తాళ్ళపాక పదసాహిత్యం/మొదటి సంపుటం/రేకు 30
రేకు: 0030-01 ఆహిరి సం: 01-182 వైరాగ్య చింత
పల్లవి: | చెల్లుఁగా కిటు నీకే చింతింపఁగా పూరి- | |
చ. 1: | చెలఁగి నే మునుసేసినచేఁత లుండఁగా | |
చ. 2: | బిగిసి నామైనున్న పెనుకట్లుండఁగా | |
చ. 3: | పొదిలిన యింద్రియంబులు వెంట రాఁగా | |
రేకు: 0030-02 పాడి సం: 01-183 ఉత్సవ కీర్తనలు
పల్లవి: | చక్రమా హరి చక్రమా | |
చ. 1: | చుట్టి చుట్టి పాతాళము చొచ్చి హిరణ్యాక్షుని- | |
చ. 2: | పానుకొని దనుజుల బలుకిరీటమణుల | |
చ. 3: | వెఱచి బ్రహ్మాదులు వేదమంత్రముల నీ | |
రేకు: 0030-03 వరాళి సం: 01-184 వైరాగ్య చింత
పల్లవి: | వట్టియాసలకు లోనై వదలక తిరిగాడేవు | |
చ. 1: | చాల నమ్మి యీ సంసారమునకు సోలిసోలి తిరిగేవు | |
చ. 2: | మానితముగ దురన్నపానముల మత్తుఁడవై వుండేవు | |
చ. 3: | పామరివై దుర్వ్యాపారమునకుపలుమారునుఁ బొయ్యేవు | |
రేకు: 0030-04 శ్రీరాగం సం: 01-185 వైరాగ్యచింత
పలల్లవ: | ఈభవనమునకుఁ జూడ నేది గడపల తనదు- | |
చ. 1: | చెప్పించెఁ బ్రియము వలసినవారలకునెల్ల | |
చ. 2: | పుట్టించె హేయంపుభోగయోనులనెల్ల | |
చ. 3: | బెదరించె దేహంబు పెనువేదనలచేత | |
రేకు: 0030-05 ఖైరవి సం; 01-186 వైరాగ్య చింత
పల్లవి:ఎంతపాపకర్మవాయ యెంతవింతచింతలాయ
వింతవారితోడిపాందు వేసటాయ దైవమా
చ.1:చూడఁజూడఁ గొత్తలాయ చుట్టమొకఁడు లేఁడాయ
వీడుఁబట్టు ఆలుచాయ వేడుక లుడివోయను
జోడుజోడు గూడదాయ చొక్కుఁదనము మానదాయ
యేడకేడ తలపోఁత యెంతసేసె దైవమా
చ.2:నీరులేనియేఱు దాఁటనేర దెంతేలోఁతాయ
మేరవెళ్ల నీఁదఁడాయ మేఁటిఁ జేరఁడాయను
తోరమైన ఆస లుబ్బి తోవ గానిపించదాయ
కోరి రాకపోకచేత కొల్లఁబోయఁ గాలము
చ.3:తల్లీ దండ్రి దాత గురువు తానెయైననాచారి
వల్లభుండు నాకు మేలువంటిదాయ జన్మము
కల్లగాదు వేంకటేశుఘనుని పాదసేవ నాకు
మొల్ల మాయ నామనసు మోదమాయ దైవమా
రేకు: 0030-06 రామక్రియ సం: 01-187 వైరాగ్య చింత
పల్లవి:కుడుచుఁగాక తనకొలఁదిగాని మేలు
దడవీనా నోరు తగినయెంతయును
చ.1:చంపవచ్చిన కర్మసంగ్రహంబగు బుద్ది
గంప గమ్మక తన్ను గాచీనా
పంపుడుదయ్యమై బాధఁ బెట్టెడుయాస
కొంపలోన నుండనీఁగోరీనా
చ.2:శ్రీవేంకటగిరి శ్రీనాథుఁ డిందరిఁ
గావఁబ్రొవఁగ నున్నఘనుఁడు
దేవోత్తముని నాత్మఁ దెలియ కితరములయిన-
త్రోవ లెన్నిన మేలు దొరకీనా