దివ్యదేశ వైభవ ప్రకాశికా/ఆచార్య వైభవం
శ్రీరస్తు
శ్రిమతే రామానుజాయనమ:
ఆచార్యవైభవము
శ్రీమన్నాథమునులు
(శ్రీరంగనాథమునులు)
తిరునక్షత్రతనియన్:-
జ్యేష్ఠ మాసే త్వనూరాధా జాతం నాథమునిం భజే|
యచ్చ్రీ శఠారే శ్శ్రుతవాన్ ప్రబన్ద మఖిలం గురో:||
నిత్యతనియన్:-
నమో చిన్త్యా ద్భుతాక్లిష్ట జ్ఞాన వైరాగ్య రాశయే
నాథాయ మునయే గాధ భగవద్బక్తి సిందవే||
పూర్వాచార్య పరంపరలో ప్రథములు శ్రీమన్నాథమునులు. వీరు వీరనారాయణ పురమున (కాట్టుమన్నార్ కోయిల్) "శోభకృత్" నామ సంవత్సర మిదునమాసమున (జ్యేష్ఠమాసమున) అనూరాదా నక్షత్రమున బుదవారమున గణేశాంశమున ఈశ్వరభట్టర్ అనువారికి కుమారులుగా నవతరించిరి.
ఒకనాడు ఆళ్వార్ తిరునగరి నుండి వేంచేసిన కొందరు స్వాములు మన్నార్ పెరుమాళ్లను సేవించి నమ్మాళ్వార్ అనుగ్రహించిన తిరువాయిమొழிలోని "ఆరావముదే" అను దశకమును అనుగ్రహింపగా నాథమునులు విని ఆనందనిర్బరులై తిరువాయిమొழிని పూర్తిగా వినవలెనని కుతూహలపడి స్వాములను ప్రార్థించిరి. స్వాములును తిరువాయిమొழி ఈ పది పాశురములు తక్క మిగిలిన భాగము ప్రణష్టమై నదని తెలుపగా చింతించి నాథమునులు ఎట్లైనను తిరువాయిమొழிని సంపాదింపవలెనని యెంచి ఆళ్వార్ తిరునగరిని చేరిరి.
అచట నిర్ణిద్ర తింత్రిణీ వృక్షముక్రింద సుఖాసీనులై వేంచేసియున్న ఆళ్వార్లను సేవించి వారి విషయమై మధురకవి యాళ్వార్లనుగ్రహించిన "కణ్ణిమణ్ శిరుత్తాంబు" ప్రబంధమును పండ్రెండువేల పర్యాయములు జపించిరి. అంత నమ్మాళ్వార్లు యోగమున నాథమునులకు సాక్షాత్కరించి నాలాయిర దివ్య ప్రబంధముల ననుగ్రహించిరి.
నాథమునులును సంతుష్టాంతరంగులై కాట్టుమన్నార్ కోయిల్‌చేరి తమమేనల్లుళ్ళగు "కీళయకత్తాళ్వార్" మేలైయకత్తాళ్వార్" అనువారలకు నేర్పి
203 వారిచే గానము చేయించిరి. ఆవంశమువారే నేటికిని శ్రీరంగనాథుని మ్రోల దివ్యప్రబంధమును గానము చేయు అరయరు స్వాములు.
వీరికుమారులు ఈశ్వరమునులు. వారికి కుమారులు దయింతురనియు వారికి "యమునై త్తుఱైవర్" అను తిరునామముంచవలయుననియు నియమించిరి. వారికి ద్వయమంత్రమును దివ్యప్రబంధములను చెప్పుమని తమ శిష్యులగు ఉయ్యక్కొండార్‌ను, యోగరహస్యముల నుపదేశింపుడని "కురుగైక్కావలప్పన్" అనువారిని నియమించిరి. వీరికి చక్రవర్తి తిరుమగన్ (శ్రీరామచంద్రులు) యందు ప్రేమాతిశయము మించగా వారిని వెదకుచు గంగైకొండ చోళపురము చేరి అచట పరమపదించిరి.
వీరి తిరునక్షత్రం: మిదునం, అనురాధ
అవతారస్థలం: కాట్టుమన్నార్ కోయిల్
అనుగ్రహించిన గ్రంథములు: న్యాయతత్త్వము, యోగరహస్యము, పురుషనిర్ణయమ్?
శిష్యులు: ఉయ్యక్కొణ్డార్, కురుగైక్కావలప్పన్, తిరుక్కణ్ణమజ్గై యాణ్డాన్ మొదలగువారు.
వాழி తిరునామజ్గళ్
అనిదనిల్ అనుడత్తిల్ అవదరిత్తాన్ వాழிయే
ఆళవందార్కుపదేశమ్ అరుళివైత్తాన్ వాழிయే
పానుతెర్కిఱ్ కణ్డవన్ శొల్ పలవురైత్తాన్ వాழிయే
పరాజ్కుశనార్ శొర్ పిరపన్దమ్ పరిన్దుకత్‌తాన్ వాழிయే
గానముర తాళత్తిల్ కణ్డిశైత్తాన్ వాழிయే
కరుణైయినాల్ ఉపదేశక్కదియళిత్తాన్ వాழிయే
నానిలత్తిల్ గురువరై యై నాట్టినాన్ వాழிయే
వలన్తిగழு నాదముని నఱ్పదజ్గళ్ వాழுయే.
నాథేన మునినాథేన
భవయేం నాథవానహమ్,
యస్య నైగమికం తత్త్వం
హస్తామలకతాం గతమ్||
ఉయ్యక్కొండార్
తిరునక్షత్రతనియన్:-
మేషమాసే సరోజాక్షం కృత్తికా జాత మాశ్రయే
నాథయోగి సదామ్బోజ ద్వస్ద్వ ప్రవణ మానసమ్||
నమస్యామ్యరవిన్దాక్షం నాథభావే వ్యవస్థితమ్|
శుద్ద సత్త్వమయం శౌరే రవతార మివాపరమ్||
నిత్యతనియన్:-
నమ: పంకజనేత్రాయ నాథ శ్రీపాద పజ్కజే|
స్వస్త సర్వభరాయాస్మత్ కులనాథాయ ధీమతే||
నాథమునుల శిష్యులు ఉయ్యక్కొండార్, పుండరీకాక్షులనునది వీరి తిరునామము. వీరు మేష మాసమున కృత్తికా నక్షత్రమునందు తిరువెళ్ళరై క్షేత్రము నందవతరించిరి. వీరు సేనమొదలి యాళ్వార్ల మంత్రియగు జయత్సేనుని అంశము.
నాథమునుల మామగారు వంగిపురత్తు నంబి. వారి కుమార్తె అరవిందా ప్పావైయాళ్. ఆమెను చూడగోరి పిలువ నంపగా నాథమునులు ఆమెకు ఉయ్యక్కొండారును సహాయముగా పంపిరి. అచట వీరిని పురశ్చూడులుగా చూచినవారు వీరికి వేరుగా భోజనము పెట్టిరి. ఉయ్యక్కొండారును సంతోషముతో భుజించి తిరిగి వీరనారాయణపురము చేరిరి.
విషయము తెలిసిన నాథమునులు ఉయ్యక్కొండారును ప్రశ్నింపగా వారు "మీ శిష్యునిగా నన్ను గౌరవింపక నాలోని నైచ్యమును గుర్తించినందులకు" నాకు పరమ సంతోషమైనదని పలికిరి. వారి నైచ్యాను సందానమునకు ఆశ్చర్యపడిన నాథమునులు వారిని చూచి "ఎన్నై ఉయ్యక్కొండేరో"(నన్ను ఉజ్జీవింప వచ్చినారా) అని పలికిరి. తదాదిగావీరికి ఉయ్యక్కొండార్ అను తిరునామమేర్పడినది.
నాథమునులు యోగరహస్యములు తెలిసినవారు-కానీవీరు "పిణంకిడక్క మణంపురి వారుండో!" శవము ఉండగా వాసన చూచువారుందురా! అనితలచి అష్టాంగ యోగమును వదలి అర్చావతారవైభవమును ప్రతిపాదించు దివ్య ప్రబంధములను నాథమునులవద్ద అధ్యయనముచేసి వాని అర్థములు తెలిసికొని లోకమునకు అనుగ్రహించుటచే వీరికి "ఉలకై ఉయ్యక్కొండార్" (లోకములను రక్షింప వచ్చినవారు) అనిపేరువచ్చెను.
వీరునాథమునుల తరువాత దర్శన ప్రవర్తకులుగా వేంచేసియుండిరి. వీరి
శిష్యులు: 1"మణక్కాల్ నమ్బి" 2. తిరువల్లిక్కేణి పాణ్ పెరుమాళ్ అరయర్ 3. శెట్టైప్పూశి శెణ్డలజ్గారర్ 4. పుణ్డరీకదాసర్ 5. ఉలకు పెరుమాళ్ నజ్గైయనువారు.
తిరునక్షత్రము: మేషమాసము-కృత్తికా నక్షత్రము.
అవతారస్థలము: తిరువెళ్లరై
ఆచార్యులు: నాథమునులు.
వాழி తిరునామమ్
<poem> వాలవెయ్యోన్దనై వెన్ఱ వడివழగన్ వాழிయే
మాల్ మణక్కాల్ నమ్బి తొழூమలర్పదత్తోన్ వాழிయే
శీలమిగు నాదముని శీరురై ప్పోన్ వాழிయే
శిత్తిరైయిల్ కార్తిగై నాళ్ శిఱక్కవన్దోన్ వాழிయే
నాలిరణ్డు మైన్దుం నమక్కురైత్తాన్ వాழிయే
నాలెట్టి నుఱ్పొరుళై నడత్తినాన్ వాழிయే
మాలరజ్గర్ మణవాళర్ వళమురైప్పోన్ వాழிయే
వైయ ముయ్యక్కొణ్డవర్ తాళ్ వై యగత్తిల్ వాழிయే
మణక్కాల్ నంబి
(శ్రీరామమిత్రులు)
తిరునక్షత్ర తనియన్:-
కుంభ మాసే మఖోద్బూతం రామమిశ్ర ముపాస్మహే
పుణ్డరీకాక్ష పాదాబ్జ సమాశ్రయణ శాలినమ్||
నిత్యతనియన్:-
అయత్నతో యామున మాత్మదాస మలర్క పత్రార్పణ నిష్క్రియేణ|
య: క్రీతవా నాస్థిత యౌవరాజ్యం నమామి తం రామ మమేయ సత్వం||
వీరు విరోధినామ సంవత్సర కుంభమాసమున శుద్ద చతుర్దశి మఖా నక్షత్రం బుధవారమున చోళదేశమందలి తిరుక్కావేరి తీర గ్రామమైన మణక్కాల్ అనుదివ్య దేశమునందు కుముదాక్షాంశముతో నవతరించిరి.
వీరు ఉయ్యక్కొండారుల ప్రధానశిష్యులు. వారి తర్వాత సంప్రదాయ ప్రవర్తకులుగా వేంచేసియున్నవారు. వీరికి ఆచార్యాభిమానము మెండు: ఉయ్యక్కొండారుల దేవిమారులు (భార్య) పరమపదింపగా వీరు ఆచార్య గృహకృత్యములన్నింటిని నెరవేర్చెడివారు. ఒకనాడు ఆచార్యులు కుమార్తెలు ఒక కాలువ దాటవలసివచ్చెను. వీరు వారిని తమ భుజములపై నిడికొని కాలువ దాటించిరి. ఉయ్యక్కొణ్డారులీ విషయము తెలిసి వీరిని విశేషముగా కృపచేసిరి.
వీరు ఆళవందారులకు ఆచార్యులు. రాజ్య పదమునందున్న ఆళవందారులను ఉపాయముగా వశీకరించుకొని వారికి మంత్ర త్రయమును దివ్య ప్రబంధములను సకల రహస్యములను ఉపదేశించిన మహనీయులు. వీచరితమును గురుపరంపరా ప్రభావాదులలో చూడవచ్చును.
తిరునక్షత్రము: కుంభమాసం, మఖానక్షత్రం
అవతారస్థలం: మణైక్కాల్
ఆచార్యులు: ఉయ్యక్కొణ్డార్
శిష్యులు: ఆళవన్దార్ మొదలగువారు
వాழி తిరునామజ్గళ్
తేశముయ్య క్కొణ్డవర్‌తాళ్ శెన్నివైప్పోన్ వాழிయే
తెన్నరజ్గర్ శీరరువై చ్చేర్‌న్దిరుప్పోన్ వాழிయే
దాశరది తిరునామమ్ తழைక్కవన్‌దోన్ వాழிయే
తమిழ் నాదముని యుగపై త్తాపిత్తాన్ వాழிయే
నేశముడ నారియనై నియమిత్తాన్ వాழிయే
నీణిలత్తిల్ పతిన్ మర్కలై నిఱుత్తినాన్ వాழிయే
మాశిమగన్తనిల్ విళ్జ్గ పన్దుదిత్తాన్ వాழிయే
మాల్‌మణక్కాల్ నమ్బి పదమ్ వైయగత్తిల్ వాழிయే.
