త్రైత శక గంటల పంచాంగము/గురుస్తోత్ర పంచకమ్
గురు స్తోత్ర పంచకము
ఆ॥ వె॥ |
విపుల శాస్త్రజ్ఞాని వేదాంత వేద్యుడు | |
ఆ॥ వె॥అమృతంబు వంటి ఆత్మ బోధన వృష్టి
శిష్య గణము పైన చింద జేసి
మృత్యు భయము తీర్చు అత్యున్నతాత్ముని
శ్రీ ప్రబోధ గురుని చేరి గొల్తు.
ఆ॥ వె॥జిహ్వ మీద వాణి జెలువార భక్తుల
కాత్మ బోధ గరుప నలరువాడు
ముక్తిదాత యైన శక్తి స్వరూపుని
శ్రీ ప్రబోధ గురుని చేరి గొల్తు.
ఆ॥ వె॥ కోటి జన్మలందు గూడిన కర్మల
జ్ఞాన ఖడ్గ మిచ్చి నరుక నేర్ప
దివ్య బోధ చేయు ధీవిశారదుడైన
శ్రీ ప్రబోధ గురుని చేరి గొల్తు.
ఆ॥ వె॥ పాప భారమవని బాపంగ దలపోసి
జన్మ మెత్తి నట్టి సాధుమూర్తి
కర్మ రహితుడైన కరుణా సముద్రుని
శ్రీ ప్రబోధ గురుని చేరి గొల్తు.