దశావతారచరిత్రము/10. కల్క్యవతారకథ
10. కల్క్యవతారకథ
దశమాశ్వాసము
క. | విను మిఁక హరి కల్యంతం | 1 |
క. | అని శ్రీవైశంపాయన, ముని దెల్పిన మిగుల మోదమున జనపాలుం | 2 |
క. | శ్రీకృష్ణుఁడు మహి వీడ్కొని, వైకుంఠము సేరినపుడె వచ్చెం గలిరా | 3 |
సీ. | బలిని వంచించిన మలినాత్మకునికాళ్లు గడిగిననీళ్లు గంగాస్రవంతి | |
తే. | బుష్కరిణులందుఁ గడుఁబ్రాచి పొదలియుండుఁ | 4 |
క. | అనృతములు వేదమంత్రము, లని బౌద్ధులు స్వైరవృత్తి నభిషిక్తునిగా | 5 |
సీ. | పరలోకదృష్టికి మఱుఁగైనకైవడి శ్వేతాతపత్త్రంబు చెన్ను మీఱఁ | |
తే. | యవనికీకటశకమలయాళసింధు, పారసీకాదిభూవరు ల్బలిసికొలువ | 6 |
మ. | దయ వర్ణాశ్రమధర్మరక్షణము నౌదార్యంబు దాక్షిణ్యము | 7 |
క. | శిష్టాచారులు లేమిని, కష్టాత్ములఁ జేసి వెనుకఁ గార్పణ్యముచే | 8 |
సీ. | శాబరమంత్రము ల్సఫలంబులుగఁ జేయు వేదమంత్రము లెల్ల వృథ యొనర్పు | |
తే. | కామశాస్త్రంబు ముఖ్యంబుగా ఘటింపు, బౌద్ధచార్వాకజైనకాపాలికాది | 9 |
వ. | అని మఱియు వారివారిం దగునుద్యోగంబుల నియోగించి శూద్రనృపలక్ష | 10 |
క. | జనపతు లన్నము భూసుర, జనములు వేదములు సతులు స్మరగేహములం | 11 |
క. | ధన మిచ్చు నతఁడె యేలిక, ధన మిచ్చినవాఁడె మగఁడు తరుణులకెల్లన్ | 12 |
క. | క్రతుధానవ్రతములకుం, బ్రతివిధు లొనరించికొంద్రు బ్రాహ్మణకులు లే | 13 |
సీ. | క్షితిని ధర్మంబు మించిన లేదు వాన వానలు లేమి షామంబు బలియు లెస్స | |
తే. | హ్రస్వదేహులు హీనాంగు లల్పధనులు | |
| జోరు లన్యోన్యభక్షు లాచారదూరు | 14 |
తే. | జగతి ధర్మార్థకామమోక్షంబు లనఁగ, వఱలు నాలుగు గనుపుల చెఱుకుఁగోల | 15 |
తే. | కలియుగము దుష్టయుగమంట కల్లమాట | 16 |
చ. | కృతయుగ వేళ జ్ఞానమునఁ ద్రేతఁ దపంబున ద్వాపరంబునం | 17 |
సీ. | నూటిలో నొక్కఁ డేపాటిదానంబు గావింపఁడే యంచును వెదకి వెదకి | |
తే. | కోటి నొకపుణ్యమైన గన్గొనఁగలేక, సంచరించుచు మ్లేచ్ఛదేశములలోన | 18 |
సీ. | బాలరండలు గొడ్డుబ్రహ్మచారులు మహావ్రతము లన్వేషింతు రతిశయముగఁ | |
తే. | యభ్యసింతురు శ్రుతులు దానార్థు లగుచు | 19 |
సీ. | బ్రహ్మసూత్రమెకాని బ్రాహ్మణోత్తములకుఁ గలుగదు షట్కర్మగౌరవంబు | |
తే. | జ్యోతిషము వైద్యసంగీతశాబరములు, నేర్చి చండాలకాదులు నిఖిలపూజ్యు | 20 |
సీ. | [2]అన్నదాతలమంచు యాయజూకులమంచు దొరలచే రూకలు దోఁచువారుఁ | |
