తిరుమల తిరుపతి యాత్ర/అధ్యాయము 5

అధ్యాయము. V

వివేషఉత్సవములు, ఆస్థానములు.

వీనిలో నొక్కొక్క ఉత్సవము సంవత్సరమున కొక్క తూరి వచ్చుచున్నవి. ఇందులో ముఖ్యమయిన వానినిఁ బేర్కొ నెదను.

1. సంవత్సరాది ఆస్థాగము.

ఇది ప్రతిసంవత్సరము ఆంధ్రసంవత్సరాది దినము జరుగును. ఈదివసమున రోజు 12 ఘంటలకయ్యెడుని వేదన ఉదయము 5 ఘంటలకయి శ్రీమలయప్పస్వామిపొరు (ఉత్స వరులు) శ్రీతాయారుల సయితము రంగమంటపములో జోడించి యున్న బంగారు మంటపమనెడి సర్వభూపాలవాహసమందు దయచేసి వజ్రకవచము, రఘోజి భాన్సిలె మొదలగువారు సమర్పణచేసిన విశేషతిర్వాభరణములు (నగలు) సమర్పణ చేయబడిన తరువాత పుష్పాలంకారమయి, విశేషనైవేద్యములతో రెండవఘంట అయిన పిదప శ్రీమూలనరులకును శ్రీఉత్సవరులకును నూతనని స్త్రధారణమయి ఆస్థానవినియోగము నకు శ్రీవిచారణకర్తలవారు మొదలగు వారందఱుఁ గూర్చుం దురు. శ్రీవారికి నూతన పంచాంగము శ్రుతపరుపఁబడును. పంచాంగమును గుణించిన వారికి బహుమానము లొసంగఁ బడును, తఱువాత కొన్ని స్థలాచార పద్దతులు జరిగి లడ్డు, వడ, అప్పము, దోశ మొదలగు ప్రసా దములు దేవస్థానమర్యాదల ప్రకారము కైంకర్యపరులకు బహుమానమయి వినియోగమవును. ఆస్థానములో 11 A. M. ఘంటలకు పూర్తి అవును. ఆస్థానములో బ్రాహ్మణేతరులు కూర్చుం డఁగూడదు. అనంతరము ధర్మదర్శనమవును.

2 నిత్యోత్సవము.

ఇది సంవత్సరాది మొదలు 40 రోజులు జరుగును. ప్రతి సాయంకాలము శ్రీవారికి మాత్రము వెండితిరిచిలో వేర్వేరు వాద్యములతో వేద ప్రబంధసారాయణులతో ఊరుచుట్టు ఉత్స వము జరుగును. సంవత్సరాదిరోజున మాత్రము ఆస్థానాలం కారముతో తాయారుల సయితము ఉత్సవమవును. 40 రోజులును ఉత్సవానంతరము శ్రీధాన్యకారులవారి ముఖమంటప ములో బకాళాభాత్ (పెరుగుఅన్నము) శనగపప్పు సహా ఆస్థానమవును.

3 ఆనిన రాస్థానము.

ఇది ప్రతిసంవత్సరము ఆనినెల ఆఖరు అడినెల మొదటి తేదీని జరుగును. ఈ ఆస్థానములో కూర్చుండువకకు సంవత్సరాది ఆస్థానములోవలె జరిగి శ్రీవారిపాదముల వద్దనున్న బీగములు, మొహర్లు ఆర్చకులు జియ్యాం గార్లకు విచారణ కర్తల వారికి వప్పగించిన తఱువాత ప్రసాదపణ్యారములు సంవత్సరాది ఆస్థానములోవలెనే వినియోగమయి ఆస్థానము సమాప్తమగును. ఈఆస్థానము దక్షిణాయనపుణ్యకాలమురోజునజరుగును. ఆస్థానానంతరము ధర్మ దర్శనమవును.

4 దీపావళిఆస్థానము.

ఇది దీపావళిరోజున జరుగను. దీనియందు పంచాంగ శ్రవణముగాని బీగముల మోహరుల నప్పగింతగాని ఉండదు. శేషము సంవత్సరాది ఆస్థానములోవలె జరుగును. ఆస్థానమునకు ముందు బ్రహ్మోత్సవపు ఆంకురార్పణ దివసమున దయ చేసిన మూర్తులు కళ్యాణమంటపము యాగశాలలనుండి శ్రీవారి గర్భాలయములోనికి విజయము చేసెదరు.

1, 3, 4 అయిటమ్ ల ఆస్థానములు పెద్ద ఆస్థానము అని పేరు. శ్రీరామనవమి, గోకులాష్టమి, కౌశిక ద్వాదశి ఆస్థానములు చిన్న ఆస్థానములనఁబడును.

