తిరుమల తిరుపతి యాత్ర/అధ్యాయము 9

అధ్యాయము IX.


ఈ దేవస్థానములో ప్రసిద్ధికెక్కిన విజయనగరపు రాజులైన కృష్ణదేవరాయలు, వీరి ఇద్దఱుుభార్యలు, వీరి తమ్ముడు వెంకటపతి రాయలుయొక్క విగ్రహములు (Statues) తోదరు మల్లునిభార్య, మంత్రి, మంత్రిభార్యయొక్క విగ్రహములు (Statues) గలవు. ఇంకను రెండు గలవుగాని ఎవరో తెలియదు.

అక్బర్ చక్రవర్తి మంత్రి తోదర్ మల్లుయు ఇతనిభార్యయు శ్రీ వేంకటేశ్వరస్వామివారి భక్తులనియు, దేవస్థానమునకు మహోపకారము చేసిరనియు వదంతిగాని దృష్టాంతముగా శాసనముల రూపకముగా నింకను నేమియు గానము.

ఈ దేవస్థానము అనాది అనియు శ్రీమహావిష్ణువు శ్రీ వైకుంఠమునుండి దయచేసి రనుట పురాణప్రసిద్ధము. చరిత్రకారకులు ఈ దేవస్థానము గురించి ఏమి వ్రాసిరి అను మొదలగు సంగతులు వినుట కాహ్లాదకరముగా నుండును గాన కొంచె మీట వివారించెదను.

మెగస్తునీస్ ఫాహియా౯ మొదలగు కొందఱు ఈ దేవస్థానము గురించి వ్రాయలేదు. కాంచీపురము మొదలగు స్థలముల గురించి వ్రాసి తిరుపతి శ్రీవేంకటేశ్వరస్వామివారి దేవస్థానము గురించి వ్రాయనందున నీ దేవస్థానము లేదనిగాదు, వీరు దేశమంతటయు తిరుగుచు వారు చూచినవి, వినినవి కొన్ని పురములు మొదలగునవి విశేషముగా వర్ణించిరి. ఈ పర్వతమునకు నాల్గుజాతుల హిందువులు తప్ప ఇతరులు వచ్చుటకు వీలులేనందున వారు యిచ్చటకు రాలేదు. వర్ణించను లేదు. అదీగాకపూర్వము మార్గస్థుల కిది మార్గములోను లేదు. ఈ కారణముల చేత వారికి వర్ణింప నవకాశము గలుగ లేదని ఊహించవలసినది.

"మణిమేఖల" అను గ్రంధములో ఈ దేవస్థానము గురించి చెప్పబడినది. ఇది క్రీస్తుశకమునకు రెండవశతాబ్దములో వ్రాయబడిన పుస్తకము.

ద్రవిడ ప్రబంధములో 9 ఆళ్వార్లు శ్రీ వేంకటేశ్వర స్వామివారిని గురించి వర్ణించియున్నారు. అందులో పొయాళ్వార్ అనువారు క్రీస్తుశకమునకు అనేక శతాబ్దములకు పూర్వము ముందుండినవారు. వారు తిరుమలగురించి వర్ణించినారు.

తాళ్ శడై యుమ్ నీణ్ముడియుమేను మళువుమ్ శక్కరముమ్।
శూడారవుమ్ పొన్నాశోమ్ తోన్ఱుమాల్ శూడమ్।
తీరశ్డొరు విపాయుమ్ తిరుమలై మేలేన్క్కు।
ఇరశ్డొరువు మొన్నాయి శైన్దుకు।

శివకేశవ చిహ్నలు గలిగి ఇద్దఱు ఒక్కరయినట్టు వర్లీంచినారు. వీరి కాలములో మతద్వేషములు లేక సమ్మతముగా నుండవచ్చుననీ తోచెడిని.

ఈ దేవస్థానములో ప్రాకారములమీదనున్న శాసనములు పూర్తిగా బహిరంగము చేయుటకు శ్రీ విచారణకర్తల వారయిన శ్రీ మహంతు ప్రయాగ్ దాస్‌జీవారి వుత్తరవు ప్రశారము క్రీస్తుశకము 1922-వ సంవత్సరములో ఇట్టి శాసనములు ప్రచురమున కొకశాఖ నిర్మాణము చేసినందువలన నా శాఖవారు శాసనంబులు పరీక్షించి వ్రాయుచున్నారు. పూర్తి అవుటకు కోన్నివత్సరంబులు పట్టును. అయినను దొరికినంత వర్కున్న శాసనంబులవలన నీ దేవస్థానమునకు చోలపాండ్య రాజులు కైంకర్యములు చేసినట్టు తెల్లంబు.

9. 1. 61 of 1889. (అర్వము) మొదట ప్రాకారములో నుత్తరపుగోడమీద కోనీర రాజరాజనరేంద్రవర్మ౯ యొక్క 16-వ వత్సరము లోనిది.

డాక్టర్ హుసువిస్కు లనువారు ఈ శాసనమున్ను, తర్వాత రెండు శాసనములున్ను నవీనమనియు, ఈ దేవస్థానమును జీర్ణోద్ధారము చేసిన సాలువవంశీపు రాజయిన వీరనరసింహదేవరాయుని కాలములో పూర్వ మున్న చోల శాసనములకు తప్పు ప్రతి అని అభిప్రాయ మిచ్చిరి.

9. J. 62 of 1889. (అర్వము). మొదటి ప్రాకార ముత్తరపు గోడమీద కోప్రత్ర మహేంద్రవరనుయొక్క 14వ వత్సరములోని శాసనము.

9 K. 68 of 1889. (అర్వము) మొదటి ప్రాకార ముత్తరపు గోడమీద కోపరత్నవరంయొక్క 14వ సంవత్సరములోని శాసనము.

9 L. 64 of 1889. (అర్వము) రాజరాజేంద్ర చోల దేవుని కాలములోని శాసనము.

17, 256 of 1904 లవంశములో నొక రాజు గురించి శాసనము.

