ఢిల్లీ దర్బారు/మొదటి ప్రకరణము

ఢిల్లీ దర్బారు

మొదటి ప్రకరణము

ఢిల్లీ పూర్వవృత్తాంతము.

ఆర్యావర్త చరిత్రమునఁ బ్రసిద్ధినొందినఁ బట్టణములలో నగ్రగణ్యము ఢిల్లీ. ఇది యనేకులచే ననేక యుగముల ననేక నామములచేఁ బిలువఁబడుచుండెడిది. దీనికి నాధునిక సుప్రసిద్ధ నామము ఢిల్లీయే యైనను, బ్రాచీన కాలమున సుప్రసిద్ధమయిన పేరు ఇంద్రప్రస్థపురము.

ఇంద్రప్రస్థము.

ఈనగరము పుట్టుటకుఁ బాండవులు కారణము. కురు సంతతి హస్తినాపురమున రాజ్య మేలుచుండిరి. పాండురాజు పరలోకమున కేగినపిదపఁ గొంత కాలమునకు ధృతరాష్ట్రుడు పాండుకుమారులకుఁ బాలు పంచియిచ్చెను. వారి భాగమునకు వచ్చినది. కురుక్షేత్రమునందలి ఖాండవప్రస్థము.

ఖాండవప్రస్థమనఁగా వ్యాప్తిగల యడవి. ఈయటవి ప్రదేశమున మూలనివాసు లుండెడివారు. వారనార్యులు. వారికి దక్షుకులని పేరు. యుధిష్టరుఁ డార్యసిద్ధాంత సంరక్షకుఁడు. అగ్ని బ్రాహ్మణరూపమును ధరించి ఖాండనదహనము నపేక్షించుటవలనను, అనఁగా ఆర్యులగు బ్రాహణుల ప్రేరేపణవలనను, దిగ్విజయా పేక్షుం జేసియు, యుధిష్ఠి రానుజుండగు నర్జునుఁడు కృష్ణ సాహాయ్యమున మూలనివాసులను సాధించి యడవి ప్రదేశముగ నుండిన ఖాండవప్రస్థభాగమునంతయు నివాస యోగ్యముగ నొనర్చెను. తన్మధ్యమునఁ గట్టఁబడిన ధర్మరాజు ముఖ్యపట్టణమే ఇంద్రప్రస్థము, ఇంద్రుని సంరక్షణ దానికిఁ గలదను నమ్మకమువలనను సీనగరమాతని, యమరావతికి సౌందర్యమున నీడగుట వలనను దీనికి పేరు గలిగినట్టు తోచుచున్నది. పాండవుల కాలమున నీపట్టణ రాజము మిక్కిలి వృద్ధియయి 'పురోత్తమ' మనిపించుకొనియెను. ఇచ్చటనె ధర్మరాజునకు మూలనివాసులలో నుత్తమోత్తము డగు మయుఁ డను శిల్పకళాధురీణుఁడు సాటిలేని సభామంటపమును నిర్మించి యిచ్చెను. అందే ధర్మ రాజు రాజసూయయాగము చేసెను, ముందావిషయము వ్రాయఁబడును. భరత వంశలగు వీరులు రాజ్యము చేసినంత కాల మింద్రప్రస్థపురము దలయె త్తికొని యుండెను. కృష్ణుని ప్రపౌత్రుఁడగు వజ్రనాభుడు, దక్కి నయదు వంశమంతయు నశించిన తరువాత, నిటనే రాజ్యాభిషిక్తుండయ్యెను. శక వంశజులకిదియె రాజధానిగ నుండెను. క్రీ. శ. 395 సం|| మున విక్రమాదిత్యుఁడను బికుదువహించిన రెండవ చంద్రగుప్తుడు ఢిల్లీనగరమున నిలిపిన లోహ స్తంభముమీఁది శాసనమునుబట్టి యిదియె గుప్తరాజులకుఁగూడ ముఖ్యపట్టణముగ నుండెనని తెలియుచున్నది. గుప్తులకుఁ దరువాత నిది రాజధానిగా నుండినదియు లేనిదియుఁ జెప్పవలనుపడదు. కనింగ్హాముగారి వ్రాతననుసరించి తోమర వంశమునందలి యనంగ పాలుఁడు పుట్టునప్పటికి ఢిల్లీ నామాన శేషమై యుండెనని తెలియవచ్చుచున్నది.