ఆళవందార్
(యామునమునులు)
తిరునక్షత్ర తనియన్:-
శుచౌ మాస్యుత్తరాషాడా జాతాం యామున దేశికం |
శ్రీ రామమిశ్ర చరణ సరోజాశ్రిత మాశ్రయే|
నిత్యతనియన్:-
యత్పదాంభోరుహధ్యాన విధ్వస్తా శేష కల్మష:|
వస్తుతా ముపయాతోహం యామునేయం నమామితమ్||
వీరు నాథమునుల పౌత్రులు. ఉడయవరులకు పరమాచార్యులు. వీరు దాతృనామ సంవత్సర కర్కాటక మాసము ఉత్తరాషాడ నక్షత్రమున విష్వక్సేసుల మంత్రులలో నొకరగు సింహముఖుని అంశమున ఈశ్వరమునులకు కుమారులుగా వీరనారాయణపురము నందవతరించిరి. వీరికి తండ్రిగారుంచిన తిరునామము యమునై త్తుఱవర్.
ఆనాటి చోళరాజు ఆస్థానమున నుండిన విద్వజ్జన కోలాహలుడను పండితుని వాదమున జయించి అర్దరాజ్యమును సంపాదించి రాజ్యసుఖములనుభవించు చుండిరి. అంతట శ్రీరామమిత్రులు (మణక్కాల్ నంబి) తమ ఆచార్యాజ్ఞానుసారము యామునమునులను అనుసరించి వారిని వశీకరించుకొని మంత్ర మంత్రార్థములను దివ్య ప్రబంధములను సకల రహస్యములను అనుగ్రహించిరి.
కాంచీపురమున వరదరాజస్వామి సన్నిధిలో స్వామి ఎంబెరుమానారులను చూచి వారిని దర్శన ప్రవర్తకులుగా కటాక్షించిరి. ఎంబెరుమానారులు వీరిని సేవించుటకు శ్రీరంగమునకు వేంచేయగా అప్పటికే వీరు పరమపదించిరి. ఆ సమయమున మూడు వ్రేళ్లు ముడుచుకొనియుండగా ఉడయవరులు మూడు ప్రతిజ్ఞలుచేసి మూడువ్రేళ్లను తెరిపించిరి.
వీరి సన్నిధిని ఆశ్రయించిన వారు 1. పెరియనంబి 2. తిరుక్కోట్టియూర్ నంబి 3. పెరియ తిరుమలై నంబి 4. మారనేరినంబి 5. తిరుక్కచ్చి నంబి 6. ఆళవందారాళ్వాన్ 7. తిరుమాలై యాణ్డాన్ 8. వానమామలై ఆణ్డాన్ 9. తెయ్‌వవారియాణ్డాన్ 10. ఈనాణ్డాన్ 11. జీయరాణ్డాన్ 12. తిరుక్కురుగూరప్పన్ 13. తిరుమోక్కరప్పన్ 14. తిరుమోక్కర్ నిన్ఱాన్ 15. తెయ్‌వపెరుమాళ్ 16. వకుళాభరణసోమయాజియార్ 17. తిరుక్కురుగూర్ దాసర్ 18. తిరుమాలిరుంశోలై దాసర్ 19. వడమధురై పిరన్దాన్ 20. ఆళ్కొణ్డి అమ్మంగి అనువారలు.
అనుగ్రహించిన గ్రంథములు: 1.స్తోత్రరత్నము 2. చతుశ్శ్లోకీ 3. సిద్దిత్రయము 4. ఆగమప్రామాణ్యము గీతార్థ సంగ్రహమ్.
208
తిరునక్షత్రము: కర్కటకమాసం-ఉత్తరాషాడా నక్షత్రం
అవతార స్థలము: కాట్టుమన్నార్ కోయిల్
ఆచార్యులు: మణక్కాల్ నంబి
వాழி తిరునామజ్గళ్
మచ్చణియుమ్ మదిళరజ్గమ్ వాழ் విత్తాన్ వాழிయే
మఱై నాన్గు మోరురవిల్ మగిழ்న్దుకత్‌తాన్ వాழிయే
పచ్చైయిట్ట రామమ్ పదమ్ పగరుమవన్ వాழிయే
పాషియైత్తో నీడేఱ ప్పార్వై శెయ్‌దోన్ వాழிయే
కచ్చినగర్ మాయ నిరుకழల్ పణిన్దోన్ వాழிయే
కడగ ఉత్తిరాడత్తుక్కాలు దిత్తాన్ వాழிయే
అచ్చమఱ మనమగిழ்చ్చి యణైన్దిట్టాన్ వాழிయే
ఆళవన్దార్ తాళిణైగళ్ అనవరతమ్ వాழிయే
విగాహే యామునం తీర్థం సాధు బృన్దావనే స్థితమ్|
నిరస్తజిహ్మగస్పర్శే యత్ర కృష్ణ: కృతాదర:||
209 పెరియనంబి
(మహాపూర్ణులు)
తిరునక్షత్ర తనియన్:-
ధనుర్జ్యేష్ఠా సముద్బూతం యామునాజ్ఘ్రి సమాశ్రితం |
మహాపూర్ణం యతీంద్రాయ మస్త్రరత్న ప్రధమ్బజే||
దయా విఘ్నం యతీన్ద్రస్య దేశికం పూర్ణమాశ్రయే|
యేవవిశ్వసృజో విష్ణో రపూర్యత మనోరథ:||
నిత్యతనియన్:-
కమలాపతి కల్యాణ గుణామృత విషేవయా|
పూర్ణకామాయ సతతం పూర్ణాయ మహతే నమ:||
పెరియనంబిగారు హేవళంబినామ సంవత్సరమున దనుర్మాసమున శుద్ద పంచమీ గురువారం జ్యేష్ఠా నక్షత్రమున శ్రీరంగమునందవతరించిరి. వీరు విష్వక్సేసుని పరివారములోని కుముదాంశ సంభూతులు. వీరికి పెరియనంబి, మహాపూర్ణులు; పరాంకుశ దాసులు మొదలగు తిరునామములు కలవు. వీరి కుమారులు పుణ్డరీకాక్షులు. కుమార్తె అత్తుళ్లాయమ్మగారు. వీరు శ్రీ ఆళవన్దారుల శ్రీపాదములాశ్రయించి సకలరహస్యార్థములను పొందిరి. తమ పతీర్థులయిన మాఱనేర్ నంబిగారికి బ్రహ్మమేద సంస్కారమును చేసిరి.
వీరు భగవద్రామానుజులకు ప్రదాన ఆచార్యులు. మధురాన్తకమున చక్రవర్తి తిరుమగన్ సన్నిధిలో భగవద్రామానుజులకు పంచ సంస్కారములను అనుగ్రహించిరి. కొంత బాగము దివ్యప్రబంధము కృపచేసిరి. చోళరాజోపద్రవమున కూరత్తాళ్వాన్లతో కలసి చోళరాజ సభకు పోయి దర్శన స్థాపన చేసి తమ దర్శనములు(కన్నులును) పోగొట్టుకొనినారు. తిరిగివచ్చునప్పుడు మధ్యే మార్గమున కూరత్తాళ్వాన్ ఒడిలో శిరస్సును కుమార్తె అత్తుళాయమ్మగారి ఒడిలో పాదములను ఉంచుకొని పరమపదించిరి. వీరనుగ్రహించిన గ్రంథము "తిరుప్పతి కోవై".
వాழி తిరునామజ్గళ్
అమ్బునియిల్ పదిన్మర్ కలై ఆయ్‌న్దురై ప్పోన్ వాழிయే
ఆళవన్దార్ తాళిణైయై యడైన్దుయ్‌న్దోన్ వాழிయే
ఉమ్బర్ తొழுమరజ్గేశర్ క్కుగప్పుడై యోన్ వాழிయే
ఓజ్గుతను క్కేట్దైదని లుదిత్తపిరాన్ వాழிయే
పమ్బవిழ்తార్ పరదరులై వాழி శెయ్‌దాన్ వాழிయే
మాఱనేర్ నమ్బిక్కు వాழ் వళిత్తాన్ వాழிయే
ఎమ్బెరుమానార్ మునివర్ క్కితమురైత్తాన్ వాழிయే
ఎழிల్ పెరియనమ్బి శరణ్ ఇనితూழி వాழிయే
తిరుమలై నంబి
(శ్రీ శైలపూర్ణులు)
తిరునక్షత్ర తనియన్:-
శ్రీ మల్లక్ష్మణయోగీంద్ర శ్రీ రామాయణ దేశికమ్|
శ్రీ శైలపూర్ణం వృషభ స్వాతి సంజాత మాశ్రయే||
నిత్యతనియన్:-
పితామహప్యాపి పితామహాయ
ప్రాచేతపా దేశ ఫలప్రదాయ
శ్రీభాష్యకారోత్తమ దేశికాయ
శ్రీ శైలపూర్ణాయ నమో నమస్తాత్||
వీరు విశ్వక్సేసుని పరివారములోని సుముఖుని అంశతో నవతరించిన మహనీయులు. వృషభ మాసమున చిత్రానక్షత్రమున ప్రసిద్ధ దివ్యదేశమున "తిరుమలై" శ్రీనివాసుని వరప్రసాదిగా నవతరించుటచే వీరికి తిరుమలై నంబియను తిరునామమేర్పడినది. శ్రీ శైలపూర్ణులనునది నామాంతరము. వీరికుమారులు పిళ్లై తిరుమల నంబిగారు.
వీరు ఆళవందారుల శ్రీపాదములాశ్రయించి సకల వేదాంతార్దములను అధికరించిరి. "వేంగడత్తై ప్పతియాక వాల్‌వీర్ కాళ్" అనునట్లు శ్రీవేంకటాచలపతినే దారకముగా భావించి సదా స్వామి కైంకర్యము నందే నిమగ్నులైన మహనీయులు.
వీరికి తోడబుట్టిన సోదరీమణులిరువురు. వారిలో పెద్దవారు శ్రీ భూమి పిరాట్టి(వీరికే కాంతిమతీ దేవియనిపేరు) కుమారులే భగవద్రామానుజులు. రెండవవారగు పెరియపిరాట్టి కుమారులు ఎమ్బార్ అనే గోవిందభట్టర్, శిరియగోవింద ప్పెరుమాళ్.
వీరిలో ఎమ్బార్ మతాంతర ప్రవిష్ఠులుకాగా వారిని దిద్దుబాటు చేసి శ్రీవైష్ణవ సిద్దాన్త ప్రవర్తకులుగా తీర్చిదిద్దిరి. భగవద్రామానుజులకు శ్రీరామాయణ రహస్యములను ఒక సంవత్సరకాలము అనుగ్రహించిరి.
వీరు తిరుమలై శ్రీనివాసునకు తీర్థ కైంకర్యము చేయు సమయము నందొకనాడు శ్రీనివాసుడు వృద్ద బ్రాహ్మణుని రూపమునవచ్చి తాతా! దాహముగా నున్నది తీర్థమునిమ్మని కోరి వీరిచ్చిన తీర్థమును స్వీకరించిరి. ఈ సందర్బములో శ్రీనివాసుడు తాతా! అనిపిలుచుటచే వీరు పితామహులకు కూడ పితామహులైరి. వీరి వైభవము గురుపరంపరా ప్రభావములో సేవింపవచ్చును.
211
తిరునక్షత్రం: వృషభం, చిత్త
ఆచార్యులు: ఆళవన్దార్
శిష్యులు: భగవద్రామానుజులు మొదలగువారు.
వాழி తిరునామమ్
వైయాశి చ్చోతియినాళ్ వందు దిత్తాన్ వాழிయే
వణ్ తిరువేంగడ ముడైయాన్ వరపుత్తిరన్ వాழிయే
అయ్యన్ శ్రీ ఆళవందార్ అడితొழுవోన్ వాழிయే
అనవరతం మలై కునియర్ కడిమై శెయ్‌వోన్ వాழிయే
మెయ్యనిరామానుజార్యర్ విరుంబుమవన్ వాழிయే
మిక్కతిరుమలై యార్‌కెల్లాం మేలావాన్ వాழிయే
శెయ్య తమిழ் కాదత్తిన్ శిఱప్పఱిందోన్ వాழிయే
తిరుమల నంబిగళ్ ఉభయ తిరువడిగళ్ వాழிయే.
