తెలుగు భాషాచరిత్ర/ప్రకరణం 6

ప్రకరణం. 6

శాసనభాషా పరిణామం (క్రీ.శ. 1600 - 1899)

- కె. కె. రంగనాధాచార్యులు

6.0. తెలుగు భాషా పరిణామాన్ని తెలుసుకోవడానికి లభించే ఆధారాలలో శాసనాలు ప్రధానమైనవి. అయితే శాసనాలు సమకాలీన భాషను సమగ్రంగా ప్రతిబింబిస్తాయని చెప్పటానికి వీలులేదు. గ్రా౦థిక లేక ప్రాచీన, వ్యావహారిక భాషారూపాలు సమ్మిశ్రితమై శాసనాల్లో కనిపిస్తాయి. అంతేకాదు శాసనాల్లో ఉపయోగించిన భాష పరిమిత ప్రయోజనం, పరిమిత స్వరూపం కలిగిఉంటుంది. రాజవంశక్రమాలు, దేవాలయాలకు,బ్రాహ్మణులకు రాజులు చేసిన దానవివరాలు,రాజుల విజయయాత్రలు, రాజులు, రాజుల ప్రతినిధులు, వివిధ సమస్యలు విషయంలో ఇచ్చిన తీర్పులు-ఇట్లా కొన్నిరకాలైన సమాచారాలను అందించటానికి శాసనాలను ఉపయోగించేవారు. మొత్తం మీద శాసనభాష రాజకీయ వ్యవవారాల్లో ఉపయోగించే ఒక ప్రత్యేక శైలికి చెందిందిగా పేర్కొనవచ్చు. ఇటీవల కాలం పరకు పెద్దలు రాసే ఉత్తరాల్లోను, రాతకోతల్లోను ఇలాంటి భాషను మనం చూడవచ్చు. కాకపోతే శాసనాల్లో వ్యావహారిక భాషారూపొలు ఎక్కువగా ప్రవేశించే అవకాశం ఉంది కాబట్టి తెలగుభాషా పరిణామాన్ని తెలుసుకోవడానికి అవి ప్రధానాధారాలవుతున్నాయి.

ప్రస్తుత యగంలో శాసనాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. ఈ ప్రకరణ రచనకు పరిశీలించగలగినవి రెండు వందల ముద్రిత శాసనాలుమాత్రమే ఈ యుగంలో ముఖ్యవిశేషం కుతుబ్ షాహీల పరిషాలనలో ఆంధ్రదేశం ఉండటం. వారికీ, వారి ప్రతినిధులకూ సంబంధించిన శాసనాలు ఎక్కువగా ఉన్నాయి. మొఘల్ వంశీయుల ప్రతినిధుల శాసనాలు కూడా ఉన్నాయి. అందువల్ల ఈ కాలపు శాసనభాషలో దక్ఖనీ ఉర్జూ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. అనేకమైన కొత్త ఆదాన పదాలు భాషలో కనిపిస్తాయి. 1802 నుంచి ఆంగ్ల భాషా పదాలు 174 తెలుగు భాషా చరిత్ర

కూడా శాసనాలలో కనిపిస్తున్నాయి. ఈ విధంగా ఈ కాలపు శాసన భాషకు చారిత్రక ప్రాధాన్యం ఉండటమే కాకుండా, తెలుగు భాష తన ఆధునిక స్వరూపాన్ని సంతరించుకోవటం ఈ యుగ౦లోనే ప్రార౦భమవుతుంది.

లేఖన పద్ధతులు ఉచ్చారణ

6.1. ఈ కాలంలోని భాషా స్వరూపాన్ని గురించి చెప్పుకొనేముందు శాసనాల్లో గల లేఖన స౦ప్రదాయాలను గురించి, వాటికి, ఉచ్చారణకు గల సంబంధాన్ని గురించి కొన్ని విశేషాలు చెప్పుకోవలసి ఉంటుండి. ఉచ్చారణతో సంబంధంలేని లేఖ్యాక్షర సంకోచం ((orthographic abbreviation) ఈ కాలపు శాసనాల్లో ఎక్కువగా కనివిస్తుంది. ఉదా. గన్కు (గనుక) (NI 2 కందుకూరు 48.52, 1650), అయ్న (అయిన) (NI 3 ఒంగోలు102.11,1762), యిచ్న (ఇచ్చిన) (SII 5.1221.9,1809)

6.2. రేఫమీద హల్లుని ద్విరుక్తంగా రాయటం రేఫకు బదులుగా వలపల గిలక రాయటం 16, 17 శతాబ్దుల్లో ఎక్కువగానే కనిపిస్తున్నా 18, 19 శతాబ్దులకి పూర్తిగా తగ్గిపోయింధనే చెప్పవచ్చు. ఉదా : రాజమాత్తా౯ండ (SII 7,845,2,1682), యెల౯గడ్డ (SII 6.79.3,1796)

6.3. మూర్ధన్య హల్లుమీద దంత మూలియాలను రాసినా వాటి ఉచ్చారణ మాత్రం మూర్ధన్యమే అయిఉంటుంది. ఉదా: పట్నంబు (NI 2 నెల్లూరు 83. 63-64, 1645).

6.4. ద్విలిపి ప్రయోగం (Use of digraph): తాలవ్యచకారోచ్చారణను, శకారోచ్చారణను సూచించటానికి చ, స లకు 'య' కార సంకేతాన్ని చేర్చటం క్వాచిత్కంగా కనిపిస్తుంది. ఉదా: ఆచ్యంద్రార్కస్థాయిగా (SII 10,771.14,1692), స్యూద్రులు (SII 10.771.15, 1692).

6.5. 9/10 శతాబ్దులనుంచి కనిపించే పూర్ణానుస్వారాన్ని సూచించటానికి అనుస్వార చిహ్నంపైన హల్లులను ద్విరుక్తంగా రాసే అలవాటు (§ 8.28), కొన్ని అపవాదాలున్నా, 17, 18 శతాబ్దులలో ఎక్కువగానే కనిపిస్తుంది. అర్ధానుస్వారానికి ప్రత్యేక చిహ్నం శాసనాలలో కనిపించదు. పూర్ణానుస్వార చిహ్నాన్నే దానికీ వాడేవారు. అయితే దానిపైన హల్లును ద్విరుక్తంగా రాయకపోతే దాన్ని శాసన భాషా పరిణామం 175

అర్దానుసారంగా గుర్తించవలసి ఉంటుంది. ఉదా : అంగ్గడి (SII 5.674.14,1620), పుండ్డె (SII 7.790. 5.1714), వె౦క్కట (SII 7.558.18, 1856). చారిత్రక దశలో అర్ధానుస్వారం పూర్వాచ్చు అనునాసిక్యతకు చిహ్నం అయి ఉంటుంది. అది ఈ యుగంలో తన విలువను పూర్తిగా కోల్పోయిందని చెప్పటానికి చారిత్రకంగా అనుస్వారంఉండి ఆనుస్వార చిహ్నంలేకుండా రాసిన కొన్ని రూపాలే నిదర్శనం. ఉదా : తోపు (<తోంపు) (SII 10.763. 6,1670), నాడు (<నాండు) (SII 5.1221.3, 1809).

6.6. ద్విరుక్త స్పర్శాలకు బదులుగా మహా ప్రాణస్పర్శాన్ని రాయటం ఈ యగంలో కనిపిస్తుంది. ఉదా: లేఖ (=లెక్క) (SII 10.757.28,1650, మఖ (=ముక్కా) (NI 2 కందుకూరు 44.88,1650). ఇది 15,16 శతాబ్దుల్లోకూడా కనిపిస్తుంది. ఉదా: ఇధరి ( = ఇద్దరి) (SII 6.884.9,1408). (SII 16.257.48.1568), బొభిలి (= బొబ్బిలి) (SII 6.798. 8, 1425). ఇంతకుముందు సంస్కృతాదానాల్లోకూడా ఈ అలవాటు కనిపిస్తుంది. ఉదా: సుధ ( =శుద్ద) (SII 5.1194.3,1455), ప్రఛన్న (=ప్రచ్ఛన్న) (రా. వా. 1938.107.20.16 వ శ). దీన్ని బట్టి సంస్కృతాదానాల్లోని ద్విరుక్త మహప్రాణాలు ద్విరక్త అల్పప్రాణాలుగా ఉచ్చరింపబడేవనీ, కాని అద్విరుక్త మహ్మాప్రాణాలుగా రాయబడేవనీ, ఉచ్చారణలోమాత్రం అవి ద్విరుక్త అల్బప్రాణాలేననీ, తత్ఫలితంగా తెలుగులోని ద్విఋక్త అల్పప్రాణ స్పర్శాలను కూడా అద్విరుక్త మహాప్రాణాలుగా రాసేవారనీ ఊహంచవచ్చు.

6.7. ద్విరుక్త, సంయుక్త అనునాసికాలకు, అనునాసికం + య సంయుక్తాలకూ ముందు అనుస్వార చిహ్నం కనిపిస్తుంది. బహుశా అది వూర్వాచ్చు అనునాసిక్యతకు చిహ్నం కావచ్చు. ఉదా. తింమ్మాబట్లు (SII 10.775.7,17 వ.శ.), జంన్మాలు (NI 2 కందుకూరు 48.89, 1650), సోంమ్య, (SII 10.761.1,1669).

6.8. లేఖనభేదం : లేఖన భేదానికి ఏడు రకాల కారణాలను పేర్కొనవచ్చు. (1) ఉచ్చారణ భేదం (Phonemic and Sub-Phonemic variation): (a) పదాదిలో తాలవ్యాచ్చులకు, ఓష్ట్యాచ్చులకు వరుసగా యకార పూర్వక తాలవ్యాచ్చులకు, వకార పూర్వక ఓష్ట్యాచ్చులకు భేదకత్వం లేదు. ఉదా : (ఇచ్చి/) 176 తెలుగు భాషా చరిత్ర

యిచ్చి (SII 10.758.10.1658), (ఎనుబోతు/) యెనుబోతు (SII 10.753.57.1600), ఉండేది/వుండేది (SII 40.781.6, 17 వ.శ/SII 10.769.21, 1891), (ఊరు/) వూర్కి (017 2 కందుకూరు,20. 18,1640), (ఒడయలు/) వొడయలు (SII 10.755.2,1604). తాలవ్యాచ్చులకు ముందు, ఓష్ట్యాచ్చులకు ముందు క్రమంగా-యం-;-వ-లను లోపింపజేయడం కూడా లేఖనంలో కనిపిస్తుంది. ఉదా : అఇది (NI 3 రాపూర్ 49.14,1688), చెరుఉ (SII 7.557.8,1636). (b) వ, వా/వొ,వో ; వకారంవైన, నిమ్నాచ్చుకు ఓష్ట్యోచ్భారణ ఉంది. వర్ణవిధేయలగాను, ఉచ్చారణ విధేయంగాను లేఖన భేదం శాసనాల్లో కనిపిస్తుంది. ఉదా; వందురు/వొందురు (NI 1 CP 9.80, 1686/18.92,1541). _వోరు (వారుకు బదులు) (SII 16.254.10, 1562). పై లేఖన పర్యాయత ఉచ్చారణార్థం ఓ, ఓ లకు ముందు వకారం చేరిన చోట్ల కూడా కనిపిస్తుంది. ఒడయలు/వొడయలు/వడయలు (SII 10.748.90- 10, 1580/SII 10.745.4,1580/NI 8. ఒంగోలు. 182.9,1448). వారుగంటి (ఓరుగంటికి బదులుగా (SII 7.372.6.1459). (c) అ/ఒ: ఓష్ట్యాలకు ముందు నిమ్నాచ్చుకు ఓష్ట్యోచ్బారణ ఉండటంవల్ల ఈ భేదం కనిపిస్తుంది. ఉదా: తవ్వించి/తొవ్వించి (SII 7. 564. 6,1667),(NI 1 గూడూరు 88.4,1791). (d) ఎ/ఓ : ణ్డ కు ముందు వా మార్పుకారణంగా కావచ్చు ఈ లేఖనభేదం కనిపిస్తుంది. ఉదా: రెండు/రొండు (SII 4.280.29,15558 / SII 5.874,6,1620). (e) ఎ/ఏ (æ) : పూర్వం ఇయాంతాలుగా ఉండే శబ్దాలు 13/14 శతాబ్ధుల కాలానికే ఎకారాంతాలుగా మారాయి. (కందప్ప చెట్టి §1, 72-4) ఈపదాలను శాసనాలలో భిన్న పద్ధతులలో రాయటం జరిగింది. అంటే-య,-ఎ,-అ లతో ఈ పదాలను రాయటం కనిపిస్తుంది. ఈ లేఖన భేదం 15 వ శతాబ్దినించే అన్ని ప్రాంతాలలోను (§ 5,7), ముఖ్యంగా ఒకే శాసనంలో కూడ కనిపిస్తుంది. దీనివల్ల ఇది ఒకే ఉచ్చారణను అంటే విసృత ఎ (æ) కారాన్ని సూచిస్తుందని చెప్పవచ్చు. ఉదా : పళ్యాలు/పళ్ళెం/పళ్ళం/పళాలు (SII 4.981.6, 1518). ఎ,ఏల వివృతోచ్చారణను సూచించటానికి యకార చిహ్నాన్ని వాడటం ఈ కాలపు శాసనాల్లో కవిపిస్తుంది. ఉదా: మ్యేరకు (NI 8 రాపూరు 30.8, 1688). (f) మ్య/వ : ఇక్కడ వకారం అనునాసిక వకారానికి చిహ్నం కావచ్చు. ఉదా: (మామిడి/) మావిడి(SII 5.1228.7,1508/, NI 2 కందుకూరు 46.37,_ 1682). (g) స/శ: తాలవ్యాచ్చులకు ముందు సకారానికి శకారోచ్బారణ శాసన భాషా పరిణామం 177

