తంత్ర దర్శనము
తంత్రము
మార్చు- తన్యతే విస్తార్యతే జ్ఞానం అనేన్, ఇతి తంత్రం ' - జ్ఞానాన్ని విస్తరించి, దానిని ఆచరించువారు రక్షింపబడతారు.
తనోతి విపులన్ అర్థన్ తత్త్వమంత్రసమన్వితాన్
త్రానంచ కురుతే యస్మత్ తంత్రం ఇత్యభిద్యతే
తాత్పర్యము: తత్త్వముల లోని జ్ఞానమును మంత్రము లతో కలిపి మోక్షము వైపు నడిపిస్తుంది కాబట్టే దీనిని తంత్రము అంటారు.
ఆత్మ మరియు పరమాత్మ
మార్చుతయోర్విరోధోయం ఉపాధికల్పితో
నవస్తావ: కశ్చిదుపాధిరేశా:
లీషాద్యమాయ మహదాదికారణం
జీవస్య కార్యం శ్ణృ పైంచకోశం
తాత్పర్యము: ఆత్మ కి మరియు పరమాత్మ కి మధ్య కేవలం వ్యక్తిగత పరిమితులు (ఉపాధి) మరియు వివిధ సామర్థ్యాలు మాత్రమే కలవు; అంతకు మించి వేరే ఏ భేదమూ లేదు. "నా లో ప్రాణము కలదు" అని పురుషుడు తెలుసుకొనేలా చేయటమే ప్రకృతి ధర్మము. ఓ మానవా! నీవు గుర్తుంచుకొనవలసినది ఇదే!!!'
ఏతా ఉపాధి పర జీవయోస్తయో
సమ్యాగ్నిరసేన పర న జీవో
రాజ్యం నరేంద్రస్య భటస్య ఖేతక
స్తయోరపోహేన భటో న రాజ
తాత్పర్యము: ఈ పరిమితులు, వివిధ లక్షణాలు ఆత్మలోనూ మరియు పరమాత్మలోనూ కలవు. ఈ భేదాలని కరిగించినచో, ఒక వ్యక్తి తన రాజ్యానికి తానే ఎలా రాజగునో, అలా ఆత్మయే పరమాత్మ అగును. ఈ భేదాలని తొలగించు. అప్పుడు ఆత్మ మరియు పరమాత్మ నీకు వేరుగా కనబడవు!!!
- న దేవో దేవం అర్చయేత్ - నీవు దైవము కాలేకపోతే దైవముని నీవు అర్చించలేవు
శివుడు
మార్చుసచ్చిదానంద విభవత్ సకల పరమేశ్వరాత్
అశిఛ్ఛక్తిస్తతోనాదో నాదాద్బిందు సముద్భవ:
తాత్పర్యము: సచ్చిదానందముకి రూపమైన పరమేశ్వరుడి నుండి శక్తి, శక్తి నుండి నాదము, నాదము నుంది బిందు ఉద్భవించినవి
శక్తి
మార్చుయా అనాది రూపా చైతన్య ధ్యాసేన
మహాప్రళయే సూక్ష్మా స్థితా
తాత్పర్యము: ఆద్యంతాలు లేని స్త్రీశక్తి సూక్ష్మములోనే మహాప్రళయము ఇమిడిపోయినట్టు, ధ్యానములోనే చైతన్యముగా ఇమిడిపోయినది
మాయా విభేధా బుద్ధిర్నిజం సజాతేషు నిఖిలజీవేషు
నిత్యం తస్య నిరంకుశా విభవం వెలెవే వరిధారుందే
తాత్పర్యము: తన భాగాలే అయిన జీవాలలో మాయ భేధబుద్ధిగా కనబడుతుంది. ఒడ్డు ని సముద్రమే పట్టి ఉంచునట్లు, ఆత్మ యొక్క విభవాన్ని (పరివర్తనని) మాయ పట్టి ఉంచుతుంది. తన ఆత్మ మాత్రం నిరంకుశంగా ముందుకెళుతుంది.
ప్రశక్తిమయ: సాక్షాత్ త్రిధ:సౌబిద్యతే పున:
బిందుర్నాదో బీజమితి తస్య భేదా: సమీరితా:
బిందు: శివాత్మకో బీజం శక్తిర్నాదస్తయోర్మితా:
సమాయావ: సమాఖ్యత:సర్వాగమ విశారదై:
తాత్పర్యము: పరాశక్తి బిందు, నాద మరియు బీజాలుగా విడిపోతుంది. బిందువు శివుడైతే బీజం శక్తి. ఈ రెండిటి మధ్యన ఉండే సంబంధమే నాదము
- సర్వో మమయాం విభవ: - ఇదంతయూ నా రూపాంతరమే
- అహం ప్రకృతిరూపా చేత్ సచ్చిదానంద ప్రయాణ - నేను ప్రకృతి రూపంలో కనిపించిననూ సచ్చిదానందములో నిగూఢమై ఉన్నాను
శివ-శక్తుల సంగమము
మార్చుఇచ్ఛా శైవ స్వఛ్ఛా సంతతా సమవాయినీ సతిశక్తి:
సచరాచరస్య జగతో బీజం నిఖిలస్య నిజనిలినస్య
తాత్పర్యము: స్వచ్ఛమైన శక్తి శివుడికి ఇష్టపూర్వకంగా సతియై, సకలచరాచర సృష్టి అనే తన సంతతికి బీజమై, తనలో దాచుకొన్నది.
- శివ-శక్తి సంయోగాత్ జయతే సృష్టికల్పనా - యావద్ సృష్టి శివ-శక్తుల సంయోగముతోనే జరిగెను
- పుం-ప్రకృత్యాత్మకో హంసాస్తదాత్మకం ఇదం జగత్ - హం అనగా శివుడు. సా అనగా శక్తి. శివ-శక్తుల హంసద్వంద్వ సంగమమే ఈ జగత్తు.
పరమానందము/అఖండ సత్యము
మార్చు- నిరతిశయ ప్రేమస్పదత్వం ఆనందత్వం - అమితమైన ప్రేమయే పరమానందము
- స హ ఎతావన్ అస యథ స్త్రీపుమాంసౌ సంపరిస్వక్తౌ - అఖండ సత్యము కౌగిలి లో ఒదిగి ఉన్న స్త్రీపురుషల వలె అగుపించెను
ప్రాపంచికం
మార్చు- నశైవం విద్యతే కవచిత్ - దేవుడిది కాని దానికి అస్థిత్వమే లేదు
- యదిహస్తి తదం యత్రా, యన్నెహస్తి న తత్ క్వచిత్ - ఇక్కడ ఉన్నదే అక్కడా ఉన్నది, ఇక్కడ లేనిది మరెక్కడా లేదు
మూలాలు
మార్చు- https://madhyamacharatantra.wordpress.com/2012/11/20/59/
- The Garland of Letters (Varnamala) by Sir John Woodroffe (Arthur Avalon)