"తిరుక్కోట్టియూర్ నంబి"
(గోష్ఠిపూర్ణులు)
తిరునక్షత్ర తనియన్:-
వైశాఖ రోహిణ్యుదితం గోష్ఠిపూర్ణం సమాశ్రయే|
చరమశ్లోక తాత్పర్యం యతిరాజాయయోపదత్||
శమదమ గుణపూర్ణం యామునార్య ప్రసాదాత్
అధిగత పరమార్దం జ్ఞాన భక్త్యాది సిన్దుమ్|
యతిపతిసతపాదం శ్లోకతత్త్వార్ధ విష్ఠం
శ్రితదురితహరం శ్రీ గోష్ఠిపూర్ణం నమామి||
నిత్యతనియన్:-
శ్రీ వల్లభ పదాంభోజ ధీభక్త్య మృత సాగరమ్|
శ్రీ మద్గోష్ఠిపురీ పూర్ణం దేశికేన్ద్రం భజామహే||
శ్రీ పుండరీకాంశ సంభూతులైన తిరుక్కోట్టియూర్ నంబిగారు తిరుక్కోట్టియూర్ అనుదివ్యదేశమున సర్వజిత్ నామ సంవత్సర వృషభమాసమున రోహిణీ నక్షత్రమునందవతరించిరి. వీరికి గోష్ఠిపూర్ణులనునది నామాంతరము. వీరు పూర్వశిఖులుద్రాహ్యాయన సూత్రులు. వీరి కుమారులు తెఱ్కాళ్‌వాన్, కుమార్తె దేవకీ పిరాట్టి.
వీరు శ్రీ ఆళవన్దారుల శ్రీపాదములాశ్రయించి రహస్యార్థములను అధికరించిరి. భగవద్రామానుజులు వీరి సన్నిధికి పదునెనిమిది పర్యాయములు అనువర్తించి తిరుమంత్రార్దమును, చరమశ్లోకార్దమును సేవించిరి. తాము తెలిసికొన్న తిరుమంత్రార్దమును తిరుక్కోట్టియూర్‌గోపురముపై నుండి సర్వులకు తెలియజేసిరి. వారి వరసమృద్ది ప్రియత్వమునకు సంతుష్ఠులైన గోష్ఠిపూర్ణులు వీరిని "ఎంబెరుమానార్" అనిసంబోదించిరి. తదాది భగవద్రామానుజులకు "ఎంబెరుమానార్" అనుతిరునామమేర్పడినది.
వాழி తిరునామమ్
<poem> అరియన్ నాళ్ రోహిణి వైయాశి వందోన్ వాழிయే
ఆళవన్దార్ తాళిణై యిల్ అడిమై శెయ్‌వోన్ వాழிయే
పరమనవన్ తెర్‌కాழ்వాన్ పదం పణిన్దోన్ వాழிయే
బాష్యకారర్ క్కతిరహస్యం పగరమవన్ వాழிయే
తిరుక్కోట్టియూరదనిల్ శేర్‌న్దిరుప్పోన్ వాழிయే
తెఱెకాழ்వాన్ తమప్పనెన్ఱు తిశైమఱివోన్ వాழிయే
తిరుమాగుం తెన్‌మొழிయిన్ తిరంతెరిన్దోన్ వాழிయే
తిరుక్కోట్టియూర్ నంబి యిరుతిరువడిగళ్ వాழிయే.
213
తిరుమాలైయాణ్దాన్
(శ్రీ మాలాధరులు)
తిరునక్షత్ర తనియన్:-
కుంభమాసే మఖోద్బూతం మాలాధర ముపాస్మహే
యామునార్య పదాంభోజ సమాశ్రయణ శాలినమ్|
రామానుజ మునీంద్రాయ ద్రావిండీ సంహితార్థదమ్
మాలాధర గురుం వందే వావదూకం విపశ్చితమ్
నిత్యతనియన్:-
భక్తామృతం వాంఛిత పారిజాతం
మాలాధరం యామున పాదభక్తమ్|
శ్రీ భాష్య కారస్య హితోపదేశమ్
శ్రీజ్ఞానపూర్ణం శిరసానమామి||
వామనాంశ సంభూతులైన తిరుమాలై యాణ్డాన్ తిరుమాలిరుంశోలై మలై అను దివ్యదేశమున సర్వదారి నామ సంవత్సర కుంభమాసమున మఖానక్షత్రము నందవతరించిరి. మాలాధరులనునది వీరికి సంస్కృత తిరునామము. వీరు శ్రీఆళవన్దారుల శ్రీపాదముల నాశ్రయించి వేదవేదాంత రహస్యములను, దివ్యప్రబంధ విశేషార్థములను గ్రహించిరి.
వీరు తిరుక్కోట్టియూర్ నంబిగారి ఆదేశానుసారము భగవద్రామానుజులకు తిరువాయిమొழி అర్ద విశేషములను అనుగ్రహించిరి. ఆసందర్బములో భగవద్రామానుజులు పలు సందర్బములలో ఆళవందారులు చెప్పిన తాత్పర్యార్థ మిట్లుండునని చెప్పి ఆళవందారుల శ్రీసూక్తులను వినిపింపగా ఆశ్చర్యపడిన మాలాధరులు ఇదియు ఒక అవతార విశేషమా! అని ఆశ్చర్యపడి దండము సమర్పించి తమ కుమారులు సుందరత్తోళుడైయాన్ అనువారిని ఉడయవరులకు శిష్యులనుగా చేసిరి. వీరి వైభవము గురుపరంపరా ప్రభావాదులలో సేవింపవచ్చును.
214
తిరువరంగప్పెరుమాళ్ అరయర్
(శ్రీ రంగదేశికులు)
తిరునక్షత్ర తనియన్:-
వృషభే జ్యేష్ఠ నక్షత్రే జాతాం శ్రీ రంగదేశికమ్
యామూనార్య సుతం వన్దే శంఖ కర్ణాంశ సంభవమ్
శ్రీ రామమిశ్ర పదపంకజ చంచరీకం
శ్రీ యామునార్య పరపుత్ర మహం గుణాడ్యమ్
శ్రీ భాష్యకార శరణం వరరంగమీడే||
నిత్యతతనియన్:-
అధ్యాపయ ద్యతీంద్రాయ పరాంకుశ సహస్రికామ్|
తన్నాథ వంశ్యం వన్దేహం శ్రీ రంగాధిపదేశికమ్.
వీరు ఆళవందారుల తిరుకుమారులు. వీరితల్లిగారు శ్రీరంగ నాచ్చియార్. తెయ్‌వత్తక్కరశునంబి, పిళ్లైయరశునంబి, శెట్టై నంబి అనువారు. ఆచార్యులు మణక్కాల్ నంబిగారు.
తిరువరంగప్పెరుమాళ్ అరయర్ ప్రతినిత్యము శ్రీరంగనాథుల సన్నిధిలో దివ్యప్రబంధమును గానము చేసెడివారు. ఆళవందారుల ఆజ్ఞచే కాంచీపురమునకు పోయి వరదరాజస్వామిని ప్రసన్నుని చేసికొని భగవద్రామానుజులను శ్రీరంగమునకు తీసికొనివెళ్లిరి. వీరి సన్నిథిలో ఎంబెరుమానార్లు దివ్య ప్రబంధములను, చరమ సర్వనిష్ఠా రహస్యములను (ఆచార్యుల యందు భక్తి కలిగియుండుటచే ఉత్తారకము) తెలిసికొనిరి.
ఉడయవర్
(భగవద్రామానుజులు)
తిరునక్షత్ర తనియన్:-
మేషార్ద్రా సంభవం విష్ణోర్దర్శన స్థాపనోత్సుకమ్
తుండీర మండలే శేషమూర్తిం రామానుజం భజే||
నిత్యతనియన్:-
యోనిత్య మచ్యుత పదాంబుజ యుగ్మరుక్మ
వ్యామోహత స్తదితరాణి తృణాయ మేనే|
అస్మద్గురో ర్భగవతోస్య దయైక సిన్దో:
రామానుజన్య చరణౌ శరణం ప్రపద్యే||
వీరు తొండమండలమునగల శ్రీ పెరుంబూదూరు అను దివ్యదేశమున హరీతగోత్రులగు ఆసూరి కేశవ సోమయాజుల వారికి కాంతిమతీ దేవి యందు కుమారులుగా పింగళనామ సంవత్సర చైత్ర (మేష) శుక్ల పంచమీ గురువారము ఆర్ద్రా నక్షత్రయుక్త కర్కాటక లగ్నము నందవతరించిరి.
వీరికి తండ్రిగారు యథోచితమగు జాతకర్మాదుల నొనర్చి "ఇళై యాళ్వార్" అను తిరునామముంచిరి. వీరు శాస్త్రాభ్యాసము చేయుసమయమునందే ఒక మూగవానికి, బ్రహ్మరక్షస్సుకు మోక్షమునను గ్రహించిరి. ఉపనిషదర్థ విచారమున యాదవప్రకాశులతో విభేదించిరి.
తిరుక్కచ్చినంబిగారి ద్వారా షడ్వార్తలనువిని ఆళవందారుల శ్రీపాదములాశ్రయించిన పెరియనంబిగారిని ఆశ్రయించి మధురాంతకమున పంచ సంస్కారములను పొందిరి. పిమ్మట అనంత సరసీ తటమున వరదరాజస్వామి సన్నిధిలో తురీయాశ్రమమును స్వీకరించిరి.
పిమ్మట శ్రీరంగముచేరి శ్రీరంగనాథుల కైంకర్యము చేయుచుండిరి. తమ మేనమామగారైన పెరియ తిరుమల నంబిగారిని వద్ద శ్రీరామాయణమును సేవించిరి. వారును తమ కుమారులగు పిళ్ల తిరుమలనంబిగారి, మేనల్లుడగు "ఎమ్బార్లను" (గోవిందభట్టర్) వీరి శ్రీపాదములాశ్రయింపజేసి "కోయిలణ్ణన్" అను తిరునామముంచిరి.
తిరువరజ్గప్పెరుమాళ్ అరయర్ అనువారివద్ద దివ్యప్రబంధములు సేవించిరి. వారును వీరికి లక్ష్మణమునులు అను తిరునామముంచి తమసోదరులగు శాట్టనమ్బిగారిని వీరి తిరువడిలో నాశ్రయింపజేసిరి.
తిరుక్కోట్టియూర్ నంబిగారివద్ద రహస్య త్రయార్థమును సేవించి వారి
216 వలన "ఎమ్బెరుమానార్" అను బిరుదమును పొంది వారి తిరుక్కుమారులైన తెఱ్కాళ్వార్ అనువారిని శిష్యులుగా స్వీకరించిరి.
శ్రీ తిరుమాలైయాణ్డాన్ అనువారివద్ద దివ్యప్రబంధవ్యాఖ్యానములను సేవించి శఠగోపన్ పొన్నడి అనుతిరునామముపొంది వారి కుమారులు సుందరత్తోళుడైయాన్ అనువారిని శిష్యులుగా స్వీకరించిరి.
అద్వైత సంప్రదాయమునకు చెందిన "యజ్ఞమూర్తి" అనువారిని వాదమున జయించి శిష్యులుగా స్వీకరించి "అరుళాళప్పెరుమాళ్ ఎంబెరుమానార్" అను తిరునామముంచిరి. తమ మేనల్లుడగు మొదలియాండాన్‌ను సగోత్రులగు కూరత్తాళ్వాన్‌ను శిష్యులుగా ననుగ్రహించిరి.
తిరుమల శ్రీనివాసునకు శంఖచక్రములు ప్రసాదించిరి. శ్రీవారి వక్షస్థలమున అలర్‌మేల్‌మంగైను ప్రతిష్ఠించి "శ్రీవేంకటేశ శ్వశుర" అను బిరుదము వహించిరి. తిరుక్కురుజ్గుడి నమ్బికి ద్వయమంత్రము నుపదేశించి "శ్రీవైష్ణవనంబి" యని తిరునామముంచిరి.
చోళరాజోపద్రవమున మేల్‌నాడు(మేల్‌కోటై ప్రాంతము) వేంచేసిరి. డిల్లీ పాదుషా వద్దనుండి "శెల్వపిళ్ళ" అను ఉత్సవమూర్తిని తీసికొనివచ్చి తిరునారాయణపురమున ప్రతిష్ఠించిరి. అచటవారి ప్రార్థనచే తమ అర్చామూర్తిని ప్రతిష్ఠించుటకు అనుమతించిరి. తమ శ్రీపాదములాశ్రయించిన వడుగ నంబికి మిధున సాలగ్రామమున శ్రీపాద తీర్థము ననుగ్రహించిరి.
బ్రహ్మ సూత్రములకు పూర్వాచార్య సురక్షితమైన యర్థముతో శ్రీభాష్యముననుగ్రహించి కాశ్మీరు శారదాపీఠమున శ్రీభాష్యకారులను బిరుదము వహించిరి. వీరనుగ్రహించిన గ్రంథములు 1 శ్రీ బాష్యము 2. వేదాంతసారము 3. వేదాంతదీపము 4. వేదార్ద సంగ్రహము 5. గద్యత్రయము 6. గీతాబాష్యము 7. నిత్యగ్రంథము.
శ్రీరంగనాథులచే "అత్త్రైవ శ్రీరజ్గేసుఖమాస్వ" అను అనుజ్ఞవడసి వారిచే ఉభయ విభూతి సాంరాజ్య పట్టాబిషిక్తులై నూటయిరువది సంవత్సరములు లీలా విభూతిలో వేంచేసియుండిరి.
