పీఠిక

భక్తిరసప్రధానమై, యాంధ్రశైవవాఙ్మయమునకు సంబంధించిన లఘుకృతులయం దెన్నికఁగన్న యీయుదాహరణము నేఁటి కించుమించుగ నాఱునూరేండ్లక్రిందట సిరిగిరికిఁ దూర్పువాకిలియగు త్రిపురాంతకమున నెలకొనిన దేవరపేర వెలసినది. సంబుద్ధితో నెనిమిదియగు విభక్తులతో నెనిమిదిపద్యములును, కళికలును, నుత్కళికలును గలిగి భక్తిప్రశంసాపరమగు ప్రబంధభేదమునకు నుదాహరణ మనిపేరు. ఆంధ్రవాఙ్మయమున నుపలబ్ధము లగునట్టి యుదాహరణములలోఁ బండ్రెండవశతాబ్దమునఁ బుట్టిన పాల్కురికి సోమనాథుని బసవోదాహరణము ప్రథమము. త్రిపురాంతకోదాహరణము కాలక్రమమున ద్వితీయమైనను, కవితాప్రకర్షయం దద్వితీయమగుటచే నీవఱకు రెండుతడవలు ముద్రింపఁబడినను మూఁడపతూరి ముద్రణావశ్యకతఁ జేగూర్చినది.

1. పూర్వమాతృకాగ్రంథవివరణము

ఈయుదాహరణమునకు మాతృక తంజావూరున శ్రీ శరభోజిమహారాజ సరస్వతీభవనప్రాచ్యలిఖితగ్రంథభాండారమునందు గలదు. నే నీమాతృకకు సరియగుపుత్రికను[1] వ్రాయించి తెప్పించికొని యీముద్రణమున నుపయోగించితిని. దీనిని తొలుత క్రీ. శ. 1918వ సంవత్సరమున సుప్రసిద్ధప్రాచ్యవిద్యాపరిశోధకులు మా రామకృష్ణకవిగారు విస్మృతకవులనుపేరఁ ప్రకటించినగ్రంథావళియం దాఱవదిగ, వెలువరించినారు. అది వనపర్తియందలి బ్రహ్మవిద్యావిలాసముద్రాక్షరశాలలో ముద్రింపఁబడి పీఠిక, లఘుటీకలతో నొప్పుచున్నది.

శ్రీరామకృష్ణకవిగారే దీనిని రెండవతూరి శ్రీతిరుమలవేంకటేశ్వరపత్రికయందు, క్రీ. శ. 1933 సంవత్సరమున నేప్రియలునెలలో బ్రకటించిరి.

పైని వివరించినవిగాక, యీగ్రంథప్రశస్తినిఁ దెలుపుచు నమూల్యమగు తమస్వంతపుఁబ్రతిని నాకు బ్రహ్మశ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రులవారు పంపిరి. వారికి నే నెంతయుఁ గృతజ్ఞుఁడను.

2. గ్రంథకర్తృత్వము

ఈయుదాహరణమునకుఁ గర్త రావిపాటి త్రిపురాంతకుఁడు. ఈ విషయము గ్రంథమునం దెచ్చటను లేకపోయినను [2]నంధ్రవాఙ్మయమున సంకలితలక్షణగ్రంథములలోని యుదా హృతులవలన నిది త్రిపురాంతకుని కృతిగాఁ దెలియుచున్నది. క్రీ. శ. 16 వ శతాబ్దాదిని ప్రాచీనగ్రంథసంకలనము గావించిన పెదపాటి జగన్నాథకవి తన ప్రబంధరత్నాకరమున దీనిని త్రిపురాంతకునిదనిఁ జెప్పియున్నాఁడు. ఆపైని యప్పకవి వేంకటకవిమున్నగులాక్షణికులు తమగ్రంథముల దీనినిఁ త్రిపురాంతకునిదిగా నుదాహరించియున్నారు. కావున దీనికిఁ గర్త త్రిపురాంతకుఁడనియే నిర్ధారింపఁదగియున్నది. ఇది యిట్లుండ క్రీ. శ. 1938 సంవత్సరమునఁ బ్రకటింపఁబడిన తంజాపురాంధ్రగ్రంథవివరణసూచిక[3] యందు నీగ్రంథమునుఁగూర్చియు గ్రంథకర్తనుఁగూర్చియు నిట్లు వ్రాయఁబడినది.

