తెలుగుతల్లి/సంపుటము 1/నవంబరు 1937/వేంకటేశ్వర స్తవము


వేంక టేశ్వర స్తవము. కె.కృష్ణారావుగారు.

ఉ|| సారసమల్లికావకుళ - చంపకపుష్పలలతికామణీ
     హారకిరీటభూషణఛా - యాంచితతావక దివ్యమంగళా
     కారవిలోకనామృతసు - ఖంబునజొక్కెమనంబుదేనినిన్
     గోరదునీకృపారసము - గూర్చుముచాలునువేంకటేశ్వరా!||
తే.గీ|| నీరుహృత్కంజమునగ్రాలు - నెనరుతేనె
         గొఱతవడకుండ భక్తాళి - గ్రోలుకొఱకు
         నొంటినిల్తువు కొండపై - నువిదమాని
         శ్రితజనప్రేమమెంతన - శ్రీనివాస!
తే.గీ|| పల్లవారుణకోమల - పదకలన
         శిలనుజెలువజెయుటదేమి - చిత్రమనుచు
         శిలగజెన్నొందు సంఘ్రుల - దలచుమాత్రం
         కనెదముక్తికాంతను - శ్రీనివాస!
                          ------