తెలుగు సమస్యలు/110-120 సమస్యలు
- దుగ్గపయోధిమధ్యమున దుమ్ములు రేగె నిదేమి చోద్యమో.
ఉ. స్నిగ్ధపువర్ణుడీశ్వరుఁడు చిచ్చఱ కంటనుపంచబాణునిం, దగ్ధ
ము చేసె నంచువిని తామరసేక్షణుమ్రోలనున్న యీ, ముగ్ధ
పులచ్చి మోదుకొనె మోహనగంధము పిండిపిండియై. . .
- ఈతాకులగుడిసెలోన నినుఁ డుదయించెన్.
క. సీతాపతిపూఁదోఁటకు
నేతా మెత్తేటివేళ యిప్పడె వచ్పెన్
పోతా పడుకున్నావా, యీతా. . . 108.
- చూతుమె లవుఁడా యటంచు సుందరి పలికెన్.
క. సీత తన ప్రియతనూజని
నాతియుఁ జేరఁగఁ బిలిచి యౌరా యనుచున్
ఖ్యాతిగ రామునిగుఱ్ఱము, చూతు. . . 109.
- విూనాక్షికిఁ గుచములాఱు మీనశరీరా.
క. సూనశరుఁడు నారసమునఁ
బూని కుసుముకందుకములఁ బొసగించె ననం _
గాను విలసిల్లె నంతయు, విూనాక్షి . . . 110
- వర్షాకాలమువచ్చె గ్రీష్మమువలెన్ వైశాఖమాసంబునన్.
శా. హర్షం బెట్లగు కృష్ణదేవు డిటకై
యబ్జాక్షిరాదాయె సా
మర్షాహుంకృతి చంద్రుఁ డేచుతఱి భీ
మద్వేషనామోగ్రదు
ర్ధక్షక్రూరనిశాతఘాతనవచూ
తవ్రాతబాణావళీ, వర్షాకాలము. 111
- మతిలేనినరుండు మిగుల మన్నన వొందున్.
క. హిత మాచరించువారికి
హిత మొనరించుచును సుజనహితుఁ డగుచును దు
ష్కృత మెప్పడు నేయను సం, మతి. . . 112
సీ. మామనోహారుఁడు మామనోహారుఁడు
మారగురుండు కుమారగురుఁడు
మామనోహారుఁడు మామనోహారుఁడు
మారగురుండు కుమారగురుఁడు
మామనోహారుఁడు మామనోహారుఁడు
మారగురుండు కుమారగురుఁడు
మామనోహారుఁడు మామనోహారుఁడు
మారగురుండు కుమారగురుఁడు
గీ. ... ... . . .
... ... . . . 113
- నీతరముగాదు కలహించి నిర్వహింప
చల్లపట్టాభిరామ నీచగుణధామ.
సీ. విజయరామక్షమావిభు మెచ్చి భాసిల్లె
ధరణిలో మా ప్రపితామహుఁడు
గంగాభవానిని గడుదిట్టయై తిట్టి
ఖ్యాతిఁ జెన్నొందె మాతాతయొకఁడు
వెలయంగ మగటిపల్వెంకను బడఁదిట్టి
తగఁ దెగటార్చె మాతండ్రిగారు
.... ......గీత పద్యం దొరక లేదు.
ఆరీతిగాదిట్టి యమపురంబునకును
నిన్నుఁబంపఁదలంచి యున్నవాఁడఁ
గీ. కాచుకోగా విటుమింద నఖండచండ
దారుణోద్దండకవితాగభీరశ_క్తి, నీతరము. . . 114
- చరమును రేగ మేక మెడచన్నులవంటివి రెండుమాన్యముల్.
చ. గరిసెలు వ్రాతగానిమఱిగం పెఁడెఱుంగము మన్య దేశముల్
తిరిగి యభీష్టవస్తువులు దెచ్చి భుజింతుము సర్వకాలమున్
సురుచిరసత్కవిత్వనిధి సూరకవీంద్రనకేలగల్గె గం,చర...
- ఏమి చేయవచ్చు నీశ్వరాజ్ఞ.
గీ. కర మెవరికె నఁ గడఁ దోవ గా రాదు
ధర్మరాజఁ దెచ్చి తగనిచోటఁ
గంకుభట్టుఁజేసె గటకటా ! దైవంబు, ఏమి. . 116
- కులకాంతకు సాటిరారు గువ్వలచెన్నా.
క. వెలివిద్య లెన్ని యైనను
గులవిద్యకు సాటిరావు కుంభినిలోనన్
వెలకాంత లెంద ఱున్నను, గుల. . . 117
- రావే ! ఈశ్వర ! కావవే! వరద ! సంరక్షించు భద్రాత్మకా!
శా. లా వొక్కింతయు లేదు ధై ర్యము విలో
లంబయ్యెఁ బ్రాణంబులా
ఠావుల్ల ప్పెను భాంతివచ్చె దనువుకొ
నీవేతప్పనితఃపరంటెఱుఁగ మ
న్నింపందగున్ దీనునిన్, రా. . . 118
- రావే ! మానిని ! కావవేతరుణి ! సంరక్షించు చంద్రాననా !
శా. పూవిల్కా_నిసరోజ బాణముల సంభోజారి మై చాయలన్
భావం బెంతయు డస్సె వేునుబడలెన్ దాపంబు రెట్టించెనే
నీవాఁడన్ మధురాధరంబొసంగవేనిక్కంబున న్నేలవే, రా. . . 119
- కో" యుంచుందొలికోడికూయుదనుకం గోపంబె బింబాధరా.
శా. ఆయెం బోయె నిఁ కేల నావలనఁ దప్పామాట సైరింపవా
ఱాయో కానము నీమనంబు; దయ విూఱంబల్కనింతైన; నీ
ప్రాయంబేటికినిన్నుఁ బాసినఁదృణప్రాయంబయో కొక్కు_రో
కో యంచుం దొలికోడికూయుదనుకం గోపంబె బింబాధరా. 120
తెలుఁగు సమస్యలు సంపూర్ణము.
చెన్నపురి : వావిళ్ల రామస్వామిశాస్త్రులు అండ్ సన్స్ వారి
వావిళ్ల ప్రెస్సున ముద్రితము.-1953.