ఢిల్లీ దర్బారు/మూడవ ప్రకరణము

ఢిల్లీ ద ర్బారు

2. శ్రీ రాజ దంపతులు..

శ్రీ రాజదంపతులు.

జార్జి బాల్య క్రీడలు.

జార్జిచక్రవర్తి క్రీ! శ|| 1865 సనత్సరమున జూన్ నెల 8వ తేదీ మారల్బరో సదనమున జన్మమందెను. అదే నెల 7వ తేది మహా రాజీ విక్టోరియాగారి సన్నిధియం దీ-బిడ్డడు కై స్తవ మతాచారము ననుసరించి జ్ఞానస్నానమను సంస్కారము మొందెను. ఇతని శైశవము నందు విశేషము లెవ్వియు లేవు. ఏడేండ్ల బాలుఁడగు నప్పటి కితఁడు నావికా సైన్యమునకు నర్హు డని నియమింపఁబడి నాఁటినుండి యీతని విద్యాదిపరిశ్ర మలు తదనుసరణముగఁ బన్నఁబడెను. సెలవు దినములలో నొక కొన్నిటి నితఁడు దన తలితండ్రులతో డెనార్కు రాజు గారి యాతిధ్యము క్రింద కోవన్ హేగను పురమునఁ గడపుట తటస్థించెను. కోపన్ హేగను రేవుపట్టణము, అచ్చట సము ద్రము మిక్కిలి యిఱుకు. ఆవల నీవల గొప్ప సముద్రభాగము లుండి యా సముద్ర భాగములను గలిపి వేయుట కయి భగ

వంతునిచే నియమింపఁబడిన యిట్టి యిఱుకు జలభాగమునకు జలసంధి యని పేరు. పై నుడివిన - జలసంధి యుదకముల రాకొమరులు జలకమాడుటకలదు. అట్టి తరుణముల మన జార్జి 'నాబిడ్డఁడె నిర్భయముగ నందఱకంటే మున్ను నీటఁ జొరఁబడు చుండును. అప్పుడె యితనికిని దరువాత రుష్యా జారుపదము నధిష్టించిన నికలసన్ అను నితని బంధువునకును మైత్రి సమ కూరెను. మొదటినుండి సాహసక్రియలయు దితని కభిరుచి మెండని నుడువఁబడియున్నది. ఏపనికిఁ బూనినను మిక్కిలి యుత్సాహముతోడఁ బూనువాఁడు. గుఱ్ఱపు స్వారి. చేయు నెడల నెల్లను బ్రారంభమునందే యితఁడు గనుపఱచుచు వచ్చిన సౌలభ్యమును జూచిన ముందీతఁడు చక్కని రౌతు గాఁగలఁడని విశదముగఁ దెలియుచుండెడిది. గొప్ప వేట కాండ్ల సమూహ ములను . జేరుటకు నాసక్తి తో నితఁడు నెడలి, వేటకుక్కలతో సమముగఁ దనయశ్వమును బరువెత్తించుచుండును. ఇ గ్లాండు నందు శీతకాలమున మైదానములు హిమవుఁ బఱపుగలవయి యుండును. మనపిల్ల కాయలు జారుడు బండ పై నాటలాడుకొను నట్లాంగ్లేయ బాలురు బాలికలును నీ హిమముమీఁదఁ గుతూ హలముతో నాటలాడుచుందురు. అయిన నీమాటలు మనము వీనితోఁ బోల్చిన జారుడుబండలయాటలకంటే నెక్కుడపాయ కరములనుట హిమము స్వభావమునుబట్టియే మాచదువరు లెఱుఁగఁగలరు. ఇట్టి వ్యాయామములలో జడ్జి రాబిడ్డకు జంకు


కళంకు లేక యెట్టి హిమము నైనను సరకు " సేయక ప్రవేశించు చుండుననిన నితని సాహసస్వభావము తేటపడఁగలదు. ఒక చిన్న కథ. 'బాలొరాలు నగరమున రాచనగరునం దీ రాకోమరుఁ డుండుతరి - నితని 'సహాధ్యాయుఁ డొక బాలు డుండెను.--అతఁడిప్పు డాంగ్లేయ ప్రభు సభయం డౌన్నత్యముగనిన సభ్యుఁడు. — - అతఁడు జార్జి బిడ్డనితో దాగుడు మూతలాడు చుండెను. ఆయాట యందు జార్జి పలుమారు దొంగ యయ్యెను. దానికిఁ గారణము పై బాలుఁ డైనందున " నతని నీతఁడు సహింప లేక ముష్టి యుద్ధమునకుఁ బిలిచెను. ఆపిడికిటి పోట్లాటలో నతనిదె పయిచేయి యయ్యెను. కానీ దానివలన వీరిద్దఱకును స్నేహ భావ మేమాత్రమును . దఱుఁగక మిక్కిలి యన్యోన్య మైత్రి యేర్ప డెను.

బాల్మొరాలు భవనమున జార్జి రాబిడ్డఁడు యుద్ధమునకు వలయు కరత్రముల (Gloves) జతలను బెట్టుకొని యూవనులగు నావికులకుఁ బ్రియమగు నీ వ్యాయామమునకుఁ బలుమాఱు కడఁగుచు స్వసంరక్షణమునందు సమర్థుఁ డయ్యెను. ఇట్లు రాకొమరులకు బహిర్వ్యాయామములకు నాటంకము సెప్ప కున్నను వారి తలిదండ్రులు 'విద్యా విషయమున మాత్రము వారి నుదాసీనులుగ నుండనిచ్చినవారుగారు. జార్జిరాకొమ రుఁడు దీప్రగ్రాహికాడు గాని యెప్పుడును బట్టుదలగల వాఁడు గావునఁ దత్ఫలము నందఁగలిగెను.

జార్జినావికోద్యోగము.

పండ్రెండు సంవత్సరములు నిండిన తోడనె ఇతఁడన్న గారితోఁ గూడ నావికా సైన్యమునఁ బ్రవేశ పెట్టఁబడెను. (క్రీ! శ|| 1877 వ సంవత్సరము జూన్ నెల 5న తేది. వీరితో నింకను నూటయేబదిగురు బాలుకు నావి కావిద్య నభ్యసించు చుండిరి, వీరును వారును శయ్యా విషయంబులఁదక్క సర్వవిధముల సమా నముగఁ జూడఁ బడుచుండిరి. జార్జిచక్రవర్తి నేటికిని దానచ్చటఁ] గడపిన కాలమును సంతోషము , సరియించు చున్నాడు. తన పుత్రులఁగూడ నచ్చటి కె విద్యాభ్యాసము నకుఁ బంపియుం డెను. “బాక్కాంటె' యను నోడమీఁద జార్జి 'రాబిడ్డఁడును నితని యన్న యు నిద్దఱును మధ్యధరా సముద్ర మార్గమున పశ్చిమ యిండియా దీవులకుఁ బోయి. ఆ ప్రయాణము వలన జార్జికి సముద్ర యానము పై నెక్కుడభిమానము గలిగెను. క్రీ! శ|| 1830 వ సంవత్సరమున ' బాక్కాది' ప్రపంచము చుట్టి రాఁబయన మయ్యెను. దానియందును దరువాత “ కనడా యను నోడయందును బ్రయాణము చేసి 1883 లో నుత్తర అమెరికాకుఁ బోయిచే రెను. అట మాంట్రియల్ , ఒటావా, టొరాంటోమున్నగు గొప్పపట్టణములను దర్శించి ఆయా ప్రదేశ ములను జూచుచు 'నయాగరా' మహాజల ప్రపాతమున కలరి రాబోవు సంబంధమువలనఁగలుగు ననురాగమునకుఁ జిహ్న మో యనునట్లు 'కనడా' రాష్ట్రము పైఁ బ్రేమగలవాఁడయ్యెను.