19. C. 713 of 1904 (అర్వము) చోలవంశీపురాజయిన కులోత్తుంగ 1 గుఱింంచి శాసనము.

19 B 712 of 1904 (అర్వము) పాండ్యరాజయిన జట వర్మన్ సుందరపాండ్య 1 గఱింంచిన శాసనము. వత్సరము అగపడలేదు.

19 D 174 of 1904 (అర్వము) యాదవరాయ వీరనరశింహదేవునినిగురించి శాసనము. వత్సరముసరిగా అగుపడ లేదు.

9 S 71 of 1889 (అర్వము) త్రిభువనచక్రవర్తి శ్రీ వీరనరశింహ దేవయాదవరాయుని గుఱించి శాసనము.

పూర్వపు చరిత్రలు తెలిసినంతవరకు క్రీస్తుశకము 9వ శతాబ్దంత్యమువరకు కాంచీపురము రాజధానిగా పల్లవవంశస్థులు ఉత్తరార్కాట్ జిల్లా పాలించిరనియు తర్వాత ఉరయూర్ చోలవంశస్థులు మాల్కా హెడ్ రాష్ట్రకూటవంశస్థులు,తంజావూరులో గొప్ప చోలరాజయిన రాజరాజు దేవుడు, తుదకు విజయనగరం హిందూరాజులు పాలించిరని ఇంపీరియల్ గెజ టి౯ అయిదవ భాగము (Volume) లోనున్నందున నీ దేవస్థానము వీరందఱపాలసలో నుండెనని చెప్పుటకు సందియము లేదు. పురాణరీత్య అనాది అని చెప్పబడు శ్రీవేంకటేశ్వరస్వామివారి దేవస్థానముయొక్క కాలనిర్నయము చేయుటకు చరిత్రలు పూర్ణమైన సహాయంబింకను నోసంగవు. అయినను క్రీస్తుశకమునకు చాలాపూర్వమనియు కాలనిర్నయంబు సరిగాచేయుటకింకను అవకాశము గలుగలేదనీయు రూఢిగ చెప్పవచ్చును.

సాలువ వంశము.

విజయనగరములో శివభక్తులైన సంగమవంశీకుల పాలనానంతరము సాలువవంశీకులువచ్చిరి. వీరువిష్ణుభక్తులు వరా హము, బాకు, రాజచిహ్నలుగా గలవారు. ఈవంశములో మొదటిరాజు వీరనరశింగరాయులు. ఈయన 1490-వ వత్సరములో రాజ్యమునకు వచ్చెను. ఈయన సంగమవంశకులలో నాఖేరు రాజువద్ద సేవకుడుగానుండి మోసకృత్యమువలన రాజ్యము సంపాదించెను. శ్రీ వేంకటేశ్వరస్వామివారి దేవస్థానమును జీర్ణోద్ధారము చేసెను. ఈరాజు జీర్ణోద్ధారము చేసినట్టు దేవస్థానము ప్రాకారపు గోడమీద శాసనముగలదు. ఈయన చేయు జీర్ణోద్ధారములో పూర్వమువలె నెచ్చోటనుండు రాళ్లనచ్చోట సరిగా నుంచకపోమి ప్రాచీన శాసనంబులు నులభ్యంబులుగావయ్యె. గుడిప్రాకారముల మీదను, బంగారు మలాం చేయబడిన రాగిరేకుతో నాచ్ఛాదనంబయిన కట్టగల భావిమిదను సహా "వరాహము, బాకు "చిహ్నలు గల్గియున్నవి. వీరు ద్రావిడ దేశమునుకూడ కొంత లోబర్చుకొని చంద్రగిరివేలూరు పురములలో కోటలుగట్టిరి. వీరు శ్రీ వేంకశ్వరస్వామి వారిర్కి అయిదు గ్రామములు ఇచ్చినట్టు దిగువనుదహరింపబడు శాసనంబువలన ఏర్పడును.

11 280 of 1904 (అర్వము) శాలివాహన శతము 1889 సర్వజిత్ సంవత్సరములో గుండయ్య దేవ మహరాజు కుమారుడు సాలువరాజయిన నరశింగయ్యదేవ మహారాజు ఉడయరు దేవస్థానమునకు అయిదు గ్రామములిచ్చినట్టు మొదటి ప్రాకారము దక్షణపుగోడమీద శాసనముగలదు.

ఇంకొక శాసనము అనగా 10. 249 of 1904 అర్వభాష లో శాలివాహనశకము 1885 స్వభాను వత్సరములో నరసింగ రాయ ఉదయర్ యొక్క ఈవినిగురించి విస్తరించి చెప్పుచున్నది.

ఈ శాలువవంశీకులు ఈ దేవస్థానమునకు విశేషముగా గ్రామములు, భూములు, తిర్వాభరణములొసగిరి. గుడిగోపురాదులు జీర్ణోద్ధారము చేసిరి. ఇంకను అనేక విధముల వృద్ధి చేసిరి. వీరు క్రిస్తుశకము 1498 లో మృతినొందిరి.

వీరి తర్వాత ఈయన కుమారుడు నీరనరసింహ దేవరాయులు రాజ్యమునకు వచ్చిరి. వీరును దేవస్థానమునకు తిర్వాభరణము మొదలగున వొసగిరి.

తుళువ వంశము.

వీరితర్వాత ఈయనతమ్ముడగు క్రిష్ణదేవరాయలు రాజ్యభారంబువహించి ద్రవిడ దేశమంతయు వశపరచుకొనిరి. వీరి కాలములో విజయనగరరాజ్యం ఔన్నత్యదశనొందెను. వీరి యొక్కయు భార్యలయినచిన్నాదేవి తిరుమలదేవి యొక్కయు విగ్రహములు (statues) పడి కావలిలోపల మంటపములోగలవు.

వీరిని గుఱించి ఈ దేవస్థానములో అనేక శాసనములు గలవు. వీరు ప్రతాపరుద్ర గజపతిని కొండవీడు వరకు తరిమినట్టును ఉదయగిరి ముట్టడించినట్టును శాసనము గలదు. (Vide 9 A 52 of 1889 నీరు శాలివాహనశకము 1486భావ సంవత్సరములో చనిపోయినట్టు అనేక శాసనములు గలవు గానీ మొదటి ప్రాకార వుత్తరగోడమీద శాలివాహన శకము 1436 ఆంగీరస వత్సరములో పరమపద మొందినట్లును, వారి భార్యలు చిన్నా డేవీ, తిరుమల దేవి దేవస్థానమునకు తీర్వాభరణము లొసగినట్లును శాసనములు గలవు.