ఉందనటాన్ని ఇది నూచిస్తుంది. ఉదా : తీసి/తీశి (NI 2 కందుకూరు 48.80,1650/SII 10.772.18,1696). (h) మ్ర/మ్బ్ర: మ,ర ల సంయుక్త వర్ణాలలో ఉచ్చారణలో బకారం చేరటం ప్రాచీనా౦ద్రలోను, ఆధునికా౦ద్రలోను కనిపిస్తుంది. ఉదా : (తామ్ర/) తామ్బ్ర౦ (SII 16.77.159, 1525/) NI 2 కందుకూరు 48.47,1650). (i) ంవ/ంహ్వా: ంహ/ంహ్వ; ంస్య/౦స్వ: పూర్ణానుస్వార పూర్వకాలైన వ, హ, స లను రకరకాలుగా రాయటం ఇంతకు ముందు శాసనాల్లోను ఇప్పటి శాసనాల్లోను కనిపిస్తుంది. ఉదా : సంహత్సర (NI 2 కందుకూరు 20 .1640), సంహ్వత్సర (SII 4.949.2, 1761); సిహ్వాసన (SII 7.561.8,1667), సింహ్వాసన (NI 8 రాపూరు 35.7.8,1684); మావసానకు (SII 10.771.18,1692). అనుస్వార పూర్వక ఊష్మాల పైన మకాని, వ (ఊష్మీకృత మకారం) గానీ కనిపించటం ఉచ్చారణకు సంబంధించిన రెండు విశేషాలను నూచిన్తుంది. (అ) అనుస్వారం, అంటే ఈ పరిసరంలో మకారం, ఓష్ట్య అనునాసిక ఊష్మంగా ఉచ్చరింపబడేది. (ఆ) పై వర్ణక్రమం అంతా, అంటే ౦వ, ౦హలు, ఓష్ట్యీకృతం అయ్యేది. ౦హ వర్ణక్రమం వ్హ్వగా ఉచ్చరింపబడటం ఆధునిక కాలంలో కూడా చూడవచ్చు. ఆ కారణంవల్లే అప్పకవి ౦హ, హ్వ లకు ప్రాస కలపటాన్ని నిషేధించాడు (2-261). అయినా ఉచ్చారణ ఆధారంగా కొందరు సమకాలీన కవులు వీటికి ప్రాస కలపటం జరిగింది. అందుకే హ్వా, ౦హ అను ౦హ్వూ గా భావించ వద్దన్నాడు అప్పకవి (పై). సంస్కృత పదాల్లోని హ్మ సంయుక్తాన్ని కూడా శాసన లేఖకులు రకరకాలుగా రాశారు. ఉదా: బ్రా౦హణ(SII 7.79౦.9.1714). బ్ర౦హ్మాండ(SII 10.766.8. 1678). ౦హ(<హ్మ్ర)వర్ణ వ్యత్యయ పలితంకావచ్చు. ౦హ్మలేఖనం ౦వ,౦హ సంయుక్తాలలాగే మొత్తం వర్ణక్రమం అంతా ఓష్ట్యీకృతం అయిఉంటుందనటానికి నిదర్శనం కావచ్చు. (ii) వర్ణభేదకత్వ తటస్టీకరణం (Neutralization of phonemic contrast): ఒక పరిసరంలో రెండు వర్జాలకు భేదకత్వం లేకపోవటంవల్ల ఆ పరిసరంలో రెండు వర్దాల లిపి సంకేతాలను పర్యాయంగా రాయటం జరుగుతుంది. య కారం తర్వాత అ, ఆ లకు, ఎ, ఏ లకు భేదకత్వం లేకపోవటంవల్ల రెండు వర్ణాలను స్వేచ్చగా రాయటం శాసనాల్లో కనిపిస్తుంది. ఎ, ఏ లకు ముందు ఉచ్చ్బారణకోసం యకారం చేరినచోట్లు కూడా ఈ లేఖన భేదం కనిపిస్తుంది. ఉదా; (ఎవ్వరు/యెవ్వరు/) యవ్వరు (SII 5.120.7.1640), (ఎల్ల/) యల్ల (SII 7.790.18,1714). అపదాది స్థానంలో కూడ ఈ భేదం కనిపిస్తుంది. ఉదా; (ఆయెను/) ఆయను (SII 10,762.15-16,

(12) 178 - తెలుగు భాషా చరిత్ర

1669), ధర్మం యెందు (/యందు) (NI 2 కందుకూరు 48.56, 1650). దేశ్య పదాల్లో చకారం తర్వాత కూడా అ, ఆ/ఎ, ఏ లు పర్యాయతను పొందుతాయి. ఉదా: చెరువు/చరువు (SII 10.755.13,1604/SII 10,766.10,1678). తెలుగులో తాలవ్య హల్లుల తరువాత ఎ,ఏ లు అ ,ఆ లుగా కనిపిస్తుండగా సంస్కృతాదానాల్లో అ,ఆ అను ఎ.ఏ లుగా రాయటం మాత్రమే కనిపిస్తుంది. ఈ సందర్భంలో సంస్కృతంలో హ్రస్వ ఎకారంలేదన్న విషయాన్ని గుర్తించాలి. ఆ కారణంవల్ల తాలవ్య హల్లులపైన అకారం తాలవ్యతను పొందుతుందని చెప్పవలసి ఉంటుంది. ఉదా : యెళము (SII 10.772.21,1696), (iii) వర్ణాల పర్యాయ ప్రవృత్తి (Phonemic free variation): లేఖన భేదం రెండు వర్జాల పర్యాయ ప్రవృత్తిని కూడా సూచించవచ్చు. (a) ఉ/అ: ఉదా: కనుక/కనక (SII 10.773.11,1697/SII 5.874.10,1620). కనకస్వర సమీకరణంవల్ల ఏర్పడ్డ ఆధునిక రూపం. (b) ఐ/అయ్; ఔ/ఆవ్: ఐ/అయ్; ఔ/అవ్ ల లేఖన భేదం ఈ రెండింటి వర్ణాశ్రిత పర్యాయ ప్రవృత్తిని సూచిస్తుంది. ఉదా: (ఐదు/)అయిదు(SII 7.655.10,1856). (c) ఎయ్య్/ఏయ్; ఉయ్య/ఊయ్: ఉదా: వెయ్యి (/వేయి) (SII 16.325. 2-8,1688), (నుయ్యి/) నూయి (SII 10.760.9,1668). (iv) పదాంశ విధేయ/వర్ణవిధేయ లేఖనం: రెండు పదాంశాలమధ్య సంధి ఫలితంగా మార్పు వచ్చినా పదాంశరూపాన్ని యథాతథంగా రాయటం పదాంశ విధేయ లేఖనం. ఉదా: పడ్లు/పళ్ల(కు) (NI 2 కందుకూరు 18.28,1408/SII 5.874.8, 1620). (v) ప్రాంతీయ, వర్గమాండలిక భేదాలు; (a) ట/ష; ఆధునిక కాలంలో కూడా కొన్ని బ్రాహ్మణ మాండలికాలలో అటు, ఇటు మొదలైన పదాలలో ష కారం వినిపిస్తుంది. ఉదా: యిషని(SII 16.312.31,1658), కలషువంట్టి (SII 6.79.10, 1796). (b) డ/ణ: కాండి/కాణి (SII 10.753.42,1500/SII 10.755.9,17వ శ.), (కట్టడము/)కట్టణము (SII 7.845.7,1782). (c) -అ/-ఎ: దేశ్య, తత్బవ, తత్సమ త్రయక్షర పదాల్లో మధ్యాచ్చు ఇకారం అయినస్పుడు చివరి అకారం ఎకారంగా కొన్ని మాండలికాలలో, ముఖ్యంగా దక్షిణ మాండలికంలో కనిపిస్తుంది. ఉదా :మాదిగ/మాదిగె (NI 2 కందుకూరి 48.65,1650/NI 2 నెల్లూరు 115.8-10,1635, (d) ఏ/ఈ; ఉదా: పోయీ (/పోయే) యందుకు (SII 10,753.51,1600). (vi) శైలీ మిశ్రణం: లేఖన భేదం శైలీ భేదాన్ని సూచించవచ్చు. ఇది మూడు రకాలుగా కనిపిస్తుంది. (1) ప్రాచీన/అర్వాచీన వర్జక్రమం : శాసనభాషా పరిణామం 179

(a) గ/వ: (ఆగు/) ఆపు (NI 2 కందుకూరు. 46.4,1682), (b) వ/గ: (మువురకు/) ముగ్గురికి (NI 1 దర్శి 61.13,1718). ఇంతకుముందు శతాబ్దాల్లో కనిపించే హ/య ల లేఖన భేదంకూడా ఇలాంటిదే అని గ్రహించాలి. ఉదా: పహిండి / పయిండి / పైడి (SII 4.1344.6,1470 / SII 4.702.104,1518/TTDES 3.32.2, 1512). (2) సాహిత్య/వ్యావహారిక రూపాల మిశ్రణం: బ్రతికేది (/బతికేది) (SII 10.771.15,1692), (మ్రాను/) మాను (NI 1 CP 8.24,1651). కొన్ని సందర్బాలలో ఇది ప్రాచీన వర్ణక్రమాన్ని పాటించటం వల్ల కూడా కావచ్చు. (3) ప్రామాణిక/అప్రామాణిక భేదాలు : ఇంతకు ముందరి శతాబ్దాలలో కనిపించే చ/స, చ/శ, శ/స, ష/స, తాలవ్యాచ్చుకు ముందు వకారం లోపించి, లోపించని రూప భేదాలు (రంగనాథాచార్యులు § 2.46.8)కాకుండా ఈ క్రి౦ది భేదాలు ఈ కాలపు శాసనాల్లో కనిపిస్తున్నాయి. (a)/ణ న: (పుణ్యము/) పున్యము (SII 5.120.5,1640). (b) త్స్య/చ్చ: ఉదా: (మత్స్యదేశ/) మఛదేశ (SII 10.776:4,1786), (c) శ్ర/చ్చ: ఉదా : (అశ్రర్ద/) అచ్చెద్ద (SII 10.765.40,1678). (vii) ఆ దానపదాల్లోని వర్ణాలకు లేఖనచిహ్నం లేనప్పుడు వాటికి తుల్యమైన ఉచ్బారణగల వర్ణాల చిహ్నాలను ఉపయోగించటం కనిపిస్తుంది. ముఖ్యంగా పర్సో-అరబిక్ ఆ దానపదాల్లోని f కు ప గాని, ఫ గాని x కు క గాని, ఖ గాని రాయటం కనిపిస్తుంది. ఉదా: ఫరుమానా/ పరుమానా SII 10.775.14,1680,/NI 2 కందుకూరు 48.15,1650).

6.9. విలోమ లేఖనం (Inverse Spelling) : వ్యుత్పత్తి గత పరిణామానికి భిన్నంగా వర్ణక్రమాన్ని వికృతీకరించటం విలోమ లేఖనం. (a) రు కు బదులుగా ఋ. ఉదా : పెకండృ (NI 2 కందుకూరు 41.17,1688). ఇది సంస్కృతంలోని ఋ కారానికి తెలుగులో రుకారోచ్చారణ ఉందనటాన్ని సూచిస్తుంది. (b) ధ కు బధులుగా థ: ఈ భేదం ఇంతకుముందు శతాబ్దాలనుంచే కనిపిస్తుంది. సంస్కృతాదానాల్లోని థ కార, ధ కారాలకు భేదం పోయిందనటాన్ని ఇది సూచిస్తుంది. ఉదా: వథ (వధకు బదులుగా) (SII 16.282.22,1572). (c) గ్నకు బదులుగా జ్ఞ రాయటం కూడా ఇంతకుముందు శతాబ్దాల్లోనే కనిపిస్తుంది. ఇది అవిద్యావంతుల భాషలో జ్ఞ > గ్న మార్పును సూచిస్తుంది. ఉదా : ఆజ్జేయ (ఆగ్నేయకు బదులుగా) (SII 10.290.18-19,1577). గ్న్య కు బదులుగా జ్ఞ రాయటం కూడా కనిపిస్తుంది. ఉదా: అజ్ఞంమకుండ(అగ్న్యమ్మకుండకు బదులుగా) (NI 2 ఒంగోలు 82.20-21, 1668). 180 తెలుగు భాషా చరిత్ర

6.10. కృతక ప్రామాణిక రూపాలు (Hyper-Correct forms):(a) అల్ప ప్రాణాలకు బదులుగా మహాప్రాణాలు. ఉదా: భావి (బావికి బదులుగా) (NI 2 కందుకూరు 48. 37,1650). భండ(బండకు బదులుగా) (SII 10.772.15,1696). (b) తాలవ్యాచ్చులకు ముందు వకారాన్ని చేర్చటం : ఇది తాలవ్యాచ్చులకు ముందు వకార లోపానికి ప్రత్నామ్నాయ ఉచ్చారణవల్ల వచ్చింది. ఉదా: విటకు (ఇటకు బదులుగా) (NI 1 ఆత్మకూరు 1.11,1616). (c) త్త కు బదులుగా త్య: నిమిత్యం (నిమిత్తలకు బదులుగా) (SII 10.771.8, 1692). ఇది త్య > త్త మార్పుకు ప్రత్యామ్నాయం కావచ్చు. (d) శ కు బదులుగా చ. ఉదా: షోడచోపచారాలు (షోడశోపచారాలకు బదులుగా) (SII 5.166,10-11,1624).

6.11. తత్సమాలలో దేశ్యాలలోని లేఖన సంప్రదాయాలు : (a)ఎ/ యె/య: ఉదా. యెజుశ్శాఖ/ఎజుశ్శాఖ (/యజుశ్శాఖ) (SII 10.777.11,1740/NI 3 వెంకటగిరి 23 7,1659). (b) ఐ/అయ్; ఔ/ఆవ్ : ఉదా. (పౌత్రులైన/) పపుత్రులయిన (SII 7.564.4, 1667), (c) దీర్ఘాచ్చు + హ/హ్రస్వాచ్చు + హహ. ఉదా :ద్వితియ్య (/ద్వితీయ) (SII 10.753.7, 1800).

పై లేఖన భేదాలే కాకుండా శాసన లేఖకులు తమిళం మొదలైన ఇతర భాషలకు చెందినవాళ్లు కావటంవల్లా ఎక్కువగా చదువుకున్నవాళ్లు కాకపోవటం వల్లా అనేక లేఖన భేదాలు, దోషాలు శాసనాల్లో కనిపిస్తాయి.

ఈ యుగంలో వర్ణాలు.

6.12. ఈ యుగపు శాసన భాషలోని దేశ్య విభాగంలో కింది విధంగా వర్జవిభాగం చేయవచ్చు.

