దివ్యదేశ వైభవ ప్రకాశికా/తిరుక్కడల్ మల్లె
93. తిరుక్కడల్ మల్లె 20
(మహాబలిపురం)
శ్లో. శ్రీ మత్తార్ష్య తరజ్గిణీ తటగతే దేశేకడల్ మల్ల ఇ
త్యాఖ్యే శ్రీ నిలమంగ నామయుతయాదేవ్యా భుజజ్గేశయ:
భాతి శ్రీ స్థలశాయి నామకవిభు శ్శ్రీ పుండరీకేక్షిత:
ప్రాగాస్యస్తు ఘనాకృతా కలిరిపు శ్రీ భూతచక్రస్తుత:||
వివ: స్థలశయనర్-నిలమంగై నాచ్చియ్యర్-తార్ష్య నది-తూర్పు ముఖము-భుజంగశయనము-గగనాకార విమానము- పుణ్డరీకునకు ప్రత్యక్షము-పూదత్తాళ్వార్-తిరుమంగై ఆళ్వార్ కీర్తించినది.
ఇది పూదత్తాళ్వార్ అవతరించిన స్థలము. ఆళ్వార్లు మంగళాశాసనము చేసిన సన్నిధి శిధిలమై సముద్రతీరమున కలదు. ఇది శిధిలముకాగా కొంత దూరములో మరియొక సన్నిధిని నిర్మించారు. స్వామి స్థలశయనముగా సేవ సాయించు క్షేత్రము ఇదియొక్కటియే.
పుండరీకమహర్షి తామర పుష్పములతో స్వామిని అర్చింపబోయెనట. ఆసమయమున స్వామి ఒక వృద్ద బ్రాహ్మణుని రూపముతో వచ్చి ఆకలిగానున్నది, ఆహారమునీయుమని అడిగెను. అంతట పుండరీకుడు ఆహారమును తీసికొని వచ్చుటకు వెడలెను. ఇంతలో స్వామి ఆ తామరపుష్పములను అలంకరించుకొని పుండరీకమహర్షి తలచిన రూపముతో శయనించెను. మహర్షి తిరిగివచ్చి స్వామిని సేవించి ఆశ్చర్యపడి వారిని స్థలశయనర్ అని సంబోధించిరి.
ఈక్షేత్రమునగల జ్ఞానపిరాన్(వరాహస్వామి) సన్నిధి తప్పక సేవింపవలెను. ఇచటస్వామి తిరుమేనిలో తాయార్లు కుడివైపున ఉండుటచే ఈసన్నిధికి వలనెన్దై అనిపేరు.
ఇది అతిమనోహరమైన శిల్పసంపదతో అలరారు క్షేత్రము. తిరుమంగై ఆళ్వారు ఈక్షేత్రస్వామిని కీర్తించుచుండ తిన్ఱనూర్ భక్తవత్సలస్వామి ప్రత్యక్షముకాగా వారికిని ఇచటి నుండియే మంగళాశాసనము చేసిరి.
మార్గము: మద్రాసునుండి 65 కి.మీ. దూరమున కలదు. సకల సదుపాయములు కలవు.
పా. పారాయదుణ్డు మిழ்న్ద పవళత్తూణై;
ప్పడు కడలిలముదత్తై ప్పరివాయ్ కీణ్డ
శీరానై; యెమ్మానై త్తొణ్డర్ తజ్గళ్;
92. నిత్యకళ్యాణర్-తిరువిడవెన్దై.
Nityakalyaner - Tiruvidavindai
93. స్థల శయనర్-తిరుక్కడల్‌మలై.
Stalasayanar - Tirukkadal Mallai 94.A. పార్థసారధి-తిరువల్లిక్కేణి.
Pardhasaradhi - Triplicane 94.B. పార్థసారధి-తిరువల్లిక్కేణి.
Pardhasaradhi - Triplicane
94.C. మన్నాధర్-తిరువల్లిక్కేణి.
Mannarthar - Triplicane 94.D. నరసింహర్-తిరువల్లిక్కేణి.
Narasimhar - Triplicane
94.E. చక్రవర్తితిరుమగన్-తిరువల్లిక్కేణి.
Ramar - Triplicane శిన్దై యుళ్ళై ముళై తైழన్ద తీజ్గరుమ్బినై;
ప్పోరానై కొమ్బొ శిత్త పోరేత్ తినై;
పుణర్ మరుద మిఱనడన్ద పొఱ్కున్ఱినై;
క్కారానై యిడర్ కడిన్ద కఱ్పగత్తై
క్కణ్డదునాన్ కడన్మల్లై త్తలశయనత్తే.
తిరుమంగై ఆళ్వార్-పెరియ తిరుమొழி 2-5-1
94. తిరువల్లిక్కేణి (చెన్నై) 21
శ్లో. శ్రీ మత్కై రవిణీ సరోవర లసత్ బృందావనాఖ్యాయుతే
వల్లిక్కేణి పురే స్థిత స్సుర దిశా పక్త్రాంబుజో రాజతే|
రుక్మిణ్యా త్వవిరుద్ద సాత్య బల ప్రద్యుమ్న సేవ్యో త్రిణా
సంపూజ్యో భువి పార్దసారధి విభు: పార్దాక్షి యుగ్మా తిధి:||
తత్తైవ రంగనాథఖ్యో వేదవల్ల్యా ఫణీంద్రగ:|
భృగుణా కన్యకాదానం ప్రాపిత స్సుర దిజ్ముఖ||
తత్తైవ నరసింహాఖ్య: పశ్చిమాభిముఖానస:
జాబాల్యత్రి మునీంద్రాభ్యాం సేవితో మోక్షదస్తయో::||
సీతాలక్ష్మణ శత్రుఘ్న భరతై స్తత్ర రాఘవ:
దక్షిణాభి ముఖస్తిష్ఠన్ మధుముమ్మవి వీక్షిత:||
గజేంద్ర వరద స్తత్ర సప్తరోమ మునీక్షిత:|
ప్రాజ్ముఖో గరుడా రూడ శ్శేషాహ్వయ విమానగ:||
ఇంద్రాగ్ని సోమ మీనాఖ్య విష్ణు తీర్థాతి సుందరే
శ్రీ మత్కైరవిణీ తీరే రాజంతే పంచమూర్తయ:||
మార్కండేయాత్రి సుమతి మరీచి భృగు యోగిన:|
జాబాలి సర్ప రోమణౌ తేపురత్ర పరం తప:||
పరకాల మహాయోగి భక్తిసార పరిస్తుత:|
తిరువల్లిక్కేణి నగరే పంచదేవాశ్చ వాసతే ||
వివ: బృందావన క్షేత్రము. పార్థసారథి పెరుమాళ్-రుక్మిణీదేవి తాయార్, బలరామ, సాత్యకి, అనిరుద్ద, ప్రద్యుమ్నులు వేంచేసియున్నారు. కైరవీణీ పుష్కరిణి-తూర్పు ముఖము-నిలచున్నసేవ-ఆనన్దవిమానము-అత్రిమహామునికి తిరువారాధనము-అర్జునునకు ప్రత్యక్షము.
అచటనే మన్నాధర్.(ఎన్నెయాళుడై యప్పన్;రంగనాథులు) వేదవల్లిత్తాయార్-తూర్పుముఖము-భుజంగశయనము-భృగుమహర్షిచే కన్యాదానము
113