1884 వ సంనత్సరమున జార్జిరాబిడ్డఁడు నావికా విద్య యందు మొదటి తరగతిఁ దేరి “ సబ్ లెఫ్టనంటు' పదమున కర్షుఁడయ్యెను. అప్పుడు నావికాధ్యక్షుఁడుగ నుండిన అడ్మిరల్ సర్ జాక్ డాల్రింపిల్ హేయను నతఁడితనిని గూర్చి “ఇతఁడారి తే రిన నావికుఁడు. పేరునకుఁదేరినవాఁడుగాక మాయందఱవలెఁ బరిశ్రమ జేసినవాఁడ"ని నుడివియున్నాఁడు. జార్జి యిల్లుఁ జేరి గ్రీన్విచ్చు పట్టణమునందలి “ రాజకీయ నావికా లాశాలయం దభ్యసింప మొదలిడెను. మంచిగదుల జత యొక్కటి దక్క నిచ్చట నితనికమర్చిన ఏ విశేష సౌకర్యము లేమియు లేవు. బుంధువుల ఛా యాపటములను బుష్కలముగ వ్రేలాడవైచి యాగది కితఁడలం కారము నిచ్చుచుండెను. 1885 లో నితఁడు లెప్టినెంటుగా నేర్ప, ఱుపబడెను. “థండరరు' ' డ్రెడునాటు'. 'అలెగ్జాండ్రా' అను మూఁడోడలలో నుద్యోగముసలిపెను.

1889 లో నితఁడొక నాశక ప్లవమును (Torpedo) నడపుచుండెను. అప్పుడితని యధికా రితనిని రావించి “మి తండ్రిగారగు " ప్రిన్సు ఆఫ్ వేల్సు గారు మిమ్మును గుడ్ వుడ్ అను నెడకుఁ బుపవలసినదనియుఁ దామట మిమ్మును జూడ వేచియుందురనియు వర్తమానమంపి యున్నారని చెప్పెను. దానికితఁడు “సరే. అయ్యా! అయిన నా నాశక ప్లవము గతి యేమి కావ లెను?” అని ప్రత్యుత్తరమిచ్చెను. దాని కాయధికారి ఇతనికానాఁటికి సెలవియ్యం గలుగుననియెను గాని, యీతఁ డదాని కంగీకరింపక “ఈనావను సముద్రయాత్రకుఁ గొంపో 'వలసినదని నాకు ముదలగలదు. కావున నేను బోయి రావలెను”. అని నుడివి కొన్ని నిమిషములలో 'స్పీ తేడ్' అను రేవువై పునఁ దన 'నావతోఁ గూడఁ బ్రయాణము సాగించెను. 1885 వ సంవత్సరము. అక్టోబరు (October) మాసములో ' నితఁడు 'ధ్రష్' అను ఆయుధప్లవమును సంపూర్ణ స్వాతంత్ర్యము , నడుప నర్హుఁడయ్యెను.

ఈతని నావికా శక్తి కచ్చటి నా రెల్లనును మిక్కిలి 'సంతోషించిరి. ఇతని తండ్రియు జర్మనీచక్రవర్తియు నితని 'నచ్చటఁ జూడవచ్చిరి. తనతల్లికిని సోదరులకును దన. మొదటి స్వతంత్రోద్యోగమును మిక్కిలి సంతోషముతో, "దెలియఁ జె ప్పెను. 1887 వ సంవత్సరమున విక్టోరియా మహారాణి గారి రాజ్యపంచాశ ద్వార్షికోత్సవ (Jubilee at the Fiftieth Year of her reign) సమయమున జరగిన నావిక ప్రదర్శనము నం దీతఁడు మిక్కిలి పరిశ్రమచేసెను. 1889లో మహారాణి గా రితనిని తమనావి కాపార్శ్వవర్తిగా( Naval aid-de-camp.) నియమించుకొనిరి. 1891లో నితఁడు నాయకుఁడయ్యెను. అసం వత్సర మే యితఁడు 'డబ్లిను' పురమునకు, బోయియుండి యచ్చట గొంచె మపాయ కరమగు జ్వరముచేఁ బీడింపఁ బడెను. కాని కొద్ది కాలములోనే యితనికి దేహము కుదిరి ఇతఁడు దన కర్తవ్యములకుఁ బూనఁ గలిగెను. 1892వ సంవ ,

త్సరము జనవరి నెల 14వ తేదీ యితని యన్న క్లారెంసు ప్రభు వకాలపు మృత్యువువాతఁ బడుట తోడనె, యీతని జీవ యాత్రయంతయును నొక్క తృటికాలమున మార్పుఁ జెందెను. ఇతఁడు దండ్రికిఁ దరువాత . రాజ్యమున కర్హు డయినందున నా వికోద్యోగమువదలి రాజకీయ వ్యవహారములయందుఁ బరి శ్రమ సేయవలసిన వాడాయెను. ఇటఁ గొంచెము జార్జి. కొమరుని కథనాపి మేరీ రాణిగారి వంకకుఁ దిరుగుదము.

మేరీ బాల్య క్రీడలు.

ఈమె 1867వ సంత్సరము మే నెల 26 వ తేది కెన్సింగు టను భవనమునఁ బుట్టెను. ఈమె , తండ్రి టెక్కు, ప్రభువు. ఈమె తల్లి విక్టోరియా మహారాజి . గారికి నాలవ. తరపు. బంధువు; అలెగ్జాండ్రా మహా రాణి తాతగారి చెల్లెలి కుమార్తె. మేరీ మహా రాణికి ముగ్గురు తమ్ములు. ఈమె పుట్టిన నెలరోజుల జ్ఞానస్నాన సంస్కారము నడచెను. చిన్నతనమున నీ మెకు 'రాచకుమారి మే' యనునది ముద్దు పేరు. ఈమె తన శైశవమును గుణించి యది మిక్కిలి తుంటరితనముతోడను, నెక్కుడు సుఖముగను, విశేషరాహిత్యముగను గడుపఁబడెనని తానే వర్ణించియున్నది. ఈమెకు బొమ్మలును గుక్కలును ప్రియతమములు. ఎంత వికారముగ నుండినను, నెంత ప్రాతపడి యుండినను, నెంత యుత్కృష్టమగు ప్రత్యామ్నా యవస్తువు నిచ్చినను నీమె తన మొదటి బొమ్మలను విడుచునదిగాదు.