అజమీర్ పట్టణము.

అతఁడు దీనికి మరలఁ బ్రాణమువోసి ప్రజలను జేర్చినట్లును తోఁచెడిని. ఇది పదునొకొండవ శతాబ్దమునందలి సమాచారము.

పృధ్వీరాజు.

ఇతని సంతతి వారొక శతాబ్దకాలము పరిపాలించి యజిమీరు రాజ్యాధిపతులగు చౌహణులలోని వీసల దేవునిచే నోడింపఁబడిరి. నాఁటినుండి చౌహణ్ రాజులు ఢిల్లీకి నాధు లయిరి. వీసల దేవుని మనుమఁడే లోక ప్రసిద్ధిగనిన పృధ్వీ రాజు. ఇతఁడు అజిమీరు ఢిల్లీల రెంటికిని రాజయి. ఢిల్లీయందు “లాల్కోట'యును, దానికి బల మొసఁగ, మఱియొక కోటయును గట్టిం చెను. కొంతకాల మీకొత్తగ నేర్పడిన పట్టణమునకుఁ బృధ్వీ నగరమని పేరుం డెడిది. నేటికీని కుతుబ్ మినారు చుట్టు పట్ల నీతనిచేఁ గట్టఁబడిన దుర్గపు శిథిల కుడ్యములు చూపట్టు చున్న వి. ఇతఁడు కనూజ్ రాజును తనకు విరోధియు నగు జయ చంద్రుని పుత్రిక యగు సంయుక్తను గాంధర్వ వివాహమున క్రీ శ. 1175 – సంవత్సరమునఁగొని తరువాత మామగారితో ప్రచండముగఁ బోరి భార్య శౌర్యము వలన జయమందెను.[1]

1182-సం|| మున నితఁడు చందేరాజును జయించెను. కాని యీతని యశస్సునకు హేతువు లివి యెవ్వయుఁ గావు. భరతవర్షము నాక్రమింపఁ బ్రారంభించి దాడి వెడలి బయలు దేరి నచ్చిన మహమ్మదీయ సైన్యమహా సముద్రమున కడ్డకట్టగా నిలిచి, ధైర్య ఫైర్య పరాక్రమములతో, బోరుటయె యీతని కజరామర కీర్తిని సంపాదించి పెట్టినది.

పాంచాల దేశము మహమ్మదుగోరి స్వాధీనమై యుండెను. బిటుండా వఱకును నతని పటాలములు వ్యాపించి యుండెను. పృథ్వీరాజ నేకులగు నాయకుల సమకూర్చుకొని గొప్ప సైన్యముతో నాపట్టణము పైకి వెడలెను. మహమ్మదుగోరి యితని నెది ర్చెను. స్థానేశ్వరము నకును గర్నాలునకును మధ్య ప్రదేశమున నిప్పుడు ' తిరౌరి ' యనఁబడు నారాయణ్ ఒద్ద ఘోర యుద్ధము జరిగెను. పృథ్వీరాజు గోరీ పై కురికి కుడిభుజమున ఖడ్గముఁ జొప్పించెను. 'ఇతని భటుఁడొక్కం డీతనినిం దక్షణమే మోసికొని పోవకున్న నా దెబ్బతోడ నె యితఁడు చచ్చినవాఁడె" యని 'ఫెరిస్తా లిఖించి యున్నాడు. మహమ్మదీయ సైన్యము చెల్లా చెదరయి పోయెను. పృధ్వీ రాజు సంపూర్ణ విజయమందెను. హిందూ చరిత్రకారులు గోరీ యీ విధమున నేడుసారు లోడిపోయి యేడుసారులు వదలి పెట్ట బడెనని వ్రాయుచున్నారు. ఇది ఎట్లున్నను గోరీ గొప్ప పరా భవ మందెననుట మాత్రము నిజము. పృధ్వీ రాజునకు వైరులగు జయచంద్రుఁడాదిగాగల ననేకావనీశులు మొదటి నుండియు గోరీకి సాయ మొనర్చిరి. కాని వారికి క్రీ! శ. 1198 వఱకును మనోభీష్ట మీడేర లేదు. ఆ సంవత్సరమున గోరీ 1,20,000 సైన్యమును జేర్చుకొని పృధివీరాజుకు “నీవు మహమ్మదీయుఁ డైనను గమ్ము. లేకున్న సమర మొసంగు”మని వార్తఁబం పెను. ,