రవి ఉడిధారకటారీ వరకుచ్చుసహా నచ్చకం ఉడిధార నిచ్చకం కటారివరచిన్న కఠారివరపతకం భుజకీర్తిజతలు 8 చిన్న కిరీటములు శ్రీకృష్ణ దేవరాయులు శా: 1435 శ్రీముఖవై శాఖ బహుళ ద్వాదశీ సోమవారంనాడు శ్రీ వేంకటేశ్వర స్వామివారికి సమర్పించిరి. శ్రీవారికి ప్రస్తుతం సమర్పణలోనుండు కఠారి శ్రీకృష్ణ దేవరాయులు సమర్పించిరను వదంతి ఈశాసనంబువలన నిజమని ఏర్పడుచున్నది. శా|| 1434 ఆంగీరస ఫాల్గుణ శుద్ధ పంచమినాడు నవరత్న ఖచితమై 3308 తూకాలుగల బంగారు కిరీటము శ్రీస్వామివారికి సమర్పించిరి. ఇదే తేదీలో వీరిభార్యలు.తిరుమల దేవి, చిన్నా దేవి జిలిపాల అవసర. నైవేద్యమునకు పయిండిగిన్నెలు 1కి 374 తూకములుగలవి సమర్పించిరి. దేవస్థానమున కేగాక బ్రాహ్మణులకు విద్వాంసులకు గ్రామాదులు శ్రీకృష్ణ దేవరాయు లొసగిరి. తిరుపతిలో తూపల్ దీకృతులకు శిరిపాది గ్రామంలో మాధవ కాల్వ నొసంగెను. తాళపాకం తిరుమలయ్యకు అనేక గ్రామాదుల నిచ్చిరి. శ్రీ వేంకటేశ్వర స్వామివారి కర్పించిన తిరువాభరణములు మొదలగునవి. లెఖ్ఖ లేదు. ఈ క్రిందని వివరించిన శాసనంబువలన శ్రీవారికి వారు కనకాభిషేకంబు చేసినట్లు తెలియుచున్నది.

"శా 1436 భావ సంవత్సర ఆషాఢ శుద్ధపౌర్ణమిగురువారం శ్రీమద్ మహా రాజాధిరాజ రాజపరమేశ్వర శ్రీవీర ప్రతాప రుద్రగజపతిమీదను దండువిచ్చేసి ప్రతాపరుద్రగజపతిని కొండవీటి దనకాసు విరుగంబొడిచి ఉదయగిరి దుర్గమున్ను కైకొనితిరిగి విజయనగర రాజధానికి విచ్చేస్తున్నూ తిరుమలమీదికి విచ్చేసి తిరువేంగళనాధ దేవునికి కనకాభి షేకంచేసిన రొఖ్కం వరహాలు గ 30000 ఇవే అక్షరాలా ముఫై వేలు” ప్రతాపరుద్ర గజపతిని ఓడించినత ర్వాత గజపతీయొక్క కుమార్తెను వివాహము చేసుకొనినట్టు చెప్పెదరుగానీ ఆరాణి యొక్క ప్రశంస ఇంకను గనపడలేదు.

వీరితర్వాత అచ్యుతరాయులు పాలించిరి వీరికితీరుపతిలో పట్టాభి షేక మహోత్సవ నుయినది. త్రిభువనచక్రవర్తి తిరువేంగడ యాదవరాజు తిరుపతిని సర్వమాన్యముగా శ్రీ వేంకటేశ్వర స్వామివారికి సమర్పించినందున అచ్యుతరాయుల కాలమునకే తిరుపతి సర్వమాన్యముగా నుండెను. అచ్యుతరాయులు శ్రీవారికి గ్రామాదులు తిరువాభరణములు మొదలగునవి విశేషముగా అర్పించిరి. హిందూరాజులు శ్రీవారికి ఏర్పాటు చేసిన నివేదనలు ఉత్సవము వర్ణింపనలవికాదు. శా 1446 జయ సంవత్సర మేషమాస బహుళ సప్తమి ఆదివారం ఉత్తరాషాఢనక్షతత్రమందు అచ్యుత రాయులు పట్టమహదేవి వరదాదేవి శ్రీ వారినివేదన ఖర్చులకుగాను గండికోట సీమలోని చిన్నమడుపులూరు, ముత్తుకూరు కొండవీటి సీమలోని పోలివా, వల్లి, మంగ మూరు, నారాయణవుగట్టులో పైండపల్లి, గ్రామములు ఆరింటిని సమర్పించెను.శా 1454 నందనసంవత్సర వృషభ మాస బహుళ ఏకాదశీ సోమవారం ఉత్తరాభాద్రా నక్షత్క్రయుక్తశాసనములో కొండమీద ఆడినుంచి చిత్రివర్కు 7 బ్రహ్మోత్సవములు తిరుపతిలో వైయ్యాశిలో 1 అనిలో 1 రెండు {బ్రహ్మోత్సవములున్నట్టు ఏర్పడుచున్నది.

ప్రస్తుతం కొండమీద ఒక బ్రహ్మోత్సవము ప్రతీవత్సరము జరుగుచున్నది.అయితే చాాంద్రసూన రీత్యా అధికమాస మువచ్చినప్పుడు మాత్రము రెండవ బ్రహ్మోత్సవము జరుగును. యోచించగా ఏడు బ్రహ్మోత్సవము లున్నట్టు శాసనమువల్ల తప్పఆచారమువల్ల ఇప్పుడు అగుపడదు. గాని ఇంచుక శ్రద్దతో పరిశీలించినంతట కొంతవరకు ఫలానా మాసములలో బ్రహ్మాత్సవములు జరుగుచుండెనని, తెలియగలదు. అనంతపద్మనాభచతుర్దశినాడు ముక్కోటిద్వాదశిసోడు రధసప్తమినాడు శ్రీస్వామి పుష్కరిణిలో చక్రస్నానము జరుగు అచారముగలదు ఈ చక్ర స్నానమునకు కారణమేమని అనేక వత్సరములు ఎవరిని అడిగినను సరి అయిన సమాధానము రాదాయెను. ఈ శాసనము వల్ల బ్రహ్మోత్సవము పూర్తిఅయిన తర్వాత చక్రస్నానమనీ నేను ఎంచితిని నేను నాయోచన సరియనీ పల్లవ వంశీకుడయినపార్థివేంద్రవర్మ౯ కాలములోనే శాసనమువలన ఏర్పడినది. ఆవర్మ౯ తన 14వ వత్సరపు పాలనములో శ్రీవారికి ధనుర్మాసములో ముక్కోటి ద్వాదశీకి ముందుదినమునకు 2 బ్రహ్మోత్సవములు 7 దినములు జరుగునట్లు నియమించి అందుకు 47604 గుంటలభూమిని ఏర్పాటు చేసిరి. కాలక్రమేణ హిందూ రాజుల పరిపాలనంబు పోయిన తర్వాత కొన్ని బ్రహ్మోత్సవములకు చక్రస్నానంబుమాత్రము మిగిలెను మరికొన్ని బ్రహ్మా త్సవములు రూపులేకపోయెను. రధసప్తమి ముందు బ్రహ్మా తపముమాత్రము 7 ఉత్సవములు చక్రస్నానము ఒకే రోజు జరుగునట్లు ఎర్పడెను.