5 శ్రీవారి తెప్పోత్సవము

ఇది దుర్మతిసంవత్సర ఫాల్గుణ శుద్దమందు జరిగినది. ఈ ఉత్సవము నూతనము దేవ స్థాసపు విచారణకర్తలైన శ్రీమహంతుప్రయాగ దాస్ జీవారిసలన ఏర్పాటు చేయబడినది. చూచుటకు కన్నులపండగగ నుండును

6 శ్రీవారి బ్రహ్మో త్సవము.

ఇది ప్రతీసంవత్సము అనఁగా అధికమాసమునచ్చినప్పుడు తప్ప నవ రాత్రులలో జరుగును. ఉత్సవ ప్రారంభమునకుపూర్వదివసమందు శ్రీవారిబ్రహ్మోత్సవ ఆంకురార్పణముజరుగును. ఈరాత్రి శ్రీవారిగర్భాలయములో శ్రీమూలవరులు భోగ ఉగ్ర మూర్తులుదప్పఇతరమూర్తులను శ్రీవారికళ్యాణమంటపములో నికిని,యాగశాలలోనికిని విజయముచేయించిదీపావళీఆస్థానమున రకుంచుదురు. ఈదినము రాత్రి నివేదన పెద్దఘంటకు ముందు శ్రీ సేనాధిపతి వారికి నాలుగు వీథులుత్సవముజరిగి తిరుమలరాయ మంటపములో ఆస్థాసము జరిగి రాత్రి ఘంటయి తీర్మానమవును. శ్రీవారి బ్రహ్మో త్సవమునకు అన్నిపనులు శిద్దముగాఅయి నవా? అనుటకొఱకును నుృత్సంగ్రహణముకొఱకును ఈఉత్సవముజరుగుననిభావము, శ్రీవారి బ్రహ్మోత్సవము మంత్ర యుక్తముగా హోమములతో జరుగును.

మొదటిరోజున____

1 ధ్వజారోహణోత్సవము.

2 పెద్ద శేషవాహనము.

ఈదినమున విశ్వరూపదర్శనము, తోమాల ళేవ, అర్చనఘంట అయి శాత్తు మొరకుముందుగ నే శ్రీవారిని ఉభయ దేవుల సమేతముగ బంగారు తిరిచిలో విశేష తర్వాభరణాలంకారము చేసినతరువాత మంత్రయుక్తముగ కొన్ని క్రియలు
జరిగినపిదప ఆర్జిత బ్రహ్మో త్సవ గృహస్థులకు శ్రీ విచారణ కర్తలవారును, ఉద్యోగస్థులలో సేష్కార్, పారుపత్యదార్ మొదలగువారు యుండి సంకల్పయక్తముగ దత్తముచేయించి శ్రీమూలవరుల ననుమతికొఱకు సన్నిద్ధికి వెళ్లి అచ్చట నుండి మం!తముతో అర్చకులు బలిసాయించుచు ఉత్సవ మూర్తికి ముందుగ వెళ్లెదరు. ఇట్లు నాలుగువీధులు ఉత్సవమైన తఱువాత ధ్వజపటమునకు ధ్వజస్థభమువద్ద ప్రజజరిగినివేదనై స్థంభము పై నెక్కించేదరు. తిరుమలరాయమంటసములో ఆస్థానమై శ్రీవారు లోపలకు దయచేసిన తఱువాత రెండవఘంటయైనవెంటనె తోమాల సేవ, ఆర్చిన రాత్రిఘంట అయి శ్రీవారికి పెద్ద శేషవాహనోత్సవమగును.ఉత్సవమై ఆస్థానానంతరము శ్రీవారులో పలకు దయచేసిన తఱువాత తీర్మానమై తలుపులు వేయఁబడును.
రెండవదిసము._____

1 మధ్యాహ్నము మొదటిఘంట అయిన తఱువాత చిన్న శేషవాహనము.

2 రాత్రి నివేదనఘంటఅయినతఱువాత హంసవాహనము. నిన్న మొదలు 9 దివసములు దినముకు ఒక ధర్మదర్శము మాత్రముండును.

మూడవదివసము.____

1 సగలు సింహవాహనము.

2 రాత్రి ముత్యపుపందిలి అనే వాహనము. (తాయారులు సయితము).

నాల్గవదినము._____

1 పగలు కల్పవృక్ష వాహనము.

