తెలుగు శాసనాలు/ముగింపు
20. ముగింపు
దాదాపు క్రీస్తు 1800 వఱకు అనగా కాకతీయుల రాజ్యాంతమువఱకు గల తెలుగు దేశముయొక్క సాంఘిక చరిత్రను తెలుసుకొనుటకు గ్రంథాధారములేవియు లేని కారణమున శాసనములే ముఖ్యాధారములు. నన్నయ, తిక్కనల ఆంధ్రమహాభారతమున్నను అది పురాణానువాద మగుటయేగాక గ్రాంథికమగుటచే నాటి జన సామాన్యజీవనమునంతగా ప్రతిబింబించుట లేదు. పండితారాధ్యచరిత్ర క్రీడాభిరామము మున్నగు కొలది రచనలు నాటి సాంఘిక జీవనమును కొంత తెలుపుచున్నవి. తెలుగువారి అప్పటి సాంఘిక విషయము అనేకములు శాసనములనుండియే కాని వేఱు విధముగ మనకు తెలియవు. విజయనగర రాజుల కాలమందున్న జీవన వ్యవస్థ, రాజకీయవ్యవస్థ. ఆర్థిక విధానము మత సంప్రదాయములు మున్నగునవి అనేక కైఫియతులలోను, గ్రంథములలోను, విదేశ యాత్రికుల కథనములందు లభ్యమగుచున్నవి. కాని కాకతీయ రాజ్యాంతమువఱకుగల రాజకీయ చరిత్రవలె సాంఘిక చరిత్రను తెలుసుకొనుటకుకూడ శాసనములే యాధారము. అందును తెలుగు శాసనములే తెలుగుప్రజల గ్రామీణ జీవనమును వ్యక్తముచేయును. స్థాలీపులాకముగ కొన్ని యంశములనిట చెప్పుదును.
1. ప్రజలు : గ్రామీణప్రజలు జాతుల ననుసరించియేగాక వృత్తుల ననుసరించికూడ సంఘములుగ వ్యవస్థీకరింపబడువారు. ఈ సంఘములకు సమయములులేక శ్రేణులనెడి వ్యవహారముండెడిది. ఆయా సమయములు కొన్ని కట్టుబాట్లు, లేక కొన్ని సాంఘిక వ్యవస్థల ద్వారా తమ వృత్తుల నిర్వహించుకొనుటయే గాక జీవిత విధానమును కూడ సరిదిద్దుకొనేడువారు. వారు ఉత్పత్తి చేయు వస్తువుల క్రయ విక్రయములకు సంబంధించిన అంగళ్లు, సుంకములు, లాభములు మున్నగునవికూడ వారి సమయములద్వారా జరుగుచుండెడివని తెలియుచున్నది. రాజోద్యోగులు వారిపై విధించు పన్నులను సమయముల పెద్దలద్వారానే వసూలు చేసెడివారు. దానధర్మములు సమయములద్వారానే ఆయా ప్రజల జీవిత విధానములో సమయముల నిర్ణయమే ప్రబల మనిపించును. ఎక్కటి, పాంచాల, కుంభాలిక, తంతువాయ, వస్త్రభేదక, తెలిక, దేవాంగ, పుట:TeluguSasanalu.pdf/107 పుట:TeluguSasanalu.pdf/108