166. త్రిపురాంతకోదాహరణము.

R సమగ్రము. వ్రాలు చక్కనివి. తప్పులు లేవు. శైథిల్యము లేదు. గ్రంథ పాతముం గన్పట్టదు. “తలఁకి సీనమరాజు దాడికోర్చినవాని” “వరలువరమాసందవనధితీర్థమువలన” అని యీగ్రంథమున నిద్దఱిపేరులు గన్పట్టుచున్నవి. వీరిలో గ్రంథకర్త యీతఁడని నిశ్చయింప వీలుగాకున్నది.

తరువాత నాంగ్లేయభాషలో నిట్లున్నది.

“There is a printed work of the same name attributed to Thripurantaka wheather this manuscript represents the printed work needs examination”

(ఈపేరితో త్రిపురాంతకుని కారోపింపఁబడిన ముద్రితగ్రంథ మొకటి గలదు. ఈ తాటాకుప్రతి యాముద్రితపుస్తకముసకు మూలమేమో పరిశీలింపఁదగియున్నది).

కాని గ్రంథప్రకాశకులు పైని వ్రాసినట్లు సీనమరాజుగాని, పరమానందతీర్థుఁడు గాని త్రిపురాంతకోదాహరణగ్రంథకర్త కాజాలఁడు. సీనమరాజు ప్రాచీన ద్రావిడ శైవభక్తుఁడు. చేరమరాజని యీతని నామాంతరము. ఈతఁ డెనిమిదవశతాబ్దికిఁ బూర్వుఁడు. ఈతఁడు గ్రంథకర్తయగుట యసంభవము గదా! ఇఁక “పరమానందతీర్థమువలన” అనునది కేవల గ్రంథస్థవిషయము. ఇది పంచమావిభక్తికళికయందు ద్వితీయపాదమున ‘మఱియు సకలాశ్రితుల మనుచు నర్థమువలన’ యనుదానితో సార్థకతఁ జెందినది. ఇచట కేవలానందజలధితీర్థమనియే కవి భావము. అయినను గ్రంథకర్త పరమానందతీర్థు లనుకొనుటకుఁ గారణము లేకపోలేదు. వివరణగ్రంథమున, పరమానందతీర్థకవికృతగ్రంథములు పెక్కులుండుటచేత నామసాదృశ్యముచేత పరమానందతీర్థులని భ్రాంతిపొడమి యట్లు వ్రాసిరి గాని వేఱు గాదు. పరమానందతీర్ణుఁడను వేదాంతకవి, అనుభవదర్పణము, శివజ్ఞానమంజరి, బ్రహ్మవిద్యాసుధార్ణవము, భగవద్గీతావ్యాఖ్యానము, ముక్తికాంతావిలాసము, దత్తాత్రేయ, శివముకుంద, సంపంగిమన్న శతకత్రయము మున్నగు బహుళగ్రంథములు రచియించినాఁడు. ఈతఁడు పదునాఱవశతాబ్దము నాఁటివాఁడు. ఈతనిచరిత్రము శతకకవులచరిత్రయందు వర్ణితము. పుటలు (167-17l) ఈతఁడును త్రిపురాంతకోదాహరణకర్త కాఁజాలఁడనుటకుఁ బైవివరణము చాలును.

ఇట్లే శ్రీ గిడుగువారు తాము ప్రకటించిన [4]యప్పకవీయమున త్రిపురాంతకోదాహరణముఁ గూర్చి యిట్లు వ్రాసియున్నారు. “త్రిపురాంతకోదాహరణము.” ఇది యెనిమిది తాటాకులపుస్తకము. గ్రంథకర్త గుండయకవి.

ఇందు గ్రంథకర్త గుండయకవియనుట పొరపాటే! గుండయప్రాచీనశైవభక్తుఁడు. గుండయపేరు చతుర్థీవిభక్తి యుత్కళియం దుదాహరింపఁబడినది. ఈతనిచరిత్ర బసవపురాణమున వర్ణితము. ఈ గ్రంథము శైవసంప్రదాయిక మగుటచేతను, సందర్భానుసారముగ నాయాభక్తులచరిత్రము లుద్ధరింపఁబడుట చేతను, వారిచరిత్రము లాంధ్రసాహితీవేత్తలకు సుపరిచితములు గాకపోవుటచేతను గ్రంథకర్తనుఁగూర్చి యిట్టి వేరుపాటు గలిగినది. త్రిపురాంతకుఁడే గ్రంథకర్త యనుట నిర్వివాదాంశము.