2 రాత్రి సర్వభూపాలవాహనము (రెండును తాయార్లు సయితము)

అయిదవదివసము.____

1 పగలు మోహినీ అవతారము పాలకీ ఉత్సవము.

2 రాత్రి గరుడవాహనము.

ఆఱవదివసము._____

1 పగలు హనుమంతవాహనము (మొదటిఘంట యయిన పిదప) వసంతోత్సవము. (రెండవఘంటసపిదప)

2 రాత్రి ఏనుగువాహనము.

ఏడవదివసము.______

1 పగలు సూర్యప్రభవాహనము.

2 రాత్రి చంద్రప్రభ వాహనము.

ఎనిమిదవ దివసము._____

ఈ దివసమున తెల్ల వారుసరికి మొదటిఘంట అయిన పిమ్మట శుభముహూర్తమున శ్రీవారు అమ్మవారుల సయితం రథారూడు లగుదురు. సాయంకాలమునకు రథము నాలుగు వీధులు తిరిగి యధాస్థానమునకు వచ్చినతఱువాత శ్రీ వారు సన్నిధికి వెళ్లఁగా రెండవఘంట అపును. వెంటనే రాత్రీ ఘంట అయి గుర్రపువాహనము జరుగును. శ్రీవారి బ్రహ్మో త్సవములో గురువారము రాత్రిన్ని, శుక్రవారము విశ్వ రూపదర్శనము, అభిషేకము నితంకాలములలోని గురుశుక్రవారముల వలన ధర్మదర్శనము లేక మునిషి రు 1 వంతున ఇచ్చి పారూపత్య దార్ ఖచేరిలో చీటి తీసుకొని లోపలకు వెళ్ల వలేను.

తొమ్మిదవ దివసము.______

1 సాలకీఉత్సవము.

2 చూర్ణాభిషేకమనే తిర్చి ఉత్సవము.

ఈ రెండున్ను శ్రీవారి మొదటఘంట అయినతఱువాత ఉదయము 7 ఘంటలలోపలఁ బూర్తి యవును. రెండవ ఉత్సవానంతరము శ్రీవరాహస్వామివారి సన్నిధిలో ఉభయ అమ్మ వారల సమేతం శ్రీవారికిన్నీ, చక్రత్తాళ్వారుకున్నూ తిరుము జనము జరిగి చక్రత్తాళ్వారికి మాత్రం పుష్కరిణిలో స్నానమయిన తఱువాత శ్రీవారు లోపలికి విజయంచేయఁగా శాత్తు మొర అయి ధర్మదర్శనమగును.

రాత్రి బంగారుతిర్చి ఉత్సవముయి ధ్వజావరోహణము జరగును. బ్రహ్మో త్సవ కాలములో శ్రీవిచారణకర్తలవారు తిరు మలమీఁదనే ఖచేరిచేసెదరు.

6 నవరాత్రోత్సవము.

చాంద్రమానరీత్యా అధికమాసము వచ్చినపుడు శ్రీవారి బ్రహ్మో త్సవము భాద్రపదమాసములో జరుగును. నవరాత్రుల లో ప్రత్యేకముగ నవరాత్రోత్సవము జరుగును.ధ్వజారోహణా వరోహణములును తేరుమాత్రము జరుగకనంతయు బ్రహ్మోత్స వమువలె నుండును. ఈ యుత్సవ కాలములో శ్రీవిచారణకర్తల

     5 వారు కొంతమంది ఉద్యోగస్థులతో నిచ్చటనె ఖచేరిచేసి దరు. నవరాత్రోత్సవములో తిరుమలరాయ మంటపములో గాక రంగనాయక మంటపములో నాస్థానము ప్రతిసారియ జరుగును.

7. ధనుర్మాసము.

ధనుర్మకరసంక్రమణముల మధ్యకాలమునకు ధనుర్మాసమని పేరు. ఈ నెలదివసములు సుప్రభాతశ్లోకములు చెప్పరు, ద్రవిడ ప్రబంధము పఠించుచు బంగారువాకిలి తీయుదురు. వెంటనె తోమాలసేవ, బిల్వార్చనయి నివేదనఘంట అవును. అనంతరము శుక్రవారముదయమునఁ దప్ప ధర్మదర్శనమయి నివేదనయిన ప్రసాదములు అనఁగా శనగపప్పు, బెల్లపు నేతి దోశలు, పొంగలి, చక్కెరపొంగలి, పండ్లు మొదలగునవి శ్రీభాష్య కారులవారి ముఖ మంటపములో స్థానబహుమాన పూర్వముగా గోష్టి వినియోగమవును. ఈతోమాల శేవ, అర్చన బహిరంగముగాదు.