అతఁ డిద్దానిని తృణీకరించి రెండు సంవత్సరములకు మున్ను గోరీని ప్రాణావ శేషునిఁ జేసి వదలిన స్థలమునందే మరల యుద్ధమునకు సన్నద్ధుఁడయి “నీకు నీ ప్రాణముల పై యాశ లేదేని నీ సైనికుల కైననుండదా ! వారినైన సుఖంబుగ నుండనీ రాదా” యని పరిహసించుచుఁ బ్రత్యుత్తర మంపెను. గోరీ విశ్రమమునకుఁ గొంతకాలమడిగెను. ఆ యొడంబడికను నమ్మి రాజు సైన్యములు హాయిగ నిదురఁ జెంది యుండెను. అట్టి తరుణమున గోరీ మోసముచే దన భటులను హిందు స్త్రీలమీదికి గవి యించెను. హటాత్తుగ పైఁబడిన మహమ్మదీయ మహాంభోనిధిని దరియింప రాజుబలము లసమానశూరత్వము బోరిరి గాని ఫలము లేదయ్యె. పృధ్వీ రాజును మహమ్మదీయులు - చెఱవట్టి చంపివేసిరి. ఢిల్లీ నగరము మహమదుగోరిబాని సీడగు కుతు బుద్దీను వశమయిపోయెను. ఇంతటితో భరతఖడంబు హిందూ సామ్రాజ్య మంతరించెను.

బానిస వంశము.

క్రీ. శ. 1206 న సంవత్సరమున ఢిల్లీ రాజధానిగం చేసి కొని కుతుబుద్దీను రాజ్యము ప్రారంభించి తన పేర బరగు మసీ దును గట్ట మొదలిడెను. కుతుబ్ మినారును నిర్మించెను.. ఇతని యల్లుఁడగు నల్తమషు దీనిని బూర్తిగావించెను. ఈ వంశములోని నాసిరుద్దీను కాలమున రాజ్యములో పలను "వెలుపటను దిరుగు బాటులును కలహములును జరిగెను. కాని యితడు దనకంటె బూర్వమునందలి రాజులవలె దుర్మార్గుఁడును వృధావ్యయ పరుఁడునుగాక నిర్మలమగు నడవడిక గలవాఁడు. ఇతఁడొక విషయమున నెల్లరకును నా దర్శకుఁడనియే చెప్ప నొప్పును. ఢిల్లీ రాజ్య పరిపాలకుఁడుగ నుండియు నీతఁడు దన స్వార్ర్జితము వలన నే జీవయాత్రగడపెను. పారసీ భాషయందలి గ్రంథముల ప్రతులు వ్రాసి యితఁడు దన కర్చులకు సంపాదించుకొను చుండెను. ఇతని ప్రోత్సాహముననే పారశీక భారత వర్షముల' చరిత్రియగు ' తాబకాతి నాసరి' యనునది రచింపఁబడెను. ఇతనికి దరువాత నీతని బానిసయు దండనాయకుఁడును నగు గ్యాసుద్దీన్" బల్బను రాజ్యమునకు వచ్చెను. ఇతని కాలము సరికి మొగలా యీల దాడి యెక్కుడయినందునఁ బండ్రెండుగురు మహమ దీయ ప్రభువు తనికడం జేఱియుండి. ఢిల్లీ యందలి నీధుల కీతఁడు వీరి పేరులఁ బెట్టను. క్రీ. శ. 1288 లో నీ బానిసనంశ పురాజును జంపించి జలాలుద్దీన్ ఖల్టీ సీహాసనము నాక్రమించుకొనెను.

ఖిల్జీవంశము.

జలాలుద్దీ: ఖల్జి బహుపరాక్రమశాలి. ఢిల్లీ ద్వారము వఱకును నాలుగుమారులు ప్రయాణమై వచ్చిన మొగలాయీలు నితఁడు తిగుగఁగొట్టి యంద నేకులను దనమతమునకుఁ జేర్చు. కొని తన కొలువునందే యుంచుకొనెను. వారికిఁ బ్రత్యేకించి యొక పుర భాగమును గట్టియిచ్చి దానికి “ మొగల్పుర 'మని పేరి డెను. ఇతనినిజంపిచి గద్దెక్కిన యల్లాయుద్దీను మొగలా యీలను రెండుమారు లెదిర్చి యోడించి తన విడిదిని బల పఱుచుకొనుటకుఁ గోటను గట్టుకొనెను. (క్రీ. శ. 1299). ఇదియె నూతన ఢిల్లీ. దీనిని బురాతన డిల్లీతో , జహన పానా అను పేట గలిపి వేయుచున్నది.