హల్లులు ఓష్ట్య దంత్య దంత మూర్ధన్య తాలవ్య కంఠ్య, మూలీయ స్వర్గ పత ట ళ్‌ బద డ గ

స్పృష్టోష్మ శాసన భాషా పరిణామం 181

ఓష్ట్య దంత్య దంత మూర్థన్య కాలవ్య కంళ్య

మూలీయ ఊష్మ స అనునాసిక మ న ణ పార్శ్విక ల ళ కంపిత ర అంతస్థ వ య అచ్చులు

పురన్‌/తాలవ్య కే౦ద్ర పశ్చాత్‌/కంఠ్య సంవృత ఇ ఈ ఉ ఊ ఈషత్సంవృత ఎ ఏ ప వివృత అ అ

సంఖ్యా వాచకాలలో మాత్రమే దేశ్యాలలో మహా ప్రాణాలు కనిపిస్తాయి. ఉదా : నలుభయి. [SII 10.755.8,1604). వెన్క (SII 5. 8.28,1778) వంటి పద మధ్యాజ్లోపంవల్ల ఏర్పడ్డ రూపాలకు, పెంకు (NI 1 గూడూరు 88.13,1731) వంటి రూపాలకు ఉన్న పరిమిత భేదకత్వాన్ని “జ"ను ప్రత్యేకంగా నిర్ణయించటానికి ఆధారంగా గ్రహించలేదు, ఱ ర తోను (§ 8.14), ఱ పరిపూరక పరిసరాల్లో డ, ర ల తోను (కృష్ణమూర్తి 1958:285-68) ప్రాచీనా౦ద్రంలోనే మిళితం అయినాయి. “ళ" ద్విరుక్తిలో మాత్రమే 'ల'తో భేదిస్తుంది. “హ" ఆ దాన పదాల్లో మాత్రమే కనిపిస్తుంది. ఐ/అయ్, ఔ/అవ్ ల పర్యాయ లేఖనం ఐ, ఔ లు భిన్న వర్ణాలు కావనటానికి నిదర్శనం (§ 6.8 (iii) (b) ). ఎ(æ) ఉచ్చారణ ఈ కాలంలో ఉందనటానికి లేఖనాధారాలున్నా (§ 6.8.(i) (c)) అది ప్రత్యేక వర్ణం అని చెప్పటానికి తగిన ఆధారాలులేవు. అనుస్వారం వర్గహల్లులకు ముందు వర్గానునాసికానికి, పదాంతంలో మకారానికి చిహ్నం. అర్థాను స్వారానికి ఈ యుగంలో ప్రత్యేకమైన విలువలేదు (§ 6.5).

6.13. ఉచ్చారణ భేదాలు : చ, జ లకు తాలవ్యాచ్చులకుముందు తాలవ్యోచ్చారణ, తాలవ్యేతరాలకు ముందు దంతమూలీయోచ్చారణ ఉండేదనటానికి 182 తెలుగు భాషా చరిత్ర

లేఖనాధారా లున్నాయి (§ 6.4). స్పర్శాలకు ఆధునిక కాలంలో లాగా అచ్చుల మధ్య శిథిలోచ్చారణ (Lenis articulation) ఉన్నదని చెప్పటానికి లేఖనాధారాలు లేవు. “మ" కు అచ్చుల మధ్య అనునాసిక వకారోచ్చారణ ఉండేది. (§ 6.8(1) (f) ).“న" వర్ణానికి దంత్య, కంఠ్య స్పర్శాలకు, తాలవ్య, దంత మూలీయ స్పృష్టోష్మ్యాలకు ముందు వరుసగా దంత్య, కంఠ్య, తాలవ్య, దంతమూలీయ ఉచ్బారణలు ఉండేదని చెప్పవచ్చు. “ర” కు మూర్ధన్య హల్లులపైన మూర్ధన్యోచ్చారణ ఉండి ఉండాలి (§ 6.8.). 'స' కు తాలవ్యాచ్చులకు ముందు తాలవ్యోచ్చారణ ఉండేది (§ 6,8 (1) (g) ). తాలవ్యాచ్చులకు ముందు యకారం, ఓష్ట్యాచ్చులకు ముందు వకారం ఉచ్చారణలో మాత్రమే ఉండేది. (§ 6.8. (1) (అ) ). నిమ్నాచ్చులకు ముందు ఎ, ఏ లకు వివృతోచ్చారణ ఉండేది (§ 6.8. (i) (e).

6.14. వర్ణ సంయోజన నియమావళి : ణ, ళలు పదాదిన లేవు. ట కూడా పదాదిన చాలా తక్కువగా కనిపిస్తుంది. ఉదా. టెంకాయ (SII 10.706.15,1678). “డ” వర్ణం పదాదిలో డెబ్బై (SII 4.698.67,1564)లోనూ, కొన్ని తద్భావాల్లోను కనిపిస్తుంది. ఓష్ట్యేతరాచ్చులకు ముందే 'వ' కనిపిస్తుంది. పదాదిలో ద్విర్తుక్త హల్లులు లేవు. పదాదిలో ఒకేరకమైన సంయుక్త హల్లులు - మొదటి వర్ణం క,త,ప,గ,ద,బ, స,మ,వ లలో ఒకటి, రెండవ వర్ణం ర వర్ణం అయినవి మాత్రమే కనిపిస్తాయి. వీటిల్లో రెండవ వర్ణం ర లోపించటం క్రీ. శ. 7/8 శతాబ్దులలో ప్రారంభమై క్రీ. శ. 14/15 శతాబ్దుల నాటికే పూర్తి అయిందని చెప్పాలి (§ 8.9.). కాబట్టి ప్రస్తుత శాసనాల్లో కనిపించే పదాది సంయుక్తాక్షరాలతో కూడిన వాటిని ప్రాచీన రూపాలుగాను, “ర” లోపించిన రూపాలను సమకాలీన రూపాలుగాను గ్రహించాలి (§ 6.8. (vi) (2)).

అచ్చుల మధ్య హల్లులన్నీ అద్విరుక్తంగాను, ద్విరుక్తంగానూ కనిపిస్తాయి: 'శ' మాత్రం ద్విరుక్తంగా మాత్రమే కనిపిస్తుంది. ద్యిరుక్త ఇకారం డ + న-ణ్ణ సంధి కారణంగా అంబరు భానుణ్ణ (SII 7.845.8,1682) మొదలైన మహద్ధ్వితీ యైకవచన రూపాల్లో 16వ శతాబ్దినుంచీ కనిపిస్తున్నాయి. ద్విత్వ హల్లులు సాధారణంగా హ్రస్వాచ్చులపైనే ఉంటాయి. పాళ్ళు (SII 10.758.87,1600) వంటి సంధి కారణంగా ఏర్పడ్డ రూపాల్లో మాత్రం దీర్ఘ౦పైన కూడా ద్విరుక్త హల్లులు కనిపిస్తాయి. శాసన భాషా పరిణామం 18౩

అచ్చుల మధ్య కనిపించే సంయుక్త హల్లులలో వర్గాను నాసికం + స్పర్శం క్రమంలో ఉండేవె తెలుగులో మొదటినుంచీ కనిపిస్తాయి. ప్రస్తుత శాసనాల్లో కనిపించే తక్కిన సంయుక్త హల్లులన్నీ పదమధ్యాజ్లోపంవల్ల ఏర్పడ్డవో, సంధి కారణంగా ఏర్పడ్డవో అయి ఉంటాయి. ఉదా. వేడ్క (<వేడుక) (SII 5,1208.24,1778), కోమట్లు (SII 10.770.18, 1691).

పదాంతంలో మ,య లు తప్ప ఇతర హల్లులు లేవు. 'య' యిరవై (SII 5.874.15,1620) వంటి సంఖ్యా వాచకాల్లో మాత్రమే కనిపిస్తుంది.

పదంలో మొదటి అక్షరంలో హ్రస్వం గానీ, దీర్ఘ౦ గానీ ఏ అచ్చైనా ఉంటుంది. అద్యేతరాక్షరాలలో ఒక్క 'ఒ' తప్ప తక్కిన హ్రస్వాచ్చులు మాత్రమే ఉంటాయి. రెండవ అక్షరంలో దీర్ఘాచ్చు గ్రామనామాల్లోను, వృక్షనామాల్లోను కనిపిస్తాయి. ఉదా. కొంబాక (SII 16.50.6-12,1513), నేరేళు (SII 10.787.44 1526). ద్వ్యక్షర పదాలైన గోనె (SII 10.758.52, 1600), కోడె (SII 10.758.57,1600) వంటి పదాల్లో మాత్రమే పదాంతంలో 'ఎ' కనిపిస్తుంది. మాదిగె (NI 2 నెల్లూరు 115.8-10,1675) వంటి త్యక్షర పదాల్లో కనిపించే పదాంత 'ఎ' కారం మాండలికం మాత్రమే (§ 6.8. (v) (c)).

ఇతర భాషలనుంచి వచ్చిన వర్ణాలు.

6.15. హింద్వార్య భాషా మూలాకాలు : హింద్వార్య భాషా పదాల ద్వారా కింది హల్లులు తెలుగులో చేరాయి.

ఫ థ ఠ ఛ ఖు భ ధ ఢ రు ఘ ష శ హ

సంస్కృతంలోని “ఋ” ప్రాచీన శాసనాల్లో 'రి' గా కనిపిస్తుండగా క్రీ.శ.12వ శతాబ్ది నుంచి 'రు'గా కనిపించటం ప్రారంభం అయింది (§ 4.7). ప్రస్తుత శాసనాల్లో అది ఎక్కువగా “రు” గానే కనిపిస్తుంది (§ 6.9. (a)). సంస్కృతాదానాలలోని ఐ, ఔ లను తెలుగులో ప్రత్యేక వర్ణాలుగా గ్రహించటానికి గాని (§ 6.11. (b)), సంస్క్భతంలోని అనుస్వారాన్ని, అది సంస్కృతంలో ప్రత్యేక వర్ణమైనా (ఎమ్. బి. ఎమెనో 1946:86-98), ప్రత్యేక 184 తెలుగు భాషా చరిత్ర

వర్ణంగా గ్రహించటానికి గాని ఆధారాలు శాసనాల్లో లేవు. అనుస్వారం దేశ్య పదాలలోలాగే వర్గాను నాసికానికి చిహ్నం. సంయుక్త హల్లులలో మాత్రమే కనిపించే ఙ, ఞ ల ప్రత్యేక వర్ణత కూడా పరిమితం మాత్రమే. 'మ' వర్ణానికి స, హ లకు ముందు అనునాసిక వకారోచ్చారణ ఉంది (§ 6.8 (i) (1)). పునః ప్రతిష్ట (SII 6.227. 14,1636) లాంటి సమాసాల్లో మాత్రమే కనిపించే విసర్గలను హకారానికి శ్వాస సవర్జంగా గ్రహించవచ్చు.

థకారానికి బదులుగా ధకారం రాయటం, ధకారానికి థకారం రాసే విలోమ లేఖనం (§ 6.9. (b) ) - వీటినిబట్టి చదువుకున్న వారిలో కూడా థ, ధల భేదం పోయిందని చెప్పవచ్చు.చదువుకోని వారి భాషలో మహాప్రాణాలు అల్ప ప్రాణాలు కావటం తెలుగుభాషా చరిత్రలో మొదటినుంచీ ఉన్నదే (రాధాకృష్ణ § 1.85;కందప్పచెట్టి § 1.105). అల్ప ప్రాణాలకు బదులుగా మహా ప్రాణులు కనిపించే కృతక ప్రామాణిక రూపాలు ఈ యుగంలో విరివిగా కనిపిస్తాయి (§ 6.10 (a) ). హింద్వార్య భాషాపదాలవల్ల పదాదిలోను, పద మధ్యంలోను అనేక రకాల సంయుక్త వర్ణాలు తెలుగులో చేరాయి.

6.16. పర్సో - అరబిక్ మూలకాలు: మహమ్మదీయుల పరిపాలన కారణంగా తెలుగులో ప్రవేశించిన పర్షియన్, అరబిక్ పదాలలో f, x, q , y, z వర్ణాలున్నా అవి ఈ నాటీ తెలుగులో ప్రత్యేక వర్ణాలుగా గుర్తించటానికి స్పష్టమైన ఆధారాలు లేవు. f వర్ణమైనా ఆధునిక కాలంలో ఇంగ్లీషు పదాలు తెలుగులో ప్రవేశించిన తర్వాత మాత్రమే ప్రత్యేక వర్ణం అయింది (కృష్ణమూర్తి 1959:85). అయితే ఈ భాషలను బాగా చదువుకున్న వాళ్ళు పైవాటిల్లో కొన్ని ద్వనులనైనా వేరుగా ఉచ్చరించే వారని లేఖన భేదాలవల్ల చెప్పవచ్చు. కొన్ని వర్ణాలు అంతకు ముందే హింద్వార్య పదాల ద్వారా తెలుగులో ప్రవేశించిన వర్ణాలతో నమ్మిశితం అయి ఉంటాయి. పై వర్దాలు వాటి ఉచ్చారణకు దగ్గరగా ఉండే వర్జాల లిపి సంకేతాలతో గుర్తి౦చటం జరిగింది. f వర్ణాన్ని ఫ తోను ప తోను గుర్తించారు (§ 6.8 (vii) ). ఇక్కడ ఫ అసలైన ఉచ్చారణను సూచిస్తూ ఉండవచ్చు. x, q లను ఖ, క లతో గుర్తించారు. ఉదా. ఖరారు (NI 2 కందుకూరు 80.28,1642), మొకాసా (SII 10.758. 14,1664) y ను గ తోను, z ను జ తోను గుర్తించారు. ఉదా. గులాపు వానికి (NI 3 ఒంగోలు 5.17,1636), జాగీరు (SII 7.790.1,1774). పర్సో _ అరబిక్ పదాలవల్ల తెలుగు శాసన భాషా పరిణామం 185

వర్జాల వ్యాప్తిలో కూడా మార్పు కనిపిస్తుంది. ముఖ్యంగా పదా౦తంలో దీర్ఘ౦ కనిపించటాన్ని చెప్పవచ్చు. ఉదా. తనఖా (SII 10.759, 16,1664).

6.17. ఆంగ్లభాషా మూలకాలు : 1802 నుంచీ ఆగొష్టు (NI 2 కందుకూరు 42 1,1802), కలకటరు (NI 2 కందుకూరు 42 8.1802), లేటు (SII 6.1192.6, 1866) మొదలైన ఇంగ్లీషు పదాలు శాసనభాషలో కనిపిస్తున్నా తెలుగు వర్ణమాలపైన ఇంగ్లీషు ప్రభావాన్ని గురించి చెప్పటానికి కావలసినంత పదజాలం శాసనాల్లో కనిపించటంలేదు.

6.18. సంధి : సంది విషయంలో పూర్వ యుగాలకు, ప్రస్తుత యుగానికి భేదం లేని వాటిని వదిలేస్తే కింది విశేషాలను పేర్కొనవచ్చు.