ధనుర్మాసపూజలో తోమాల సేవ, అర్చన రహస్యము గాన నెవరు పోఁగూడదు. బ్రాహ్మణే తరులకు వాపక్షమైనను లేదు. ధనుర్మాసపుఘంట దర్శనమయిన తఱువాత తలుపులు వేయబడి 9 A M. ఘంటలకు తిరుగ తెరచి ధర్మ దర్శనము లేక నేతోమాల సేవ మొదలగునవి మామూలు ప్రకారము జరుగును. ఈమాసమున రాత్రి శయనమునకు శ్రీకృష్ణస్వామి వారు దయచే సెదరు.

శ్రీవారి ధనుర్మాసములోని శుద్ధఏకాదశికి "ముక్కోటి ఏకాదశి" అని పేరు. ఈదివసమున శ్రీవారి వైకుంఠప్రాకారము
తెఱచెదరు. ఈ ప్రకారాము సంవత్సరమున కొకదివసము మాత్రము తెరవబడును. ఈసాయంకాలమున స్వభూవాలవాహనములో శ్రీవార్లకు వజ్రకవచము మొదలగు విశేషాభ రణములు సమర్పణ చేసి ఉత్సవముజరుగును. ఈరాత్రి తీర్మానమయిన శీఘ్రకాలములోన తలుపులు తెరచి ధనుర్మాసపుపూజనివేదనయు నిత్యకట్ల తోమాల సేవ, అర్చన ఘంటఁయి చక్రత్తాళ్వారు మహాప్రదక్షణముగ శ్రీ స్వామిపుష్కరణిలో తెల్ల వారు సమయమున స్నాన మొనరించెదరు. ఈసమయమే పుణ్యకాల మని చెప్పెదరు. అప్పుడందఱును స్నానము చేసెదరు.శ్రీస్వామి పుష్కరణిచూచుట కాహ్లాదకరముగ నాలుగు ప్రక్కలున్నా ఇముఁ జేయు జనులతో నిండియుండును . ఈ సమయమందు శ్రీస్వామి పుష్కరిణిలో 360 తీర్థములు కలియుననియు,సమస్త దేవతలును ఆసమయమున వచ్చి స్నానమాచరించెద రనియు చెప్పెదరు. ద్వాదశినాడు సాయంకాలము వైకుంకాప్రాకారము తలుపులు వేయుదురు.

9 అధ్యయనోత్సవము.

ఇది 25 దివసములు జరుగును. ఈదివసములలో శ్రీ ఉత్సవరులు బ్రహ్మోత్సవములోవలె కళ్యాణమంటపములో నుందురు. ప్రతిదివసము తీర్మానమునకు ముందు అచ్చటాస్థానము జరుగును. ఈదివసములలో వేదాధ్యయనమును, ద్రవిడ వేదమగు ప్రబంధ పఠనము నుండును. దేవస్థానములో నేదైన వైదికలోపము తెలియక జరిగినయడల దానివి హరించుటకు నీ యుత్సవ మేర్పడినదని కొందఱి మతము. మఱికొండఱు దానిని తిరువధ్యయనోత్సవమునెదరు.

10 రథసప్తమి.

ఇది మాఖశుద్ద 7_వ దివసమునకుఁబేరు. ఈదినమునఁ దెల్ల వారుసరికి మొదటిఘంటఅయి శ్రీవారుసూర్యప్రభవాహనము మీఁద వజ్రకవచము మొదలగునవి సమర్పణఅయి సూర్యోదయమునకు ఉత్తరపువీథిలో వాహనముండవలెను. సూర్యప్రభవాహనముమీఁద వి శేషాభరణ భూషితులై సూర్య కిరణములు శోకగా దేదీప్యమానులై యుండు శ్రీవారు పాదాక్రాంతుఁడగు సూర్యున కభయమిచ్చురీతి శోభిల్లుచుందురు, తఱువాత చిన్న శేష, గరుడ, హనుమంత వాహనములు జరిగి చక్రస్నానమయి రెండవఘంట అయిన పిదప శ్రీవారి ధర్మ దర్శన మగుచుండగ సర్వభూపాలము, కల్పవృక్షము, చంద్ర ప్రభ వాహనములు జరిగి శ్రీవార్లు సన్నిధికి విజయం చేసిన తఱువాత రాత్రి ఘంటయి గుంపు లేక నే (గురువారం తప్ప) తీర్మా నమయి తలుపులు వేయఁబడును, రథసప్తమికి అర్థ బ్రహోత్సవ మని పేరుగలదు.