దివ్యదేశ వైభవ ప్రకాశికా/తిరుక్కండియూర్

15. తిరుక్కండియూర్

శ్లో. నిత్యం భాతి కపాల తీర్థ రుచిరే శ్రీకండియూర్ పట్టణే
   వైమానే కమలాకృతా స్థితియుత: ప్రాచీముఖాలంకృత:|
   నాయక్యా హర శాప నాశక విభు శ్శ్రీపద్మ వల్ల్యా శ్రిత:
   ప్రత్యక్షో వర కుంభ సంభవ మునే: కీర్త్య: కలిద్వేషిణ: ||

వివ: హర శాపం తీర్త పెరుమాళ్(హర శాపనాశకర్)-కమలవల్లి తాయార్-కపాల తీర్థాము-కమలాకృతి విమానము-తూర్పు ముఖము-నిలచున్న సేవ-అగస్త్యునకు ప్రత్యక్షము. తిరుమంగై ఆళ్వార్ కీర్తించినది.

విశే: రుద్రుని చేతియందు గల కపాలమును నేలపడునట్లు అనుగ్రహించిన స్థలము. సన్నిధికి 1 కి.మీ దూరములో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు సన్నిధులు కలవు. ఈ క్షేత్ర సమీపములో కల్యాణపురమున శ్రీనివాస పెరుమాళ్ సన్నిధి కలదు.

మార్గము: తంజావూరు నుండి తిరువయ్యారు పోవుటౌను బస్‌లో పోవలెను. వసతులు లేవు. తంజావూరులోనే బసచేయవలెను.

పా. పిణ్డియార్ మణ్‌డై యేన్ది ప్పిఱర్ మనై తిరి తన్దుణ్డుమ్‌
    ముణ్డియాన్; శాపయ్ దీర్త ఒరువనూర్; ఉలగమేత్తుమ్‌
    కణ్డియూర్; అరజ్గమ్ మెయ్యమ్ కచ్చిపేర్‌మల్లై యెన్ఱు
    మణ్డినార్; ఉయ్యలల్లాల్ మట్రనయార్కు ఉయ్యలామే?
            తిరుమంగై ఆళ్వార్-తిరుక్కుఱున్దాణ్డగమ్‌ 19


భగవత్కృపా పాత్రులు

వివిధ జాతులలో జన్మించియు భగవంతుని కృపకు పాత్రులైన వారు:-1. గుహప్పెరుమాళ్. 2. శబరి. 3. జటాయు మహారాజు. 4. సుగ్రీవాది వానరులు. 5. అయోధ్యా వాసులైన చరాచరము. 6. చిన్తయన్తియను గోపిక. 7. దధిభాణ్డు అను గొల్లవాడు. 8. వాని పెరుగు బాన. 9. కుబ్జ. 10. సుదాముడను మాలా కారుడు. 11. ఘంటా కర్ణుడు. 12. శ్రీకృష్ణునకు భోజనమిడిన ఋషి పత్నులు. 13. ప్రహ్లాదాళ్వార్. 14. విభీషణుడు. 15. గజేంద్రళ్వాన్. 16. గరుడునకు భయపడి భగవంతుని శరణు వేడిన సుముఖ మను సర్పము. 17. శ్రీకృష్ణుని ఆశ్రయించిన గోవిందస్వామి. 18. మార్కండేయుడు.