తు ఘ్ ల ఖ్ వం శ ము.

ఖిల్జీవంశ మంతరించి గ్యాసుద్దీన్ తుఘ్ లక్ రాజ్యా రూఢుఁడయిన తోడనే నతఁడు (క్రీ. శ. 1321) కి నాలుగు మైళ్ల దూరమున తుఘ్ లఖా బాదును నిర్మించెను. కాని యిప్పు డది నిర్జనముగా నున్నది. క్రీ. శ. 1825 -- మహమ్ముదు తుఘ్ లఖ్ సింహాసనమునకు వచ్చెను. అతని రాజ్య కాలములో బటూ టాయను ప్రవాసికుఁ డొక్కఁడు ఢిల్లీని దర్శిం ప వచ్చెను. అత డప్పటి ఢిల్లీ నిగూర్చి యిట్లు వ్రాయుచున్నాడు:-- " అది గొంచె మించుమించుగ 'నెడారివ లె నుండెను. అందుఁ గట్టడములు చాలతక్కున. గృహస్థు లిండ్లు వదలిపోయి యుండినందున నది పూర్తిగఁ బాడుపడియుండెను. అందు వలన లోకమునందలి యత్యుత్తమ నగరమున సత్యల్పసఃఖ్యగల గృహస్థులుండుట తటస్థించెను.” ఇదతిశయోక్తి యేమియును, లేదు. " " పేరువహించిన ఢిల్లీ నగరమును గుడ్లగూబలకు నివా సముగను, అటవి మృగముల కాస్థానముగను వదలిపోవు చున్నాను.” అని "ఫెరిస్తా వ్రాసియున్నాడు. ఇట్లున్నను ఇది మిక్కిలి మహత్వముగల పురము. సౌందర్యమును బలమును .

దీనియందు మేళవమంది యున్నవి. దీని గోడలకు సమానమగు నవి లోకమున మఱి యెచ్చటను గానము. హిదూస్థానమున నిద్దియె విశాలతమము హిందూస్థానమున నేల, మహమదీయ మతము వ్యాపించిన పౌరవాత్య దేశముల నెల్ల యనియే చెప్పు వచ్చును. నాలుగునగరము బొక్కటితో నొక్కటి చేరి యీ నగరమయియున్నది. దీని కోటగోడల వెడలుపు పదునెకండు మూరలు. ..ఇందులను మసీదు మిక్కిలి గొప్పది. కట్టడపు వైశా ల్యమునను సొంపును దానిని జయిం చున దింకొకటుండదు. ఢిల్లీ ముహమ్మదీయులకు లోఁబడక మున్ని ది హిందువుల 'ఎల్ బుర్ ఖానా' యను దేవాలయముగ నుండెడిది. తరువాత నిది మసీ దుగ నుపయోగింపఁబడెను. దీని యంగణము నందొక ఖానా గలదు. మహమదీయ నగరములఁ దెచ్చటను దీనికిఁ బ్రతివచ్చు నది లేదు. దీని పైనుండి క్రిందికిఁ జూచిన వయోవంతులగు మను ష్యులు చిన్న బిడ్డలవ లెఁ గానుపింతురనిన దీనియౌన్న త్యము దెలియఁగలదు, ఆయా వరణమునుదే యొక స్థూల స్తంభము గలదు. సప్త ఖనులనుండి దీనినిగట్టుటకు శిలలు గొనిరాఁ బడెనఁట. దీని పొడవు ముప్పది మూరలు చుట్టుకొలత యెనిమిది మూరలు. ఇది యుత్యాచ్భతముగదా" అని బటూటా వ్రాయు చున్నాడు. ఈ స్తంభ మశోకుని స్థంభమని తోచుచున్నది. శ. 1351 --ఫిరోజుషా ప్రస్తుతము హుమాయూను సమాధి యెల్లగఁ గల ఫిరోజా బాదును గట్టెను. అతని కాలమునఁ బ్రజలు మిక్కిలి సౌఖ్యమందిరి. కాని యతనికిఁ దరువాతి రాజులు బలహీనులు నవివేకులు నై నందున లోకప్రసిద్ధుడగు 'తయమూరులంగు ' ఢిల్లీ జొచ్చి యవాచ్యంబగు క్రౌర్యముతో క్రీ. శ. 1398 లోఁ జిన్నలు పెద్దలు, స్త్రీలు పురుషులు, నను వివక్షత లేకుండ నందఱను ఖడ్గమువాతనఱికి, నగరమునందలి ద్రవ్యము నంతయుఁ గొల్ల కొట్టుకొని పోయెను. అతఁడు దీసికొని పోయిన ధనమింత యని లెక్క పెట్టుటకుఁగూడఁ గాదని చరిత్రకారులు వ్రాయుచున్నారు.