పూర్వముబ్రహోత్సవానంతరము పడాయతి వుత్సవము గుచున్నట్టు శా 1314 ఆంగీరససంవత్సర శాశసమువలన నందవనములో పూమంటపమునకు శ్రీవార్లు విజయము చేసినట్లు ఏర్పడు చున్నది. నందవనములందలి అనేక మంటపమ'లు చూడనాకు గల్గిన సందేహము ఈశాసనంబువలన నివృత్తిగల్లెను.

హిందూరాజుల కాలములో శ్రీవారికిని వేదనలపరిమిత ముగానుండే నని ఇదివరలోనే చెప్పబడినెనుగదా! ఇంతనివేదనయు ఇప్పటివలెనేశ్రీవారికి ప్రతినిత్యము నియమిత కాలములయిన పగలు 2 సార్లు రాత్రి 2సార్లునివేదనఅగుచుండేనా? లేక ఇంకను హెచ్చు సార్లునివేదనగుచుండెనా? అని దేవస్థానవుఅనుభవముగలవారికి ఈసందేహముకలుగకమారదు. పూర్వము “అచ్యుత రాయులసంధి”అనికొన్ని గంగాళములునివేదన ప్రతినిత్యముగలదు. ఇదేమాదిరిగా అనేక రాజుల పేర్లలోఅనేక గంగాళములునివేదనగలవు. నంధిఅనగా నేమి? ఇప్పుడు రెండవఘంటకుని వేదన అయ్యెస్వల్పమైనచప్పిడి ప్రసాదము సంధి అనివాడబడుచున్నది.బ్రహోత్సవములుపోయి చక్రస్నానముమాత్రము మిగిలినట్టు సంధి అనీ కొంచము చప్పిడి ప్రసాదము ఆరగింపు మాత్రము నిలిచినది. సంధి అనగా రెండు కాలములుకూడు సమయము ఇక్కడ సేన లకుమధ్య కాలమునకు సంధీ అని చెప్పవచ్చును. ఆసంధి సమయనులో ఆరగింపు అయ్యే ప్రసాదములకు సంధి ప్రసాదము అని చెప్పుటకుబదులు సూక్ష్మముగా ఏరాజుసమర్పించిన ప్రసాదములు ఆ రాజు యొక్క సంధి అని పూర్వులు వాడినట్లున్నది. విశ్వరూప దర్శనమైనతర్వాత తోమాల సేవకు ప్రారంభము చేయబోవుకాలము, తోమాల సేవఅయికొల్వుకుముందు కాలము, కొల్వుఅయి అర్చనకుముందు కాలము, మధ్యాహ్నము ధర్మదర్శనముఅయి అర్చనకు ప్రారంభించబోవు కాలము, సాయంకాలముతలుపులుతీసిరాత్రితోమాల శేవకుముందుకాలము, తోమాల సేవ అయి అ ర్చనకుముందు కాలము, రాత్రి దర్శనమై ఏకాంత సేవ ప్రారంభించబోవు కాలము సంధికాలములుగానుండును. ఈసంధి కాలముల యందు ప్రసాదములు శ్రీవారికిఆరగింప గుటవలన ప్రసాదములు చేయువారికి . కష్మతీతము లేకపోవుటయేగాక ప్రసాదములు భోగ్యముగానుండి కాలాకాలములందు భక్తాదులు స్వీకరించుటకు ప్రయుక్తములుగానుండును. ఇట్లుని వేదన చేయుట గలదనుటకు తోమాల సేవకుముందు ప్రసాదములు ఆరగింపయినట్లు శాసనంబువలన ఏర్పడును. శ 1390 సర్వధారిలో కందాడై రామానుజయ్యంగార్ నరీయనూరిసరిహద్దు మొదలు కుండ్రపాకము పరిత్తి పుత్తూరు గ్రామముల మీదుగా దేవమాన్యమగు తీరువేంగడ నెల్లూరులోనిభూములకు నీరుపాగుటకు కాల్వత్రవ్వించి ఆభూమి ఫలితమువల్లను దేవమాన్యమగు కొనిపట్టు దక్షిణపుతట్టు భూముల కునీరుపారునట్లు కాలున త్రవ్వించి ఆభూములఫలసాయము చేతను తోమాల సేవకు(శ్రీవారిపాదాబ్దములుకడిగిన సమయమున) 4గం గాళములదధ్యోదనము శ్రీవారికిఆరగింపు చేయుటకుఏర్పాటు చేసిరి. ఇదిగాక ఇంకొక శాసనమందు శ్రవవణనక్షత్రమందు శ్రీవారలకుతిరుమంజన మైన వెంటనే అన్న ప్రసాదములు ఆరగింపయినట్లు తెలియగలదు శ్రీవారికైయ్యెడిని వేదనలలో ఇడ్డెనలు కూడాపూర్వము ఉండినట్లు శా 1441 ప్రమాదివత్సరపు శాసనమువలన తెలియగలదు.

అచ్చుతరాయలు తర్వాత కొంత కాలమునకు రామరాజు పాలించెను. అప్పుడును వీరుభక్తితో దేవస్థానమును పాలించిరి. తులువవంశస్థుల కాలములోతిరుపతిభాటలు బాగుచేసి యాత్రికులకుసురతముగాపోవునట్లును,యాత్రికులకుప యుక్తముగడోలీలు. గురించిగూడ సౌకర్యార్ధముగా ఏర్పాటులున్నట్టు చెప్పుతారు. తదనుగుణముగా ఆంధ్రసాహిత్య పరిషత్ యొక్క కాళయుక్లి సంవత్సరము మాఘ ఫాల్గుణ మాసముల సంచికలో 428వ పేజీలో ప్రకటింపబడిన చింతరాజుపల్లె పాళెం వెంకటపతిరాయనివద్దనున్న కాగితపు కౌలుకు నకలువల్లను తెలియగలదు.