3. కవిజీవితము

రావిపాటి త్రిపురాంతకుని వాడుకపేరు తిప్పన[5]. తెలుఁగుకవులలో నీతనిచరిత్రము బహుసులభముగా వ్రాయవచ్చును. ఏలయన నితనిపేరు తప్ప, తలిదండ్రులపేళ్లుగాని కులగోత్రవిద్యావిషయము లితరము లేవియఁ దెలియరావు. త్రిపు రాంతకునితరకృతులు సంపూర్ణముగ దొరకినచోఁ గొంత తెలియును గాని వానియందు కొన్ని పద్యములే లభించుచున్నవి గావున నీతనిచరిత్రము నిగూఢ మైయున్నది.

జన్మముచే నెవ్వఁడైనను భక్తిప్రపత్తియం దీతఁడు శైవుఁడని చెప్పనొప్పును. ఈయుదాహరణమునందలి శైవసంప్రదాయాభిజ్ఞతయందేమి, ప్రాచీనశివభక్తకథాసూచనమునందేమి కవి శైవుఁడగుట స్పష్టమే! పేరు శైవులదే! ఈతఁడు శ్రీశైలమునకుఁ దూర్పువాకిలియగు త్రిపురాంతకక్షేత్రమున జనించి తద్దేవునకు భక్తుఁడై శృంగారకావ్యములను భక్తిరసప్రధానములగు కావ్యములు రచియించె నని రెండవప్రతాపరుద్రునికాలమువాఁ డని శ్రీరామకృష్ణకవిగారు త్రిపురాంతకోదాహరణము తొలికూర్పునను మలికూర్పుననుగూడ వ్రాసియున్నారు. దీని కాధార మూహ్యము.

4. కాలనిర్ణయము

శ్రీరామకృష్ణ కవిగారు, త్రిపురాంతకుఁడు ద్వితీయప్రతాపరుద్రునికాలమువాఁడని వ్రాసినారు. త్రిపురాంతకుఁ డనుకవి ద్వితీయప్రతాపరుద్రునియాస్థానమున నున్నట్లు ప్రతాపచరిత్రమునఁ[6] గలదు. కాకతీయచక్రవర్తులలోఁ గడపటివాఁ డగు నీప్రతాపరుద్రుఁడు క్రీ. శ. 1295 మొదలు 1326 వఱకుఁ బరిపాలించినవాఁడు. కావున నీతఁ డాకాలమువాఁడు కావలెను. కాని దీని కొకప్రతిబంధకము గలదు. రావిపాటి తిప్పన్న చాటుధార యని యప్పకవీయమున యతిప్రాసవిషయికమగు మూ డపునాశ్వాసమున ననుస్వారసంబంధయతి కుదాహరణముగా నీ క్రిందిపద్యము దాహరింపఁబడి యున్నది.

మ. సరిబేసై రిపుడేలభాస్కరులు భాషానాథ! పుత్రా! వసుం
     ధరయం దొక్కడు మంత్రియయ్యె వినుకొండన్ ; రామయామాత్యభా
     స్కరుఁడో! ఔ, నయిన స్సహస్రకరశాఖల్లే వవేయున్న వే
     తిరమైదానము సేయుచో, రిపుల హేతిన్ర్వే యుచో, వ్రాయుచోన్.

పైపద్యమునందలిపాఠము ముప్పదియిద్దఱుమంత్రులచరిత్రమున రాయనామాత్య భాస్కరుఁడని యున్నది. ఇదియ సరియగుపాఠము. ఈ భాస్కరులు పెక్కుఱు గలరు. వారిలో నీరాయనిభాస్కరుఁడు దాతృత్వమున తెలుగునాటఁ బేరెన్నికఁగన్న వాఁడు ఈతనిఁగూర్చి భట్రాజులు చెప్పినపద్యములు చాల గలవు, గ్రంథవిస్తరభీతి నుదహరింప మానితిని. ఈతఁడు క్రీ. శ. 1386 సంవత్సరప్రాంతమున రాజమహేంద్రవరమును పరిపాలించిన రెడ్డిరాజు కాటయవేముని యాస్థానమున నున్నట్లీ క్రిందిపద్యమువలనఁ దెలియుచున్నది.