తైమూరు లంగ్

ఇతఁడు వెడలి పోయిన రెండు మాసముల వఱకును ఢిల్లీ యరాజకముగనుండెను. ఇక్బాలనువాఁడు గొంత పరిశ్రమచేసి ఢిల్లీ యందలి యల్లకల్లోలమును మాన్చెను. బాదుషానా యగు మహమ్మదీతని మరణానంతరము మరల సింహాసనము నెక్కెను. కాని ఢిల్లీకి బయట నితని శక్తిసాగలేదు. (1412)

ఆఫ్‌గన్ రాజవంశావసానము

ఇతఁడు పరలోక గతుఁడైన తరువాత సయ్యదు వంశమువారు పరిపాలించిరి. వారిని లోడీవంశము మ్రింగివేసెను. ఈ వంశములో రెండనవాఁడగు సికందరులోడీ ఢిల్లీని వదలి యాగ్రాను రాజధానిగ నేర్పఱుచుకొనియెను. ఇతని కుమారుఁడు సికందరు మిక్కిలి దుర్మార్గుడై నిరంకుశాధికారముతో మెలఁగఁ బ్రారంభిచుట వలన శయమూరు వంశస్థుఁడగు బాబరు హిందూస్థానసామ్రాజ్యరమను గైకొనుట సులభ సాధ్యమయ్యెను. లోడీ బాదుషాహ పానిపత్ కురుక్షేత్రమున నోడింపఁ బడెను. జహిరుద్దీన్ మహమదు. బాబరు బాదుషాహ యయ్యెను.

మొగలాయి వంశము

బాబరు నాలుగుసంవత్సరములు (1526-1531) రాజ్యము చేసి చనిపోయెను.

బాబరు

తదుపరి యతని పుత్రుఁడు హుమాయూను బాదుషాహయై దన రాజధానిని మరల

మార్చి యచ్చట నింద్రప్రస్థముండిన ప్రదేశముననే ఒక్క కోటను గట్టించెను. దానినే “పురానాఖిల్లా' (పాతకోట) యందురు. ఇతనిని ఓడించి క్రీ|| శ|| 1540 లో 'కాబూలు' నగరమునకుఁ బారదోలి, షీర్
ఫ్లురానా ఖిల్లా


షాహ యనుసతఁడు పురమును సంరక్షింపఁ గ్రొత్తకోట నొక దానిని నిర్మించెను. లాల్ట ర్వాజాయను దగ్గద్వారమిప్పటికిని

యతనికార్యవైభనమును జాటుచున్నది. ఇతని పుత్రుడిప్పటి

కిని గల సాలింఘరు కోటను గట్టించెను. హుమాయూను. రెండవ మారురాజ్యమునకు వచ్చెను. అతని సమాధి యీసాలింఘరుకుఁ బ్రక్కన నే యున్నది. అక్కా-లవు. శిల్ప కళాభివృద్ధిని యిది బహు బాగుగఁ బ్రదర్శింపు. చున్నది. అక్బరు చక్రవర్తి హుమాయూను మరణము నకు దరువాత క్రీశ. 1556 లో సింహాసనా రూడుడయ్యెను. ఇతఁడు సర్వసాధారణముగ నాగ్రా యందే నివసించుచుండెడి వాఁడు. ఇతని యాస్థాన కవీశ్వరుఁడును మంత్రియు నగు ' అబుల్ ఫజలు' దన ' అయినీ అక్బరీ'లో ఉల్లీస్ వర్ణించి యున్నాఁడు గాని యావర్ణ న నలన నది రెండవకట్టణమని గోచరము గాక మానదు.