వీరు అవతరించిన కాలమునందే "తిరునారాయణపురము, శ్రీ పెరుంబుదూరులలో వీరి అర్చా విగ్రహములు ప్రతిష్ఠింపబడెను. వీరి చరమతిరుమేని శ్రీరంగమున ప్రతిష్ఠింపబడెను.
ఈ విధముగా తమ ప్రభావముచే విశిష్టాద్వైత సిద్దాంతమును స్థాపించి తమ శ్రీపాదములాశ్రయించిన వారి నందరిని అనుగ్రహించిన కృపామాత్ర ప్రసన్నాచార్యులు
217 భగవద్రామానుజులు. వీరి చరిత్ర గురుపరంపరా ప్రభావములో విశదముగా సేవింపవచ్చును.
తిరునక్షత్రము: మేషమాసము; ఆర్ద్ర నక్షత్రము.
అవతారస్థలము: శ్రీ పెరంబూదూర్.
ఆచార్యులు: పెరియనంబి.
శిష్యులు: కూరత్తాళ్వాన్ మొదలగువారు.
నాళ్‌పాట్టు
ఇన్ఱులగీర్! శిత్తిరైయిల్ ఏయ్‌న్ద తిరువాదిరై నాళ్
ఎన్‌ఱై యినుం ఇన్ఱిదమక్కేత్‌త్త మెన్ఱాన్-ఎన్ఱవర్‌కు
చ్చాత్‌త్తు గిన్ఱేన్ కేణ్మిన్ ఎతిరాశర్‌దం పిఱప్పాల్
నాల్ దిశైయుం కొణ్డాడుం నాళ్.
ఆళ్వార్‌గళ్ తాజ్గళ్ అవదరిత్త నాళ్ గళిలుమ్
వాళ్వాననాళ్ నమక్కు మణ్ణులగీర్?-ఏழ்పారుం
ఉయ్య ఎతిరాశరుదిత్తరుళుం, శిత్‌తిరైయిల్
శెయ్య తిరువాదిరై.
ఎన్దై ఎతిరాశర్ ఇవ్వులగిల్ ఎన్దమక్కా
వన్దు దిత్త నాళెన్నుం వాశియనాళ్-వన్ద
త్తిరువాదిరై దన్నిన్ శీర్మెదనై నెంజే!
ఒరువామల్ ఎప్పొழுదుమ్ ఒర్.
వాழி తిరునామజ్గళ్
<poem> అత్తిగిరి యరుళాళర్ అడిపణిన్దోన్ వాழிయే
అరుట్కచ్చి నమ్బియురై యాఱు పెత్‌తోన్ వాழிయే
పత్తియుడన్ బాషియత్తై ప్పగర్‌న్దిట్టాన్ వాழிయే
పదిన్మరైకలై తుట్పొరుళై ప్పరిన్దు కత్‌తోన్ వాழிయే
శుత్తమగిழ் మాఱన్ అడితొழு తుయ్‌న్దోన్ వాழிయే
తొల్ పెరియనమ్బి శరణ్ తోన్ఱినాన్ వాழிయే
శిత్తిరైయిల్ ఆదిరైనాళ్ శిఱక్క వన్దోన్ వాழிయే
శీర్ పెరుమ్బూదూర్ మునివన్ తిరువడిగళ్ వాழிయే
ఎణ్డిశై యెణ్డిళై యాళ్వార్ ఎతిరాశరన్ వాழிయే
ఎழுపత్తు నాల్వర్‌క్కుమ్ ఎణ్ణాజ్గుఱైత్తాన్ వాழிయే
పణ్‌డై మరై యైతై రిన్ద బాషియత్తోన్ వాழிయే
218 పరకాల నడియిణైయై పరపు మవన్ వాழிయే
తణ్డమిழ் నూర్ నమ్మాళ్వార్ శరణానాన్ వాழிయే
తారిణియుం విణ్ణులగం తానుడైయోన్ వాழிయే
తెణ్డిరై శూழ் బూదూరెమ్బెరుమానాన్ వాழிయే
శిత్తిరై యిற் శెయ్య తిరువాదిరైయోన్ వాழிయే
శీరారు మెతిరాశర్ తిరువడిగళ్ వాழிయే
తిరువరైయిల్ శాత్తియ శెన్దువరాడై వాழிయే
ఏరారుమ్ శెయ్యవడి వెప్పొழுదుమ్ వాழிయే
ఇలజ్గియ మున్నూల్ వాழி యిణైత్తోళ్‌గళ్ వాழிయే
శోరాదు తుయ్య శెయ్య ముగచ్చోతి వాழிయే
తూముఱువల్ వాழி తుణై మలర్కణ్గళ్ వాழிయే
ఈరారు తిరునామమ్ అణిన్ద ఎழிల్ వాழிయే
ఇని తిరుప్పోడెழிల్ --నముద్దిరై వాழிయే
అఱుశమయచ్చెడియదనై యడియఱుత్తాన్ వాழிయే
అడర్‌న్దు వరుం కుదిట్టగళై యఱత్తుఱన్దాన్ వాழிయే
శెరుకలియై చ్చిఱిదుమర త్తీర్తు విట్టాన్ వాழிయే
తెన్నరజ్గర్ శెల్వమత్‌తుం తిరుత్తివైత్తాన్ వాழிయే
మరై యదనిల్ పొరులనైత్తుం వాయ్‌మొழிన్దాన్ వాழிయే
మాఱనురై శెయ్‌ద తమిழ்మరై వళర్తోన్ వాழிయే
అఱమిగు నఱ్పెరుమ్బూదూర్ అవతరిత్తాన్ వాழிయే
అழగారుం ఎతిరాశర్ అడియిణైగళ్ వాழிయే
శజ్కర పాఱ్కర యాదవ బాట్ట పిరపాకరర్ తజ్గళ్ మతం
శాయ్‌వురు వాదియర్ మాయ్‌వుఱుమెన్ఱు శెదుమరై వాழ்న్దిడునాళ్
వెజ్గిలి యిజ్గిని వీఱు నమక్కిలై యెన్ఱు మిగత్తలర్ నాళ్
మేదిని న--మై యాఱుమెనత్తుయర్ విట్టు విళజ్గియనాళ్
మంగై యరాళి పరాజ్కుశ మున్నవర్ వాழ்వు ముళైత్తిడునాళ్
మన్నియ తెన్నరజ్గాపురి మామలై మత్‌తు మువన్దిడు నాళ్
శెజ్గయల్ వావిగళ్ శూழ்వయల్ నాళుం శిఱన్ద పెరుమ్బూదూర్
శ్రీమానిళై యాళ్వార్ వన్దరుళియనాళ్ తిరువాదిరై నాళే.
ముదలియాణ్డాన్
తిరునక్షత్ర తనియన్:-
మేషే పునర్వసు దినే పాంచజన్యాంశ సంభవమ్|
యతీన్ద్ర పాదుకాభిఖ్యం వన్దేదాశరధిం గురుమ్||
నిత్యతనియన్:-
పాదుకే యతిరాజస్య కథయన్తి యదాఖ్యయా|
తస్య దాశరధే: పాదౌ శిరసా ధారయామ్యహమ్||
వీరు కన్దాడై కుడి(వంశము) యందు మేషమాసమున పునర్వసు నక్షత్రమున పూందమల్లికి సమీపమునగల "పచ్చైవారణ పెరుమాళ్‌కోయిల్" (పేట్టె) యందు పాంచ జన్యాంశము నందవతరించిరి. వీరు ఎంబెరుమానారులకు భాగినేయులు(మేనల్లుళ్ళు). ఎంబెరుమానార్లచే త్రిదండస్థానముగా పరిగణింపబడినవారు.
వీరు చరమ శ్లోకార్థమును సేవింపదలచి ఉడయవరులను ప్రార్థింపగా వారు తిరుక్కోట్టియూర్ నంబిగారి సన్నిధికి పంపిరి. వారును "విద్యామదము ధనమదము అభిజన్మదమను మదత్రయము పోయినచో ఎమ్బెరుమానారులే కృపచేయుదురని వీరిని పంపివేసిరి.
మొదలియాండాను కూడ మిగుల శమదమాది ఆత్మగుణ పరిపూర్తి కలవారై మిక్కిలి ఆర్తితో ఉడయవరుల శ్రీపాదములాశ్రయింపగా స్వామి సంతోషించి వారికి గుహ్యతమైన చరమశ్లోకార్థము ననుగ్రహించి తమకు త్రిదండము చేతికి చిక్కినదని సంతోషించిరి. వీరును ఉడయవర్ శిష్యులలో ప్రధానులు. వీరి సంస్కృతనామము దాశరథి. వీరు ఎంబెరుమానారులకు పాదుకాస్థానీయులుగా పెద్దలు నిర్వహింతురు.
తిరునక్షత్రము: చైత్రం (మేషం ), పునర్వసు
అవతారస్థలము: పచ్చైప్పెరుమాళ్ కోయిల్
ఆచార్యులు: ఎంబెరుమానార్
అనుగ్రహించిన గ్రంథములు: దాటీ పంచకం. రహస్యత్రయం
వాழி తిరునామజ్గళ్
అత్తిగిరి యరుళాళర్ అడిపణిన్దోన్ వాழிయే
అరుట్పచ్చై వారణత్తిల్ అవదరిత్తాన్ వాழிయే
శిత్తరయిల్ పునర్పూశం శిఱక్క వన్దోన్ వాழிయే
శీర్ బాషియ మీడుముదల్ శీర్ పెఱువోన్ వాழிయే
ఉత్తమమాం వాదూల ముయర వన్దోన్ వాழிయే
ఊర్తిరున్ద శీర్పాద మూన్ఱినాన్ వాழிయే
ముద్దిరయుం శెజ్గోలుం ముడిపెఱువోన్ వాழிయే
ముదలియాణ్డాన్ పొఱ్పదజ్గళ్ ఊழிదోఱుం వాழிయే
కూరత్తాళ్వానులు
(కూరేశ మిశ్రులు)
తిరునక్షత్ర తనియన్:-
మకరే హస్త నక్షత్ర సర్ప నేత్రాంశ సంభవమ్
శ్రీ మత్కూర కులాధీశం శ్రీ పత్సాజ్క ముపాస్మహే||
నిత్య తనియన్:-
శ్రీ వత్స చిహ్నమిశ్రేభ్యో నమ ఉక్తి మధీమహి
యదుక్తయ స్త్రయీ కంఠే యాంతి మంగళ సూత్రతామ్||
వీరు ఉడయవరుల శిష్యులలో ప్రధానులు. కాంచీపురమునకు సమీపమునగల కూరమను అగ్రహారమున కలియుగాది 4109 సంవత్సరమునకు సరియగు సౌమ్యనామ సంవత్సర తై మాసమున (పుష్య) హస్తానక్షత్రమున సర్పనేత్రాంశము నందవతరించిరి. వీరికి తండ్రిగారుంచిన తిరునామము తిరుమరు మార్పన్ (శ్రీపత్సాజ్క మిశ్రులు) వీరికి సర్వేశ్వరుని యందుగల ప్రేమాతిశయమును గుర్తించిన ఉడయవరులు "ఆళ్వాన్" అనిపేరిడిరి.
వీరి దేవిమారులు ఆండాళమ్మగారు. ఈ దంపతులిరువురు పరమ వైరాగ్య సంపన్నులు. మహాసంపన్నులై యుండియు ఆ సంపదనంతయు పరిత్యజించి ఉడయవర్ శ్రీపాదములే రక్షకములని నమ్మియుండిరి.
స్వామి యెంబెరుమానారుల యాజ్ఞచే తిరువరజ్గత్తముదనార్లను దిద్దుబాటుచేసి వారినుండి శ్రీరంగనాథుని సన్నిధి నిర్వాహమును తీసికొని ఉడయవరులకు అప్పగించిరి. శ్రీరంగనాథుని పురోహితులుగా నిత్యము స్వామి సన్నిధిలో కైంకర్యము చేయుచుండెడివారు.
చోళరాజగు క్రిమికంఠుని వలన ఉడయవరులకు ప్రమాదము కలుగనున్నదని తలచి తాము పెరియనంబిగారితో కూడా చోళరాజసభకు పోయి "శివాత్పర తరంనాస్తి" అనువాదమును ఖండించి విష్ణుపరత్వ స్థాపన చేసిన మహనీయులు.
ఉడయవరులను గ్రహించిన శ్రీభాష్యరచనలో మిక్కిలి సహాయము చేసినవారు. వీరి కుమారులు వ్యాసభట్టర్, పరాశరభట్టర్. వీరి ప్రభావము వాచామ గోచారము. పరమ దయాసముద్రులగు వీరి చరితమును గురుపరంపరా ప్రభావాది గ్రంథములలో సేవింపవచ్చును.
తిరునక్షత్రము: మకరమాసం-హస్తా నక్షత్రం
వీరనుగ్రహించిన గ్రంథములు: పంచస్తవములు 1. శ్రీవైకుంఠస్తవం 2.
221 అతిమానుషస్తవం 3. సుందరబాహుస్తవము 4. వరదరాజస్తవము 5.శ్రీస్తవము 6. గద్యత్రయవ్యాఖ్యానమ్.
