తెనాలి రామకృష్ణకవి చరిత్రము/అమవసనిశికిన్
రుద్రాక్షాక్షం పంక్తివిభ్రమము లీరూఢిన్నిరూపింప నీ
శూద్రప్రజ్ఞలు విప్రవిత్కవి వచస్ఫూర్తిన్విడంబించునే?
క. కెంగేల రామకృష్ణుని
బంగరు కడియంబు లుండఁ బండితుఁ డగునా
జంగులు జల్లులు గల్గిన
సింగారపు టూరకుక్క సింగంబగునా?
13 అమవసనిశికిన్
శ్రీకృష్ణదేవరాయ లొకనాఁటి ' మధ్యాహ్నమున నిండు పేరోలగంబుండి.
'క. కలనాటి ధనములక్కఱ
గలనాఁటికి దాచ కమల గర్భుని వశమా'
యని చదివి, మిగత రెండుపాదములునుబూ ర్తి చేయుమనఁగా నలసాని పెద్దనకవి లేచి,
‘నెలనడిమనాఁటి వెన్నెల
యలవడునే నాడుఁబోయ నమవసనిశికిన్'
ఆపద్యము నాకర్ణించి, రామకృష్ణుఁ డిట్లు జదివెను---
క. ఎమితిని సెపితివి కపితము
బ్రమపడి వెఱిపుచ్చకాయ వడిఁదిని సెపితో
ఉమెతకయను దినిసెపితే
యమవసనిశి యన్నమాట నలసని పెదనా!
'క. కవి యల్లసాని పెద్దన
కవితిక్కన సోమయాజి గణుతింపగాఁ
గవి నేను రామకృష్ణుఁడ
గవియను నామంబు నీటికాకికి లేదే'
14 ఆనందభట్టు
రాయల యాస్థానమున కొక నాఁడు తిట్టు కవిత్వమునందుప్రజ్ఞగల యానందభట్టు అనుకవివచ్చి తన్నుగూర్చి చెప్పుకొనెను. రాయలా కవిత్వము విననొల్లక , యెదో కొంతధనము బహూకృతిగానిచ్చి వేయ దలంచెను. ఆనందభట్టీ పద్యమును జదివెను.
'ఉ. బూతుకవిత్వ వైఖరులపోడిమి జూడక పొమ్మనంగ నీ
కేతగుగాక , యిట్టులమఱెవ్వరు సెప్పుదురో సృపోత్తమా
చాతురితోఁ దెనాలి కవిసత్తముఁ డీతఁడు రామకృష్ణుఁడీ
రీతిని యూరకుండిన విరించినినైన జయింప జాలనే?
రామకృష్ణుఁ డంతవరకు రాయలేమనుకొనునో యని మాటాడక యూరకుండెను. ఇఁక సహింపనేరక నతఁడులేచి 'చూతుమె లవుఁడా యటంచు సూక్తులుపలికెన్ ' అసు సమస్యనిచ్చి పూర్తిచేయుమనియెను. ఆనందభట్టు ఆ సమస్యను బూర్తి చేయఁజూలక పోయెను రామకృష్ణకవియే యిట్లు పూర్తి చేసెను - '
'క. ఆతురపడి యెదిరించితి
వాతతబలశాలి రాముఁడనె తనయునితో
సీత, రఘురాము సదృశుని
జూతుమే లవుఁడాయటంచు సూక్తులు పలికెన్ .'
ఆనందభట్టు ప్రమోదమంది యిట్లనెను