జహాంగీపునూర్జ హానుల వివాహ సంవత్సరము (క్రీ. శ. 1611) న విల్లియమ ఫించు ఢిల్లీని దర్శించెను. అప్పటి రాజు ధానియగు నా గ్రానుండి యతఁడు లాహోరునకుఁ బ్రయా ణము) సాగించుచు గ్రోనయందు ఢిల్లీలో నిలచెను. " నవ

ఢిల్లీ న గ ర చరిత్రము. దుర్గములును నేబది రెండు ద్వారములును గలదను ప్రఖ్యాతిఁ గాంచిన ప్రాచీన ఢిల్లీ శిధిలాంగములు నలపటఁగాన నగును.' అందిప్పుడు నినసించునవి గుడ్లగూబలు. దీనికి ననతి దూరమున యమునా నది పై పదునెకండు కమానుల, మెప్పు చిన్న వం తెన యొకటి గలదు. ఇటనుండి గొప్ప మ్రాకుల నల్ల ని చల్లని

జహంగీరు. అక్బ రు. నీడల చే నావరింపఁబడిన రాచ బాటఁ బట్టి పోయిననిప్పటి రాజుగారి తాతయగు హుమాయూను సమాధి చేరుదుము. మిక్కిలి విలువ గల రత్నకంబళములు పరుపబడిన యొక విశాలమగు భవనమధ్యమున నితనిగోరీ యున్నది. దీని పై నెప్పు


డును స్వచ్ఛమగు తెల్లని పచ్చడము గప్పియుందురు. దీని కెదుటి పార్శ్వమునను, దీని నడి నెత్తికి సూటిగను నమూల్య మగు ' షామియా' ( Semiane)విందులు గురిపించు చుండును. అచ్చటచ్చట చిన్న చిన్న మేజాల పై ఒక కొన్ని గ్రంథములు గాన నగును. వీని ప్రక్కన నె హుమాయూనువరకత్తి, పాద

హుమాయూన్ గోరీ.


రక్షులు మున్నగునవి ప్రదర్శింప బడియున్నవి. నగరమునను నగరప్రాంతములను రమామి యిరువదిగురు పఠాను రాజుల దివ్యసమాధులు గలపు, భరతవర్షపురాజు లెల్ల రును నీ పురమునందె పట్టభద్రులు గావలెను. లేకున్న వా రాక్రమికులుగ నెన్నఁబడుదురు. సుందరోద్యాన వనముల చేతను

ప్రాచీనశోభాచిహ్నములగు కట్టడముల చేతను జుట్టఁబడిన బయ
ఔరంగజేబు


లు ప్రదేశమున నీ ఢిల్లీ నగరమున్నది”యని వ్రాయుచున్నాఁడు.జహంగీరు కుమారుఁకు షాహజహాను దన తండ్రి తాతలు ఢిల్లీకిఁ గనుపఱ చిన యలక్ష్యము ను రద్దుపరచనో యన నిప్పటి ఢిల్లీని క్రీ|| శ || 1638లో షాహ జహానాబాద్ అను పేరఁ గట్టించి దానిలోఁ దన మహలును జుమ్మా

షాహజహాను

మసీదును నెలకొల్పెను. ఇతని కాలమునకుఁ దరువాత నె ప్పుడో యొక కొద్ది దినములు దప్ప నెల్లప్పుడును నీ నగరమె మొగలాయీల రాజధాని నుండెడిది. షాహజహాను ఆ గ్రా వదలి ఢిల్లీని జేరుటకీ పురమెక్కుడు సమశీతోష్ణ స్థితులుగలదగుట చేతనని తెలియ