అవతారస్థలము: కూరం
ఆచార్యులు:ఎంబెరుమానార్.
వాழி తిరునామజ్గళ్
శీరారుమ్ తిరుప్పతిగళ్ శిరక్కవందోన్ వాழிయే
తెన్నరజ్గర్ శీరరుళై చ్చేరుమవన్ వాழிయే
పారారు మెతిరాశర్ పదమ్‌పణిన్దోన్ వాழிయే
పాషియత్తిన్ నుట్పొరుళై ప్పగరుమవన్ వాழிయే
నారాయణన్ శమయం నాట్టినాన్ వాழிయే
నాలూరాన్ దనక్కున్ ముత్తినల్గినాన్ వాழிయే
ఏరారుం తై యిలత్త త్తిజ్గువన్దాన్ వాழிయే
ఎழிల్ కూరత్తాళ్వాన్ తన్నిణై యడిగళ్ వాழிయే
"ఎంబార్"
(గోవింద భట్టర్)
తిరునక్షత్ర తనియన్:-
పుష్యే పునర్వసు దినే జాతం గోవిన్ద దేశికమ్
రామానుజ పదచ్చాయా రాజహంసం సమాశ్రయే||
నిత్య తనియన్:-
రామానుజ పదచ్చాయా గోవిన్దాహ్వానసాయినీ
తదాయత్త స్వరూపా సా జీయాన్మ ద్విశ్రమన్ధలీ||
వీరు భగవద్రామానుజులకు పినతండ్రి కుమారులు. తండ్రిగారు "కమలనయనభట్టరు". శ్రీపెరుంబూదూరునకు సమీపమునగల మధుర మంగలమను గ్రామమున మకరమాసమున (పుష్య) పునర్వసు నక్షత్రమందవతరించిరి.
వీరు కొంతకాలము అన్యసంప్రదాయమునందుండగా వీరి మేనమామగారైన పెరియ తిరుమల నంబిగారు "తేవుమెప్పొరుళుం పడైక్క" అను తిరువాయిమొழி అర్దాను సంధానముచేత వీరిని వశీకరించుకొనిరి. ఉడయవరుల శ్రీపాదముల నాశ్రయింపచేసిరి. తదాది వీరు ఉడయవరుల శ్రీపాదములను విడువక చాయవలె అనుసరించు చుండిరి. ఉడయవర్ తరువాత దర్శన నిర్వాహకులుగా వేంచేసియుండిరి.
కూరత్తాళ్వాన్ తిరుక్కుమారులు వ్యాసభట్టరు, పరాశరభట్టరులకు మంగళాశాసనము చేయదలచిన ఉడయవరుల సన్నిధికి, ఆ బాలకులను తీసికొనిపోవుచు "ద్వయమంత్రమును" రక్షగాచెప్పిరి. స్వామి ఎంబెరుమానార్లు ఆ బాలుర తేజస్సును గమనించి ఎంబారులవలన విషయము తెలిసికొని తమకంటె ముందుగా వారి క్షేమమును కోరినవారగుటచే వారికి ఎంబారులనే ఆచార్యులుగా నియమించిరి. వీరు అనుగ్రహించిన గ్రంథము: విజ్ఞానస్తుతి.
వాழி తిరునామజ్గళ్
పూవళరుం తిరుమగళార్ పొలివుత్తోన్ వాழிయే
పొయ్‌గై ముదల్ పదిన్‌మర్ కలై పొరుళరైప్పోన్ వాழிయే
మావళరుం బూదురాన్ మలర్పదత్తోన్ వాழிయే
మకరత్తిల్ పునర్‌పూశమ్ వన్దుదిత్తాన్ వాழிయే
తేవుమెప్పొరుళుమ్ పడైక్క త్తిరున్దినాన్ వాழிయే
తిరుమలై నమ్బిక్కడిమై శెయ్యుమవన్ వాழிయే
పావై యర్గళ్ కలవియిరుళ్ పగలెన్దాన్ వాழிయే
బట్టర్ తొழுమెమ్బార్ పొఱ్పదమిరణ్డుమ్ వాழிయే
పరాశర భట్టర్
తిరునక్షత్ర తనియన్:-
మాధవే మాస్యనూ రాధా జాతం భట్టార్య దేశికమ్
గోవింద తాత పాదాబ్జ భృజ్గరాజ మహంభజే||
నిత్య తనియన్:-
శ్రీ పరాశర భట్టార్య: శ్రీ రంగేశ పురోహిత:|
శ్రీ వత్సాంక సుతశ్శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే||
వీరు కలియుగాది 4164 వ సంవత్సరం శుభకృత్ నామ సంవత్సర వృషభ మాసమున అనూరాధా నక్షత్రమున పరాశరాంశతో అవతరించిరి.
స్వామి యెంబెరుమానారుల తర్వాత సిద్ధాంత వ్యాప్తిని చేసిన మహనీయులు పరాశరభట్టరు. వీరు కూరత్తాళ్వానుల తిరుక్కుమారులు. శ్రీరంగనాథుని అనుగ్రహమున అవతరించి శ్రీరంగనాథులచే పుత్రులుగా స్వీకరింపబడినవారు. వీరి సోదరులు వ్యాసభట్టరు. వీరి ఆచార్యులు ఎంబారు. వీరు సకల శాస్త్రములను దివ్య ప్రబంధములను తదర్థములను సాంగో పాంగముగ అదిగమించిరి.
ఎంబెరుమానారుల చివరి కాలమున మైసూరు ప్రాంతమున మాధవాచార్యులను అద్వైత వేదాంతి ఉండేవారు. ఎంబెరుమానారుల ఆజ్ఞచే భట్టరు ఆ వేదాంతిని వాదమున జయించి సంప్రదాయ ప్రవర్తకులను చేసిరి. వారే నంజీయరు.
వీరు బహుగ్రంథ కర్తలు. దివ్య ప్రబందములయందు అనేక విశేషార్థముల ననుగ్రహించిరి. వానిని పెరియ వాచ్చాంపిళ్ళై తమ వ్యాఖ్యానములందు విశదీకరించిరి.
వీరనుగ్రహించిన గ్రంథములలో శ్రీ విష్ణుసహస్రనామ భాష్యమగు "భగవద్గుణ దర్పణము" ప్రదానమైనది. పరమవైరాగ్య సంపన్నులైన వీరి వైభవము గురుపరంపరాప్రబావాది గ్రంథములలో సేవింపవచ్చును.
తిరునక్షత్రం: వృషభం - అనూరాద
ఆచార్యులు: ఎంబార్
శిష్యులు: నంజీయర్ మొదలగువారు
అనుగ్రహించిన గ్రంథములు: 1. శ్రీగుణరత్నకోశము 2. శ్రీరంగరాజస్తవము 3. అష్టశ్లోకి 4. చతుశ్లోకి.
224
వాழி తిరునామజ్గళ్
తెన్నరజ్గర్ మైన్దనెన చ్చిఱక్కవన్దోన్ వాழிయే
తిరునెడున్దాణ్డగ ప్పొరుళై చ్చెప్పుమవన్ వాழிయే
అన్నవయల్ పూదూరన్ అడిపణిన్దోన్ వాழிయే
అనవరతం ఎమ్బోరు క్కాట్చెయ్‌వోన్ వాழிయే
మన్ను తిరుక్కూరనార్ వళమురై ప్పోన్ వాழிయే
వైగాశి యనుడత్తిల్ వన్దుదిత్తాన్ వాழிయే
పన్నుకలై నాల్వేదప్పయన్ తెరివోన్ వాழிయే
పరాశరనాం శీర్ బట్టర్ పారులగిల్ వాழிయే.
నంజీయర్
(వేదాన్తి)
తిరునక్షత్ర తనియన్:-
ఫాల్గునోత్తరఫల్గున్యాం జాతం వేదాన్తి సమ్మనిమ్|
శ్రీ పరాశర భట్టార్య పాదరేఖామయం భజే||
నిత్య తనియన్:-
నమో వేదాన్త వేద్యాయ జగన్మంగళ హేతువే|
యస్య వాగమృతాసార పూరితం భువన త్రయమ్||
వీరు విజయనామ సంవత్సరమున మీన మాసము ఉత్తర ఫల్గునీ నక్షత్రమునందవతరించిరి. వీరు మొదట అద్వైత సంప్రదాయస్థులు. మాధవాచార్యులనిపేరు. "వేదాంతి" యను బిరుదముతో షడ్దర్శనములకు షడాసనంబిడి మతాంతర విద్వాంసులను జయించు చుండిరి.
వీరి ఖ్యాతిని వినిన శ్రీపరాశరభట్టరు శ్రీరంగపట్టణము వేంచేసి తొమ్మిది దినములు వీరితో వాదముచేసి జయము నిర్ణయము కాక పదియవ దినమున "తిరువెడుందాండక"మున గల రహస్యార్థముల నుపన్యసింపగా వేదాంతి సంభ్రమాశ్చర్యములతో భట్టరువారు శ్రీపాదముల నాశ్రయించెను. వారి వలన పంచసంస్కారములు పొంది భగవద్రామానుజ దర్శనము నందభిమానము గలవారైరి.
శ్రీభట్టరును శ్రీరంగమునకు వేంచేసి వేదాంతిని జయించిన విషయమును "తిరునెడున్దాణ్డక" దివ్య ప్రబంధ రహస్యార్థములను శ్రీరంగని సన్నిధిలో విన్నవించిరి. ఆమరునాటి నుండి అధ్యయనోత్సవ ప్రారంభము. తదాదిగా భట్టర్ విజయ సూచకముగా నేటికిని అధ్యయనోత్సవమునకు ముందు దివసమున శ్రీరంగములో తిరునెడున్దాణ్డక ఉత్సవము జరుగుచున్నది.
వీరి ఆచార్యాభిమానము పరమ విలక్షణమైనది. వీరు శ్రీపరాశర భట్టరు వారి సన్నిధిలో దివ్య ప్రబంధార్థములను సేవించి రస్యముగా ఉపన్యసించెడివారు.
తిరువాయిమొழி "తిరుక్కురుగై ప్పిరాన్ పిళ్లాన్" అనుగ్రహించిన "ఆరాయిఱప్పడి" వ్యాఖ్యానము అతిసంగ్రహముగానుండుటచే భట్టర్ నియమనానుసారము వీరు "ఒన్బదినాయిరప్పడి" వ్యాఖ్యను అనుగ్రహించిరి.
భట్టర్ వారిచే "నమ్ముడైయ జీయర్" అని అభిమానింప బడుటచే వీరికి "నంజీయర్" అను తిరునామమేర్పడినది.
తిరునక్షత్రము: మీనము-ఉత్తర
226 ఆచార్యులు: శ్రీపరాశర భట్టర్
శిష్యులు: నంబిళ్లై మొదలగువారు
అనుగ్రహించిన గ్రంథములు: తిరువాయిమొழிకి "ఒన్బదినాయిరప్పడి వ్యాఖ్య", తిరుప్పావైకు ఈరాయరప్పడివ్యాఖ్య, ఉరై, శరణాగతిగద్య వ్యాఖ్య.
వాழி తిరునామజ్గళ్
తెణ్డిరై శూழ் తిరువరజ్గమ్ శెழிక్క వన్దోన్ వాழிయే
శీమాదవ నెన్నుమ్ శెల్వనార్ వాழிయే
పణ్‌డై మఱై త్తమిழ் ప్పొరుళై పగర వందోన్ వాழிయే
పజ్గునియిల్ ఉత్తిర నాళ్ పారుదిత్తాన్ వాழிయే
ఒండొడియాళ్ కలవిదన్నై యొழி త్తిట్టాన్ వాழிయే
ఒన్బది నాయిర ప్పొరుళై యోదుమవన్ వాழிయే
ఎండిశైయుమ్ శీర్ బట్టరిణై యడియోన్ వాழிయే
ఎழிల్ పెరుగుమ్ న--య రిని తూழி వాழிయే
"నంబిళ్లై"
(కలివైరి దాసులు)
తిరునక్షత్ర తనియన్:-
వృశ్చికే కృత్తికా జాతం కలివైరి గురుమ్బజే|
వేదాన్త ముని పాదాబ్జ శ్రితం సూక్తి మహర్ణవమ్||
నిత్య తనియన్:-
వేదాన్త వేద్యామృత వారిరాశే: వేదార్థ సారామృత పూరమగ్ర్యమ్
ఆదాయవర్షన్త మహం ప్రపద్యే కారుణ్యపూర్ణం కలివైరి దానమ్||
వీరు వృశ్చికమాసమున కృత్తికా నక్షత్రమునందవతరించిరి. నంబూరి వరదరాజులనునది తండ్రిగారుంచిన తిరునామము.