విద్య నేర్చుకొనుట కెంతో యీమెను బుజ్జగింప వలసి యుండెను. ఈమెగారి తల్లియు దాదియు మిక్కిలి పరిశ్రమచేసి యీమెకు విద్యయందభిరుచి కలుగ జేసిరి. చరిత్రయనిన నీమెకు మహాభిలాష. ఈమెకు క్రికెటు: మున్నగు వ్యాయామములకుఁ దగినంత కాల మియఁబడుచుండెను. ఆయాటలో నీమె దనసోద రుల ననాయాసముగ మించుచుండెడిది. అట్లగుట నలన నే ఈమె దృఢ కాయయు నారోగ్యవతియు సయి యున్నది. 'సర్గుణముల నాటుటయం దీమె తల్లికిఁగల యాసక్తి పెక్కు తల్లుల కుండ దనిన నతిశయోక్తి గా నేరదు. ఆమె మతము దన బిడ్డలు విశేష సౌఖ్యములకును భ్రమాస్పదములగు నభ్యాస ములకును లోనయి యనదలు గాఁగూడదనుట. ఆయమ ‘విధే యత నేర్చుకొనుటయు, విద్యగఱచుటయు, పెరుగుటయు "నేను పనులు బిడ్డలకుఁ జాలును. విందులకుఁ బలుమారు పోవు టయు, రాత్రు లెక్కుడు నిద్ర గాచుటయు శైశవపుఁ బచ్చద సముం బో నడచి కన్యాత్వవు సౌందర్యమును, గాంతిని సపహ రించును. లోకమున ముసలి శిశువులు లెక్క కుమారి ఇప్పటికే యున్న వారు” అని యొక తరి నుడివెను. మఱియొక సమయమున నొక యాహ్వాన ప్రార్థనకు “దయపూర్ణ మగు తమ కోరికను నెర వేర్ప నా కెంత యిస్టమున్నను రేపటి దినము నాపిల్లలను బంఫుటకు వీలు లేకుండుట కెంతయు: జింతిల్లుచున్నాను. ఈ వారమున రెండు రోజులు నా బిడ్డలు విదులకుఁ బోయి యుండిరి. ఎక్కుడు కాలము దుర్వ్యయము సేయుట వలన వారి విద్యాభ్యాసమునకు బలమగు నాటంకము గాఁగలదు. కావున నాయభిప్రాయ 'మెఱింగిన వారు నన్ను క్షమింతురు గాక' యని వ్రాసి పంపెను. ఇంతి యెకాదు. మేరీగారి తల్లి దన బిడ్డ లితరుల కష్టములను జక్కగ నెఱింగికొని వారి యెడల సానుభూతి గలవారయి వారికి సాహాయ్య మొనర్ప సమర్థులుగావ లెనని కోరునది. ఆమె దేశాభిమానమునకు మేర లేదు. బీదల యెడ నామెకుఁ గల యనురాగము మెండు. ఇత రులను దనవలె నెంచుకొని వారి కెప్పుడును నామె మేలు సేయుచుండును. రా కొమారి మేయును నామె సోదరులును నితరుల కొఱంతలను దెలిసి కొనుటకై వారిని మతాచార్యు లతో దరిద్రుల గృహముల కనుపు చుండును. ఇట్టీ మాత చేఁ బెంపఁబడిన దగుట చే మేరీరాణియు నా సుగుణముల కాల వాలమయ్యెను.

1883 వ సంవత్సరమున మే తల్లిదండ్రులు ప్లారెంసున నివసింప నేగిరి. అచ్చట నీమెకు చిత్రకళాభవనములందుఁ గల పటములఁ జూచుటకును బట్టణ వై చిత్రముల దర్శించుటకును సమయము గలిగెను. ప్లా' రెంసున దివ్యమగు గానము గొల్లలుగ నీరి వీనుల దనుపుచుండెను. మే రాకుమార్తెకు వర్ణ లేవన విమర్శ నాశక్తి యచ్చటనె కలిగెను. వీరు తిరిగి యింగ్లాండునకు వచ్చిన తరువాత విక్టోరియా మహారాజీ ‘రిచ్చిమండు' పట్టణము

లోని స్వేత భవనమును వీరికి బసకు గా నిచ్చిరి. అచ్చట నుండు నెడ జరగిన యొకటి ' రెండు వృత్తాంతములు వ్రాసినచో మేరీ రాణికి నామె తల్లి పట్టించిన సుగుణము లిట్టివని తెల్లముగాఁ గలదు.

రా కొమారితె మేయును నామె తల్లియు రిచ్చిమండు ఉద్యాన భూములకును బ్రక్కనంగల 'క్యూ' తోటలకును నప్పుడప్పుడు విహారార్థము నెడలు చుండుదురు. అట్లొక్క ప్రాతః కాల సమయమున పోయియుండి యొక ముసలి శ్రీ గట్టె లేరుచుండుటను గాంచిరి. ఆనాడు మిక్కిలి చలిగా నుం డెను. ఆముదుసలి బడలిపోయి యుండుట విశదముగఁ గనుపించుచుండెను. వెంటనే “టెక్కు' ప్రభ్వి దన గొడుగు వంకరతో రెండు శాఖలను ద్రుంచ మొదలిడెను. " మే ' రా కుమార్తె వాని నన్నిటిని బోగుచేసెను. ఈపగిది మంచి కట్ట యేర్పడెను. ముసలిది మహాసంతోషమున దాని నెత్తుకొని యింటికిఁ బోయెను. ఒక నాడు క్యూతోటయందును నిట్టి వి శేష మొక్కటి దటస్థించెను. ఒక దాది ఒక బిడ్డను తోపుడు బండియం దిడుకొని త్రోసికొని వచ్చుచుండెను. అప్పుడామెకు దారి యందుఁ దీగెలకంచె యడ్డమయ్యెను. బహుదూరము వెను కకు దిరిగి పోయిన గాని సరియగు మార్గము గాన రాదు. కావున నామె యాకంచెలో నుండి త్రోపుకుబండిని

దూర్చి ప్రయాణము సాగించవలెనని పలుమారు ప్రయత్నిం చెను. కాని యామె ప్రయత్నము ఫలింప కుండెను. దాని నంతయు గమనించి చూచుచుండిన ఒక్కు ప్రభ్వి 'నిలు. నిలు. నేను నీకు సాయము చేయఁగలుగుదును. నీవు బిడ్డనెత్తుకోమ్ము. నేనును నాపుత్రికయు తోపుడు బండెని కంచెను దాఁటిం చెద” మని నుడివి తృటికాలములో నా దాదిని సంతోషపజచి పంపి వేసెను. కాని యా దాదికి మాత్రము దనకిట్టి సాయము చేసిన వారెవ రైనదియును దెలియదు.

