దత్త దేవ దత్త దేవ దత్త దేవ పాహిమాం
శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ తెలుగు కీర్తనలు
పల్లవి: దత్త దేవ దత్త దేవ దత్త దేవ పాహిమాం సత్ప్సభావ చిత్ర్పభావ దత్త దేవ పాహిమాం చరణం: చిత్త చోర తత్వసార సిధ్ధిహార పాహిమాం వాదదూర భేదసార సద్విహార పాహిమాం మార్గశీర్ష పౌర్ణమాస్య పర్వజాత పాహిమాం ఆత్రివంశ వారిరాశి పూర్ణచంద్ర పాహిమాం సరోవరమ్మున సారతపస్సుల ఊరితివౌరా శ్రీ దత్త ఒడ్డున నిలిచిన దొడ్డల ముంచగ తేరితివౌరా శ్రీ దత్త చర్మము వొలిచి కర్మము తొలిచి అమ్మకు జ్ఞానం బిడు దత్త మర్మము విడిచి నేరము మరచి మమ్ముల గావవె శ్రీ దత్త బూచుల నలిపి కూచిని నిలిపి బాపని గాచిన శ్రీ దత్త మా యెద నిలిచి మమతల విరిచి మము గాపాడవె శ్రీ దత్త మరుపున పెరకి విద్యల చిలికి బ్రహ్మను గాచిన శ్రీ దత్త గరువము నరికి అభయము పలికి మము దయ చూడవె శ్రీ దత్త సేవల మెచ్చి చేతుల నిచ్చి అర్జును గాచిన శ్రీ దత్త క్రేవకు వచ్చి త్రోవకు తెచ్చి మము దరి చేర్చవె శ్రీ దత్త వెనుకటి భక్తుల విధముల లేనని చీ చీ యనకో శ్రీ దత్త శరణము నీవే సద్గురు వీవె సచ్చిదానందా శ్రీ దత్త