తద్ధర్మ విశేషణ ప్రత్యయమైన - ఏ పైన అట్టు, అందుకు పదాలలోని మొదటి అచ్చు అకారం లోపించటం గాని, టకారం ఆగమంగా రావటంగానీ 16వ శతాబ్ది నుంచీ విరివిగా కనిపిన్తుంది. అంతకు ముందు ఇట్లాంటిచోట్ల యడాగమం మాత్రమే కనిపించేది. ఉదా. పెట్టేట్టలుగా. (NI 2 నెల్లూరు 1.23-24, 1638), నడచే టట్టుగా (SII 10.763.12, 1670), వేంచేసే టందుకు (SII 5.874.10.1620). పై రెండు రకాల రూపాలు ఆధునిక కాలంలో పూర్తిగా ప్రచారంలో ఉన్నాయి. పై రూపాల్లోని ట చారిత్రకంగా - ఏటి (<ఏ + అట్టి) కి సంబంధించిందై ఉంటు౦ది

ఇది కాక ఆధునిక భాషలో కనిపించే అనేకమైన సంధులు ఈయుగ ప్రారంభం నుంచే వ్యాప్తిలో కనిపిస్తాయి.

రెండు హల్లులకు మధ్య అజ్లోపం, అంటే మొదటి పదం చివరి అచ్చు రెండవ పదం మొదటి హల్లుకు ముందు లోపించటం 15వ శతాబ్ది నుంచి కనిపిస్తుంది. ఉదా. కోమట్రెడ్డి (-కోమటి + రెడ్డి) (SII 10.576.4,1410), కొండ్రాజు (-కొండ + రాజు) (SII 4.709. 132,1558), లోంతట్టు (-లోని + తట్టు) (NI 2 కందుకూరు 48.29,1650-51). అచ్చు లోపించిన తరువాత పరహల్లు శ్వాసం అయితే పూర్వ హల్లుకూడ శ్వాసం కావటం 17వ శతాబ్ది నుంచీ కనిపిస్తుంది. ఉదా. అడుక్కొని (-అడుగు +కొని). (NI 2 కందుకూరు 41.36,1683-84). 186 తెలుగు భాషా చరిత్ర

అచ్చు లోపించిన తరువాత సమ హల్లుకు ముందు ద్విరుక్త హల్లు సరళీకృతం, అంటే అద్విరుక్తం అవుతుంది. ఉదా. కొన్నాండ్లు (-కొన్ని + నాండ్లు) (SII 10.755.7,1604).

గసడదవా దేశ సంధి క్రియాపదాది హల్లుకు మాత్రమే పరిమితం కావటం 15వ శతాబ్ది నుంచీ కనిపిస్తుంది. అదైనా వికల్బమే. ఉదా: నుయి + గట్టించి (SII 10 760.9, 1660), నిర్ణయం + సేసి (SII 5.874.18,1620), బరువు + వెట్టించి (SII 10 753.32,1600).

ద్రుత ప్రకృతిక సంధి కావ్య భాషలో మాత్రమే కనిపిస్తుంది. సమకాలీన భాషలో ద్రుతాలు అస్తిత్వాన్ని కోల్పోవటంవల్ల ద్రుత ప్రకృతికాలు కళలలాగే వర్తిస్తాయి. ఉదా. సుఖాన + వుంటిమి (SII 10.772.19,1696), పందిని + కోసినట్టు (SII 10.765.42,1678).

6.19. నామ ప్రాతిపదికలు (Noun stems) : నామ ప్రాతిపదికలు మూడు రకాలు. (1) సామాన్యం (Simple), (2) సంశ్లిష్టం (complex), (3) సమాసం (Compound). సామాన్య ప్రాతిపదికలలో దేశ్యాలు, ఎరువు ప్రాతిపదికలు ఉన్నాయి. ఉదా. పేరు (NI 8 ఉదయగిరి 2?.8,1661), గోనె (SII 10.753. 52,1600) మొదలైనవి దేశ్యపదాలు. ఎరువు ప్రాతీపదికలలో తెలుగు భాషా చరిత్ర మొదటిదశ నుంచి హింద్వార్య భాషలకు సంబంధించినవి అనేకం కనిపిస్తున్నాయి. మహమ్మదీయుల పరిపాలన కారణంగా పర్సో-అరబిక్ పదాలెన్నో తెలుగులో చేరాయి. ఉదా. పరుమానా (NI 2 కందుకూరు 48.15, 1650), ఖరారు (NI 2 కందుకూరు 80.28, 1842) మొదలైనవి. ఇవి కాకుండా సోదర ద్రావిడ భాషలైన తమిళ, కన్నడ భాషలనుంచి వచ్చిన అనేక ఆదారాలు తెలుగులో కనిపిస్తాయి.

6.20. సంశ్లిష్ట ప్రాతిపదికలు : సంశ్లిష్ట ప్రాతిపదికలు కృత్తులనీ, తద్ధి తాలనీ రెండు రకాలు. (1) కృత్తులు. మూలధాతువుపైచేరే ప్రత్యయాలు కృత్తులు, (2) -పు/-ంవు : కాంవు (SII 10.753,36,1600), పంప్పు (SII 10.755.3.1604, (b) -త: అగడ్త (SII 7.84.57,1632), (c) -(౦) ట: తోంట(SII 10.755.11,1604). చారిత్రకంగా -(౦) ట - త్త నుంచే వచ్చింది. దాని పరిణామ క్రమం ఇది తోంట్ + త్త్‌ > తోణ్ ట్ట > తోంట. (d) -అటం : తవ్వటం శాసన భాషా పరిణామం 187

(SII 7.845. 7,1632). (c) -అ: కాయ (SII 7.557.9,1645). (g) -వ: కాలువ (NI 3 రాపూరు 34.15,1630. (h) -ము ( < * -మ్సు) : నోము (SII 10.737.104, 1526), (i) -బడి : యేలుబడి (SII 10.758.10,1658). (j) -అలి : కావలి (NI 3 ఒంగోలు 102,13,1762). (k) ధాతువు ఉపధాడకారం టకారమై పూర్వచ్చు దీర్ఘ౦ అవుతుంది ; పాటు (NI 2 కందుకూరు 20.29,1640), (2) తద్ధితాలు : నామాలపైన నామ నిష్పత్తికోసం చేరే ప్రత్యయాలు తద్దితాలు. (అ) - కాండ్రు : గుత్త-గాండ్రు (NI 2 నెల్లూరు 1.31-39,1638). (b) -వారు : అంచుల-వారు (SII 10.753.47,1600). (c) -(ఇ)మి: పేర్మి (SII 10,780.5,18 వశ.). (d) -పాటు : కయిలు-పాటు (NI 3 ఒంగోలు 102.16, 1762). వీటితోపాటు పర్సో-అరబిక్ మూలకమైన-దారు అనేది కూడా తద్ధిత ప్రత్యయంగా ఈ కాలంలో కనిపిస్తుంది. ఉదా : తరపు-దారు (SII 10.777.9,1740). ఈ కాలపు శాసనాలలో కనిపించేవి మాత్రమే పైన ఇవ్వటం జరిగింది.

6.21. సమాసాలు : రెండు గానీ అంతకంటే ఎక్కువగానీ ప్రాతిపదికలు ఒకే ప్రాతిపదికగా ఏర్పడితే సమాసం అవుతుంది. సమాసాలను ఉత్పత్తిని బట్టి, అవయవపదాలకు పరస్పరం ఉండే సంబంధాన్ని బట్టి రెండు రకాలుగా విభజన చేయవచ్చు. ఉత్పత్తిని బట్టి సమాసాలను (1) దేశి-కేవల దేశ్య ప్రాతిపదికలతో ఏర్పడేవి. (2) తత్సమం-సంస్కృతం నుంచి యథాతథంగా గ్రహించినవి, (3) మిశ్రం-తత్సమ, దేశ్యాల సమ్మేళనంవల్ల ఏర్పడేవి - అని మూడు రకాలుగా విభజించవచ్చు. వీటి విషయంలో గత యుగాలకు, ఈ యుగానికి పెద్ద భేదం ఏమీలేదు. వరుసగా పై మూడింటికి ఉదాహరణలు. (1) వెల్ల-నూలు (SII 10, 753.55,1600). (2) నిత్య-నైవేద్యాలు (SII 5.1260.8,1604), (3) పడమటి-బాగానను (SII 7.790,15.1714).

6.22. సమాసంలో అవయవ పదాలకుండే పరస్పర సంబంధాన్ని బట్టి సమాసాలను ప్రధానంగా మూడు విభాగాలు చేయవచ్చు. (1) అంతః కేంద్రకాలు (Endocentric): కర్మధారయ, ద్విగు, తత్పురుష సమాసాలు ఈ విభాగంలో చేరుతాయి. ఉదా. వెల్లనూలు (SII 10.753.55,1600), మూడు తావులు, (SII 10.769.10,1691). దేవుని ప్రతిష్ట (SII 7.558.18, 1856). (2) బహిః కే౦ద్రకాలు (Exocentric) ; బహువ్రీహి సమాసం. ఉదా. విప్పర్ల 188 తెలుగు భాషా చరిత్ర

గోత్రులు (SII 5.1260.9.10,1604). (3) ద్వంద్వ సమాసం (Co-ordinative) ఉదా. మెరక పల్లాలు (SII 10.755.12,1604).

6.23. సమాసాలేర్పడేటప్పుడు మొదటి పదంలో వచ్చే మార్పుల విషయంలో కింది విశేషాలను ఈ యుగంలో గమనించవచ్చు. -ము వర్జకం స్థానంలో -పు రావటం ఇంతకుముందు చూశాం (§ 4.57 (గ) ), -పు ఆదేశం రాకుండానే సమాసం ఏర్పడటం ఈ యుగంలో చూడవచ్చు. ఉదా. గుఱ్ఱము బండ్లు (SII 10.753.56,1600). -ము, -పు అనే అమహద్వాచకాలైన రెండు సపదాంశాలలో -పు తొలగిపోయి -ము మాత్రమే మిగిలిందనటాన్ని ఇది సూచిస్తుంది. అయితే అధునిక భాషలో గుర్రంబండి, గురబ్బండి ( < గుర్రపు-బండి) అని రెండు రకాల రూపాల ప్రతి రూపాలు కనిపిస్తున్నాయి. రెండవ పద్ధతిలో సమీకరణం పొందిన రూపాలు ఈ యుగంలో కూడా కనిపిస్తున్నాయి. ఉదా. అను ప్పలె (<అనుపు-పల్లె < అనుము-పల్లె) (SII 10.757.11-12,1650).

6.24. లింగబోధక ప్రత్యయాలు : దేశ్య పదాలకు చాలావరకు లింగబోధక ప్రత్యయాలు లేవు. నామ వాచకాలకు -అన ( ), -ఆయ ( ), -అప్ప చేర్చటంవల్ల పురుష వాచకాలు, -అమ్మ,( ), -అవ ( ) మొదలైనవి చేర్చటంవల్ల స్త్రీ వాచకాలు గుర్తింపబడేవి. వీటికి వరుసగా ఉదాహరణలు. చింన్నన్న (SII 10,777.17, 17 వశ.), కోనయ (SII 6.227.14.15,1636), నారాయణప్ప (SII 10.750.19,1658). -అమ( ), -అవ ( ) చేర్చి స్త్రీ వాచకాలను గుర్తించే ఉదాహరణలు ఈ యుగంలో లెవుగాని గత యుగంలో ఉన్నాయి. ఉదా. లచ్చమ (SII 10 749. 88,1683), సోమవ్వ (SII 10.748.45.1583). _డు ( <ణ్ఞు < *-న్టు). పురుష బోధక ప్రత్యయంగా ఎక్కువగా అకారాంత తత్సమాలపైన కనిపిస్తుంది. పర్సో- అరబిక్ ఆదానాలలో పురుష నామాలమైన కూడా కనిపిస్తుంది. ఉదా. ఆలమఖానుండు (SII 10.751.18,1592). స్త్రీ బోధక ప్రత్యయాల విషయంలో ఈ యుగానికి గత యుగానికి పెద్దగా భేదం ఏమీ లేదు. ౦బు, -మ్ము, -ము లతో ప్రాచీన అహమద్వాచక రూపాలు కనిపిస్తున్నా -౦ మాత్రమే అమహద్వాచకంగా ఈ కాలంలో స్థిరపడిందని చెప్పవచ్చు. ఉదా. శాసనం (SII 10,777.15,1740). -వు కూడా అమహదేకవచన ప్రత్యయంగా ఉకారాంత, ఓకారాంత తత్సమాలపైన కనిపిస్తుంది. ఉదా. పస్వు (NI 2 కందుకూరు 48,31,1650). శాసన భాషా పరిణామం 189

6.25. వచనం : ఏకవచన సూచక ప్రత్యయాలు ప్రత్యేకంగా ఏమీలేవు. లింగబోధక ప్రత్యయాలతో కూడిన పదాలన్నీ ఏకవచనాలే. బహువచనంలో మాత్రం కింది విశేషాలను గమనించవచ్చు. మానవ వాచక బహువచన ప్రత్యయంగా -రు చాలా కొద్దిగా మాత్రమే ఈ కాలంలో కనిపిస్తుంది. -లు(*-ళ్) మానవ, మానవేతర సాధారణ బహువచన ప్రత్యయంగా స్థిరపడటాన్ని ఇంతవరకే గమనించాం (§ 4.39.). కందులు (SII 10.753.52,1600) మొదలైనవి నిత్యబహువచనాంతాలు. నామవాచకాలపైన - లు చేరేటప్పుడు కింది మార్పులు వస్తాయి.

(1) దీర్ఘా౦తాలై న అన్యదేశ్యాలకు, ఎకారాంతాలకు, అకారాంతాలకు, ట, డ, ర, ల పూర్వకంకాని ఉకారాంతాలకు బహువచన ప్రత్యయం చేరేటప్పుడు ఎలాంటి మార్పులు రావు. ఉదా. జాగాలు (SII 10.759.35-36, 1665), వొడ్డెలు (NI 2 కందుకూరు. 48, 34,1650). దొరలు (SII 10.753.39,1600), రోజులు (SII 10.772.3,1696).

(2) -లుకు ముందు పురుష బోధక ప్రత్యయం -డు లోపిస్తుంది. ఉదా. బ్రాహ్మణులు (SII 10. 753.39,1600).

(3) -లుకు ముందు ప్రాతిపదిక చివరి -వు, -ను, -యి, -రు లు లోపిస్తాయి. -వు లోపానికి మాత్రమే ఈ కాలపు శాసనాల్లో ఉదాహరణ దొరికింది. ఉదా. పూల - (ఏ. వ. పూవు (KI 53. 11, 1812).

(4) -లు కు ముందు -ము వర్ణకం లోపించి పూర్వ అకారం దీర్ఘ౦ అవుతుంది. ఉదా. కుంచాలు (ఏ. వ. కుంచము) (NI 2 కందుకూరు 44.28.1650),

(5) ప్రాతిపదిక చివరి - ఇకారం బహువచన ప్రత్యయం -లు కు ముందు ఉ గా మారుతుంది. ఉదా. పందులు (ఏ. వ. పంది) (NI 2 నెల్లురు 33.69,1645).