మే రాకొమారితకు తలిదండ్రులిచ్చు చిల్లర పైకమున నామె యొక భాగము ప్రత్యేకించి వైచి దరిద్రుల బిడ్డలకు బంచి పెట్టుట చిన్న తనమునందే నేర్చుకొనియెను. ఆప్రాంత నుండిన క్షయరోగియగు మెక బాలునియెడ నీమె చూపిన దయయు సానుభూతియు నింకను నచ్చట విన నగుచున్నది. ఈమె పలుమారు వానిని జూడ: బోయి యా కుటీరమున వానిప్రక్కనఁగూర్చుండి ముద్దులు గులుకుమాట లతో వానిని సంతోష పెట్టుచు సధ్గ్రంథములఁ జదివి వాని వీనులకు విందొనర్చుచు వాని యాయాస ముడుపుచుండెడిది. ఒక యాదిత్య వారము ప్రొద్దుటి వేళ చర్చికి పోవుచు కడపటి పర్యాయము వానిని జూ చెను. ఆమెకప్పటికే యీపసి వానికి మరణము మూడియుంట నిశ్చయముగఁ డెలిసియుండెను, కావున నామె కంట నీరునించి వానిని ముద్దుగొని వానినుండి .

సెలవు పుచ్చుకొనియెనఁట. ఇట్టి వి శేషచరిత్రకలదయి పెరు గుచు నీమె తల్లితో గూడ ననేక వైద్య శాలలును శరణాలయ ములును వీక్షించి బీదల మేలునకై పెక్కు- విధములఁ బాటు పడుచుండెను. మే'రాకొమరితె కిరువది సంవత్సరములకుఁ బై పడి చూచుటకీమె విగ్రహము పొడనయి బహుసుందరమయి యుండెను.ఆ సమయమున నీ మెపాణిని గ్రహించుట కెవరో యొక విదేశపు రాకొమరుఁడు ప్రయత్నించెనను వార్త కొద్దిగఁ గలదు. "కాని యూతని కీమె లభింపద య్యెను. తండ్రి కనంతరము సింహాసనమున కర్హుడయిన జార్జి కోమరుఁ మాచదువరుల కై వేచియున్న వాఁడు.

జార్జి యార్కు- ప్రభువగుట.

క్లారంసు ప్రభువు మరణము చేత తన స్థితియందుఁ గలిగిన ' పూర్తియగు మార్పు, దుఃఖము వలన జార్జి కొక కొంత కాలము చక్కఁగ బోధపడలేదు. కాని త్వరలోనే క్రమ క్రమముగఁ దన భవిష్యత్కర్తవ్యముల నితఁ డెఱింగికొన మొదలిడెను. 1892 న సంవత్సరమున సతఁడు “ఇంహే' పం డితునితోఁగూడ జర్మేనియా యందలి హీడల్బర్గు పట్టణము నకుఁ బోయెను. విద్యాభ్యసన కాలము గానిసమయముల నితఁడు సుందరమగు నాపురవీధులలోఁ బచారు చేయుచు నెదురు పడ్డ ప్రజతో సంభాషించుచుండును. అచ్చటి సర్వకలాభవన విద్యార్థులు బంతులాడుచుంటను జూచి యొక్కొక వేళ సంత

సించుచుండును. ఇట్లు కొంత కాలమట గడపి జార్జి మెలంపసు' అను రెండవతరగతి నావ కధ్యక్షుఁడయి నావికా ప్రదర్శనములఁ బని చేసెను. ఇంచుమించుగ నీసమయమున నె జార్జికి 'యార్కు ప్రభువు' అను బిరుదుగలిగెను. సింహాసనమున కర్షఁడై నందున నీతనికి నావికాజీననము విడువదగినదేయైనను గొంతకాలము వఱకును నప్పుడప్పుడు సముద్రయానమునకుఁ బోవుటకువలయు సదుపాయము లేర్పఱుపఁబడెను. ప్రభుమండల మధ్యమున కంటే వీచికాసమూహమధ్య ముననే యితనికి దృష్టి యెక్కుడగుటచే యున రాజపట్టభద్రున కోసంగఁబడు పెక్కు బిరుదావళులును దదర్థమునియమితములయిన యాచారములును నితని కంతగా రుచింప లేదు. కాని యవ్వానిని స్వీకరించియే తీరవలసిన వాఁ డగుట, నాని నెల్లను నర్థాంగీకారముతోడ సందు కొనియెను' క్రీ|| శ|| 1892 వ సంవత్సరము జూన్ నెల 17 వ తేది యితఁడు ప్రభువుల సభలో నొక సభ్యుఁడుగ నేర్పడి యా పదమునకు నిర్ణీతమగుఁ బ్రతినల నంగీక రించెను. ఉపన్యాసము లిచ్చుట యనిన నావికులకు తలకంటగింపు. నావికుఁ డగుట చే నితనికిని ఉపన్యాసముల యుదంత యభిరుచి లేదు. లేకున్నను ఉపన్యా సము లియ్యక తప్పినది కాదు. కావున ఇతఁడు దన బంధువగు కేఁ బ్రిడ్డు ప్రభువును ఉపన్యాసములిచ్చు విధమునుగూర్చి కొన్ని సలహా లిమ్మని యడిగెను. అతఁడు “కుర్రా! ఇంతకంటే సులభ మేమియు లేదు. చిన్న కాగితపు ముక్కలమీఁద నీవు మాట్లాడు

విషయమును రచియించి యుంచుకొనుము. పిదప నేమియుఁ దొట్రుపాటు పని లేదు. సమయము వచ్చిన వెంటనే ముక్కలు దీసి చదువ వలసిన దె” యని ప్రత్యుత్తర మిచ్చెను, యార్డు ప్రభు నతనికిఁ బ్రణమిల్లెను. కాని యతని బోధనుపయోగింప లేదు. ఒక సభయందు కేంబ్రిడ్జు ప్రభువు ప్రక్కనఁ గూర్చొని యుం డెను, తానగ్రాసనాసీనుఁడై యుండె. అట్టి తగుణమున జార్జి ప్రభువు లేచి కేంబ్రిడ్జు ప్రభువు విస్మయమందు చుండఁ దన మనో పేటిక నుండి వెలువడు వాక్కులతో నల్ల నల్లన నుపన్యసింప మొదలి డెను. కేంబ్రిడ్జు “పొగరుపోతు కుఱ్ఱఁడు. నేఁ జెప్పిన ట్లేల జెయ్య- డయ్యె ? తప్పదు. ఇతఁడుపన్యాసమధ్యమున నాఁగిపోవును. అవ మానపడును” అని గొణఁగుకొను చుండెను. యూర్కు భీతినంద లేదు. నిలువ లేదు. రెండుమూఁడుపన్యాసముల జయప్రదముగఁ జేసి తండ్రికి సంతోషము నించెను.