“స్వస్తిశ్రీ విజయాభ్యుదయ శాలివాహనశక వరుశాషంబులు 1448 అగు నేటీ వ్యయనామ సంవత్సర వైశాఖ 18 లు శ్రీమద్రాజాది రాజరాజాకంఠీవర రాజకందర్ప మహా రాజాధిరాజ పరమేశ్వర రాజపూజితులగు మహారాజశ్రీ రామరాజయ్యగారు విజయనగర సింహాసనమున పృధ్విసామ్రాజ్యము చేయుచుండగాను గురుగింజకూటన మలసేని కుమార పెద్ద బుచ్చినాయనవారికి వ్రాయించియిచ్చిన కౌలునీరుపం. మహారాజశ్రీకృష్ణరాయలయ్య గారికిన్ని తరిగొండ తిమ్మానాయనికుమార రామానాయనికిన్ని విరోధం సంభవించినప్పుడు మీరువారిలో కిలస్తిరి అని సంశయించి మీకు నడుస్తువున్న గ్రామాదులు నశీర జప్తిచేయించిరి గనుక కోటకొండ పెద్దవైజుళ రాజు విప్పవెంట కుమార జంగమ రెడ్డి కడప గోపాల బుద్దారెడ్డి వౌగిమళ్ల పెద్దరెడ్డి వీరబల్లె యరమాచిరెడ్డి గెందికోట బాగసాని పెద్దనల్లపరెడ్డి యీ మొదలయిన దేశస్థులున్ను మహారాజశ్రీ రాయలవారీ ముద్రకర్త వుదయగిరి మలహరి శంకరపంతులు కొమారుడు ఆనంద గోపాలపంతులువారు మాతోవిన్నపం చేసిరి. గనుక చిత్తగించి మీకు నడుస్తూవున్న గ్రామాదులు విప్ప వెంటలోకి చెల్లే ఆరు గ్రామాదులున్ను విప్పవెంట ౧ పోంశమాళ్ల ౧ విరువల్లే ౧ సోమవరం పెద్దనీడు ౧ గెండికోట 1 చింతరాజుపాళెం 1 మలసేనిపట్టం 1యీ పద్ధాలుగు గ్రామాదులున్నూ మొభాచెన్నూరు పర్గణే శిద్దావటం తాలూకు యెనభై నాలుగు గ్రామాదులు కావల నిర్వయం. కాట్రగుంటక౯ 2 మడకకు౯ 2 దుగ్గానక౯ 2నర్తకుల యిండ్లకు౯ 2 మడి అనిని ఆధాన్యం చెన్నూరు తాలూకు ౧౪ గ్రామాదులు శిద్దవటం తాలూకు దర అన్వి గ్రామానకు ... ... మది సూర్యకొమారుని కనను రుసుము చేరి కట్టిన రుసుము ... దొంగలసాని రుసం ... తిరుపతిబాట రు సం ... పరపల్లె వంగిమాళ్ల నీటి రుసుములు తొక్కల పెరికెమర్ o/o రసవుషా౯నకు నగకుర్ 0/0 వస్రాలనగాకుర్ 0/2 తిరుపతి పరుషకు స్వారికీ నె౪ జనం ౧–కి నెబులు 1 భూసాన్కుర్ యీ చొప్పున నడిపించుక మాకాలు నమ్మి సుఖాన వుండమని వ్రాయించి యిచ్చిన కవులు నిరుపం.”

ఈ వంశములోని వెంకటపతి రాయలుయొక్క విగ్రహముకూడా (Statue) పడి కావలిలోపల గలదు.వీరు శాలివాహనశకము 1524_ వత్సరములో శ్రీ వేంకటేశ్వరస్వామివారి దర్శనమునకు వచ్చినప్పుడు మంగల అను గ్రామము దేవునికిచ్చెను. ఇంకోక శాసనములో శాలివాహనశక 1508 లో వెంకటపతి దేసమహరాయలు శ్రీ వేంకటేశ్వర స్వామివారి సన్నిధిలో గంజివరపట్టు అనుగ్రామ మొసగిరని గలదు.

1566-వ వత్సరములో రామరాజుతల్లి కోటయద్దములో ఓడింపబడిన తర్వాత క్రీస్తుశకము 1354–వ వత్సరములో కట్టబడిన కోటగల పెనుగొండ రాజధానిగా నేర్పాటు చేసుకొనిబడె ను. అనంతరము 1575-వ వత్సరములో తిమ్మరాజు పెనుకొండ నుండి చంద్రగిరికి రాజధానిని మార్చెను. వీరి కాలములోనే ఘంటామంటపములు కట్టించెరనీ వదంతి. వీరుమిగుల భక్తులు, శ్రీ వేంకటేశ్వరస్వామివారి దేవస్థానములో ప్రతిదినము రేయింబగళ్లు నివేదన కొలనులో పెద్దఘంటలు వాయించెదరు. ఆని నాదము 3 మైళ్లు వినబడును. దేవస్థానమునకు 3 మైళ్లదూరములో నొక మంటపం ఘంటయు నీరు కట్టించినారు. దేవస్థానములో నివేదనఘంటకాగానే యీఘంట వాయించబడుచుండెను. అనినాదము చంద్రగిరికోటకుచేరగా అచ్చట దేవతా నీవేదనయి తాను భుజించుచుండెననీ చెప్పెదరు. వీరి పుత్రులలో నొకరు శ్రీహ త్తిరాంజీ వారికి శిష్యులయి శ్రీ మహంతు గిరిధర దాస్ జినామమున శ్రీహ త్తిరాంజీ మఠమునకు మూలపురుషుని తర్వాత మహంతుగా నుండెను.

శ్రీరంగరాయ 11 పరిపాలనలో శా# 1499 సేవప్పకుమారు డచ్చుతప్పనాయక్ (తంజావూరు) వల్ల ఈ దేవస్థానము మరమ్మతు చేయబడినట్లు తేలియఁ గలదు. పూర్వము పల్లవవంశీకుడై న కోపార్థివేంద్ర వర్మ౯ తమయొక్క 14 వత్సరపు పొలనంబులో చాలా వ్యయము చేసి శ్రీవేంకటేశ్వర స్వామివారి గర్భగృహమును నూతనముగా కట్టించిరి. తర్వాత త్రిభువన చక్రవర్తి వీరనరసింహ్మ యాదవరాయుల కాలములో దేవస్థానము. చాలాభాగము నూతనముగా కట్టబడినది.