తే. | దూరపరదేశి నని పంచఁ జేరి రాత్రి | 21 |
తే. | అవని నొక్కొకపుణ్యాతురాలు పతినిఁ, జంపకయె జారువెంబడి జరుగుఁ గాని | 22 |
తే. | ఎన్న నైదేండ్లనైన నాఱేండ్లనైన | 23 |
వ. | అట్టి సమయంబున. | 24 |
శా. | శ్రీమద్విష్ణుయశోభిధానమున రాజిల్లున్ మహీదేవసు | 25 |
సీ. | కలనైన మగవానిఁ దలయెత్తిచూడదు కలకలనవ్వుచుఁ జిలుకబోదు | |
తే. | బ్రతిదినము నత్తమామల బత్తి సేయుఁ, దోడికోడండ్రఁ గనుసయిదోడుజాడఁ | 26 |
క. | ఆపుణ్యసాధ్వి కాత్మజుఁ, డై పుట్టును గల్కి యనఁగ నంభోనిధిక | 27 |
క. | లౌల్యప్రధానమై తగు, బాల్యము గ్రమియించి తరుణభావము దనరం | 28 |
సీ. | తళుకుబంగరుచెఱంగులయోర తలపాగ తలకుఁ జౌపంచ మిన్నలతురాయి | |
| కడవన్నెజిగిపట్టు నడికట్టు పడిదలపట్టంబు నేజయు బాగుదేర | |
తే. | మెఱయ నుచ్చైశ్శ్రవముఁ బోనిమించు తెల్ల, తేజిపై నెక్కి తేజంబు తేజరిల్ల | 29 |
సీ. | జోడన ల్ద్రొక్కించు శూరసేనాంగబంగాళము ల్పంచబంగాళముగను | |
తే. | గర్కకర్కశతరఖురాఘాతజాత, నూతనస్ఫీతరేఖికాజాతభూత | 30 |
మ. | జవలీలాహసితానిలం బగుజిరాసంజోకగుఱ్ఱంబుమేల్ | 31 |
క. | ఈరీతిఁ గల్కి జనసం, హారము గావించి తెలిసి మహిధర్ము వి | 32 |
తే. | విష్ణుయశునకు విష్ణుఁ డావిర్భవింపఁ, గారణం బేమి యతఁ డెట్టిఘనతపంబుఁ | 33 |
సీ. | అవనీశ తొల్లి స్వాయంభువమనువు బ్రహ్మర్షి లోకశరణ్యమైన నైమి | |
తే. | దశశతాబ్దంబు లతిఘోరతప మొనర్ప | 34 |
చ. | కమలదళాక్షుఁ డిట్లు దనకట్టెదుటం గనుపట్టినం బ్రమో | 35 |
సీ. | శతపత్రదళనేత్ర జననత్రయంబు మత్పుత్రుఁడవై నీవు పొడమవలయు | |
తే. | గృష్ణుఁడై విష్ణుఁ డుదయించె నింక విష్ణు, యశుఁడు దేవప్రభ యన గల్క్యంతమునను | 36 |
క. | ఈకల్క్యవతారక్రమ, మాకర్ణించిన జను ల్సదారోగ్యశుభ | 37 |
సీ. | సకలసత్కవినితాష్టాదశవర్ణనాపూర్ణమై నవరసోదీర్ణ మగుచుఁ | |
ఆ. | దనరు నీదశావతారమహాప్రబం, ధంబు వినినయట్టిధన్యమతులు | 38 |
క. | అని శ్రీవైశంపాయన, ముని వినుపించినను భక్తి విని వేడుకతో | 39 |
శా. | శ్రీమద్వేంకటమాభిధానవరపుత్రీరత్నపుత్రీవివా | 40 |
క. | ద్విడ్భోగధవళితాశా, రుడ్యామిన్యధిపకీర్తిరుచిరచిరసుధా | 41 |
మత్తకోకిల. | హైమభూధరగౌరనీరజహంసమండలజైత్రదో | 42 |
గద్య. | ఇది శ్రీరామభద్రదయాభిరామభద్రకరుణాకటాక్షవీక్షాపరిప్రాప్తదీప్తతరాష్ట్ర | |
ఇది పదియవ యవతారంబగు కల్క్యవతారము.
దశావతారచరిత్ర సర్వము సంపూర్ణము.