వీరు నంజీయర్ శ్రీపాదముల నాశ్రయించి వారి వలన దివ్య ప్రబందార్థములధికరించిరి. నంజీయర్ అనుగ్రహించిన "ఒన్‌బదినాయిరప్పడి" వ్యాఖ్యానమును తాళ పత్రములపై తిరిగి వ్రాయు ప్రయత్నములో కావేరి నదిలో దానిని పోగొట్టుకొని తాము వినిన విషయమగుటచే తమ మేదాశక్తితో తిరిగి వ్రాసి నంజీయర్ సన్నిధిలో సమర్పించిరి. వారి మేదా విశేషమున కాశ్చర్యపడిన నంజీయర్ వీరిని "నమ్ముడైయ పిళ్లై" అని సాదరముగా మన్నించిరి. తదాది వీరికి నంబిళ్ళై యను తిరునామము ప్రసిద్ధి చెందెను. వీరికే తిరుక్కలి గన్ఱి దాసులు (కలివైరి దాసులు) అనియు లోకాచార్యులనియు తిరునామము.
227 ఆనాడు వీరి శిష్యగోష్ఠి అమితముగా నుండెడిది. దానిని జూచిన వారు నంబిళ్లైగోష్ఠియో? నంబెరుమాళ్ గోష్ఠియో అని ఆశ్చర్యపడుచుండెడివారు. వీరి శిష్యులు వడక్కుత్తిరువీధిపిళ్లై, పెరియవాచ్చాంబిళ్లై మొదలగువారు.
దివ్య ప్రబంధార్థములను పలురీతుల వర్ణించి వాక్‌పయోదమని ప్రసిద్ధిచెందిన మహనీయులు "నంబిళ్లై".
తిరునక్షత్రము: వృశ్చికం - కృత్తిక
ఆచార్యులు: నంజీయర్
శిష్యులు:వడక్కుత్తిరువీథిప్పిళ్లై మొదలగువారు
గ్రంథములు: తిరువిరుత్త వ్యాఖ్యానంఈడు, కణ్ణమణ్ శిరుత్తాంబుకుఈడు, తిరుప్పల్లాణ్డుఈడు మొదలగునవి.
వాழி తిరునామజ్గళ్
తేమరువుం శెజ్గమల త్తిరుత్తాళ్‌గళ్ వాழிయే
తిరువరైయిల్ పట్టాడై శేర్‌మరుజ్గుం వాழிయే
తామమణి వడమార్బుం పురిమాలుం వాழிయే
తామరై క్కైయిణై యழగుం తడమ్బుయముం వాழிయే
పామరునం తమిழ்వేదం పయిల్ పవళం వాழிయే
పాడియత్తిన్ పారుళ్‌దన్నై ప్పగర్ నావుం వాழிయే
నామనుతల్ మదిముగముం తిరుముడియుం వాழிయే
నమ్బిళ్లై వడివழగుం నాడోఱుం వాழிయే
కాతలుడన్ నంజీయర్ కழల్ తొழுవోన్ వాழிయే
కార్‌తికై క్కార్‌తికై యుతిత్త కలికన్ఱి వాழிయే
పోతముడ వాయ్వార్ శొற்పొరు ళురైప్పోన్ వాழிయే
పూతూరన్ పాడియత్తై ప్పుకழுమవన్ వాழிయే
మాతకవా లెవ్వుయర్‌క్కుమ్ వాழ் వళిత్తాన్ వాழிయే
మతిళరజ్గరోలక్కం వళర్‌తిట్టాన్ వాழிయే
నాతముని యాళవన్దార్ నలమ్పుకழ்వోన్ వాழிయే
నమ్బిళ్లై తిరువడికళ్ నాడోరుమ్ వాழிయే
వడక్కుత్తిరువీథి పిళ్లై
(శ్రీ కృష్ణపాదులు)
తిరునక్షత్ర తనియన్:-
మిధునే స్వాతి సంభూతం కలివైరి పదాశ్రితమ్|
ఉదక్ర్పతోళి నిలయం కృష్ణపాదమహంభజే||
నిత్య తనియన్:-
శ్రీకృష్ణపాద పాదాబ్జే నమామి శిరసా సదా|
యత్ర్పపాద ప్రభావేన సర్వసిద్ధిరభూస్మమ||
వీరు సర్వజిత్ నామసంవత్సర మిధునమాసము స్వాతి నక్షత్రము నందవతరించిరి. వీరి ఆచార్యులు నంబిళ్లై. వారి సన్నిధిలో సకల దివ్యప్రబందార్థములను సేవించిరి. నంబిళ్లై ఉపన్యసించిన తిరువాయిమొழி విశేషార్థముల నన్నింటిని ఒక గ్రంధముగా గూర్చిరి. అదియే ఈడుముప్పత్తారాయిరప్పడి.
"తిరుక్కురుగైప్పిరాన్ పిళ్లాన్" శ్రీవిష్ణుపురాణ సంఖ్యతో ఆరాయిరప్పడి వ్యాఖ్యానమును, నంజీయర్ శ్రీభాష్య ప్రక్రియ ననుసరించి ఒన్బదినాయిరప్పడి వ్యాఖ్యానమును, పెరియ వాచ్చాంబిళ్లై శ్రీరామాయణ సంఖ్య ననుసరించి ఇరుపత్తునాలాయిరప్పడి వ్యాఖ్యానమును అనుగ్రహింపగా వీరు శ్రుత ప్రకాశికా ప్రక్రియగా "ఈడుముప్పత్తారాయిరప్పడి"ని అనుగ్రహించిరి.
ఈడు అనగా సదృశమని యర్థము. ఉపనిషత్తులకు సదృశమగుటచే ఈ వ్యాఖ్యకు ఈడు ముప్పత్తారాయిరప్పడియను పేరువచ్చినది. సర్వులను భగవద్గుణము లందు ఈడుపడునట్లు (అవగాహనము చేయునట్లు చేయుటచే) "ఈడు" అనిపేరు వచ్చినది. వీరి తిరుకుమారులు పిళ్లై లోకాచార్యులు, అழగియ మణవాళప్పెరుమాళ్, నై నారాచార్యర్.
తిరునక్షత్రము: మిధునం ; స్వాతి
ఆచార్యులు: నంబిళ్లై
గ్రంథము: ఈడుముప్పత్తారాయిరప్పడి.
వాழி తిరునామజ్గళ్
అనిదని ఱ్పోదినా ళవతరిత్తాన్ వాழிయే
ఆళ్వార్గళ్ కలై ప్పొరుళై యాయ్‌న్దురైప్పోన్ వాழிయే
తానుగన్ద నమ్బిళ్లై తాళ్ తొழுవోన్ వాழுయే
శడగోపర్ తమిழ் క్కీడు శాత్ తినాన్ వాழிయే
నానిలత్తిల్ బాషియత్తై నడత్తినాన్ వాழிయే
నల్లవులగారియనై నమక్కళిత్తాన్ వాழிయే
ఈనమఱనెమై యాళు మిరైవనార్ వాழிయే
ఎజ్గళ్ వడవీది పిళ్లై యిణై యడిగళ్ వాழிయే.
పెరియ వాచ్చాన్‌బిళ్లై
(శ్రీ కృష్ణదేశికులు)
తిరునక్షత్ర తనియన్:-
సకల ద్రావిడామ్నాయ సార వ్యాఖ్యాన కారిణమ్|
శ్రావణే రోహిణీ జాతం శ్రీకృష్ణ గురు మాశ్రయే||
నిత్య తనియన్:-
శ్రీమత్కృష్ణ సమాహ్వాయ నమోయామున మాసనే
యత్కటాక్షైక లక్ష్యాణాం సులభ శ్శ్రీధర స్సదా||
వీరు కలియుగాది 4269 సంవత్సరమునకు సరియగు సర్వజిత్ నామ సంవత్సర సింహ మాసమున రోహిణీ నక్షత్రమున శెంగనల్లూరు(తంజావూరుమావట్టం) నందవతరించిరి. (తిరువెళ్ళియజ్గుడికి సమీపము) శ్రీకృష్ణాష్టమినాడు అవతరించుటచే వీరికి కృష్ణమాచార్యులను తిరునామము కలిగినది. వీరి ఆచార్యులు నంబిళ్లై. వారి నియమనానుసారము తిరువాయిమొழிకి శ్రీరామాయణ సంఖ్యతో "ఇరుపత్తునాలాయిరప్పడి" వ్యాఖ్యానము ననుగ్రహించిరి. అంతియగాక తాము నంబిళ్లై గారి యొద్ద సేవించిన దివ్యప్రబందార్థము లన్నింటిని వ్యాఖ్యాన రూపముగా అనుగ్రహించిన మహనీయులు. వీరికి వ్యాఖ్యాతృ చక్రవర్తియని బిరుదము . "అభయప్రద రాజులనియు" బిరుదము. వీరు శ్రీరామాయణ విశేషార్థములను వివరించు తనిశ్లోకిని అనుగ్రహించిరి. వీరు సుమారు అరువది గ్రంథములు అనుగ్రహించిన మహనీయులు. (వీరి కుమారులు "నయనారాచ్చాన్‌పిళ్లై").
గ్రంథములు: 1. ఇరుపత్తునాలాయిరప్పడి 2. తత్త్వత్రయ వివరణము 3. నిగమనప్పడి 4. పరందరహస్యము 5. మాణిక్యమాల 6. మూన్ఱాయిరవ్యాఖ్య 7. రహస్య త్రయ వివరణమ్ 8. నవరత్నమాలై 9. సకల ప్రమాణ తాత్పర్యం 10. ఉపకార రత్నమ్ 11. గద్యత్రయ వ్యాఖ్యానం 12. ఆళవన్దార్ స్తోత్రవ్యాఖ్యానం 13. అభయప్రధాన వ్యాఖ్యానమ్ 14. చరమరహస్యమ్ 15. అనుసందాన రహస్యమ్.
వాழி తిరునామజ్గళ్
తణ్‌మై శింగం రోహిణినాళ్ తழைక్క వన్దోన్ వాழிయే
తారణియిల్ శెంగనల్లూర్ తానుడై యోన్ వాழிయే
పున్ మై తవిఱ్కుం తిరువరంగర్ పుగழுరైప్పోన్ వాழிయే
పూదూరెతిరాశర్ తాళ్ పుగరుమవన్ వాழிయే
మణ్‌పుగழ் శేర్ శటగోపర్ వళమురై ప్పోన్ వాழிయే
మఱై వాలిన్ పొరుళ్ దన్నై పగుత్తురైత్తాన్ వాழிయే
అన్బుడ మలగారియర్ దం అడియిణై యోన్ వాழிయే
అభయప్రదరాజర్ తాళ్ అనవరతం వాழிయే
పిళ్లై లోకాచార్యులు
(లోకాచార్యులు)
తిరునక్షత్ర తనియన్:-
తులాయాం శ్రవణేజాతం లోకార్యసుహమాశ్రయే|
శ్రీ కృష్ణపాదతనయం తత్పదాంబుజ సమంశ్రితమ్||
నిత్య తనియన్:-
లోకాచార్యయ గురువే కృష్ణపాదస్య సూనవే|
సంసారభోగి సందష్ట జీవజీవతానే నమ:||
నమ్బిళ్లైగారి శ్రీపాదములాశ్రయించిన వారిలో వడక్కుత్తిరువీధిపిళ్లై గారొకరు. నంబిళ్లగారి మంగళా శాసనములతో వీరికిరువురు కుమారులుదయించిరి. అందు మొదటివారు పిళ్లైలోకాచార్యులు - రెండవవారు అழగియమణవాళప్పెరుమాళ్ నాయనార్ అనువారు.
పిళ్లై లోకాచార్యులవారు క్రోథ నామసంవత్సరం తులామాసం శ్రవణ నక్షత్రమున శ్రీరంగమునందవతరించిరి. తమ తండ్రిగారైన వడక్కుత్తిరువీధిపిళ్లై గారి శ్రీపాదములాశ్రయించి ఉభయవేదాన్త రహస్యములను అధికరించిరి.
పరమకారుణికులైన పిళ్లై లోకాచార్యులవారు సర్వులు తరించుటకు పురాణప్రక్రియననుసరించి అష్టాదశ రహస్యములను కృపచేసిరి. వీరిసోదరులు అழగియ మణవాళప్పెరుమాళ్ నాయనార్; ఆచార్యహృదయము; అరుచ్చెయల్ రహస్యము; తిరుప్పావై ఆరాయిరప్పడి వ్యాఖ్యానమును అనుగ్రహించిరి. వీరి శ్రీపాదము లాశ్రయించిన వారిలో తిరువాయిమొழி పిళ్లై ప్రధానులు.
తిరునక్షత్రం: తులామాసం , శ్రవణం
ఆచార్యులు: వడక్కుత్తిరువీధిపిళ్లై
అనుగ్రహించిన గ్రంథములు: అష్టాదశ రహస్యములు
శిష్యులు: తిరువాయిమొழி పిళ్లై, అழకియమణవాళప్పెరుమాళ్, నై నారాచార్యర్ మొదలగువారు.