వి వా హ మ హెూ త్స వ ము.

1893 వ సంవత్సరము మే నెల 3 వ దినమున యార్కు ప్రభువుకును మేరా కొమరి తెకును ప్రధానము జరగె ననువార్త వ్యాపించెను. దేశమంతయును మిక్కిలి యానందించె. పత్రికలా యానందమును వేనోళ్లఁ జూటెను. శీఘ్రకాలము లోననె యిరు వారులవారును నపరిమితమగు పెండ్లి సన్నాహములఁ జేయఁ దొడంగిరి. సామ్రాజ్యపుఁ బది చెరగుల నుండియు బహుమాన ములు పెండ్లి కోమారుఁడు . పెండ్లి కోమార్తెలకు వేన వేలుగ .

రాఁ బ్రారంభిం చెను. విక్టోరియా మహా రాజీగా రీప్రయత్నములు గొంతకాలము నాగిన తరువాత వానివలననగు నాయాసమును దీర్చుకోన బాలొరాలు భననమున వసింపఁబోయి. అయిన నటనున్నను వివాహమున కమర్పఁబడు ప్రతి విషయమును నా మెకుఁ దెలిపి యామె యంగీ కారమందు చుండిరి. యార్కు ప్రభు వింకను . విందు సమయముల నెక్కుడు సిగ్గును గనుపఱచు చుండెను. ఒకతరి “ఇక్కడ నొక్కరినై నను 'నేనెఱుఁగను. ఇంత కాలము సముద్రముమీఁదనుండిపోయితి” నని యొక స్నేహితు నితో నుడి వెను, అయినఁ బ్రధానమునకుఁ దరువాత నితఁడును ఈతని భవిష్యద్భార్యయు ననేకములగు విందుల కాహూయ మాను లై వీరేయచ్చట ముఖ్యాతిధులయినందున నీతని కీసిగ్గు వదలి పోవుటకు సందర్భములు గావలయు నన్ని దొరకెను.

జూలయి నెల యారవ తేది సర్వజనులకును నుత్కుృష్ట సంతోషాస్పదమగుఁ బండుగ. నాఁడు, దినము గూడ నిర్మలమై హర్ష దాయిగ నుండెను.అరుణోదయము మొదలు మధ్యా హ్నము వఱకును బ్రజ గుంపులుగ లండను నగరమునకు వచ్చి చేరిరి. వివాహితులగు డ్యూకు రాకోమరితల యూ రేగింపుఁ జూడ నెల్లరును గుతూహలులయి యేతెంచిరి. రాచబాట కావల నీవల 'వేన వేలు యుద్ధభటులు వరుసలు దీరిరి. పదిన్నర గంటలగుటయు నతిధులొక్కరొక్కరుగ సెంటు జేం సునగరు నందలి అంబాసడరు కోర్టుఁ జొర బ్రారంభించిరి. వధువు

తండ్రిగారికిఁ బిల్లనాఁటనుండియు స్నేహితుఁడును, నాంగ్లేయ దేశ భక్తులలో నగ్రాగ్రేసరుఁడును నగు గ్లావస్టన్ రాజనీతిజ్ఞ శిఖామణి మొట్ట మొదటి వారలలో నెక్కఁడుగఁ బ్రవేశించెను. లెక్కకు మారి పిక్కటిలిన యువతీమణుల యాభరణముల నుండియు వస్త్రములనుండియు బయలు దేరు ప్రభలు నలు దిక్కులను వ్యాపించి వింత కాంతుల వెదఁజల్లుచుండెను. ప్రసిద్ధి నొందిన ప్రతి పురుషుఁడును బ్రతి స్త్రీయును వివాహాలయంబునకు వేళకు దప్పక వచ్చియుం డెననుట విశదమయ్యె, బహిరంగణము నందలీ వాద్యవి శేషముల గంభీర స్వసములు మొదటి యూరే గింపు గదలివచ్చుటం దెల్పెను. అచిర కాలములోనే వరుఁడు దనతండ్రి తోడను బినతండ్రి తోడను వివాహాలయము లోనికి బదము లిడుచుండుట గానవ చ్చెను. అతఁడు ధరించిన యుడుపులు నావికా నాయకత్వమును జంహించుచుండెను. అతని నడక యుఁ జేష్టయు నాతని సభాకంపతను బయల్ప జచుచుండెను. మేరా కూతురును శుభ్రమగుఁ దెలుపు గట్టి వెండి జరిగె బుటేదారు పని చకచక లీనుచుండఁ దా ధరించిన గులాబి మున్నగు సుపుష్ప ములకుఁ దన దేహకాంతిచే నెక్కుడు సౌందర్యము నిచ్చుచుఁ గోలఁది కాలములో నె సఖులతోఁగూడ నావివాహమందిరముఁ జొచ్చెను. ఈయుత్సవ సమయమున కేతించిన రాజకీయాతిథు ల నేకులు. అందు రుష్యాజారు కుమారుఁడును, నార్కు రాజ్యపురాజును రాణియు నుండిరి. వీరెల్లరును రాజనగరునం

దలి చిన్న గుడిలో నెట్టిరంగు వస్త్రములతో నలంకరింపఁబడిన యాసనముల మీఁదఁ గూర్చుండిరి. పవిత్ర వేదికకు వరుఁడు వచ్చటకుఁ గించిత్పూర్వము, రజత శూర్యముల మంగళ స్వనములును, సామాజికు లెల్లరును నిశ్శబ్దముగ లేచి నిల చుటయును విక్టోరియా మహారాణిగారి రాకను దెలియ పఱచెను. ఆయమ నల్లనివ స్త్రముల ధరియించి యుండెను గాని సుదర్భ శుద్ధికయి నలంకరింపఁ జేసిన బుటేదారు పని వానిని సంపూర్ణ ముగ నావరించుకొని వాని యసిత వర్ణమును పై కెగయ నీకుండెను. వజ్రముల చిన్న కిరీటమును, ' ఆర్డరు ఆఫ్ దిగార్ట'ను బిరుదును సంకేతించు నీలవర్ణపు బట్టెడయు, “ నైటు' పదమును సూవు పెక్కులగుఁ జుక్కలును బ్రపంచము నందలియు త్తమ చక్రవర్తిని కలంకారములయి శోభిల్లు చుండెను. ఇప్పగిది ధగధ్ధగాయ మానమగు విచిత్ర వర్ణముల ప్రవాహము పరిపూర్ణముగఁ బ్రవహించుచుఁ జూపరుల కన్నుల మిఱుమిట్లు గొలుపుచుండెను. వారిదిగ్బ్రమతను బాపుట కోయన నాచార్య సంఘము దమకు సాధారణమగు నుడువులతో సభామధ్య మున కేతెంచిరి. టెక్కు ప్రభువు దనకన్యను జార్జి ప్రభువుకు దానము సేసెను. ఆమెయు మెల్లని స్వనమున సందర్భోచితము లగు పలుకుల నుడివెను. మహామతాచార్యుం డొకచిన్న యుపన్యాసమున వధూవరులకు బోధనా వాక్యములఁ బల్కి యీ వివాహము ఆంగ్లేయ జాతికి శ్రేయోదాయమగు గాత


