూపమైన శ్రీవైకుంఠమును విడచి స్వామి పుష్కరిణీ తీరమున లక్ష్మీదేవితో కలసి ఆనందించుచున్నాడు, అనియు
"శ్రీవైకుంఠవిరక్తాయ స్వామిపుష్కరిణీ తటే
రమయా రమమాణాయ వేజ్కటేశాయ మంగళమ్"
("శ్రీవైకుంఠమున విరక్తుడైన స్వామి, స్వామి పుష్కరిణీ తీరమున లక్ష్మీదేవితో కలసి ఆనందించుచున్నాడు") అనియు చెప్పినట్లుగా శ్రీవైకుంఠనికేతనుడైన స్వామి భక్త సంరక్షణ దీక్షితుడై తిరుమలపై వేంచేసియున్నాడు.
117