తెనాలి రామకృష్ణకవి చరిత్రము/ఆస్థానమున బ్రవేశించుట

'అ సంశయమేమి?' అని దేవి ప్రశ్నింప, రామకృష్ణుడు తల్లీ! మాకు పడిశము బట్టినచో రెండుచేతులతోను బాధపడుచున్నను జాలుబలేదే సహస్రశీర్షములుగల నీకు పడిశము పట్టినచో నెట్లు బాధపడుదెవోయని నవ్వుపచ్చినది. అని బదులుచెప్పెను. అతని పరిహాసమునకు బ్రమాదంబంది 'దేవి 'రామకృష్ణకవీ! నీవు వికటకవివై ధనయశస్సముపార్జన మొనరింతువు' అని యంతర్ధానమయ్యెను.

కాళికాదేవి యొకగిన్నెలో క్షీరమును, మరియొకగిన్నెలో బెరుగును బోపి, 'దీనిలోనీకేది కావలయు?'నని ప్రశ్నింపగా నాతడు అమ్మా! ఆ పాత్రలను నీ చేతిలో యుంచుకొనియడిగినచో నేనేమిచెప్పుదును? అని వానినందుకొని 'ఇదియేమి?' అని ప్రశ్నింపగా, 'దేవి ఇది విద్య, ఇది ధనము, ఈరెండింటిలో నీకేమి కావలయునో తీసుకొను' మనెను. రామకృష్ణుడు 'అమ్మాఁ విద్యయుండి ధనములేని మనుజులకు మర్యాదయుండదు. దారిద్ర్యానలమున మ్రగ్గిపోవుచు నెవడును గ్రంథములరచించి విద్యావ్యాప్తికి తోడ్పడజాలడు. కావున విద్యాధనములు రెండును మానవున శవసరమే' యని పాలును పెరుగును కూడ త్రాగివైచెను.

అతని సాహసమున కచ్చెరువంది. దేవి 'రామకృష్ణా! నీకవిత్వము శాశ్వతమై ఆచంద్రతారార్కమై వెలయుగాక ' యని నీవించి మాయమయ్యెనని కొందరు చెప్పుదురు.


3 ఆస్థానమున బ్రవేశించుట

విద్యానగరమున కేలికయైన సాళువనరసరాయలు దేశసంచార మొనరించుచు తెనాలినొకసారి చూడబోయి యచ్చట పాఠశాలకరి గెను. ఆబాలురందఱిని గూర్చుండ నియమించి, నరసరాయలు 'బాలురారా ! మీలో తెలివిగల వారెవరో లేచి నిలువఁబడుఁడు' అనెను. అందఱును ఒకరిమొగము లొకరు చూచుకొనుచు నూరకుండిరి . రామకృష్ణుఁడు లేచి నిలువబడెను. నరసరాయ లిట్లు ప్రశ్నించెను --- 'అబ్బాయీ! అందఱును మారుమాటాడక కూర్చుండియుండగా నీవేల లేచి నిలువఁబడితివి?'

రామకృష్ణుడు ధైర్యముగా 'అయ్యా! ఎవరు తెలివిగలవారో లేచి నిలువబడుడు అనికదా ప్రశ్నించిరి. అందఱును దెలివిహీనుల వలె గూర్చుండిరి. ప్రతివారికిని గొంచెమోగొప్పగనో తెలివి యుండి తీరునుగాని యుండకపోదు. ఈబాలులందరును దమ తెలివి గుర్తింప నేరని మూఢులుగాన మాటాడక యూరకున్నారు. నేను తెలివిగల వాడనను ధైర్యము నాకు గలదు గాన నిలువబడితిని' అని పలికెను.

నరసరాయలు విస్మయపరిచేతస్కుఁడై , యాతడు వృద్దిలోనికి రాగలడని తలంచి ఓయీ! నీకేదైన జిన్నయుద్యోగ మిప్పింతును. నాతో వత్తువా?' యని ప్రశ్నింప నాత డంగీకరించి తలిదండ్రులతో కలిసి యాతని ననుసరించి చనెను. తెనాలికి సమీపముననున్న బట్టుపల్లె యనుగ్రామములోని బట్రాజుల సాంగత్యముచేసి రామకృష్ణుడు కవిత చెప్పుటయందు బ్రావీణ్యము సంపాదించెను. రామకృష్ణు డల్లసాని పెద్దనయను కవీంద్రుని దర్శించి, యాతడు సంతసించున ట్లీక్రింది పద్యము రచించి చదివెను-

క. నలుగురు నినుఁ బలుమారున్
   గెలుతురు సుగుణోక్తికి కాంతికీర్త్యాకృతులన్
   నలుగురు నినుఁ బలుమారున్
   భళిభళియన కచ్చరంగపాండురరంగా!

నాఁటగోలె పెద్దనకవీశ్వరుఁడు రామకృష్ణునివిషయమై రాయలతోఁ జెప్పి యాస్థానకవిగా బరిగణింప వలసినదాని కోరెనని చెప్పుదురు. కొందఱు నందితిమ్మనకవీంద్రు నుద్దేశించి రామకృష్ణుడు.

క. 'నీకవితామాధుర్యం
    బేకవులకు గలుగ నేర్చు నే కూపనట
    ద్బేకములకు నాకధునీ
    శీకరములచెమ్మ ! నందిసింగయతిమ్మా'

యని చదివెనట. అంత నా నందితిమ్మన్న కవీంద్రుడు పరమానందభరితాత్ముండై తనకు శ్రీకృష్ణ దేవరాయలు బహుమానముగ నొసంగిన శాలువ నిచ్చెను. ఆశాలువ ధరించి, రామకృష్ణు డాస్థానమునకుఁ బోయెను, రాయలు రామకృష్ణుడు ధరించియున్న శాలువా చూచి ‘కవిచంద్రమా! నీ కియ్యది యెట్లు లభించినది?” అని ప్రశ్ని౧పగా తన పద్యమునకు సంతోషించి, నందితిమ్మన్న యా పచ్చడము నొసంగెనని చెప్పి యాపద్యము జదివెను, రాయలు సంతసించి రామకృష్ణుని సన్మానించెనట,

4 ధూర్జటి కవి

ఆస్థానకవులందరిలో కృష్ణదేవరాయలకు ధూర్జటికవిపై నత్యధికమగు ప్రీతిఁగలిగియుండెను. కవితాగోష్ఠి సలుపునపుడు రాయలు తఱచుగా ధూర్జటి కవిత్వమును గూర్చియే ప్రశంసించు చుండెను. ధూర్జటి పైకి పరమశ్రోత్రియుడుగా గన్పట్టుచు రహస్యముగా వారాంగనాలోలుఁడై మెలగుచుండెను. అట్టి మహాకవి యవినీతివర్తను డై మెలగుచు భార్యమోము చూడకుండుటచే నెట్లయిన యాతని వేశ్యానురక్తి తొలగజేయవలయునని పెద్దనాదులందరు నిశ్చయించుకొని, రామకృష్ణకవితో 'ఇది నీవల్ల జరుగవలసిన పనిగాని మావలన


This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after sixty years counted from the beginning of the following calendar year (ie. as of 2024, prior to 1 January 1964) after the death of the author.