మని యాశీర్వదించెను. ప్రార్ధనగీతము పాడిన తరువాత యార్కు ప్రభువు దన భార్యను, విక్టోరియా మహారాణిగారిని, వేల్సు రా కొమారితెను, ఒక్కు- ప్రభ్విని, డెనాళ్ళు రాజదంపతులను ముద్దు గొనెను. మహా రాజియు, తక్కుంగల రాజసమూహమును మిక్కిలి యను రాగముతోఁ బెండ్లి కూఁతును దీవించిరి. తరువాత స్వల్ప కాలములోనే యూరేగింపులతో సందఱును వివాహ భోజనమునకయి బక్కింగ్ హాము' నగరునకు బయలు దేరిరి. ప్రక్కన నుద్యాన వనమందుంగల తుపాకులు గౌరవార్ధముగ గుండ్లు పేల్చెను. లండను నగరమండలి చర్చుల గంట లన్ని యు సంతోషధ్వానముల నిగుడ్చెను. బక్కింగ్హాము నగర ముంగల పధూవరులకై యెదురు జూచుచుండిన జనులు మూకగట్టి - సిలిచి యుండిగి. వీరి కానందము గలుగఁ జేయుటకు నగరు సేరిన కొన్ని నిమేషముల లోపల 3 విక్టో రియా మహారాణియు నామె కుటుంబమును యా సౌధపు బై యంతస్థు నందలిసజ్జున నగుపించిరి. కుర్చీలు దేబడి వారి కమర్పఁబడెను. పదినిముసముల కాలము నవీన దంపతులు సరస సల్లాపము లాడుకొనుచుఁ దమ యవ్వగారి సమీపమునఁ గూర్చుండి. జనులందఱును దాము వేచియున్నందులకు ఫల ముగఁ గన్నులార జార్జి మేరీల జూచి తనివినందిరి. దీనికి బిదప సాధారణముగ నిట్టి వివాహములకు సామాన్యములగు నితర కార్యములును వేడుకలును నడచెను. వివాహము యధా

విధిగను జయ ప్రదముగను ముగింపునందెను. ప్రజలందఱును దమ తమ కుచితమగు విధమున నీ మఘోత్సవ 'కాలమున సంతోషమును' గనుపఱచి. తనకు నైజమగు సుస్వభాన మును వెల్లడించుచు, తన మనుమఁడగు యార్కు ప్రభువు కును, ఒక్కు రాకోమరితె యగు విక్టోరియా మేరీకిని జరగిన వివాహ సమయమునఁ బ్రజలు - దన యెడలను దన దన సంతతి యెడలను గనుపఱచిన విశేష ప్రేమాభ క్తులు మనస్సునకు హత్తి మహా సంతోష ప్రీతుల నిచ్చెనని విక్టోరియా రాణిగారు దెలియఁ జేసియున్నారు.ఇది రాణీగారి కొక క్రొత్త సంగతి గాదు.సుఖమునఁగాని దుఃఖమునఁ గాని యామెయెడ గాఢమగు సానుభూతి యెల్లరును గనుపింపఁ జేయు చుఁడుటా యమ మనమున సంపూర్ణముగా నంటినదే. తమ సుఖదుఃఖములయం దా యమ హృదయమేంత గాఢ ముగ నిమగ్నమగునదియు వారెరుంగుదు రని యామెకుఁ దెలియును. సామ్రాజ్యమందలి సర్వప్రజలకును నామెకును నీపరస్పర సంబంధ ముండుటయె సామ్రాజ్యమునకు నిజమగు బలము. పౌరులతో గూడ ' రాణిగారును దన మనుమఁడును మనుమరాలును జిరాయు రైశ్వర్యముల నందుదురు గాతమని పరమాత్వుఁ బ్రార్థించుచున్నది." యని ప్రజల యనురాగ మునకు ప్రత్యుత్తరముఁ బ్రక టింపిం చెను.

జార్జి రా జ కా ర్య పరిశ్రమ

వివాహానంతర మేడుసంవత్సరముల కాలము మేరీ ప్రభ్వి జూర్జి ప్రభువుల జీవనమం దొక్క విభాగముగఁ గానవలసి యున్నది. 1894న సంవత్సరము జూను నెల 28న తేది వీరి ప్రథమ పుత్రుఁడు పుట్టి విక్టోరియా మహారాజికిఁ దనకుఁ దరువాత మూఁడవ తరపురాజును జూడఁగల్గు సంతోషమును గలిగించెను. ఈ శిశువునకు ‘ఎడ్వర్డ్ ఆల్బర్ట్ క్రిశ్చియఁన్ జార్జ్ ఆన్టూ పాట్రిక్ డేవిడ్ ' అను నామకరణ మొనర్చిరి. మాచదు వరు లీపొడనగు పేరేల యిడఁబడెనని యాశ్చర్యపడుచున్నారు గాఁబోలు. బ్రిటిషు దీవులలోని ప్రతి భాగమునకును సంరక్షుణ కర్తయగు ఋషి యొకఁడొక్కరుఁడు గలఁడని వాడుక. అట్టి ఋషులందఱను స్మరియించుఁ దలంపుతో నింత పెద్ద పేరు. కాని సర్వసాధారణముగ నీ బిడ్డని డేవిడ్ అనియే పిలుతురు. 1895 వ సంవత్సరమునఁ దూర్పు ఆశియా యందు చీనా చరిత్రమందు బాక్సరు విగ్రహమని పేరుఁగనిన యుద్ధము ప్రారంభమయ్యెను. దానియందు జార్జి కెక్కుడు దృష్టిదగిలి యచ్చటి సమాచార ములను జాగరూకుఁడయి చదువుచుండెను. ఆసంవత్సరము ఫిబ్రవరి మాసముననే యితఁ డున్నత తపాలాస్థానమును జూచి యాంగ్లేయ తపాలా పద్ధతుల నన్నిటినియు మత పాలాధ్యక్షుని సాహాయ్యము చేఁ బరీక్షించెను. ఇంచుమించుగ నీ కాలమున నె యితని తండ్రియగు వేల్సు ప్రభువు గొంచెము గొంచెముగఁ

