తనదీగాక యిందరిదీగాక (రాగం: ) (తాళం : )

ప|| తనదీగాక యిందరిదీగాక | తనువెల్ల బయలై దరిచేరదు ||

చ|| కడుపూ నిండదు కన్నూ దనియదు | కడగి లోనియాకలియు బోదు |
సడిబడి కుడిచినకుడుపెల్ల నినుము- | గుడిచిననీరై కొల్లబోయె ||

చ|| చవియూ దీరదు చలమూ బాయదు | లవలేశమైన నొల్లకపోదు |
చివచివ నోటికడవలోనినీరై | కవకవ నవియుచు గారీని ||

చ|| అలపూ దోపదు అడవీ నెండదు | యెలయించుభంగమయిన బోదు |
తెలిసి వేంకటగిరిదేవుని దలపించు- | తలపైన దనకు ముందర నబ్బదు ||


tanadIgAka yiMdaridIgAka (Raagam: ) (Taalam: )

pa|| tanadIgAka yiMdaridIgAka | tanuvella bayalai daricEradu ||

ca|| kaDupU niMDadu kannU daniyadu | kaDagi lOniyAkaliyu bOdu |
saDibaDi kuDicinakuDupella ninumu- | guDicinanIrai kollabOye ||

ca|| caviyU dIradu calamU bAyadu | lavalESamaina nollakapOdu |
civaciva nOTikaDavalOninIrai | kavakava naviyucu gArIni ||

ca|| alapU dOpadu aDavI neMDadu | yelayiMcuBaMgamayina bOdu |
telisi vEMkaTagiridEvuni dalapiMcu- | talapaina danaku muMdara nabbadu ||


బయటి లింకులు

మార్చు




అన్నమయ్య పాటలు  
| | | | | | | | | | | | | | అం | అః | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | |


"https://te.wikisource.org/w/index.php?title=తనదీగాక&oldid=9825" నుండి వెలికితీశారు