16. తిరువిణ్ణగర్ 16 (కుంభకోణం 5.కి.మీ)

(ఉప్పిలి యప్పన్ కోయిల్)

శ్లో. భాతి శ్రీ తిరువణ్ణగర్ పురవరే హార్త్యబ్జినీ శోభితే
   శ్రీ మద్విష్ణు విమాన సంస్థితి లసన్ శ్రీ భూమి దేవీ పతి:
   శ్రీ మాను ప్పిలి యప్పనాహ్వయ యుత: పక్షీంద్ర కావేరికా
   ధర్మైర్దష్ట వపు శ్శఠారి కలిజిత్ సమ్యక్ స్తుత:ప్రాజ్ముఖ:|

వివ: ఉప్పిలియప్పన్(శ్రీనివాసర్) భూమిదేవి తాయార్-ఆర్తి పుష్కరిణి(అహోరాత్ర పుష్కరిణి)-విష్ణు విమానము-తూర్పు ముఖము-నిలచున్న సేవ-గరుత్మంతునకు, కావేరికి, యమునకు, మార్కండేయ మహర్షికి ప్రత్య్క్షము-పొయిగై ఆళ్వార్, పేయాళ్వార్, నమ్మాళ్వార్, తిరుమంగై ఆళ్వార్లు కీర్తించినది.

విశే: ఈ దివ్యదేశమునకు "నణ్ణగర్" అను విలక్షణమైన తిరునామము కలదు. శ్లాఘ్యమైన దివ్యదేశము.(తి.వా.మొ. 6-3-2) నల్ కురువుమ్‌ అను తిరువాయిమొழிలో (6-3) నమ్మాళ్వార్లు తమకు సేవ సాయించిన తిరువిణ్ణగర్ పెరుమాళ్ళ కల్యాణ గుణములను అనుభవించుచు "పల్‌వకయుం పరన్ద" అని సర్వేశ్వరుని ఆఘటిత ఘటనా సామర్ద్యమనెడి కల్యాణ గుణమును ప్రకాశింపజేసిరి. తంజావూరు జిల్లాలో ప్రసిద్దమైన క్షేత్రము. ఇచ్చట స్వామి మార్కండేయ పుత్రికను వివాహమాడిరి. ఆ సమయమున భూమిదేవి నాచ్చియార్ చిన్న వయసు గలవారగుటచే తళియలో ఉప్పువేయుట కూడ తెలియనివారైరి. అందుచే నాటి నుండి స్వామి ఉప్పులేని ప్రసాదమునే ఆరగించెడివారు. నేటికిని ఉప్పులేని ప్రసాదమునే ఆరగించు చున్నారు. ఈ క్షేత్రమునకు తులసీ వనమనియు తిరునామము కలదు. అన్ని వసతులు గలవు. సన్నిధిలో ప్రసాదములు లభించును. కుంభఘోణమునుండి టౌన్ బస్ కలదు. ఈసన్నిధి తిరునాగేశ్వరము అను ప్రసిద్ధ శివ క్షేత్రమునకు 1 కి.మీ. ఇచట నుండి తిరుచ్చేరై "నాచ్చియార్‌కోయిల్" పోయి సేవింప వచ్చును.

   పర--డరుడమ్బాయழక్కు ప్పదిత్త పుడమ్బాయ్;
   కరన్దుం తోన్ఱియుమ్‌ నిన్ఱుమ్‌ కైదవజ్గల్ శెయ్‌దుమ్; విణ్ణోర్‌
   శిరజ్గళాల్ వణజ్గుమ్‌ తిరువిణ్ణగర్ చ్చేర్‌న్ద పిరాన్
   వరజ్గొళ్ పాదమల్లాలిల్లై యావర్‌క్కుమ్‌ వన్‌శరణే.
          నమ్మాళ్వార్-తి.మొ 6-3-7

   వణ్డుణు నఱుమల రిణ్డై కొణ్డు-వణ్ణనమ్‌ వినై కెడవెన్ఱు; ఆడిమేల్
   తొణ్డరు మమరరుం పణియనిన్ఱ జ్గణ్డమోడ కలిడ మళన్దవనే
   ఆణ్డాయున్నైక్కాణ్బద్బో రరుళె నక్కరుళుదియేల్
   వేణ్డేన్ మనై వాழక్కైయై విణ్ణగర్ మేయవనే.
        తిరుమంగై ఆళ్వార్ పె.తి.మొ. 6-1-1