దనకుఁ జేయవలయుఁ గార్యములఁ దన కుమారుని పై నిడ బ్రారంభించెను. రాజ్యము నందలి వేరు వేరు మండలములను జూచి వచ్చుపని యార్కుప్రభువు సేయ వలసిన వాఁడయ్యెను. ఇట్లు దినములు గడువ నీతఁడు రాజ్య కార్యము లెక్కుడు నేర్చు. చుండెను. డిశంబరు నెల 14న తేది యితని రెండన కుమారుఁడు పుట్టెను. అతనికి ఆల్బర్ట్ ఫ్రెడరిక్ ఆర్థర్ జార్జ్ అను పేరిడిరి. 1896వ సంవత్సరముతయు యార్కు ప్రబ్వీప్రభువులు బ్రిటిషు దీవులలోని నాలుగు చెరగుల యండలి. ప్రదేశములను దర్శించివచ్చుటయందుఁ గడపి. కొన్ని యెడల వీర నేక శుభ కార్యములకుఁ బునాది వైచు చుందురు. మఱీ కొన్ని చోట్ల వేన వేలు ధనము వెచ్చించి కట్టించిన పరిశ్రామిక విద్యాలయ ములఁ దెఱచు చుందుఱు. ఇంక గొన్ని పట్లఁ దమ జ్ఞాపకార్థమై యేర్పడిన వైద్యశాలలయందు స్వాగతమంది తమ కృతజ్ఞత బెలుపుచుంద్రు. ఎల్లెడను మనోవాక్కాయ కర్మంబుల నుత్త మోద్యోగముల యెడఁ దమ సానుభూతిని వెలిఁబుచ్చు చుందురు, 1897 న సంవత్సరమున మూఁగి - వారలకును జెవిటి వార. లకును విద్యఁగఱపు సంఘము వారొక విందునడపిరి. ఆసమయ మున యార్కు ప్రభు నగ్రాసనాసీనత్వమున కంగీరించి తన సానుభూతిఁ గనుపఱిచెను. విందుకుఁవిందుకుఁ బూర్వమె యితఁడా సంఘము వారి విద్యా శాలకుఁ బోయి సర్వమును నెఱింగి కొని తన కార్యమునకు సిద్ధపడి యెను. ఒక విద్యార్థి స్వైర

సం చిత్ర లేఖనము నభ్యసించు చుండెను. అతనింజేరి దగురీతి సంభాషించి సంపూర్ణ బధిరుఁ డైనను జక్కఁగ మాట్లాడ నేరువఁ గలిగె ననుటను దెలిసికొనియెనఁట ! 1897 వ సం వత్సరము ఏప్రిలు నెల 25వ తేది 'తల్లిదండ్రుల నలరఁ జేయుచు యార్డు ప్రబ్క్వీ ప్రభువులకుఁ బుత్రికారత్న మొక్కటి జనించెను. ఆ బిడ్డకు విక్టోరియా అలెగ్జాండ్రా ఆలిస్ మేరీయను నామము నిడిరి. జూన్ మాసమునఁ బ్రపంచపు దశ దిశలనుండి గౌరవాను రాగ వాక్యపుష్పముల విక్టోరియా మహా రాజీగారి పీఠమునకుఁ గొని తెచ్చిన యాయమ“ రాజ్యారోహణ షష్టిపూర్తి ' మహోత్సనము జరగెను. అప్పుడీ ప్రభ్వీప్రభ్వు లిరువురును నెల్ల నుద్యోగములకుఁ దోడ్పడి సెయింట: పాల్ దేవాలయ మునకు మహారాణితోఁ గూడఁ గృతజ్ఞతా ప్రార్థన ల్సేయ నేగిరి.

ఐర్లా డు న కు ప్రయాణ ము.

దీనికి తరు వాత ప్రభ్వీ ప్రభువులు ఐర్లాండునకు విజయము సేయుదురను వార్తపర్వెను. ఆ సీమయందలి జను లెల్లరును దమ సంపూర్ణాంగీకారమును గనుపఱచి వీరెప్పుడు వత్తురాయని వేచి యుండిరి. వీరు ఆగస్టు మాసము 17వ తేది లండను నగరము నుండి బయలు దేరిరి. వీరు ఇంగ్లాండు, ఐర్లాండులకు నడుమ నున్న జలభాగము దాఁటు నప్పును దినమంత సుముఖముగ నుండ లేదు. కాని వారుగట్టు చేరిన తరువాత వారికి జనులిచ్చిన స్వాగత మత్యద్భుతము. కొందఱివార్తననుసరించి యట్టి

స్వాగతము విక్టోరియా నుహా రాజీగారి కైనను లండనుపుర ముననేని రాజ్యారోహణ షష్ఠిపూర్తి సమయము నందునఁ గూడ నియ్యఁబడ లేదఁట! ఇట్లు సుఖముగఁ బ్రారంంచి వా రైర్లాండులోని దర్శనీయ స్థలముల కన్ని టికిని బోయిరి. వారి రాకపోకలన్నియు వివరించు టనవసరము. వారయిర్లాండు సందర్శనమును ముగించు నప్పటికి జనుల యందు సాంద్రతమ మగు రాజభక్తి భావములఁ బురికొల్పి తమ యెడల 'నెప్పటికిని నశింపనేరని యనురాగమును బుట్టించిరనిన వారి సౌమనస్యత దెలియఁ గలదు.

టెక్కు- ప్రభ్వీ ప్రభ్వుల మరణము.

ఐర్లాండున నుండఁగ నే ప్రభ్వి తల్లియగు టెక్కు ప్రభ్వి జబ్బు పడెనను కించిద్దుఃఖ కరమగు వార్త వచ్చెను. ఔషధ సేవ జేయింప నామె యష్పటికిఁ గొంత గుదురు పడెను. కాని యక్టోబరు 25వ తేది మరల నామెకు బలమగు వ్యాధి తటస్థిం చెను. ఒక పర్యాయ మదివి కెరణ చికిత్స చేయఁబడిన యెడనె రెండ వమారును నదే చికిత్స చేయవలసి వచ్చెను. ఆమె కా చికిత్స వలన గుణము కాలేదు. 27వ తేది యక స్మాత్తుగఁ గాల గతి నొందెను. అప్పటికి మేరీ ప్రభ్వి యింగ్లాండు సేరియుండెను. కావునఁ దల్లి మరణము నామె చూడ వలసిన దయ్యెను. సంవ త్సరమున కైదు వేల పౌండ్లా దాయము మాత్రము గల దైనను టెక్కు ప్రభ్వి దీర్చుచుండిన యపారమగు లోకోపకార కార్య

ముల వలనను నామె యాదార్య గుణమువలనను నామె దేశ వాసు లందఱకును బ్రియయై యుండెను. కాబట్టియే యాయమ మరణమునకు బహు జనులు వగపు గనుకలచిరి. ఆమెను సనూధి సేయు నపుడు చేగిన మహాజనుల గుంపును జూచినను నామె జనుల కెంత యల్లారు ముద్దే తెలియు చుండెడిది. ఆమె మరణము నలన టెక్కు ప్రభువు దీనుఁడై యటు తరువాతఁ గృశించుచు నే వచ్చెను. 1909 సంవత్సరము జనవరి నెల లో నరువది రెండేండ్ల నయస్సున నితఁడు పరలోక ప్రా ప్తినొందెను. కొలఁది కాలములో నే యీవిధముగఁ దలిదండ్రుల నిద్దఱను గోల్పోయిన 'మేరీ ప్ర ఖ్వీ యెంతి వ్యసనము గలిగియుండెనో ప్రత్యేకించి వ్రాయ నలసిన 'పని లేదు.