ఈ విజయునగరపు వంశములో ఆఖరు రాజయిన శ్రీరంగరాయులు 1646 క్రీస్తు॥ శ॥ చంద్రగిరిలో పాలించెను వీరికి నామకార్థములో బడిన సామంతరాజులుగా తంజావూరు, మధుర, చన్నపట్నం, శ్రీరంగపట్నము రాజులుండిరి. వీరు 1660–వ వత్సర ములో పులికట్ వద్ద ప్రముఖులు గా నుండిన డచ్చి వారు వలదని నను వినక ఈస్టిండియా కంపెని వారికి మద్రాసు నొసగిరి. వీరు భక్తి శ్రద్దలతో దేవస్థానమును పరిపాలించినట్లు చెప్పుతారు.

క్రీస్తు శకము 1644 లో బిజపూరు సుల్తానులు కర్నాటక మును దండెత్తటకు రందూల్ ఖా౯ షహాజి, అను ఇరువురు సేనానులను బంప వారు చంద్ర గిరి, గింజిలను లోబరుచుకొనగ శ్రీ రంగరాయలు ఉత్తర కర్ణాటములో కొంత కాలము దాగి తుదకు 1646. వ సంవత్సరములో బెడ్నూరుకు, బోయి సామంత రాజయిన బెడ్నూరు ప్రభువువద్ద దాగెను. ఈ రాజుతో ప్రసిద్ధి కెక్కిన విజయనాగర వంశస్థుల పాలనంబంత్యమేగాక హిందూ రాజుల పరిపాలనంబు బోయి మహమ్మదీయుల పాలనంబునకు దేశములోనై అందువలన శ్రీ వేంకటేస్వర స్వామి వారి దేవస్థానంబు నదాదిగా మహమ్మదీయుల పాలనాధీనంబాయెను.

మహమ్మదీయ ప్రభుత్వము

క్రీస్తు శకము 1646 మొదలు బిజపూరు సుల్తానులు పాలించిరి. అనంతరం డిల్లీ పాదుషా ఔరంగ జీబు దక్షిణ దేశము దండెత్తి లోబర్చుకొని తంజావూరు, తిరుచునాపల్లి, మైసూరు, వగైరా సామంత రాజ్యముకుపైన ఆర్కాడులో ఒక్క నౌకరు నుంచి పాలింప నాఙాపించి డిల్లీకి విచ్చేసిరి. వీరికే ఆర్కాడు నవాబు అని ఇపేరు. 1732 లో ఆర్కాడు నవాబుగా రాజ్యమునకు వచ్చిన దోస్తు అల్లీ కాలములో కలతలు ప్రారంభమాయెను. వీరి కాలములోనే మహారాష్ట్ర రాజయిన రఘోజీభా౯ నులే కర్నాటక రాజ్యము మీద దండెత్తి దామల్ చెరువు యుద్ధములో 1740లో నవాబులను ఓడించి కొంత దేశమును దోచుకొని పది లక్షల రూప్య ములు తీసుకొని రాజ్యమువదలెను. ఇట్లు పోతూర ఘోజీభా౯ నులే శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి విశేష నగలు సమర్పించిరను వదంతి. వారు సమర్పించిన నగలు యింకను భద్రముగా నుంచ బడి శ్రీ వారికి సమర్పణ అగుచున్నవి. ఈ నవాబువంశములో గృహకలతలు కలిగి ఒకరిని ఒకరు చంపుకొనిన తర్వాత, సైదు మహమ్మదల్లీఖా౯ అను పశివాడు నవాబుగా నిర్మింప బడి వంద వాసి కోటలో పెరుగుచుండెను. అంత డిల్లీ పాదుషా క్రింద సుబాదార్ (గవర్నరు) గా హైద్రాబాద్ లో నుండిన నైజాముల్ ముల్ క్ అను వారు ఆర్కాడుకు వచ్చి రాజ్యము అరాచకముగా నుండుట గని మైనరు నవాబును అర్కాడులో తన నౌకర్ల సంరక్షణలో నుంచి హైద్రాబాదుకు పోయి ఏలూరు, రాజమహేంద్ర వరము, పరగణాలు పాలించు చుండిన తన నౌకరైన అన్ వారుద్దీన్ ఖాన్ ని నవాబు పని చూచుటకు నియమించిరి. మైనర్ నవాబును వీరి స్వాధీనములో నుంచెను. కొలది కాలములోనే మైనర్ నవాబు కొందరు నౌకర్ల వల్ల చంప బడగా అన్ వారుద్దీన్ ఖాన్, నైజాముల్ ముల్ క్ వల్ల నవాబుగా నియమింప బడెను. యితడికిన్నీ పూర్వపు నవాబు వంశమునకు సంబంధ పడిన ముఖ్యోద్యోగులలో నొకరుగా నుండిన చందా సాహేబునకు కలతలు కలిగెను. 1749 లో జరిగిన అంబూరు యుద్ధములో అన్ వారుద్దీన్ వీరి పెద్ద కుమారుడు మఫూజు ఖాన్ ఇరువరులు చంప బడగా రెండవ కుమారుడైన మహమ్మదలీ, తిరుచునాపల్లికి పారి పోయి ఇంగ్లీషు వారి సహాయము కోరెను. ఫ్రెంచి వారు చందా సాహెబు కు సహాయము గావించుచుండిరి. ఇట్లుండగా హైద్రాబాదులో 104 సంవత్సరముల వయస్సు గల నైజాముల్ ముల్ క్ చని పోయెను. వారి యిష్టానుసారము మనుమడు సుబాకు రావలసి నందుకు నాజర్ జంగ్ అను కుమారుడు సుబాకు రాగా కలతలు ఆరంభమాయెను. మనుమడు ముర్జషాజంగ్ చందా సాహెబుకు సహాయమొనర్చి అతనిని నవాబుగ నిర్మించెను. నాజర్ జంగ్ మహమ్మదల్లీని నబాబు అనెను. ఇంగ్లీషువారి సహాయము వల్ల అనేక యుద్ధములైన తేర్వాత మహమ్మదల్లీ నవాబు ఆయెను. యుద్ధములో ఇంగ్లీషు సేనాని క్లైవు సహాయము వల్ల నాలుగు లక్షల వరహాలు రాబడి వచ్చు రాజ్యము ( అనగా శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవస్థానము రాబడి సహా) మహమ్మదల్లీకి లోబడినది. కర్నాటక యుద్ధములు నిల్చి నిల్చి జరుగు చుండెను. 1753 లో మహమ్మద్ కోమాల్ అను సేనాని అర్కాడులో కలతలవల్ల కావేరిపాకం యుద్దమయిన తర్వాత స్వంతంత్రము వహించి నెల్లూరు ముట్టడించి స్వాధీనము చేసికొనిరి. నెల్లూరులో గవర్నరును నవాబు సవతి సహోదరుడును అయిన నజీబుల్లా నెల్లూరు నుంచి ఆర్కాడుకు పారి పోయిరి. ఈ ప్రకారము సుమారు ఒక వత్సరము మహమ్మదు కోమల్ జయంబొంది ఆర్కాడుకు యాబై మైళ్ల దూరమున నున్న తిరుపతి కొండ మీది ప్రసిద్ధి కెక్కిన శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్తెహానము, ముట్టడింప ప్రయత్నించి వచ్చెను. అప్పుడు వుత్సవ పడిత రాదులు పోను వర్షమునకు 60 వేల వరహాలు ఆర్కాడు నవాబులకు దేవస్థానమునుండి రాబడి వచ్చు చుండెను. ఈ దేవస్థానమువల్ల వచ్చు రాబడిని కర్నాటక యుద్ధములో అయిన ఖర్చులకు గాను నవాబు మహమ్మదల్లీ 1753 లో ఇంగ్లీషు వారికి యెసగెను. తదాదిగా రాబడి మాత్రము ఇంగ్లీషు వారికి చేరు చుండెను. 1753 లో బ్రహ్మోత్సవమునకు ముందు ఈ దేవస్థానము స్వాధీనము చేసుకొన నిర్నయించి తిరుపతికి వచ్చిన మహమ్మద్ కోమాల్ ఇంగ్లీషు సేనాని ఓగిల్ బి మహమ్మదు సేనానీ జీబుల్లాఖాన్ వీరువర్ల వల్ల ఓడింప బడినందున దేవస్థానపు రాబడికి చలనము కలుగ లేదు.