చ కలయఁ బసిండిగంటమునఁ గాటయవేము సమక్షమందు స
   త్ఫలముగ రాయనిప్రభుని బాచఁడు వ్రాసిన వ్రాల మ్రోతలున్
   గలుగలు గల్లుగల్లురన గంటకమంత్రుల గులడెలన్నియున్
   జలుజలు జల్లుజల్లురనె సత్కవివర్యులు మేలుమేలనన్ .

రాయని భాస్కరుని స్తుతియించిన త్రిపురాంతకుఁడు శ్రీ. శ. 1380 ప్రాంతమువాఁడు గావలెను. ఇందులకు ప్రబలముగ శ్రీనాథమహాకవిరచితమై వల్లభరాయని కృతిగా పేర్వెలసిన క్రీడాభిరామమున త్రిపురాంతకుని ప్రశంసగలదు,

ఉ. నన్నయభట్టు, తిక్కకవినాయకుఁ డన్న ,హుళిక్కి భాస్కరుం
     డన్ననుఁ, జిమ్మపూడి యమరాధిపుఁ డన్నను సత్కవీశ్వరుల్
     నెన్ను దుటం గరాంజలులు నింతురు 'జే' యని రావిపోటి తి
     ప్పన్నయుసంతవాఁడ! తగునాయిటుదోసపుమాటలాడగన్.

మఱియు నీత్రిపురాంతకుడు సంస్కృతమున రచించిన ప్రేమాభిరామము సనుసరించి తెనుఁగున శ్రీడాభిరామము రచియించిన ట్లాగ్రంథమునఁ గలదు.

“దిప్పమంత్రీంద్రతనయుఁ డార్య మణివల్లభామాత్యుఁడహరహంబు."

వ. ఆమంత్రి శేఖరుండు రావిపాటిత్రిపురాంతక దేవుఁడను కవీశ్వరుఁ డొనరించిన ప్రేమాభి రామనాటకము ననుసరించి క్రీడాభిరామంబను రూపకంబు తెలుఁగుబాసను రచియించినాఁడు.”

వల్లభరాయనితండ్రి తిప్పన కర్ణాటరాజ్యమును పరిపాలించిన మొదటి హరిహరరాయని రత్నభాండాగారాధికారి యగుటచేతను, నాతనిపెదతండ్రి లింగన రెండవహరిహర


(1) ఆంధ్రదేశమున భాస్కరులచరిత్రమునుఁ దెలిసికొనఁగోరువారీక్రిందిగ్రంధములఁ జూడనగును.

1. ముప్పదియిద్దఱుమంత్రులచరిత్రము (1889)

2. భాస్కరోదంతము- కాశీభట్ట బ్రహ్మయ్యశాస్త్రిగారు (1893)