(6) ట,డ,ర,ల లు ము౦డుగల పదాంతంలోని ఇ,ఉ లు -లు కు ముందు లోపిస్తాయి. ఉదా. కోమట్లు (SII 10.753. 44, 1600). 190 తెలుగు భాషా చరిత్ర

కొన్నాండ్లు (SII 10.755.7,1604) మొదలైనవి. చారిత్రకంగా కొన్నాండ్లు వంటి రూపాలు దీర్ఘంపైన పూర్ణబిందువు లోపించకముందు ఏర్పడ్డ రూపాలు అయిఉండాలి.

(7) -లుకు ముందు ద్విరుక్త హల్లులు అద్విరుక్తాలవుతాయి. ఉదా. గట్లు (ఏ. వ. గట్టు) (SII 10.753.30,1600), రెడ్లు (ఏ. వ రెడ్డి) (NI 1 కందుకూరు 12.48,1648).

(8) రెండు హ్రస్వాచ్చులు గల పదాలకంటే భిన్నమైన పదాలలో చివరి అకారం -లు కు ముందు లోపిస్తుంది. ఉదా. కట్టడ్‌లు (>కట్టళ్ళు) (ఏ.వ. కట్టడ) (NI 2 కందుకూరు 48.69,1650).

(9) -లు కు ముందు డ, ర, ల లు ళ గా మారుతాయి. ఉదా. అంగళ్ళు (ఏ. వ. అంగడిి (NI 2 కందుకూరు. 48.69,1650), మళ్ళు (ఏ. వ. మడి) (SII 10.758.13,1658), నీళ్ళు (ఏ. వ. నీరు) (NI 1 CP 9,39.1687), వాకిళ్ళు (ఏ. వ. వాకిలి) (SII 7.564.6,1667), వడ్లు (ఏ. వ. వరి) (NI 2 కందుకూరు 44.21,1650) లో వడ్డు (< * వఱ్) ని బహువచన ప్రాతిపదికగా గ్రహించవచ్చు.

(10) -ళ్ళు అనేది బహువచనంలో కొన్ని పదాలకు చేరుతుంది. ఉదా. రాళ్ళు (ఏ. వ. రాయి (SII 7.790.15,1714).

(11) -చివరి అచ్చు లోపించింతర్వాత ర ళ గా మారని అధునిక రూపాలు గత యగంనుంచే కనిపిస్తున్నాయి. (§ 5.27). అవి ఈ యుగంలో ఎక్కువ వ్యాప్తిలో ఉన్నాయి. ఉదా. పేర్లు (ఏ.వ. పేరు) (NI క2 కందుకూరు 48.6,1650).

గౌరవార్థకాలుగా. -లు, -రు, వారు, అయ్యవారు -గారు, -గారలు మొదలైనవి ఈ యుగంలో కనిపిస్తున్నాయి. ఉదా. గురువు -లు (NI 2 నెల్లూరు 13.12,1613). దాసరి నాయని -వారు (SII 7,557.4.5, 1636), శ్రీరంగరాజయదేవ మహారాజులయ్యవారి (SII 7.564.4,1667). సాహెబుల -గారు (SII 10.760.8,1668) మొదలైనవి. శాసన భాషా పరిణామం 191

6.26. ఔపవిభక్తికాలు: నామ ప్రాతిపదికలను ప్రధానంగా రెండు విభాగాలుగా చేయవచ్చు. (1) ప్రథమా విభక్తిలో, ద్వితీయాది విభక్తులకు ముందు ఒకే విధమైన రూపం కలిగి ఉండేవి. (2) ప్రథమా విభక్తిలోను, ద్వితీయాది విభక్తులలోను భిన్న రూపాలు కలిగి ఉండేవి. ప్రభువు -తో (NI 2 కందుకూరు 41.25-26,1683), వేడ్క -తో (SII 5.1203.24,1773) మొదలైనవి మొదటి రకానికి చెందినవి. రెండవ రకానికి చెందిన నామ ప్రాతిపదికలు ద్వితీయాది విభక్తులకు ముందు కొన్ని మార్పులను పొందుతుంది. (a) పురుషవాచక ఏకవచన ప్రత్యయం -డు స్థానంలో -ని వస్తుంది. ఉదా. హనుమంతుని (SII 7.564.6-7,1667). చారిత్రకంగా -ఇ అనేదే దీంట్లో ఔపవిభక్తికం. మహదేకవచనం -డు మీద ఔపవిభక్తిక ప్రత్యయం -ఇ చేరిన ఆధునిక రూపాలు 12వ శతాబ్ది నుంచీ కనిపిస్తున్నాయి (§ 4.40(1)). ఉదా. వాడి (NI 2 కావలి 46.16,1638). (b) -డి + ని → ణ్ణి: ఔపవిభక్తికం -డి పైన ఇ లోపించి డ,న లు పరస్పరం సమీకరణం చెందటం అంటే డ అనునాసికం, న మూర్ధన్యం కావటం 16 వ శతాబ్ది నుంచి కనిపిస్తుంది. ఉదా. అంబారుభానుణ్ణి (SII 7.845.3,1632). (c) ఔప విభక్తికం -న కు ముందు -ము లోపించి పూర్వాచ్చు దీర్ఘం అవుతుంది. ఇలాటి రూపాలు 11వ శతాబ్దినుంచే కనిపిస్తున్నాయి. (§ 3.33 (3) (1)). ఉదా. నీరాటా -న -కు (SII 5.874.11,1620). -న కు బదులుగా -ని 13వ శతాబ్ధినుంచి కనిపిస్తుంది. (§ 4.43) ఉదా. మొట్టడా -ని -కి (SII 10,753.53,1600), (d) -ము లోపించి -న్ని చేరుతుంది. అంతకుముందు హ్రస్వం దీర్ఘ అవుతుంది. ఉదా. పాపాన్ని (NI 2 కందుకూరు 48.19, 1650). ఇలాంటి రూపాలు కూడా 12వ శతాబినుంచీ కనిపిస్తున్నాయి (§ 4.41). (c) ల, ర, న పూర్వకాలైన ఉకారాంత పదాలకు -ఇ చేరటం 12 వ శతాబ్ది నుంచీ కనిపిస్తున్నా (§ 4.40 (3)) ఈ యగంలో అవి ప్రచురం. ఉదా మొదలి (మొదలు) (SII 10 753.35,1600), కందుకూరి లో (NI 2 కందుకూరు 44. 19,1650). (f) -య్‌ (ఇ), -ల్డ్‌ (ఉ) -ల్‌ (ఇ/ఉ) -ర్‌ (అ/ఉ) (<ఱ్), -డ్‌ (ఇ/ఉ) చివరగల ప్రాతిపదికలు కొన్నిటికి -తి (య*క్త్‌ (ఇ) ) ఔపవిభక్తిక ప్రత్యయంగా చేరుతుంది. -తి కి ముందు ప్రాతిపదికలో కొన్ని మార్పులు వస్తాయి. (1) -తి -యి స్థానంలో చేరుతుంది. ఉదా. రాతి- (SII 7.845.6,1632), (ii) -డ్‌ (ఇ/ఉ), -ర్ (*-ఱ్) (అ/ఇ), -ల్‌ (ఇ/ఉ) చివరగల ప్రాతిపదికలలో ప్రాకైలుగులోనే -తి -టి గా 192 తెలుగు భాషా చరిత్ర

మార్పు చెంది ఉండాలి. ఉదా. ఏంటి -కి (<ఏంట్టి <*ఏంట్‌ -త్తి) (ప్ర వి.ఏ౦డు) (SII 10 758.85, 1600), వాకిట -ను (<వాకిట్టి <*వాకిల్‌ -త్తి) (ప్ర. వి. వాకిలి) (SII 7. 564.7.1667). నీటి (ప్ర. వి. నీరు) NI 3 రాపూరు 74.11,1638 సాదృశ్యంవల్ల ఏర్పడ్డదై ఉండాలి. ఇల్లుకు ఇంటి ఔప విభక్తిక రూపంగా కనిపిస్తుంది. ఇక్కడ ఉండే ఔప విభకక్తిక ప్రత్యయం కూడా -తి కి సంబంధించిందే అయి ఉండాలి. పుట్టింటి -కి (<-ఇంటి <ఇన్‌ణ్ణి <*ఇల్‌-న్‌ - త్తి) (ప్ర. వి. పుట్టిల్లు) (NI 3 రాపూరు. 7.8,1638). 15, 16 శతాబ్దుల నుంచే కనిపిస్తున్న పడమట -ను (SII 5.103,13,1408), తిరువీడు -లో (SII 8.536.15.1585) వంటి ఔప విభక్తిక ప్రత్యయం చేరని రూపాలు ఆధునిక రూపాలు. రెండవ రకం నామ ప్రాతిపదికలు (ఔప విభక్తికాలు) మొదటి రకం నామ ప్రాతిపదికలతో కలిసి పోతున్నాయనటానికి ఇది నిదర్శనం. 11వ శతాబ్ది నుంచీ సంఖ్యా వాచకాలమైన -ఇ (౦) టి చేరటం చూశాం (§ 8.88; రాధాకృష్ణ § 4.58). సంఖ్యా వాచకాలసైనే కాకుండా ఇతర ప్రాతిపదికలకు కూడా ఇది చేరటం 15 వ శతాబ్ది నుంచి చూడవచ్చు (§ 5.28). ఉదా. పేరిటి (ప్ర. వి. పేరు) (SII 5 874.11,1620). (g) బహువచన ప్రత్యయం -లు పైన -అ ఔప విభక్తికంగా చేరుతుంది. ఉదా. బ్రాహ్మల -కు (SII 5. 1260. 18,1604). (h) మానవ వాచక బహువచనం -రు పైన -ఇ చేరుతుంది. ఉదా. వారి -కి (SII 5.874.17,1620).

6.27. విభక్తులు : (1) ప్రథమావిభక్తి: ప్రథమావిభక్తికి ప్రత్యేకమైన ప్రత్యయాలు లేవు. సాధారణ౦గా కర్త ప్రథమావిభక్తిలో ఉంటుంది.

(2) ద్వాతీయావిభక్తి : -ను/-ని ద్వితీయావిభక్తి ప్రత్యయం. -ని ఇకారా౦తాలపైన -ను ఇతర్శత చేరుతాయి. ద్వితీయావిభక్తి కర్మార్థాన్ని వ్యక్తం చేస్తుంది. ఉదా. పాపాన్ని చెందుదురు (NI 2 కందుకూరు 48.79, 1650-51). అప్రాణి వాచకాలకు ఈ ప్రత్యయం నిత్యం కాదు. ఉదా. కవులు శిలాశాసనం వ్రాసిరి (SII 10.769.22-27,1681).

(3) తృతీయావిభక్తి : -చేత. -చే, -తో, -వల్ల తృతీయావిభక్తిలో 15, 16 శతాబ్దులలో కనివిస్తున్నాయి. (రంగనాథాచార్యులు § 5.03). ప్రస్తుతం -వల్లకు మాత్రమే శాసనాల్లో ఉదాహరణలు దొరుకుతున్నాయి. ఉదా. యీ శాసన భాషా పరిణామం 193

కాసులవల్ల అయిన పదార్థం (SII 10.758.61,1600). ప్రాచీన ప్రయోగంగా -న కనిపిస్తుంది. ఉదా. కుతుబు పాదుషహూ వొడయలుంగారి పంపున ..యర జర్లను సాదించి (SII 10.755.3,1604 ). -తో సహార్థంలో కనిపిస్తుంది. ఉదా. వీండ్లతో పాటు (NI 2 కందుకూరు 48. 32,1650), వగైరాలతో కూడా (NI 2 కందుకూరు 48.65,1650). -తో కు పాటు కూడా చేరటం 17 వ శతాబ్ది నుంచే శాసన భాషలో కనిపిస్తుంది

(4) చతుర్దీ విభక్తి: -కు/కి, -కై, -కొఱ-కు, - కొఱకై చతుర్థీ విభక్తిలో కనిపిస్తాయి. ఇవి సంప్రదానార్థాన్ని సూచిస్తాయి. ఉదా. -అచ్చ౯ కులకు. ..ఇచ్చిన ధర్మశాసనం... (SII 5.166.4,1624). -కు/-కి అనేకార్థాలలో కనిపిస్తుంది. వచ్యర్థంలో: ...హుజూరుకు. ..మాల్ము చేసిరి (SII 10.759.52.1663). గమ్యార్థంలో : పేటకు తెచ్చే యందుకున్ను (SII 10,753.51,1600). కాలార్థంలో : యెల్దప్పట్కిన్ని (SII 10.771.11,1692). దిగర్థంలో ; చేనికి దక్షిణానను (NI 2 కందుకూరు 20.21,1640). సంబందార్థంలో : అరబ్బులకు మాతృ స్థానంపైన (SII 7.558. 9.1856).

(5) వంచమీ విభక్తి : -చేత(ను),-వల్ల(ను), -నుండి, -నుంచి, -పట్టి పంచమీ విభక్తిలో కనిపిస్తున్నాయి. -చేత(ను), -వల్ల(ను) గ్రహ్యార్థంలో రావటం గత శతాబ్దాలలోనే చూచాం (§ 4.44;5.32). -వల్ల, -లోన ల పైన నుండి చేరటం 15వ శతాబ్ది నుంచే చూడవచ్చు (§ 5.30). -మీద, -పైన -నుండి చేరటం కూడా ఈ యుగంలో కనిపిస్తుంది. ఉదా. మోకు మీద నుండి (NI 2 కందుకూరు 41.2,1683). -నుంచి, -పట్టి మొదటి సారిగా 17 వ శతాబ్ది నుంచి శాసన భాషలో కనిపిస్తాయి. ఈ రెండూ వరుసగా స్థల వాచకాలకు, కాల వాచకాలకు చేరుతున్నాయి. ఉదా. జుచ్చూర నుంచ్చి...(SII 6.227.6-7,1636), నలుభయి యేండ్ల బట్టి.... (SII 10.755.8-9, 1604).

(6) షష్టి విభక్తిలో, (7) సప్తమీ విభక్తిలో గత యగానికి, ఈ యగా నికీ చెప్పుకోదగ్గ భేదాలేంలేవు (§ 4.46). ఇంతకు ముందునుంచి కనిపిస్తున్న -కింద, -మీద, -వద్ధ(ను), -దనకా(ను) మొదలైన వాటితోపాటు -ముందట, -కిందట, -వరకు మొదలైనవి భిన్న విభ క్త్యర్థాలను సూచించేవిగా ఈ యుగంలో కనిపిస్తున్నాయి. ఉదా. ముఖమంటపం ముంద్ధట (SII 10.767.5, 1680). 194 తెలుగు భాషా చరిత్ర

సంవత్సరాల కిందట (SII 7.558.17,1856 ), శుక్రవారం వర్కు (SII 10.762.8,1669).