వచ్చుచున్నది. బాదుషాహయును వర్తకులును షాహాజహానాబాదులో నివసింతురు.
నాదిరుషాహా


ప్రభువులలో ననేకులును బీదసాదలును పురాతన ఢిల్లీలోనిండ్లు గట్టుకొనిరి.. శ్రీశివాజి యీనగరమును కీ|| శ|| 1666 లోదర్శించెను. ఔరంగ జేబు బాదుషాహ కాలమునఢిల్లీపూర్వ వైభవమున నుండెడిది. ఈవంశమునందుఁ గడ పటివాఁడు మహమ్మదుషాహ. ఇతని కనంతరము సీంహాసనారూఢులయిన మొగలాయీలు నామమాత్రచక్రవర్తులు. మహారాష్ట్రులు "మొగ ల్సామ్రాజ్యము నందెక్కుడు భాగమును లోబరచు కొనుచుండిరి. ఇంతలో(1739) తయమూరులుగు సంతతి వాఁడగు నాదిర్ షాహాదండెత్తివచ్చి తయమూరుమాదిరి - యితడును గొల్లకొట్ట మొదలిడెను.సలుబడియెనిమిది దినములు పురమును దోఁచుకొని, షాహజహాను బాదుషాహవలనఁ జేయింపఁబడి లోకప్రసిద్ధి చెందిన మయూరాసనము • నితర ద్రవ్యములతోగూడ, నపహరించుకొని పోయెను. | శ | 1759 లో ఢిల్లీ

కీ. శ. 1857 న సంవత్ససంపూర్ణముగ మహారాష్ట్రుల స్వాధీన మాయెను. కొంత కాలము ఢిల్లీ కై పోట్లాటలు జరిగెనుగాని 1788 లో మహారాష్ట్ర సైన్యము బాదుషాహనగరున స్థిరముగ స్థాపింపఁ బరెను.పదునారు సంవత్సరముల కాలమీమహారాష్ట్ర వీరు లేక చ్ఛత్రాధిపత్యముగ నుత్తర హిందూస్థానమునంతయు "నేలిరి.క్రీ! శ! 1803 లో లార్డు లేకు ఢిల్లీ యుద్ధమున వీరినోడించి నగరము నాక్రమించుకొని యదివఱకు బొత్తిగ సంతరింపక నామావ శేషుఁడై యుండిన రెడవషాఆలం బాదుషాహనుదన సంరక్షణమం దుంచుకొనెను. క్రీ.శ.1857వ సంవత్సరమున జరిగిన సైనికుల తిరుగుబాటు వఱకును నాంగ్లేయులు బాదుషాహ పేరుతోడనే ఢిల్లీ నేలుచుండిరి. ఆమహాక్షోభ కథ యిట వ్రాయు టనవసరము. దానిని బ్రిటిషునా రణచుటయందు విజయులై తమ చేతినుండి యూడి పోయిన ఢిల్లీని మరల వశపఱచుకొనిన తోడనె బాదుషాహ నామమును దుడిచివైచిరి. కొంత కాల మాపట్టణమును "సైనిక పరిపాలన(Military Government) క్రింద నునిచిరి. బ్రిటిషు భటుల నేకులు చంపఁబడుచు వచ్చినందున ఢిల్లీ పౌరులందరును బట్టణమునుండి నెడలఁ గొట్టఁబడిరి. కాని యచిర కాలములో నే హిందువులును, 1858 సంవత్సర ప్రారంభమున మహమ్ముదీయులునుఁ జేర గలిగిరి. అప్పుడె సైనిక రాజ్యాంగము వోయి దివానీ పరిపాలన (Civil Government) ప్రారంభమా

యెను. నాఁటినుండి నేటివఱకును ఢిల్లీనగరము శాంతి మెయి నూతన మార్గములఁ దన కాలము గడపుచున్నది.

1876 న సంవత్సరమున యువ రాజుగ నుండి ""నిన్న నేడు గతించిన నష్టమైడ్వర్డుగారు దమసాన్ని ధ్యముచే నలంకరించిన దీనగరమునే. క్రీ|| శే|| 1877 వ సంవత్స రారంభదినమున విక్టోరియా మహారాష్టి, భరతఖండమునకుఁ జక్రవక్తినియయ్యేసనుటఁ జాటిన దీనగర మే. దాని కిరువదియారు సంవత్సరము లీవల సప్తమైడ్వర్డు చక్రవర్తి త్వము నెఱుక పఱుప రాజప్రతినిధియగు లార్డుకర్జను మహాదర్బారు చేసిన దిచ్చట నె.ఇట్టి చరిత్రముగల 'ఢిల్లీని గురించి యిఁకఁ గొన్నిసంగతులు ముందు ప్రకరణమునఁ గనుఁడు.

ఆకాశమునుండి , కనఁబడు ఢిల్లీ

  1. (మహమ్మదీయ మహాయుగమున నీ విషయమంతయుఁ జక్కగ వర్ణింపఁబడియున్నది. విస్తరభీతిచే నిట విరమించితిమి).