1757 లో అతృప్తి చెందిన నజీబుల్లా ఖాన్ బ్రంహోత్సవమునకు వచ్చు యాత్రీకుల నుత్సవమునకు రాకుండ తన రాజ్యమైన నెల్లూరు మండలము నుండి వెనుకకు తరిమినందున బ్రహ్మోత్సవమునకు రాబడి తగ్గెను.

1758 లో నవాబు సహోదరుడైన అబ్దుల్ వహాబ్ ఖాన్ పాలేరు నదికి ఉత్తరముగా నున్న రాజ్యమునకు గవర్నరుగా నుండి రాజ్యము నందలి సొమ్ము వృధా ఖర్చు పెట్టి ధనము లేక నుండెను. తిరుపతి దేవస్థానమును ముట్టడించుటకు సేనను చేర్చు చుండెను గాని ఇంగ్లీషువారు సేనను పంపుచున్నారను వదంతిని విని ఆయత్నమును మాని చంద్ర గిరి నాక్రమించెను. హైద్రాబాదు నుండి ఫ్ర్ంచి సేనాని బుస్సీ వచ్చు చు తిరుపతిలో మకాము చేసెను. నజీబుల్లా ఖాన్ తో ఫ్రెంచి నాయకుడగు మరోసినీ నెల్లూరు నుండి వచ్చి కలుసుకొనెను. చంద్రగిరి లో నుండిన అబ్దుల్ వహాబు కూడ చేరిరి. దేవస్థానపు యిజారా దారును ముట్టడించి దేవస్థానం సొమ్మును తీసుకొనిరి. దేవస్థానం తమ స్వాధీనము కాదని తెలుసుకొని అబ్దుల్ వహాబ్ వెడలి క్రమేణ ఇంగ్లీషు వారి స్నేహము చేసెను. ఫ్రెంచి వారు దేవస్థానపు యిజారా దార్ వద్దనుండి లక్ష రూపాయలు తీసి కొని ఇంగ్లీషువారికి వ్రాసి యిచ్చిన రీతిగా కవులు వ్రాయించు కొని కొంచెము సైన్యము ఈ నూతన సంపాద్యమును కాచుటకు వుంచి అందరు పోయిరి. 1759 మహారాష్ట్ర సేనాని గోవింద గోపాల రావు ఫ్రెంచి వారొసగిన స్వల్ప పారితోషకమునకు తృప్తి చెందక తిరుపతిని గంగమ్మ జాతరకు ముందు ముట్టడించి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానమును తిరుపతియు లోపరచుకొనెను. అచ్చట నుండి పన్ను వసూల్ చేయదలచెను గాని మే నెలలో కృష్ణా నదీ వరదలు వచ్చునని పూనాను బాలాజీ రావు వాఫసు రమ్మనగా నారాయణ శాస్త్రి , అను వాని చేతి క్రింద కొంచము సేననుంచి తిరుపతిని వదలెను ఇంగ్లీషువారితో స్నేహముగా నుండిన నవాబు సహోదరుడగు అబ్దుల్ వహాబు చంద్రగిరి నుండి ఇంగ్లీషు వారితో చేరి తిరుపతికి స్వల్ప సేనను పంపి లోబర్చుకొని దేవస్థానము తన స్వాధీనము చేయ మని కోరెను. గాని ఇంగ్లీషు వారు యిదివరలో నుండిన యిజారా దారు కొనసాగిరి. నారాయణ శాస్త్రి తిరుపతికి 15 మైళ్ల దూరమునున్న కరకంబాడిలో కొంతకాలముండి మట్ల వారి సహాయము వలన సేనను చేర్చుకొని ఇంగ్లీషు సేనానీ విల్ క౯ తన సేనతోను యిజారాదారుని సేనతోను యాత్రీకులు వచ్చు కొండ మార్గము కాచు చుండగా మారు త్రోవను కొండెక్కి దేవస్థానమును స్వాధీనము చేసికొనెను. జూలై నెల తే. 9 దిని కొండ నుండి మహారాష్ట్రులును, క్రిందనుండి మట్ల వారును ముట్టడించిరి గాని ఓడిపోయిరి. దేవస్థానము యింకను వారి స్వాధీనములో నున్నది. తిరుగ మద్రాసు నుండి సేన, ఫిరంగులు, విల్ క౯సేనాని సహాయమునకు వచ్చెను. నాలుగు జాతుల హిందూ సిఫాయిలు మాత్రం కొండ నెక్క నర్హులగుటచే ఇంగ్లీషు వారి హిందూ సిఫాయిలు యిజారాదార్ సేనయి కలిసి 500 మంది కొండకు వచ్చి పోరాడిరి గాని ఓడిపోయిరి. హైద్రాబాదులో జరిగిన సంగతుల వలన సుభాదార్ సహోదారుడైన బసౌలత్ జంగ్ పద బ్రష్టుడై కొంత సేనతో దేశము దోచుకొనుచు నెల్లూరు ప్రాంతములకు వచ్చి తాను దక్క౯ సుబావల్ల పన్ను వసూల్ చేయుటకు పంపబడెనని చెప్పుచూ నజీబుల్లాఖాన్ కున్ను యింకను అనేక పాళేగార్ల కున్ను, బాకీ యుండు కప్పము చెల్లించ వలసినదిగా బెదిరించుచు జాబులు వ్రాసెను. ఆర్కాడులో ఫ్రెంచి వారితో