6.28. సర్వనామాలు : నిర్దేశాత్మక సర్వనామాలలో వాండు (NI 3 రాపూరు 3.35,1638), అతడు (SII 7.558 15,1856). ఆయన (SII 7.845.4, 1682), మహదేక వచనంలోను, వాండ్లు (NI 2 కందుకూరు 52.11,1635), వీరు (SII 10.767.47, 1680), వీండ్ల (NI 2 కందుకూరు 48.31,1650), మహాన్మహతీ బహువచనంలోను, ఇది (SII 7.845.7, 1362), యివి (SII 7.845.7,1682) వరుసగా అహమదేక వచన, బహు వచనాల్లో కనిపిస్తున్నాయి. వాండుతో పోల్చినప్పుడు అతడు, ఆయన ఆధునిక భాషలోలాగా గౌరవార్థకాలై ఉంటాయి. -వాండ్లు, వీండ్లు వంటి బహువచన రూపాలు ఎక్కువగా నెల్లూరు జిల్లాలోను, ప్రకాశం జిల్లాలో కొన్ని చోట్ల కనిపిస్తున్నాయి. వారు, వీరు వంటి ప్రాచీన బహువచన రూపాలు గౌరవార్థకాలుగా పరిణమించగా, పైవి బహువచన రూపాలుగా స్థిరపడి ఉంటాయి. ఆధునిక బహువచన రూపాలైన వాళ్ళు, వీళ్ళు లకు ఇవి!పూర్వ రూపాలు. ఆమె, ఈమె వంటి స్త్రీ వాచకాలు ఈ యుగంలో కనిపించక పోయినా 12వ శతాబ్ధి నుంచీ ఇవి శాసనభాషలో ఉన్నాయి (కందప్పచెట్టి (§ 2.129). అవికి ఔప విభక్తికమైన ఆధునిక రూపం 'వాటిని' కూడా 13వ శతాబ్దినుంచే కనిపిస్తుంది (కందప్పచెట్టి § 2.131). యెవ్వండు (NI 2 నెల్లూరు 11.14,1638), యెవరు (SII 10.763.13,1670) వరుసగా ఏక వచన, బహు వచనాలలో మహద్వాచక ప్రశ్నార్థక సర్వనామాలుగా ప్రస్తుత శాసనాలలో కనిపిస్తున్నాయి.

మధ్యమ, ఉత్తమ పురుష సర్వ నామాలలో అచ్చుతో మొదలయ్యే ఈవు, ఈరు, ఏను, ఏము వంటి రూపాలు ఈ యుగంలో కూడా కనిపించవు. మధ్యమ పురుష సర్వనామాలుగా నీవు (ఏ.వ.) (KI 53.10,1812), మీరు (బ.వ) (SII 10.789.12,1691); ఉత్తమ పురుష సర్వనామాలుగా నేను (ఏ.వ.) (SII 10.773.8,1697), మేము (బ.వ) (SII 5.874.8,1620) కనిపిస్తున్నాయి. ఉత్తమ పురుష బహువచనంలో నేము (SII 16.42.8,1503; SII 10.774.8,1697) అనే రూపం 16వ శతాబ్ధి మొదటినుంచీ శాసనాల్లో కనిపిస్తుంది. మూల ద్రావిడంలో ఉభయార్థక బహువచనంగా *ఞామ్‌ను పునర్నిర్మించటానికి గల శాసన భాషా పరిణామం 195

ప్రధానాధారాలలో ఇది ఒకటి (కృష్ణమూర్తి 1968). కాని “నేము" అనేది అస్మదర్ధకంగానే శాసనాల్లో కనిపిస్తుంది.

ఆత్మార్థక బహువచనంగా తాము (SII 7.5571.0,1637) 16వ శతాబ్దినుంచీ కనిపిస్తుంది (§ 5.41). అంతకు ముందు తారు అనేది మాత్రమే కనిపిస్తుంది (పై). తులనాత్మకంగా పరిశీలిస్తే *తామ్‌ అనేదే మొదటి రూపం. ప్రాక్తెలుగు కాలంలోనే మానవ వాచక బహువచన ప్రత్యయమైన -ర్‌ అనేది -మ్‌ అనే దాని స్థానంలో మధ్యమ పురుష సర్వనామంలో (*నీమ్‌>నీర్‌ >మీరు) లాగా వచ్చి ఉంటుంది (కృష్ణమూర్తి 1968).

6.29 సంఖ్యా వాచకాలు : ప్రధమా విభక్తిలో “ఒకటి" అనే రూపం ఒకండు' అనే రూపాన్ని తొలగించి గత యుగంలోనే పూర్తిగా స్థిరపడింది. (§ 5.33). 'ఒక'కు బదులు 'ఓ' విశేషణంగా 13 వ శతాబ్ది నుంచే కనిపిస్తుంది(కందప్పచెట్టి § 2.119). “ఏను” అనేది పూర్తిగా వ్యవవర భ్రష్టమై 'ఐదు' (NI 3 రాపూరు 49.14,1638) అనేది మాత్రమే కనిపిస్తుంది (§ 4 48(4)) ). ఏను విశేషణంగా మాత్రమే కనిపిస్తుంది. ఉదా. ఏందుము (SII 10. 769.16, 1691). సంధ్యక్షరం -హ -తో కూడిన పదహారు (SII 18.285.15, 1558) వంటి ఆధునిక సంఖ్యా వాచక రూపాలు 16 వ శతాట్టి నుంచీ కనిపిస్తున్నాయి. కూడిక సంఖ్యలలో పదిలో చివరి అచ్చు లోపించిన పద్మూడో (SII 16.330.17,1647), పద్నాలుగు (SII 16.172 ,58,1620) వంటి రూపాలు, సమీకరణం వల్ల ఏర్పడ్డ పన్నెండు (<పండ్రెండు) (KI 58.9,1812) వంటి రూపాలు ఈ యుగంలో మొదటి సారిగా కనిపిస్తున్నాయి. సమాసాలలో -పదిలో -ద -> -య -మార్చు పొందిన రూపాలు ఇంతకుముందే భాషలో స్థిర పడ్డాయి (§ 4.48(11) 6). ఈ యుగంలో అలాంటి రూపాలు పూర్తిగా వ్యాప్తిలోకి వచ్చాయి. ఉదా. ఇరువై (SII 5.874.15,1620). తక్కిన సంఖ్యా వాచకాల విషయంలో గత యగాలకు ఈ యుగానికి పెద్దగా భేదం ఏమీ లేదు.

పూరణార్థకంగా -ఓ (<అవ<అవు<అగు) అనేదే ఈ యుగంలో కని వస్తుంది. ఉదా; నాల్గో (SII 10.753.36,1600). -గురు అనేదీ మహద్వాచక సంఖ్యావాచక విశేషణ సూచకంగా - వురు ఫ్టానాన్ని 12వ శతాబ్ది నాటికే ఆక్రమించింది ( § 4.48 (15) ). -మంది అనేది 15 వ శతాబ్ది నుంచీ కనిపిస్తుంది. 196 తెలుగు భాషా చరిత్ర

ఉదా. నలుగురు (SII 10.758. 18,1658), పదునెనిమిది మంది (NI 3 ఒంగోలు 132.11,1443).

6.30. విశేషణాలు : విశేషణాల విషయంలో ఈ యుగంలో కొత్తగా చెప్పుకోదగ్గ విశేషాలేమి లేవు. -లాగు చేర్చిన ఆధునిక సంకీర్ణ విశేషణాలు యిచ్చే (లాగు NI 2 కందుకూరు 48.42.1450), యిలాగు (SII 10.751.14,1592), చూచేలాగు (NI 2 కందుకూరు 48.36,1650) వంటివి 15వ శతాబ్ది నుంచీ కనిపిస్తున్నాయి. బాగా (<బాగుగా) (NI 2 కందుకూరు 45.50,1650) 17వ శతాబ్దిలో మొదటి సారిగా కనిపిస్తుంది.

6.31. క్రియలు :- క్రియా ప్రాతిపదికలు (1) సామాన్య (2) సంకీర్ణ (3) సమస్త - ఆని మూడు రకాలు, (1) పడు (NI 2 కందుకూరు 41.24,1683), చెప్పు (SII 5.1208,84, 1772) వంటివి సామాన్యాలు. (2) సామాన్య క్రియా ప్రాతిపదికలకు క్రియా కారకాలు చేరి ఏర్పడేవి సంకీర్ణాలు. (1) దేశ్యాలు: ఒనర్‌-చ్‌ -(SII 6.227,16,1636), నడివ్‌-ఇంచ్‌ ( SII 5.166.11,1624). (2) ఆదానాలు: సృజించ్‌ (SII 5. 1208.26,1778). దేశ్యాలలో -చ్‌, -ఇంచ్‌ సకర్మక, ప్రేరణార్థకాలయి ఉంటాయి. (3) సమస్త క్రియా ప్రాతిపదికల్ని రెండు రకాలుగా విభజించవచ్చు. (i) ప్రధాన క్రియలోనే సమాసం ఏర్పడేవి. (ii) సామాన్య, సంకీర్ణ లేక సమస్త క్రియా ప్రాతిపదికకు సహాయక క్రియచేరి ఏర్పడేవి. (i) ప్రధాన క్రియా సమాసంలో రెండవ అవయవం ఎప్పుడూ క్రియ అయి ఉంటుంది. మొదటిది నామంగాని, క్రియగాని కావచ్చు. (a) క్రియ+(కియ: పడ-వేన్‌ (SII 6.79.14,1796), చని-పోవు (KI 61.8, 19వశ.). నడిపించక-పోవు (NI 3 రాపూరు 18.21,1622), తెలుపు-కొన్‌ (SII 10.777.10,174౦). కౌన్‌ అనుబంధం ప్రాచీన భాషలో క్త్వార్ధకాలమీద చేరేది (§ 3.40). కాని ఈ యుగంలో అధునిక యుగంలోలాగా క్రియా ప్రాతిపదికలమీద మాత్రమే చేరుతుంది. -కొన్‌ అనుబంధంగా చేరటంవల్ల అక్మార్థక క్రియ లేర్పడతాయి. -కొని సంకుచిత రూపంగా -క 15 వ శతాబ్ది నుంచి కనిపిస్తుంది (§ 5,52). ఉదా. అనభవించ్చుక (SII 10.769,22,1681). ఈ యుగంలో -కుని అని ఆధునిక రూపం మొదటిసారిగా కనిపిస్తుంది. ఉదా. అనుభవించు కుని (SII 10. 771.16,1682). (b) నామం+క్రియ: కావ్‌-అడు (NI 2 కందుకూరు 48.66, 1650). (2) -ఉండు, -కల, -వలయు, -ఇచ్బ్‌ మొదలైన సహాయక శాసన భాషా పరిణామం 197

క్రియలు చేరగా ఏర్పడేవి రెండవరకం సమస్త క్రియలు. ఉదా. చేస్తు-వుండగా (SII 10.772 4,1698). కా-వలెను (NI 3 రాపూరు 18.42-18, 1662).

6.32. సకర్మక క్రియలు: చూచ్‌ (SII 6.79.13, 1796), తీన్‌ (NI 2 కందుకూరు 48.30,1650) మొదలైనవి. (1) సిద్ధ సకర్మకాలు, (2) అకర్మకాలకు -చు, -ఇంచు, -వులు చేరి ఏర్పడేవి సాధ్య సకర్మకాలు. ఉదా. ఉంచు (అ.క్రి.ఉండు) (SII 7.845.4 1632), ఈడేర్చు (అ. క్రి. ఈడేరు) (NI 2 కావలి 44.8, 1715), జరుపు (అ.క్రి. జరుగు) (SII 6.663.13, 1482), పండించ్‌ (అ. క్రి. పండు) (NI 2 కందుకూరు 48.18,1650),

6.33. ప్రేరణార్థకాలు : సకర్మకాలకు -ఇంచ్‌ చేరటంవల్ల ప్రేరణార్థకాలేర్పడతాయి. ప్రేరణ -ఇంచ్‌కు ముందు క్రియా ప్రాతిపదికలతో కింది మార్పులు వస్తాయి. (i) (చ్)చ్ (వ్‌)వ్‌ గా మారుతుంది. ఉదా. కొలుచ్‌ :- కొలిపించ్‌ (SII 10.758.17,1658), (ii) -న్‌ -య్‌ గా మారుతుంది. ఉదా. వ్రాన్‌ : వ్రాయుంచ్‌ (SII 7.790.8, 1714), (iii) త్ర్యక్షర క్రియా ప్రాతిపదికలలోని రెండవ అక్షరంలోని ఉ ఇ గా మారుతుంది. నడుపు : నడిపించ్‌ (SII 10.759.81,1663).

