తల్లీ గిరిజా
శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ తెలుగు కీర్తనలు
రాగం: నవమాలిక(నిరోష్ఠక) తాళం: ఆది పల్లవి: తల్లీ! గిరిజా! తరగని కరుణా! హరునే గెలిచే జాణా! అనుపల్లవి: ఎద ఎదలో గల వెలుగా! ఇదిగిదిగో నిను గనెదా! గలగల సాగే నదిలో జననీ! చేలో కదిలే చిగురులలో చిలుకల ఈ కిలకిలలో కడలి కడా ఇసుకలలో చక చక సాగే కలలో కథగా నీ శ్రీ గిరియే జనులకు తోచే గురుచరణా శ్రయగతిచే అదియే సచిదానందదగా