వాழி తిరునామమ్
అత్తిగిరి అరుళాళర్ అనుమతియోన్ వాழிయే
ఐప్పిశియిల్ తిరువోణత్త వదరిత్తాన్ వాழிయే
ముత్తి నెఱి మఱై త్తమిழாల్ మొழிన్దరుళ్ వోన్ వాழிయే
మూదరియ మణవాళన్ మున్‌బుదిత్తోన్ వాழிయే
నిత్తియం నమ్బిళ్ళై పదం నెంజిల్ వైప్పోన్ వాழிయే
నీళ్‌వశన బూషణత్తాల్ నియమిత్తాన్ వాழிయే
ఉత్తమమాం ముడుమ్బైనగ రుదిత్తవళ్లల్ వాழிయే
ఉలగారియన్ పదజ్గళ్ ఊழிదోరుం వాழிయే.
తిరువాయిమొழி పిళ్లై
(శ్రీ శైలనాథులు)
తిరునక్షత్ర తనియన్:-
శ్రీశైలేశగురుం లోకదేశికాంఘ్రి సమాశ్రితమ్
వృషే విశాఖా సంభూతం వన్దే పరగుణాకరమ్||
నిత్య తనియన్:-
సమశ్రీశైలనాథాయ కున్తీనగర జన్మనే|
ప్రసాదలబ్ద పరమప్రాప్య కైంకర్యశాలినే||
వీరు విభవనామ సంవత్సరం వైశాఖ మాసం విశాఖానక్షత్రమున పాండ్యదేశమునందలి కున్తీ నగరమునందవతరించిరి. వీరికి తిరుమలై ఆళ్వార్ అనియు తిరువాయిమొழிపిళ్లై అనియు తిరునామములు. వీరు పిళ్లైలోకాచార్యులుగారిని ఆశ్రయించి పంచసంస్కారములను పొందిరి. వారిసన్నిధిలోనే దివ్య ప్రబందముల నధ్యయనము చేసిరి.
దేవాదివులని నామాంతరముగల నాలూరాచ్చాంబిళ్లై గారి సన్నిధిలో భగవద్విషయమును, శ్రీబాష్యాది గ్రంథములను అழగియమణవాళప్పెరుమాళ్ నాయనార్ సన్నిధిలోను, తత్త్వత్రయ ఆచార్యహృదయాదులను కూరకులోత్తమ దాసర్ వద్దను, మిగిలిన గ్రంథములను విళాంశోలై పిళ్లైగారి సన్నిధిలోను అధ్యయనము చేసిరి. వీరు నమ్మాళ్వార్ల యందు అమితమైన ప్రావణ్యముగల వారగుటచే ఆళ్వార్ తిరునగరి జీర్ణోద్దరణ గావించిరి. రామానుజ చతుర్వేది మంగలమను అగ్రహారము నేర్పరచి దాని మధ్య ఉడయవరుల సన్నిధి నిర్మించి దాని నిర్వహణము పెరియజీయర్‌కు అప్పగించిరి. వీరి శిష్యులలో మణవాళమామునులు ప్రధానులు. వీరు పెరియాళ్వార్ తిరుమొழிకి స్వాపదేశఉరై అనుగ్రహించిరి.
తిరునక్షత్రము: వృషభం-విశాఖానక్షత్రం
ఆచార్యులు: పిళ్లై లోకాచార్యులవారు
శిష్యులు: శ్రీమణవాళమామునులు మొదలగువారు
గ్రంథములు: పెరియాళ్వార్ తిరుమొழிకి స్వాపదేశఉరై
వాழி తిరునామమ్
వైయగమెణ్ శడగోపర్ మరైవళర్తోన్ వాழிయే
వైగాశి విశాగత్తిల్ వన్దుదిత్తాన్ వాழிయే
ఐయన్ అరుళ్‌మారికలై అయ్‌న్దురైప్పోన్ వాழிయే
అழగారుమెతిరాశర్ అడిపణివోన్ వాழிయే
తుయ్యవులగారియ న్‌దన్ తుణైప్పదత్తోన్ వాழிయే
తొల్‌కురుకాపురి యదనై త్తులక్కినాన్ వాழிయే
తెయ్‌వనగర్ కున్తిదన్నిల్ శిఱక్కవన్దోన్ వాழிయే
తిరువాయిమొழி పిళ్లై తిరువడిగళ్ వాழிయే.
శ్రీమణవాళమామునులు
(సుందరజామాత్రమునులు)
తిరునక్షత్ర తనియన్:-
తులాయామతులే మూలే పాండ్యే కుంతీ పురీవరే
శ్రీ శేషాం శోద్భవం వందే రమ్యజామాతరం మునిమ్||
నిత్య తనియన్:-
శ్రీశైలేశ దయాపాత్రం ధిభక్త్యాది గుణార్లవమ్|
యతీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిమ్||
వీరు సాదారణ నామ సంవత్సర తులా మాసమున మూలా నక్షత్రమున గోమఠం తిరునావీరుడయపిరాన్ తాతరణ్ణర్ అనువారికి కుమారులుగా నవతరించిరి. తల్లిగారు శ్రీరంగనాచ్చియార్. సోదరులు తిరుమలై ఆళ్వార్, సోదరి నాచ్చియారమ్మన్. పూర్వాశ్రమమున కుమారులు శ్రీరామానుజాచార్యులు. వీరికి తండ్రిగారు జాతకర్మాది సంస్కారములు చేసి "అழగియమణవాళన్" అనిపేరుపెట్టిరి. వీరును తమ మేనమామగారి గ్రామమగు "శిక్కల్ కిడారం" అను అగ్రహారమున బాల్యమును గడిపిరి.
"పిన్నానార్ వణజ్గుం శోది" (వెనుకటివారు ఆశ్రయించి తరించుటకు తగిన తేజోమూర్తి) అనునట్లు సంసారి చేతనులను ఉజ్జీవింపచేయుటకై భగవద్రామానుజులే తిరిగి మణవాళమామునులుగా అవతరించిరి. ఆళ్వారాచార్యుల శ్రీసూక్తులే దారకముగా గల మణవాళమామునుల దివ్యచరిత్ర భగవద్రామానుజుల చరిత్ర కంటె విస్తృతమైనది.
భగవద్రామానుజులవలె వీరును దివ్యదేశయాత్రచేయుచు అనేక దివ్యదేశములను జీర్ణోద్దరణ గావించిరి. పరమత నిరసనమొనర్చి స్వమత స్థాపన చేసిరి. వడమధురై (ఉత్తరమధుర) వేంచేసి జీర్ణోద్దారణగావించిరి. ఆళ్వార్ తిరునగరి యందు తిరువాయిమొழி పిళ్లై గారికి తమ స్వస్వరూపమగు ఆదిశేషావతారము ప్రదర్శించిరి. తిర్యక్‌స్థావర జంగమములకు సైతము మోక్షముననుగ్రహించిన దయా సముద్రులు వీరు.
శ్రీరంగమును నిత్యవాసముగా చేసికొని యుండుటయేగాక శ్రీరంగనాథులకు ఈడు వ్యాఖ్యానమును ప్రసాదించిరి. నంబెరుమాళ్లును పరమప్రీతితో "శ్రీశైలే దయాపాత్రం" అను శ్లోకమును కృపజేసి పెరియజీయర్ అనుతిరునామముంచిరి. తదాదిగా వీరికి కోయిల్ పెరియ జీయర్ అనుతిరునామమేర్పడినది.
233 వీరు దివ్య ప్రబన్దములను భగవద్విషయమును స్వాచార్యులైన తిరువాయిమొழி పిళ్లై గారి వద్ద సేవించిరి. శ్రీబాష్యాదులను శ్రుత ప్రకాశికను కిడాంబి తిరుమలై అయ్యంగారి వద్ద సేవించిరి. తత్త్వత్రయాది రహస్యములను "కూరుకులోత్తమదాసర్" అను ఆచార్యులవద్ద సేవించిరి.
వీరు ఉడయవరుల శ్రీపాదములందు అత్యంత అభినివేశముగల వారగుటచే "యతీంద్ర ప్రవణు" లను తిరునామమేర్పడినది. మరియు మణవాళమామునులు, రమ్యజామృత మునులు, వరవరమునులు, పరయోగి, రామానుజన్ పొన్నిడి అను తిరునామములు కలవు.
వీరి సన్నిదిని ఆశ్రయించినవారు అనేకులు గలరు. వీరిలో 1. వానమామలై జీయర్ 2. పరవస్తు పట్టర్‌పిరాన్ జీయర్ 3. తిరువేజ్గడ జీయర్ 4. కోయిల్ కన్దాడైఅణ్ణన్ 5. ప్రతివాది భయంకరం అణ్ణా 6. ఎఱుంబి అప్పా 7. అప్పిళ్లై 8. అప్పుళ్లాన్ అనువారలు అష్టదిగ్గజములుగా ప్రసిద్దినొందిరి.
వీరనుగ్రహించిన గ్రంథములు 1. తత్త్వత్రయమునకు వ్యాఖ్య 2. రహస్యత్రయ వ్యాఖ్య 3. శ్రీవచనభూషణ వ్యాఖ్య 4. ఆచార్యహృదయ వ్యాఖ్య 5.జ్ఞానసార వ్యాఖ్య 6. ప్రమేయసార వ్యాఖ్య 7. పెరియాళ్వార్ తిరుమొழி వ్యాఖ్య 8.రామానుశనూత్తందాది వ్యాఖ్య 1. ఈడుకు ప్రమాణతిరట్టు 2. ఆరాయిరప్పడి ప్రమాణతిరట్టు 3. తత్త్వత్రయ ప్రమాణతిరట్టు 4.శ్రీవచనభూషణ ప్రమాణతిరట్టు.
1.ఉపదేశరత్తినమాలై 2. తిరువాయిమొழி నూత్తందాది 3. ఆర్తి ప్రబంధము 4. తిరువారాదన క్రమము(జీయర్‌పడి)
1.యతిరాజ విశంతి 2. భగవద్గీతకు గీతార్థ సంగ్రహదీపికా యను సంస్కృత వ్యాఖ్య.
వాచామగోచరమైన వీరి దివ్యప్రభావమును "యతీంద్ర ప్రవణ ప్రభావము" అనుగ్రంథమున సేవింపదగును.
వాழி తిరునామమ్
ఇప్పునియిల్ అరంగేశర్ క్కీడళిత్తాన్ వాழிయే
ఎழிల్ తిరువాయిమొழி పిళ్లై యిణై యడియోన్ వాழிయే
ఐప్పిశియిల్ తిరుమూల త్తవదరిత్తాన్ వాழிయే
అరపశర ప్పెరుంజోది యనన్దనెన్నుం వాழிయే
ఎప్పొழுదుమ్ శ్రీశైల మేత్తవందోన్ వాழிయే
ఏరారు మెతిరాశరెన ఉదిత్తాన్ వాழிయే
ముప్పురినూల్ మణివడముం ముక్కోల్ దరిత్తాన్ వాழிయే
234 మూదరియ మణవాళ మామునివన్ వాழிయే.
తిరునాళ్‌పాట్టు
శెన్దమిழ் వేదియర్ శిందై తెళిన్దు శిఱన్దు మగిழ்న్దిడు నాళ్
శీరులగారియర్ శెయ్‌దరుళ్ నఱ్కలై తేశుపొలిన్దిడు నాళ్
మన్దమదిప్పుని మానిడర్ తజ్గళై వానిలుయర్తిడునాళ్
మాశరు --నియర్ శేరెతిరాశర్ తం వాழ்పుముళైత్తిడునాళ్
కన్దమలర్ పొழிల్ శూழ் కురుగాదిపన్ కలై కళ్ విళజ్గిడునాళ్
కారమర్ మేని యరజ్గనగర్ కిఱై కణ్గల్ కళిత్తిడునాళ్
అన్దమిల్‌శీర్ మణవాళమునిప్పిరాన్ అవదారం శెయ్‌దిడునాళ్
అழగు తిగழ்న్దిడుమైప్పశయిల్ తిరుమాలమదనై నాళే
శ్రీమతే రమ్యజామాతృ మునీంద్రాయ మహాత్మనే
శ్రీరంగ వాసినే భూయాత్ నిత్యశ్రీ: నిత్యమజ్గళమ్||
శ్రీ మద్వేదాంత దేశికులు
తిరునక్షత్ర తనియన్:-
కన్యాశ్రవణ సంభూతం ఘంటాంశం వేంకటేశితు:
శ్రీ మద్వేంకట వాధార్యం వన్దేవేదాన్త దేశికమ్||
నిత్య తనియన్:-
శ్రీమాన్ వేంకట వాధార్యం కవితార్కిక కేసరీ
వేదాన్తా చార్య వర్యోమే సన్నిధత్తాం సదాహృది||
శ్రీమద్వేదాన్త దేశికులు విభవనామ సంవత్సర కన్యామానసమున శ్రవణనక్షత్రమునందు కాంచీపురమందలి తూప్పిల్ అని వ్యవహరింపబడు "దీపప్రకాశర్" సన్నిధి ప్రాంతమున అనంతసూరి-తోతారంబ అను దంపతులకు కుమారులుగా నవతరించిరి. వీరు అవతరించిన దినము శ్రీవేంకటాచలపతి వర్ష తిరునక్షత్రమగుటచే వీరికి తల్లిదండ్రులు వేంకటనాథులని పేరుపెట్టిరి.