3. రాయసభాస్కరమంత్రిచరిత్రము - గురుజాడ శ్రీరామమూర్తి గారు (1900) పుట:త్రిపురాంతకోదాహరణము.pdf/10 పుట:త్రిపురాంతకోదాహరణము.pdf/11 పుట:త్రిపురాంతకోదాహరణము.pdf/12 పుట:త్రిపురాంతకోదాహరణము.pdf/13 పుట:త్రిపురాంతకోదాహరణము.pdf/14 పుట:త్రిపురాంతకోదాహరణము.pdf/15 పుట:త్రిపురాంతకోదాహరణము.pdf/16 పుట:త్రిపురాంతకోదాహరణము.pdf/17 పుట:త్రిపురాంతకోదాహరణము.pdf/18 పుట:త్రిపురాంతకోదాహరణము.pdf/19 పుట:త్రిపురాంతకోదాహరణము.pdf/20 పుట:త్రిపురాంతకోదాహరణము.pdf/21 పుట:త్రిపురాంతకోదాహరణము.pdf/22 పుట:త్రిపురాంతకోదాహరణము.pdf/23 పుట:త్రిపురాంతకోదాహరణము.pdf/24 పుట:త్రిపురాంతకోదాహరణము.pdf/25 పుట:త్రిపురాంతకోదాహరణము.pdf/26 పుట:త్రిపురాంతకోదాహరణము.pdf/27 పుట:త్రిపురాంతకోదాహరణము.pdf/28 పుట:త్రిపురాంతకోదాహరణము.pdf/29 పుట:త్రిపురాంతకోదాహరణము.pdf/30 పుట:త్రిపురాంతకోదాహరణము.pdf/31 పుట:త్రిపురాంతకోదాహరణము.pdf/32 పుట:త్రిపురాంతకోదాహరణము.pdf/33 పుట:త్రిపురాంతకోదాహరణము.pdf/34 పుట:త్రిపురాంతకోదాహరణము.pdf/35 పుట:త్రిపురాంతకోదాహరణము.pdf/36 పుట:త్రిపురాంతకోదాహరణము.pdf/37 పుట:త్రిపురాంతకోదాహరణము.pdf/38 పుట:త్రిపురాంతకోదాహరణము.pdf/39 పుట:త్రిపురాంతకోదాహరణము.pdf/40 పుట:త్రిపురాంతకోదాహరణము.pdf/41 పుట:త్రిపురాంతకోదాహరణము.pdf/42 పుట:త్రిపురాంతకోదాహరణము.pdf/43 పుట:త్రిపురాంతకోదాహరణము.pdf/44 పుట:త్రిపురాంతకోదాహరణము.pdf/45 పుట:త్రిపురాంతకోదాహరణము.pdf/46 పుట:త్రిపురాంతకోదాహరణము.pdf/47 పుట:త్రిపురాంతకోదాహరణము.pdf/48 పుట:త్రిపురాంతకోదాహరణము.pdf/49 పుట:త్రిపురాంతకోదాహరణము.pdf/50 పుట:త్రిపురాంతకోదాహరణము.pdf/51 పుట:త్రిపురాంతకోదాహరణము.pdf/52

  1. దీనిని యథామాతృకముగ వాయించి సకాలమునకు నా కందఁజేసిన తంజావూరు సరస్వతీగ్రంథాలయకార్యనిర్వాహకసంఘ గౌరవ కార్యదర్శులు శ్రీయుత రావుసాహెబు టి. సాంబమూర్తిరావు, బి.ఏ. ఎమ్.ఎల్. గారికి నే నెంతయు గృతజ్ఞుఁడను.
  2. ఆంధ్రమున ప్రబంధరత్నాకరము, సంస్కృతభాషలో కవీంద్రవచనసముచ్చయము, శార్ఙధరునిపద్ధతి, జల్హణునిసూక్తిముక్తావళి, వల్లభదేవుని సుభాషితావళి మొదలగువానిఁబోలిన సంకలితగ్రంథము. తెనుఁగులో మడికి సింగనసమకూర్చిన సకలనీతిసమ్మతము మొదటిది. ఇది రెండవది. ఇది యముద్రితము. మూఁడాశ్వాసములదనుక తంజావూరుపుస్తకాగారమున గలదు. ఇందపూర్వగ్రంథము లుద్ధరింపఁబడినవి.
  3. ఆంధ్రవిశ్వకళాపరిషత్ప్రకటితము 1933. ఫుట. 37. (చూ. ఫుట, 37. A Descriptive Catalogue of the Telugu Manuscripts in the Tanjare Mabaraja Serlojis Saraswati Mahal Library.)
  4. అప్పకవీయము వావిళ్లవారిముద్రణము 19 24 అప్పకవి ఉదహరించిన గ్రంధములు. అందులోని పద్యములు 3 పుట యడుగున యథోజ్ఞాపిక.
  5. భాస్కరశబ్దమునకు బాచన్న, తిరుమలశబ్దమునకు దిమ్మన, త్రిపురాంతకునికిఁ దిప్పన్న, జగన్నాథశబ్దమునకు జగ్గన్న ఆదిత్యునకు నైతన భైరవునకు బయ్యన్న వికృతరూపములు.
  6. ప్రతాపచరిత్రము-ఆంధ్రసాహిత్యపరిషత్పత్రిక. 7. సంపుటము. 7. పుట.