కలియుటకు వీర్ల రాజ్యములుగుండా తాను పోవలెనని వెల్లడించ వీర్లందరకు మరింత భయకంపిత మాయెను. నజీబుల్లా ఖాన్ యు, పాళెగార్లందరునూ మద్రాసులోని ఇంగ్లీషువారి సహాయము కోరినను తిరుపతి కొండ తిరుగ స్వాధీనము చేసుకొటకు ఇంగ్లీషువారి కొకరయినను సహాయము చేయరైరి. ఇజారాదార్ ఓడిపోయినాడని విని పాలేగార్లు మొదలగు వార్లకు భయము మరింత హెచ్చాయను. నారాయణ శాస్త్రికి సహాయముగా సేన వచ్చుచున్నదనియు అది తిరుపతి ఆక్రమించినంతట వచ్చే ఉత్సవము వల్ల రాబడి ఇంగ్లీషు వారికి చేరదని తెలియగా మదరాసు నుండి మేజర్ కాలియడ్ అను సేనాని సైన్యముతోను మందు, గుండు సాములతోను తిరుపతి వచ్చి కరకంబాడి పాళెగార్లతో పోరాడి ఓడించి గ్రామమున్ను చుట్టుపట్లయున్ను ధ్వంసము చేసి, పాళెగారును చంపెను. తర్వాత తిరుపతికి వచ్చి ఇజారాదారు యొక్క సైన్యమున్ను తన హిందూ సిపాయిలను కొండకు పంపి, నారాయణ శాస్త్రిని మట్ల వారి అడవికి ప్రాలద్రోలి శాస్త్రికి సహాయముగా సేన వచ్చు చున్నదని చెప్పుట నిజము కాదని తెలుసుకొని 10 మంది సోల్ జర్ లను విల్ క౯ వద్ద తిరుపతిలోనుంచి తాను బయలు దేరి వెళ్లెను. అనంతరం కొన్ని రోజులకు మట్ల వారి సహాయము వల్ల కరకం బాడి మారమత్తు చేయు చున్నారని విని విల్ క౯సైన్యము తోను, మందు గుండు సామానులుతోను కరకం బాడికి వెళ్లెను. గాని చచ్చేటట్టు గుండు దెబ్బలు తగుల డోలీలో సేనతో వాఫసు వచ్చెను. ఇట్లుండగా బసౌలత్ జంగ్ పెన్న నది దాటి పోలూరు కోట స్వాధీన పరచుకొని కాళాస్తి వరకు రాగా ఇంగ్లీషు సేనాని కాప్తా౯మూర్ సేనతో కాళాస్తి వద్దకు ఎదుర్కొనుటకు వచ్చెను. బంగారు యాచమనాయుడు దామెర్ల వెంకటప్ప నాయుడు సంపతి రావు వీర్ల ఒక్కొక్కరి వద్దను 40 వేల రూప్యములు కప్పము తీసుకొని ఫ్రెంచి వారు సహాయమునకు రారని తెలిసికొని తర్వాత వంద వాసి వద్ద కలతలు గ్రహించి ఇంగ్లీషు వారు సైన్యముతో వంద వాసి వద్ద నుండుట గని కర్ణాటకము నుండి పారి పోయిరి. తర్వాత సైన్యములన్ని వారి వారి ప్రదేశములు చేరెను.

ఈ దేవస్థానపు రాబడి ఈస్టిండియా కంపెనీ వారికి చేరుచు దేశపరిపాలన మాత్రము 1801 వరకు అర్కాడి నవాబులుదిగా నుండెను. అయితే 1782 మొదలు 1785 వరకున్ను 1790 మొదలు 1792 వరకున్ను నావాబులకు బదులు ఈ స్టిండియా కంపెనీ వారే దేశము పాలించు చుండిరి. 1801 జూలై 31-వ తేదీలో ఈస్డిండీయా కంపెనీ వారికి శాశ్వతముగా నవాబు వద్ద నుండి దేశపాలనంబు మారి నందున మహమ్మదీయ ప్రభుత్వం బంత మాయెను.

ఇంగ్లీషు ప్రభుత్వము

1801 జూలై 31 తేది మొదలు ఇంగ్లీషుప్రభుత్వమునకు లోబడి ఈ దేవస్థానం ఉన్నది. 1842 జూలై నెల 10 తేదీన శ్రీ మహంతు సేవాదాస్ జీ వారిపేర సన్నదుపుట్టి దేవస్థానములకు విచారణకర్తలుగా ఏర్పడువరకు ఈస్టిండియా కంపెనీ వారే సర్కారు ఉద్యోగస్తులనుంచి దేవస్థానపు వ్యవహారము లను చక్కచేయుచుండిరి. శ్రీహత్తిరాంజీమఠం శ్రీమహంతు సేవాదాస్ జీ వారి కాలమునుండి శిష్యపరంపర ఈ శ్రీవేంకటేశ్వరస్వామివారి దేవస్థానమునకున్ను, అందుతో చేరిన యితర చిన్న దేవస్థానములకును విచారణకర్త (Trustee) గా నుండి దేవస్థానపు కార్యనిర్వాహకత్వము జరిపించుచున్నారు.

కలియుగములో స్మరణమాత్రమున ముక్తినిచ్చు శ్రీవేంకటేశ్వరస్వామివారి దర్శనము ఈ చిట్టిపొత్తము యాత్రస్తులు చదివినంతట సులభసాధ్యంబయి సమస్తసుఖముల నొసగును.

సంపూర్ణము.