వీరి మేనమామ వాది హంసాంబుది అని బిరుదు వహించిన ఆత్రేయ రామానుజాచార్యుల వారు. వీరికే కిడాంబి అప్పుళ్లార్ అనిపేరు. వీరియొద్దనే వేదాంత దేశికులు సకలశాస్త్రములను ఇరువది సంవత్సరముల వయసునకే అభ్యసించిరి. ఈవిషయమునే "వింశత్యబ్దే విశ్రుత నానావిద విద్య:" అని స్వయముగా చెప్పియున్నారు. వీరు శ్రీనివాసుని ఘంటావతారమని పెద్దలు చెప్పుదురు. ఈ విషయము వీరి అవతార కాలమునందే వ్యవహారములో నుండినది. ఆవిషయమునే వీరు తమ సంకల్ప సూర్యోదయమను నాటకమున "ఉత్ప్రేక్ష్యతే బుదజనై రుపపత్తి భూమ్నా ఘంటా హరే స్సమజనిష్ట యదాత్మనేతి" అనిచెప్పినారు.
ఆత్రేయ రామానుజాచార్యుల వారికి ఆచార్యులు నడాదూరు అమ్మాళ్. వారవద్ద కాలక్షేమునకై పోవునపుడు అప్పుళ్ళార్ వేంకటనాథులను కూడా తీసికొనిపోయిరట. అమ్మాళ్ వేంకటనాథులను గూర్చి విచారించి
"ప్రతిష్ఠాపిత వేదాంత: ప్రతిక్షిప్త బహిర్మత:
భూయాస్త్రై విద్య మానస్త్వం భూరికల్యాణ భాజనమ్||
("వేదాంతార్దములను స్థాపించి దుర్వాదులను నశింపజేసి త్త్రైవిద్యమానుడనై శుభముల బడయుము") అని మంగళా శాసనము చేసిరట. ఆమంగళాశాసన బలమే వారిని కవితార్కిక సింహులను చేసినది.
వీరు తమ ఆచార్యుల వలన గరుడ మంత్రమునుపదేశము పొంది తిరువహీంద్రపురమున గరుడనదీ తీరమునగల ఔదాద్రి యందు ఆ గరుడమంత్రమును జపించి
236 గరుడాళ్వార్ల అనుగ్రహమును పొందిరి. అంతేకాక వారి వలన హయగ్రీవ మంత్రము నుపదేశము పొంది దానిని అచటనే జపించి హయ వదనుని అనుగ్రహమును సంపాదించిరి. కావుననే గరుడాళ్వార్లను స్తుతించుచు గరుడ పంచాశత్, హయగ్రీవ స్తోత్రరూపముగా హయగ్రీవస్తోత్రమును అనుగ్రహించిరి. అంతేకాక కాంచీపుర ప్రాంత దివ్యదేశమూర్తుల విషయములో అనేక స్తోత్రములను రచించిరి.
ఒకానొకప్పుడు శ్రీరంగమున మతాంతరుల ఆగడములు మితిమీరినప్పుడు వీరు శ్రీరంగము వేంచేసి మతాంతరులను వాదమున జయించి విశిష్టాద్వైత సిద్దాంతమును స్థాపించిరి. ఆ సందర్బములో జరిగిన వాద సారాంశమునే శతదూషిణిగా రచించిరి. వీరి విషయమున ప్రసన్నుడైన శ్రీరంగనాథులు వేదాన్తా చార్యులనియు, సర్వతస్త్ర స్వతంత్రులనియు, కవితార్కిక సింహులనియు బిరుదములను కృపచేసిరి. "త్రింశద్ద్వారం శ్రావిత శారీరక బాష్య:" అని వారు ముప్పదిసార్లు శ్రీభాష్య ప్రవచనము చేయుటయే కాక శ్రీభాష్య సారార్థమైన అధికరణ సారావళిని రచించి వేదాన్తాచార్యులను బిరుదమును సార్థకమొనర్చుకొనిరి. శ్రీరంగనాథుల పాదుకా విషయమైన "పాదుకా సహస్రము"ను రచించి శ్రీరంగనాథుని అనుగ్రహమును పొందిరి.
వీరు రచించిన గ్రంథములు శతాధికములు. వ్యాఖ్యాన గ్రంథములు, స్తోత్ర గ్రంథములు, ద్రవిడ ప్రబంధములు, వ్యాఖ్యానములు, సంస్కృత కావ్యములు, నాటకములు అనేకములు రచించిరి. వానిలో శతమాషణి, న్యాయ సిద్ధాంజనము, గీతాభాష్య తాత్పర్యచంద్రిక, న్యాయపరిశుద్ది, పాదుకా సహస్రము, యాదవాభ్యుదయము, హంస సందేశము, సంకల్ప సూర్యోదయము, రహస్యత్రయసారము ప్రసిద్ధములైనవి. వీరి శ్రీపాదములను ఆశ్రయించిన వారిలో వీరి కుమారులు వరదాచార్యులు, బ్రహ్మతంత్ర స్వతంత్ర జీయరులు ప్రముఖులు. ఒక సమయమును విద్యారణ్యస్వామికిని అక్ష్యోభ్యమునికిలి ఏర్పడిన వాదములో మాధ్యస్థము వహించిరి.
వీరు రచించిన గ్రంథముల వివరములు: స్తోత్ర గ్రంథములు 29. కావ్యనాటకములు 5. వేదాన్త గ్రంథములు 21. అనుష్ఠాన గ్రంథములు 2. రహస్య గ్రంథములు 30. ద్రావిడ ప్రబంధములు 25.
ఏమైనను "యతి ప్రవర భారతీ రసభరేణ నీతం వయ:" అనియు "నిర్విష్టం యతి సార్వభౌమ చచసా మా వృత్తిబి ర్యవ్వనమ్" అనియు తామే చెప్పుకొనినట్లు భగవద్రామానుజుల శ్రీసూక్తులతోడనే కాలక్షేపము చేసిన మహనీయులు వేదాన్త దేశికులు.
237 వీరి రచనలు: రహస్యత్రయసారమ్, అమలనాథపిరాన్ వ్యాఖ్యానమ్, సారాసారమ్, ఉపకారసజ్గ్రహమ్, విరోధిపరిహారమ్, పరమపదసోపానమ్, పరమతభజ్గమ్, ప్రబన్దసారమ్, ఆహారనియతి, తత్త్వత్రయమ్, శతదూషణి, సర్వార్థసిద్ధి, తత్వముక్తాకలాపమ్, స్తోత్రభాష్యమ్, పా--రారక్షై, న్యాసత్రయమ్, భగవద్ధ్యానసోపానమ్, అబీతిస్తవమ్, దశావతారస్తోత్రమ్, మధురస్తవమ్, గోదాస్తుతి, శ్రీస్తుతి, భూస్తుతి, యతిరాజసప్తతి, ద్రవిడొపనిషత్తాత్పర్యమ్, గరుడప--శత్తు, సంకల్పసూర్యోదయమ్, న్యాయపరిశుద్ధి, న్యాయ సిద్దా--నమ్, గీతాభాష్యసారమ్, చతుశ్లోకీ వ్యాఖ్యానమ్, అదికరణ సారావళి, తత్వదీపికై, అవిద్యాఖండనమ్, కుదృష్టి త్రయనిరానమ్, తాత్పర్య చంద్రికై, పాదుకా సహస్రమ్, మీమాంసాపాదుకై, మీమాంసాభాష్యమ్, యాదవాభ్యుదయమ్, వేదార్థసజ్గ్రహ వ్యాఖ్యానమ్, హంససన్దేశమ్, హయగ్రీవస్తోత్రమ్, గోపాలవింశతి, గరుడదణ్డకమ్ మొదలైనవి.
వాழி తిరునామమ్
వాழி ఇరామానుశప్పిళ్ళాన్ మాతగవాల్
వాழுమ్ మణినిగమాన్త గురు - వాழிయవన్
మాఱన్ మఱైయు మిరామానుశన్ పాడియముమ్
తేఱుమ్బడి యురైక్కుమ్ శీర్
వ--ప్పర వమయమ్ మాற்றవన్దోన్ వాழிయే
మన్నుపుగழ் ప్పూదూరాన్ మనముగప్పోన్ వాழிయే
క--త్తిరుమజ్గై యుగక్కవన్దోన్ వాழிయే
కలియనురై కుడికొణ్డ కరుత్తుడై యోన్ వాழிయే
శె--ల్ తమిழ் మఱైగళ్ తెళిన్దురై ప్పోన్ వాழிయే
తిరుమాలై మాల్ తిరుమణి యాయ్ చ్చిఱక్కవన్దోన్ వాழிయే
త--ప్పరగదియై త్తన్దరుళ్వోన్ వాழிయే
తణ్డమిழ తూప్పుల్ తిరువేజ్గడవన్ వాழிయే
నానిలముమ్ తాన్ వాழ నాన్ మఱైగళ్‌తామ్ వాழ
మానగరిన్ మాఱన్‌మఱై వాழ - --నియర్‌కళ్
శెన్నియణిశేర్ తూప్పుల్ వేదాన్త దేశికనే
ఇన్నుమొరు నూற்றణ్డిరుమ్.
శాற்றுమఱై
పల్లాణ్డు పల్లాణ్డు పల్లాయిరత్తాణ్డు పలకోడి నూఱాయిరమ్
మల్లాణ్డ తిణ్డోళ్ మణివణ్ణా! ఉన్ శేవడి శెవ్వితిరుక్కాప్పు;
అడియోమోడుం నిన్నోడుం పిరివిన్ఱి ఆయిరం పల్లాణ్డు
వడివాయ్ నిన్‌వలమార్బినిల్ వాழ் గిన్ఱమంగైయుం పల్లాణ్డు
వడివార్ శోది పలత్తుఱై యుమ్ శుడ రాழிయుం పల్లాణ్డు
పడై పోర్ పుక్కు ముழுజ్గుం అప్పా--శన్నియముం పల్లాణ్డే
సర్వదేశదశాకాలే ష్వవ్యాహతపరాక్రమా|
రామానుజార్యదివ్యాజ్ఞా వర్దతామభివర్ధతామ్||
రామానుజార్యదివ్యాజ్ఞా ప్రతివాపరముజ్జ్వలా|
దిగన్తవ్యాపినీభూయాత్ పాహిలోకహితేషిణీ||
శ్రీమన్ శ్రీరజ్గ శ్రియ మనుపద్రవా మనుదినం సంవర్దయ|
శ్రీమన్ శ్రీరజ్గ శ్రియ మనుపద్రవా మనుదినం సంవర్దయ||
నమశ్రీశైలనాథాయ కున్తీనగరజన్మనే|
ప్రసాదలబ్దపరమప్రాప్యకై జ్కర్యశాలినే||
శ్రీశైలేశదయాపాత్రం దీభక్త్యాదిగుణార్ణవమ్|
యతీన్ద్రప్రవణం వన్దే రమ్యజామాతరంమునిమ్||
వాழி తిరువాయ్ మొழிప్పిళ్ళైమాదగవాల్
వాழு0 మణవాళమామునివన్ వాழிయవన్;
మాఱన్ తిరువాయ్‌మొழிప్పొరుళై మానిలత్తోర్
తేఱుమ్బడి యురైక్కుం శీర్.
శెయ్యతామరై త్తాళిణై వాழிయే శేలేవాழி తిరునాబి వాழிయే
తుయ్యమార్ బుం పురినూలుం వాழிయే శున్దర త్తిరుత్తోళిణై వాழிయే
కై యుమేన్దియ ముక్కోలుం వాழிయే కరుణై పొజ్గియకణ్ణిణై వాழிయే
పొయ్యిలాద మణవాళమాముని పున్దివాழி పుగழ் వాழி వాழிయే.
239
ఆడియార్ గழ వాழ అరజ్గనగర్ వాழ்
శడగోపన్ తణ్డమిழ் నూల్ వాழ் కడల్‌శూழ்న్ద
మన్నులగం వాழ் మణవాళమామునియే!
ఇన్నమొరు నూற்றாణ్డిరుమ్.
శ్రీమద్రజ్గం జయతు పరమం దామతేజో నిధానం
భూమాతస్మిన్ భవతు కుశలోకోపి భూమా సహాయ:
దివ్యంతస్మై దిశతు విభవం దేశికో దేశికానాం
కాలే కాలే వరవరముని:కల్పయన్ మంగళాని|
అపగతమదమానై రంతిమోపాయ నిష్ఠై:
అధిగత పరమార్దై రర్ద్ధకామానపేక్షై:
నిఖిల జన మహ్పద్బి: నిర్జిత క్రోధలోభై:
వరవరమునిభృత్యై రస్తుమే నిత్య యోగ:
ఆழ்వార్ యెంబెరుమానార్ జీయర్ తిరువడిగళే శరణమ్
జీయర్ తిరువడిగళే శరణమ్
240