6.34. క్రియా ప్రాతిపదికలలో మార్పులు: కాలవాచి ప్రత్యయాలకు ముందు క్రియా ప్రాతిపదికలలో కింది మార్పులు కనిపిస్తున్నాయి. (1) అకారాది ప్రత్యయాలకు ముందు ప్రాతిపదిక చివరి -స -యగా మారుతుంది. ఉదా. చేయ.-వలదు <(చేన్‌-అ-వలదు ) (SII 5.1203.86,1778). ఇంతకు ముందు ఈ సూత్రం భిన్నంగా ఉండేది. తాలవ్యాచ్చులకు ముందు -య -స కావటమే ఆ సూత్రం (§ 8.48 (1); 4 51 (గ)). ఉదా. చేయ ;- చేసి చేసెను మొదలైనవి. తరువాత సకారాంత సపదాంశాలు ఇతర పరిసరాల్లోకి కూడా వ్యాపించాయి. ఉదా. త కు ముందు : చేస్తూ (ప్రా. చేయ -చ)ు, ఆత్మార్థక సహాయక క్రియ -కొ ను ముందు : చేసు-కొను (ప్రా. చేసికొని), చేసు-కోండు (ప్రా. చేయు-వాండు) మొదలైనవి. ఇవి యకారాంత ధాతువులు సకారాంతాలుగా పునర్నిర్మితాలయ్యా యనటానికి నిదర్శనం. చేసు-వాండు వంటి రూపాలు 12వ శతాబ్ది నాటికే కనిపిస్తున్నాయి. (కందప్పచెట్టి § 3.10, § 5.46). ఈ పునర్నిర్మాణం ఆప్పటికే ప్రారంభమై ఉంటుందని చెప్పవలసి ఉంటుంది. (2) -చ్‌, -చ్చ్‌, -౦చ్‌ లు తకారంతో మొదలయ్యే ప్రత్యయాలకు ముందు స గా మారుతాయి. 198 తెలుగు భాషా చరిత్ర

ఉదా. నడుస్తూ (<నడుచ్‌-తూ) (NI 3 ఒంగోలు 102.15,1762). (3) అ-తో మొదలయ్యే ప్రత్యయాలకు ముందూ, విద్యర్థక ప్రత్యయం ఉ- ( ∞ ɸ ) కు ముందు -ఇంచ్‌లోని -చ్‌ -వ్ కావటం ప్రాచీన భాషారూపాలలో కనిపిస్తున్నా, ఆధునిక భాషలోలాగా ఈ మార్చలేని రూపాలే ఎక్కువగా ఈ కాలంలో కనిపి స్తున్నాయి. అంటే -ఇంచ్‌, -ఇంప్‌ అనే సపదాంశాలలో ఇంచ్‌ అనే సపదాంశమే అన్ని పరిసరాల్లోకి వ్యాపించటం 13 వ శతాబ్ది నుంచీ ప్రారంభమై (కందప్పచెట్టి § 3.12; § 5.43.) ఈ యుగంలో పూర్తిగా స్థిరపడింది. ఉదా. చేయించ్‌-అక (SII 10.765.89, 1678), కట్టించు-ము. (KI 48.6,1613). (4) త్యక్షర ధాతువుల్లోని రెండవ అక్షరంలోని ఉ తాలవ్యాచ్చుకు ముందు ఇ గాను, ఆ కు ముందు అ గాను మారుతుంది. ఉదా. చదువు : చదివి (SII 5. 1208. 34,1772), కొలుచు: కౌలవగాను (SII 10.748.7,1577). (5) కాలవాచి ప్రత్యయంలోని తకారం ప్రాతిపదికాంత న కారంపైన ట గా మారుతుంది. 18వ శతాబ్ది నాటికే ఇలాంటి రూపాలున్న ఆధారాలున్నా ( కేతన: 26 ) శాసనాల్లో ఇలాంటి రూపాలు మొదటి సారిగా కనిపిస్తున్నాయి. ఉదా. వింటిమి (<-విన్‌ -తి-మి) (SII 6.80.15 18వ శ.), వుంటిమి (-ఉన్‌ (/ఉండు +తి+మి) (SII 10.772.19,1691).

6.35. సమావక క్రియలు : సమాపక క్రియలు రెండు రకాలు- (1) సామాన్య (Simple). (2) అనేక పదనిర్మాణం కలవి (Periphrastic). (1).సామాన్య సమాపక క్రియలు క్రియా ప్రాతిపదిక + కాలవాచి ప్రత్యయం + పురుష-వచన ప్రత్యయం నిర్మాణంలో ఉంటాయి. ప్రాచీన భాషలోని భూతకాల, తద్ధర్మార్థక, వ్యతి రేకార్ధక క్రియలు, ఆధునిక భాషలోని భవిష్యదర్థక క్రియలు సామాన్య సమాపక క్రియలు. ఉదా. చేసిరి (NI 2 కందుకూరు 41.80, 1693). పోదురు (SII 5.120.8,1640), చేస్తారు (NI 2 కందుకూరు 48.82,1650). (2) క్రియాజన్య విశేషణాలకు సార్వనామిక ప్రత్యయాన్ని గాని, వురుష ప్రత్యయాన్ని గాని చేర్చటంవల్ల అనేక పద నిర్మాణంకల సమాపక క్రియ లేర్పడతాయి. ప్రాచీన, ఆధునిక భాషలలోని వర్తమాన కాలక్రియలు, ప్రాచీన భాషలో భవిషత్క్రియలు, భూతకాల వ్యతిరేకార్థక క్రియలు ఈ కోవలోనికి వస్తాయి. ఉదా. చేస్తున్నారు (SII 10.759. 22,1683), సేయలేదు (SII 10.753 48,1600). శాసన భాషా పరిణామం 199

6.36. భూతకాలం : -ఎ-, -ఇ-, -ఇతి-, -తి- ప్రాచీన భాషలో భూతకాల ప్రత్యయాలు. ఉదా. సాగించెను (SII 10.780.7,17 వ శ,), చేసిరి (NI 2 కందుకూరు 41.80,1683). వెలసితివి (SII 10.780.24,17 వ శ.), చేస్తిమి (SII 5.166.5,1624), చేస్తిమి వంటివి ఈ నాటికీ కొన్ని మాండలికాలలో, ముఖ్యంగా తెలంగాణాలో వ్యవహారంలో ఉన్నాయి.

-ఇనా/-ఇన-/-ఇన్‌- ఈ యుగంలో భూతకాల ప్రత్యయాలు : ఉదా. వచ్చినావు (SII 6.79.14, 1796), నడచినవో (NI 3 రాపూరు 3.11,1638), అయింది (SII 5.1175.11,1419). ప్రాతిపదిక చివరి -న్‌ పైన ఇనా/ఇన్‌ లోని ఇ లోపిస్తుంది. వుంన్నాము (చూ. వెంకటరావు 1900.549. విజయరంగ చొక్కానాధుని శాసనం. 1708:82. ఈ రూపం వర్తమాన కాలార్థంలో కూడా కనిపిస్తుంది. చారిత్రకంగా పై రూపొలు వేయించిన వాడను, వచ్చినవాడు మొదలైన క్రియాజన్య విశేషశాలనుంచి వకారం లోపంవల్ల ఏర్పడ్డాయి. ఆధునిక రూపాలైన వచ్చాడు, వచ్చిండు, వచ్చాము మొదలైనవి పై రూపాలనుంచి ఏర్పడ్డవే.

6.37. వర్తమాన కాలం : సమకాలీన భాషలో -తు- వర్తమాన కాల ప్రత్యయం. ఉదా. చేస్తున్నారు [SII 10.75 9.22,1668).-చున్‌- ప్రాచీన భాషకు సంబంధించిన వర్తమానకాల ప్రత్యయం.

6.38. భవిష్యత్కాలం : చేయగలవాడు మొదలైన క్రియాజన్య విశేషణాల నుంచి వకార లోపంవల్ల ఏర్పడ్డ చేయగలడు వంటి రూపాలు ప్రాచీన భాషలోలాగా భవిష్య దర్ధకాలుగా కాకుండా ఆధునిక భాషలో లాగా సామర్థ్యార్థద్యోతకాలుగా కనిపిస్తున్నాయి. -తా- ప్రత్యయంతో కూడిన తద్ధర్మ భవిష్యద్రూపాలు చేస్తారు (NI 3 కందుకూరు 48.82,1650) వంటివి భవిష్యదర్థంలో వాడుకలో ఉన్నాయి.

6.39. తద్ధర్మార్థకాలు : ప్రాచీన భాషలో -ø-, -దు-, -తు-, సమ కాలీన భాషలో -తా- తద్ధర్మార్థక ప్రత్యయాలు. ఈ క్రియలన్నీ శాసనాల్లో భవిమ్యత్తునే సూచిస్తున్నాయి. ఉదా. దెంగు -ø- ను (NI 2 నెల్లూరు 4.10, 1638), సేయు-దు-రు. (NI 3 పొదిలి 13 24,1642), చేస్తారు (NI 2 కందుకూరు 48.82,1650). 200 తెలుగు భాషా చరిత్ర

    6.40. విధ్యాద్యర్థకాలు : తద్ధర్మార్థక విశేషణాలకు అది చేరగా ప్రాచీన నిశ్చయార్థకా లేర్పడుతున్నాయి. ఉదా. వుండునది (NI 3 ఒంగోలు 102.23,1762). -ఏ -ది (<ఎడి-ది) చేరటంవల్ల ఏర్పడే ఆధునిక రూపాలు ఈ కాలంలో విరళంగా కనిపిస్తాయి. ఉదా. వుండేది (SII 10.769.22,1691). గుంటూరు, కృష్టా జిల్లాలలో -ఏ -కు బదులుగా -ఇ- కూడా కనిపిస్తుంది. ఉదా. అనుభవించిది ( SII 5.1221.12, 1809). వుండువారు (NI 2 కందుకూరు 41.44,1683) వంటి ప్రాచీన నిశ్చయార్థకాలు కూడా సమకాలీన శాసనాల్లో కనిపిస్తున్నాయి. అన్నంతాలకు వలయు, వలెను చేరటంవల్ల ఏర్పడే నిశ్చయార్థకాలు కూడా విరివిగా ఈ కాలపు శాననాల్లో కనిపిస్తాయి. ఉదా. కావలెను (NI 3 రాపూరు 18.12, 1622). విధ్యర్థకాలలో కట్టించ్చుము (KI 48.6, 1613) వంటి ఏకవచన రూపాలే ఈ కాలపు శాసనాల్లో దొరికాయి. బహువచనంలో -ఆండి సేయండి (NI 1 ఆత్మకూరు 30.31, 1462) వంటి రూపం 15వ శతాబ్దికి సంబంధించిన శాసనంలో కనిపిస్తుంది.
    6.41. ఆశీరర్థకం : -గాత చేరిన ప్రాచీన ఆశీరర్థకరూపం ఈ కాలంలో కనిపిస్తుంది. ఉదా. ఈడేర్చుకో -గాత (NI 3 రాపూరు 60.33.1612).
    6.42: వ్యతిరేకార్థకాలు : -ఆ- -ø-, వ్యతిరేకార్థక ప్రత్యయాలు. దీర్ఘంపైన -ø-, ఇతరత్ర -అ- చేరుతుంది. ఉదా. లే-ø- దు (SII 10.759.33,1663), కా -ø- వు (SII 10.768.13,1658).
    అన్నంతంపైన లేదు చేరటంవల్ల ఏర్పడే సేయ-లేదు (SII 10.753.48, 1600) వంటి భూతకాల వ్యతిరేకార్థక క్రియలు, మొదటిసారిగా ఈ యుగప్రారంభంలో కనిపిస్తాయి.
    సేయ-వలదు ( SII 5.1203.36,1773 ) వంటి వ్యతిరేక నిశ్చయార్థక రూపాలు ప్రాచీన రూపాలుగా ఈ కాలపు శాసనాల్లో కూడా కనిపిస్తున్నాయి.
6.43. అసమాపక క్రియలు : (1) క్త్వార్ధకం ఇ. చూచి (SII 6.79.13,1796). (2) శత్రర్థకం:- చు. (ప్రా.రూ) -తు ఉదా: యేలుచు (SII 10.706, 1678), చేస్తూ (KI 53. 11,1812). తా/త కూడా ఈ కాలంలో విరళంగా కనిపిస్తుంది. ఉదా: యిస్తా (SII 10.770. 15,1699). ఈ

శాసన భాషా పరిణామం

201

రూపాలు 15వ శతాబ్ది మొదటి నుంచీ కనిపిస్తున్నాయి. ఉదా: నడస్తా (SII 16 49.7.1612) (3) చేదర్థకం:- ఇనా (ను) ప్రాచీన ప్రత్యయం. -ఇతే/తే సమకాలీన ప్రత్యయాలు. ఉదా: తీసివేసినాను (NI 3 రాపూర్ 8.34,1633), చేస్తేను (SII 10.751 22,1592 ). (4) అప్యర్థకం:- ఇన్నీ అప్యర్థకంగా కనిపిస్తుంది. ఉదా: అయ్యిన్ని (SII 10.759 24.1663). (5) తుమర్థకం: -అ (ను) తుమర్థకం. ఉదా: సాయను (SII 10.759 24,1663) (6) అనంతర్యార్థకం: -కా (ను) అనంతర్యార్థకం. ఉదా: తెలుపుకోగా (SII 10.768.14, 1858). (7)వ్యతిరేకక్యార్థకం:- ఆక. ఉదా: సాగక (SII 10.755 9,1604) -కాకుండా చేరటంవల్ల ఏర్పడే ఆధునిక వ్యతిరేకక్యార్థకాలు 15వ శతాబ్ది నుంచీ కనిపిస్తున్నాయి. ఉదా: చెడకుండాను (NI 1 కందుకూరు 16.40.1430).

    6.44. క్రియాజన్య విశేషణాలు: 1) భూతకాల విశేషణం :- ఇన చేరి ఏర్పడుతుంది. ఉదా: నిలిచిన (SII 5.874. 17,1620). (2) వర్తమాన కాల విశేషణం:- చేయుచున్న (NI 2 కందుకూరు 77.14-15,1523) (8) తద్ధర్మార్థక విశేషణాలు: -ఎడి, -ఎడు. -ø- ప్రాచీన తద్ధర్మార్థక విశేషణ ప్రత్యయాలు, -ఏ (< -ఎరు/-ఎడి), వీటి ( వీట్టి (ఏ + అట్టి) ఆధునిక ప్రత్యయాలు. ఉదా: పట్టించు కానియెడు (SII 10.758.291600), సాగే (SII 10.771.11,

1682). చెల్లేటి (SII 4:802 20,1609). (4) వ్యతిరేకార్థక విశేషణం:- అని. కానరాని (5II 10:768.85,1663).

6.45- సముచ్చయాద్యర్థకాలు (1) సముచ్చయార్థకం:- న/-ని సముచ్చయార్థకంలోని సకారం ద్విరుక్తం కావటం కనిపిస్తుంది. ఉదా: చేనున్ను (SII 10.758.8.1819). సముచ్చయార్ధకానికి ముందు పదాంతంలోని అచ్చు దీర్ఘ కావడం కూడా ఇంతకు ముందు కాలం నుంచీ కనిపిస్తుంది. ఉదా: కోటాను (SI17.668.6577), ఆధునిక భాషలో లాగా వదంచివరి అచ్చు దీర్ఘంకావటం వల్ల సముచ్చయార్థం వ్యక్తం కావటం ఇంతకు ముందు శాసనాల్లోనే కనిపిస్తుంది. -ఉదా. కొదవా S11 8586.6,1685) ప్రాచీన ప్రయోగంగా- యు (5) కూడా సముద్చయార్థకంగా ఈ కాలంలో కనిపిస్తుంది. ఉదా: గురువులయుం (N 2 నెల్లూరు 46.471895), (2) ఏవార్థకం:- ప్రాచీన ప్రయోగాల్లోను, ఏ -సమకాలీన భాషలోను ఏవార్థకాలుగా కనిపిస్తున్నాయి. ఉదా. సముఖమంద్ద (N1 2 కందుకూరు 41.17.8,1888), వీండ్లే (NI 2 కందుకూరు 48,36,1650).

