తాళ్ళపాక పదసాహిత్యం/నాలుగవ సంపుటం/రేకు 351
రేకు: 0351-01 శ్రీరాగం సం: 04-297 వేంకటగానం
పల్లవి : | చేరి కొల్వరో యాతఁడు శ్రీదేవుఁడు | |
చ. 1: | అలమేలుమంగ నురమందిడుకొన్నదేవుఁడు | |
చ. 2: | ఘనమకరకుండలకర్ణముల దేవుఁడు | |
చ. 3: | కోటిమన్మథాకార సంకులమైన దేవుఁడు | |
రేకు: 0351-02 పళవంజరం సం: 04-298 కృష్ణ
పల్లవి : | ఇతఁడొకఁడే సర్వేశ్వరుఁడు | |
చ. 1: | పరమయోగులకు భావనిధానము | |
చ. 2: | కలిగి యశోదకు కన్నమాణికము | |
చ. 3: | తగిలినమునులకు తపములసత్ఫలము | |
రేకు: 0351-03 వసంతం సం: 04-299 తేరు
పల్లవి : | నిండెను లోకములెల్ల నెరి నితనికరుణ | |
చ. 1: | గరుడవేగమునఁ గదలె విజయరథ- | |
చ. 2: | అనిలవేగమున నదెవెడలె రథము | |
చ. 3: | వెలయ మనోవేగాన వేంచేసీ మగిడి రథ- | |
రేకు: 0351-04 బౌళి రామక్రియ సం: 04-300 రామ
పల్లవి : | దేవతలఁగాచిన దేవుఁ డితఁడు | |
చ. 1: | రావణుఁజంపి పుష్పకరథ మెక్కి సీతతోడ | |
చ. 2: | వసుధ యింతయునేలి వసిష్ఠాదులు వొగడ | |
చ. 3: | అలర రుద్రునెదుటనటు విశ్వరూపు చూపి | |
రేకు: 0351-05 మాళవశ్రీ సం: 04-301 రామ
పల్లవి:
నమో నమో దశరథనందన మమ్మురక్షించు
కమనీయ శరణాగతవజ్రపంజరా
చ. 1:
కోదండదీక్షాగరుఁడ రామచంద్ర
ఆదిత్యకుల దివ్యాస్త్రవేది
సోదించుమారీచునితలగుండుగండ
ఆదినారాయణ యసురభంజనా
చ. 2:
ఖరదూషణ శిరఃఖండన ప్రతాప
శరధిబంధన విభీషణవరదా
అరయ విశ్వామిత్రయాగసంరక్షణ
ధరలోన రావణదర్పాపహరణ
చ. 3:
పొలుపొంద నయోధ్యపుర వరాధీశ్వర
గెలుపుమీరిన జానకీరమణ
అలఘుసుగ్రీవాంగదాది కపిసేవిత
సలలిత శ్రీవేంకటశైలనివాసా
రేకు: 0351-06 కేదారగౌళ సం: 04-302 శరణాగతి
పల్లవి:
నిలచినవాఁడవు నీవేకాక దైవమా
నెలవై ప్రకృతి నేను నీలోనిసొమ్ములము
చ. 1:
తఱి నిరువదేను తత్వములుండఁగాను
యెఱఁగని యజ్ఞానానకెవ్వరు గురి
నెఱిఁ జైతన్యమెల్లా నీసొమ్మై వుండఁగాను
యెఱుకవొక్కటేకాక యెవ్వరున్నా రీడను
చ. 2:
దినలెక్క లూరుపులు తెచ్చి తెచ్చి వొప్పించఁగ
యెనలేని జన్మములకెవ్వరు గురి
వునికై బ్రహ్మాండము వొళ్ళునీకై వుండఁగాను
యేనసే ఆనందమేకా కెవ్వరున్నా రీడను
చ. 3:
అచ్చపు సుముద్రవంటాత్మ లణువైయుండగా
యిచ్చఁ గామక్రోథాల కెవ్వరు గురి
నిచ్చలు శ్రీవేంకటేశ నీవేలికవై యుండఁగా
హేచ్చేటిదాస్యమేకాక యెవ్వరున్నా రీడను