202

తెలుగు భాషా చరిత్ర

(3 ) ప్రశ్నార్థకం:. ఆ ప్రశ్నార్థకం; ఉదా. వచ్చినావా? (SII 6.79.14, 1796). (4) పోలిక: పోలిక చెప్పటానికి ఆధునిక భాషలోలాగా - లాగు(ను) ఉపయోగించటం కనిపిస్తుంది. ఉదా. యిచ్చేలాగునున్ను(NI 2 కందుకూరు 48.42, 1650).

6.46. వాక్య నిర్మాణం : వాక్యనిర్మాణ పద్ధతుల్లో గతయుగాలకూ, ఈయుగానికి ఆధునిక యుగానికి చెప్పుకోదగ్గ భేదా లేమీ లేవు. పైగా శాసనాలు పరిమిత ప్రయోజనం, పరిమిత ప్రయోగాలు కలిగినవి కాబట్టి సమకాలీన భాషలోని వాక్యనిర్మాణాన్ని సమగ్రంగా విశ్లేషించటానికి అవకాశం లేదు. అయినా లభించిన ఆధారలపైననే కొన్ని ప్రత్యేక విషయాలను పేర్కొనవచ్చు. క్రియాసమాపక వాక్యాలు, నామ సమాపక వాక్యాలు రెండూ ఈ కాలపు శాసన భాషలో కనిపిస్తున్నా క్రియాసమాపక వాక్యాల ప్రయోగమే ఎక్కువ, వాక్యంలో పదబంధాల విన్యాస క్రమంలోకూడా మార్పులు లేవు. ప్రాచీన శాసనాల్లో సంస్కృత ప్రభావంవల్ల, కావ్యభాషలో ప్రవేశించిన యత్తధర్ధక వాక్యప్రయోగాలు నాలుగు మాత్రమే కనిపిస్తుండగా (§ 3.73) ఈ కాలంలో సుమారుగా శాప (imprecatory) వాక్యాలన్నీ యత్తదర్ధక వాక్యాలుగా కనిపిస్తాయి. కర్మణ్యర్థక వాక్యాలు ఈ యుగంలో అసలు కనిపించవు. వ్యావహారిక భాషకు దగ్గరగా ఉండే శాసన భాషలో కర్మణ్యర్థక వాక్యాలు కనిపించక పోవటంవల్ల ఈ వాక్యనిర్మాణం తెలుగుకు సహజం కాదనీ సంస్కృత భాషా ప్రభావంవల్ల మాత్రమే కావ్యభాషలో ప్రవేశించిందని చెప్పవచ్చు. ప్రాచీన శాసనాల్లో మూడు సార్లు మాత్రమే ఈ ప్రయోగాలు కనిపిస్తాయి [§ 3.74).

శాసన భాషలోని వాక్యాలను ప్రధానంగా సామాన్య వాక్యాలనీ, సంశ్లిష్ట వాక్యాలనీ, సంయుక్త వాక్యాలనీ మూడుగా విభజించవచ్చు.
6.47. సామాన్య వాక్యాలు : సామాన్య వాక్యాలు నామ సమాపకాలనీ, క్రియాసమాపకాలనీ రెండు రకాలు.
  నామసమాపక వాక్యాలు : ఆఖ్యాతంలో నామం ఉంటే నామ సమాపక వాక్యం అవుతుంది. నామ సమాపక వాక్యాలుగా సామాన్య వాక్యాలు ఈ యుగంలో తక్కువగా కనిపిస్తున్నా, శానన భాషలో మొదటినుంచీ ఇలాంటి ప్రయోగాలు ఎక్కువగానే కనిపిస్తాయి. ఉదా. దామయ్య ముత్తతాత (SII 10.732.69.70,1500). వారు దోషులు (NI 2 కందుకూరు 85.20,1516). అఖ్యాత నామం
మధ్యమ, ఉత్తమపురుష ప్రత్యయాలనుకూడా స్వీకరిస్తుంది. ఉదా. నీవు దోషా

శాసన భాషా పరిణామం

203

కరుండవు (SII 6.79.13,1796). అఖ్యాతనామం సంబంధ బోధక నామంకూడా కావచ్చు. ఉదా. ... ఆ పొలము తాండికొండది,.. (SII 10.759.23, 1663). అగు ధాతువు వ్యతిరేకార్థక రూపాన్ని చేర్చటంవల్ల పైన చెప్పిన వాక్యాల్లాంటి సమీకరణీయ వాక్యాలు వ్యతిరేకార్థక వాక్యాలవుతాయి. ఉదా...(అది)...పరిమి పొలము కాదు (SII 10.759.21,1663).

క్రియాసమాపక వాక్యాలు : ఆఖ్యాతంలో సమాపక క్రియ ఉంటే క్రియా సమాపక వాక్యం అవుతుంది. ఇవి అకర్మక వాక్యాలని, సకర్మక వాక్యాలనీ ప్రధానంగా రెండు రకాలు. అకర్మక వాక్యాలలో కర్మ ఉండదు. సకర్మక వాక్యాలలో ఉంటుంది. ఉదా. వర్తకులు ... ఉండిరి (SII 10.770.9.1691), కవులు శిలాశాసనం వ్రాసిరి (SII 10.769,22-27,1697).

క్రియా సమాపక వాక్యాలలోనే విధ్యాద్యర్థక వాక్యాలుంటాయి. విధి: విధి వాక్యాలలో ధాతువుకు ఏకవచన౦లో-ము, బహువచనంలో-అండి చేరుతుంది. కర్త ఎప్పుడూ మధ్యమ పురుషలో ఉంటుంది. ఉదా. .. సంధ్యాదీపానకు ముట్టింపుము (NI 2 కావలి 20.4-6, 789-90). బహువచన రూపాలు ఇంతకు ముందు కాలంలోని శాసనాల్లో ఒకసారి మాత్రమే కనిపించింది. ఉదా. .. అది పాలించి పుణ్యం లానను సేయండి (NI ఆత్మకూరు 30.31, 462). ప్రశ్న: ప్రశ్న వాక్యం ఒకటి మాత్రమే ఈ కాలంలో కనిపిస్తుంది. ఉదా. .. చంద్రుడితో ..... వివాదకు వచ్చినావా? (SII 6.79.23-14 1796). ప్రశ్నార్థక పదాలైన ఎవడు, ఎవరు మొదలైన వాటితో ప్రత్యేకంగా ప్రశ్నార్థక సామాన్య వాక్యాలు శాసనాల్లో కనిపించక పోయినా యత్తదర్థక వాక్యాలను ఇలాంటి వాక్యాలు ఉన్నా యనటానికి నిదర్శనంగా గ్రహించవచ్చు. వ్యతిరేక: ఉండు/ఉన్‌ ధాతువు వ్యతిరేక రూపమైన లేదు చేర్చటంవల్ల వ్యతిరేక వాక్యా లేర్పడుతున్నాయి. ఉదా. యిక్కడ సుంకం...లేదు (SII 10.753.59,1600). భూతకాల వ్యతిరేక క్రియతో అంతమయ్యే వ్యతిరేక వాక్యం. బలిమి సేయలేదు (SII 10:753.48,1600). నిషేధం: నిషేధార్థక క్రియలతో అంతమయ్యే వాక్యాలు నిషేధ వాక్యాలు. ఉదా. నను నింద సేయవలదు (SII 5.1208,36.1773).

6.48. సంశ్లిష్టవాక్యాలు : అసమాపకక్రియతో అంతం అయ్యే ఒకటి గాని, కొన్నిగాని ఉపవాక్యాలతో కూడిన సామాన్య వాక్యాలు సంశ్లిష్టవాక్యాలు. యత్తదర్థకవాక్యాల్లో, అను కృతివాక్యాల్లో మాత్రం ఉపవాక్యంలో కూడా నమాపక

204

తెలుగు భాషా చరిత్ర

క్రియ ఉండవచ్చు. అసమాపక క్రియతో అంతం అయ్యే ఉపవాక్యాలన్నీ సామాన్య వాక్యాల పరివర్తిత రూపాలే.

క్త్వార్ధకం : ఉపవాక్యం చివర ఉండే క్త్వార్ధకక్రియ, ప్రధాన వాక్యంలోనీ క్రియా వ్యాపారానికి ముందు జరిగే వ్యాపారాన్ని సూచిస్తుంది. ప్రథాన వాక్యంలోను, ఉపవాక్యంలోను సాధారణంగా కర్త ఒకటేఅయి ఉంటుంది. ఉదా.సాహెబులగారు నుయి గట్టించి ప్రతిష్టజేసె (SII 10.760.8-10, 1668). క్త్వార్ధక క్రియలు హేత్యర్థకాలుగా కూడా కనిపిస్తాయి. ఉదా. ..... అన్నారెడ్డి మోకు మీద నుండి సభామధ్యమందు పడి మృతిబొంద్దె (NI 2 కందుకూరు 41.23-25 1683). క్త్వార్ధక్యక్రియ రీత్యర్థకంగా కూడా కనిపిస్తుంది. ఉదా. .... యి ధర్మమాచరించి ... దనరు (SII 18.772.22,1696). వ్యతిరేక క్త్వార్ధకం కూడా హేత్వర్థకం అవుతుంది. ఉదా. ... మరహంమతు చేయించక అచ్చెద్ద చేసినాడు (SII 10.765. 38-40, 1678).

శత్రర్థకం : ఉపవాక్యంలో శత్రర్థంలో ఉండే క్రియ ప్రధాన క్రియతో పాటు జరిగే వ్యాపారాన్ని సూచిస్తుంది. ఉదా. .... భక్షిస్తాను యమపురికి యెంగును (NI 2 కావలి 50.16, 1636).

చేదర్థకం : ప్రధాన వాక్యంలో క్రియ బోధించే వ్యాపారం ఉపవాక్యంలోని వ్యాపారంమీద ఆధారపడి ఉన్నప్పుడు ఇలాంటి వాక్య నిర్మాణం జరుగుతుంది. ఉదా: ఇందుకు తురుకలు తప్పితే పంది మాంసానకు ఆసించ్చిన పాపాన బోదురు (SII 10.769 22-24,1691)... -ఇతే/తే తో పాటుగా-ఆ కూడా చేదర్థాన్ని ఇస్తుంది. ఉదా. అది తప్పి నడిపించ్చిరా వాండ్ల మానం మాలమాదిగెలకు ఇచ్చిన వాండ్లే (NI 2 నెల్లూరు 115 8-10,1635).

అప్యర్థకం : ఈ వాక్యాలలో రెండు వ్యాపారాలకు వైరుధ్యం ఉంటుంది. ఉదా. ఆ పొలము తాండి కొండ్డది అయ్యిన్ని ... ఆపరిమివారు తాండి కొండపొలము గరకసా చేసేదియేమి? (SII 10.759.23-25,1663).

6.49. సంబంధబోధక వాక్యాలు : ... యిందుకు యవ్వరు ఆక్షేపణ సేతురో వారు శ్రీవైష్ణవ ధర్మంలో వారుగారు. (NI 8 పోదిలి 1.23-25,1642) వంటి సంస్కృత భాషా ప్రభావం వల్ల కావ్యభాషలో ప్రవేశించిన సంబంధ బోధక యత్తదార్థక వాక్యాలు ప్రధానంగా శాసనాల్లోని శాపయుక్త (imprecetory) వాక్యాల్లో మాత్రమే కనిపిస్తాయి. నామపదాలకు విశేషణాలుగా వర్తించే వాక్యా

శాసన భాషా పరిణామం

205

ల్లోని క్రియ నామపదానికి విశేషణంగా మారటంవల్ల ఏర్పడ క్రియాజన్య విశేషణాలతో తెలుగులో సంబంధ బోధక వాక్యాలేర్పడతాయి. ఉదా: యీ ప్రతిష్ట చేసినవారు గౌతమ గోతృలు (NI 3 ఒంగోలు 13.17-20.1778).

6.50. నామ్నీకరణాలు : ఒక వాక్యం కొన్ని మార్పులు చెందటంవల్ల మరొక వాక్యంలో కర్తృస్థానాన్ని వహంచటాన్నే నామ్నీకరణం అంటారు.

సంబంధార్థక నామ్నీకరణం : వాక్యంలోని సమాసక క్రియ నామపదానికి విశేషణంగా మారటమే స౦బంధార్థక నామ్నీకరణం. ఉదా. పాపయ చెక్కిన శాసనం (<- పాపయ శాసనం చెక్కిన్నాడు) (SII 5.1262 21,1873). సంబంధబోధక వాక్యాలలో కర్తృస్థానం వహించే క్రియాజన్య విశేషణాలు ఇలాంటివే (§ 6.49).

అటం:- అటం చేరటంవల్ల కొన్ని వాక్యాలు వ్యాపార బోధక నామాలుగా మారుతున్నాయి. ఉదా. ఈ శిలాశాసనం చెక్కించడం (NI 2 కందుకూరు 48.45,1650). అది: అది చేర్చడంవల్ల కూడా కొన్ని వాక్యాలు నామ్నీకృతాలవుతున్నాయి. ఉదా. .... ఆ పరిమివారు తాండి కొండ పొలము గరకసా చేసేది యేమిపని (SII 10.759.26-27, 1663).

6.51. అనుకృతి : ప్రత్యక్ష, పరోక్ష భేదాలతో అనుకృతి వాక్యాలు ఈ కాలపు శాసనాల్లో చాలా అరుదు .. నీవు ... కీర్తిచ౦ద్రుడితో ... వివాదకు వచ్చినావా? అని కోపంచేసి .. (SII 6.13-14,1796) అని ప్రశ్నవాక్యాన్ని చేర్చుకున్న అనుకృతి వాక్యం ఒకటి కనిపిస్తుంది. ఈ కింది వాక్యంలో “అని” విషయార్థ బోధకం. ఊళవారు అపరిమివారు లేని గరకసా చేస్తున్నారని మాల్ము చేసిరి (SII 10.759.19-22,1663).

6.58. సంయుక్త వాక్యాలు: సమప్రాధాన్యం గల రెండు గానీ, అంతకంటె ఎక్కువగానీ సామాన్య వాక్యాల కలయికవల్ల ఏర్పడే సంయుక్త వాక్యాలు ..... మల్లరుసున్ను ..... శ్రీపతిన్ని యీ శాసనం వ్రాసిరి (SII 8.495.5,1516) వంటివి ఇంతకు ముందు కాలంలోని శాసనాల్లో దొరుకుతున్నా ఈ కాలపు శాసనాల్లో వాటికి ఉదాహరణలు కనిపించడం లేదు. పై వాక్యంలో సముచ్చయార్థకం-న్ను|-న్ని రెండు వాక్యాలను సంయోజనం చేయటాన్ని, రెండు వాక్యాల్లోను సమాన వ్యాపారాన్ని సూచించే క్రియలలో ఒకటి లోపించటాన్ని చూడవచ్చు.