ఈ భేదమును గొంచె ముపశమింపఁ జేయు విషయ మొకటి మూడుమాసముల లోపలన జర గెను. మార్చి నెల 31 న తేది మన ప్రభ్వీ ప్రభువులకు మఱి యొక కుమారుఁడు పుట్టెను. అతనికి హేన్రివిల్లియమ్ ప్రెడరిక్ ఆల్బర్టు అనునాను మునిడి. ఇంచు మించుగ దినములలోనె జార్జి గారి తండ్రి వేల్సు రాకొమరుఁడు 'బ్రు స్సెల్సు ' నుండి ప్రయాణమయి వచ్చుచుండ నాతనిని ' సిపిడో." యనువాఁడు గాల్వఁ బ్రయత్నిం చెనుగాని దైవానుగ్రహమువలన నది దప్పి పోయెను.దీని వలన జర్జి ప్రభువుకు రాజున కగోచరముగఁ జుట్టుందిరుగు నపాయము ల నేక ములుగలవని విశదమయ్యెను. ఈ విషయమును గుఱించి : యితఁడు దరువాత నొక సభయందు " మహాజను లారా! ఇట్టి సంగతుల నెల్ల మనమాపరమాత్మిని చేతిలోనివా రమే” యని హ్రస్వరీతిని పలికిఁ దనభావమును వెల్ల డించెను 1889 న సంవత్సరమున నే గ్లాడుస్టను మహానుభావునికి దేహ ము స్వస్థతగప్పి లోకమునకుఁ గొంతవిచారము గలిగెను. అప్పుడు జార్జ్ ప్రభువును మేరీ ప్రభ్వియు నతనియెడ సానుభూతి గనుపఱచిరి. కొలఁది కాలములో గ్లాడుస్టను పరలోక ప్రాప్తి , జెందెను. అతని భార్యయు -1900 జూన్ ' మాసములో మగనిఁ గలుసుకొన నేగెను. గ్లాడ్ స్టను సమాధి సమయమున మన ప్రభు వును నతని తండ్రియు శవము పయిఁబఱచు వస్త్రమునుమోసి కొని యాలో కో త్తరునియెడఁ దమకుఁ గల గౌరవ ప్రేమలఁ గనుపఱచిరి. అతని భార్య గతించిన ప్పుడును మన ప్రభువును ప్రభ్వియు దమ సానుభూతిం దెలిపిరి. ప్రపంచ ప్రఖ్యాతి గాంచి తన సౌమనస్యము వలన నానా దేశీయ ప్రజల నలరఁ జేసి, బూట కపు బిరుదులు మానవుల పరస్పర సామ్యమును బ్రక టించుఁ దనవంటి మహామహునకు రుచింపనని దనంతవచ్చి చేరిన ప్రభు వు పదమును దిరస్కరించి చాటి, మానవ నామమున కర్హత నిచ్చు నుపకరణము సత్కార్య దీక్షు యే యని తన జీవనము వలనఁ బ్రదర్శించి, యింగ్లాండు రాష్ట్రమునకును విక్టోరియా మహారా జి కిని అఖండ యశస్సును సంపాదించి పెట్టి, లోక మెల్లను . హాహారావములు సెలంగ నస్తమించిన రాజనీతి పారంగతుఁ . .

డును సామాన్య జన స్వాతంత్ర్య సుస్థాపకుఁడును అగు మంత్రి సత్తముఁడు దివికేగిన తరువాత నెంతో కాల మాయుత్తమ మిత్రుని సాంగత్యము వీడ లేక వెడ లెనో యన విక్టోరియా మహారాణి 'యచిరకాలములోనే 1901 సంవత్సరమున దన సుప్రసిద్ధ శాంతపరిపాలనమును వదలి దిగంతంబులకు వ్యాపిం చియుండిన కీర్తి పుజంబులనలనఁ బొమరులగు సర్వజనుల హృదయ సీమలనుండి "వెల్వడు దుఃఖ పరంపరల నురుమారుచు వారి శుద్ధప్రేమానిలంబుల సర్వవ్యాపనముతో నాలింగింప స్థూలకాయంబు వదలి ప్రకృతితో సమ్మేళన మందెను.

జార్జియు న రా జ ప ద వి.

ఈమె మరణమువలన వేల్సు ప్రభువు సప్త మైడ్వర్డు చక్రని యయ్యెను. మార్కు ప్రభువు కారన్ వాల్ ప్రభువై తండ్రియనుమతిమీఁద మార్చి 16 న తేది భార్యతోఁ గూడ ఆస్ట్ర లేసియాఁ జూచి రాఁబయలు దేరెను. అచ్చటతఁడు తద్దే శపుఁ బ్రథమ పార్లమెంటు సభ ననఁగా రాజకీయ సభను డెఱ చెను. ప్రభ్వీ ప్రభువుల యీభ్రమణ కాలమువలన ఆస్ట్ర లేసియా న్యూజీలాండు, దక్షిణ ఆఫ్రికా, కనడా, దేశములయందలి బ్రిటి షు ప్రజలకు సంతోష ప్రేమలు గలిగెను. నవంబరు మాసము మొదటిదినమున జార్జి ప్రభువును మేరీ ప్రభ్వియు నింగ్లాండు వచ్చి చేరిరి. ఎనిమిది దినములకుఁ దరువాత నెడ్వర్డు మహా రాజు పుట్టిన దినమున, కారన్ వాల్ ప్రభువును ప్రభ్వియు "వేల్సురా

కొమరుఁడును రాకొమరైయు నను బిరుదులందిరి. ఈ బిరుదు లంచుటయె సింహాసనమునకుఁ దామ యప్పటి రాజ్యారూడు లకుఁ బిమ్మట హక్కు దారులని స్థాపించుకొనుట. కావున నె యీ బిరుదులనందు రాబిడ్డలకు దేశీయులందరు హర్షముతో సభివాదన మొనరింతురు. లండనునగర పౌరులు జార్జి మేరీల కిట్టి యభివాదనోత్సవము జరపినపుడు ఆంగ్లేయులారా, మేలుకొనుఁడి " అను శీర్షికతో జార్జి ప్రభువిచ్చిన యుపన్యాస మిప్పటికీని సుప్రసిద్ధమై యున్నది. నాఁటినుండి వేల్సు రా కొమరుఁడు దండ్రికిఁ క్రమ క్రమముగ నెక్కుడు సహ కారికాఁ జొచ్చెను. 1902 న సంవత్సరము వసంత కాలమం తయు రానున్న పట్టాభిషేక మహోత్సనమును గుఱించి జనులుత్సుకులయి యుండిరి. లగ్నమునకుఁ గొన్ని గంటల పూర్వ మెడ్వర్డు చక్రనర్తి యస్వస్థత నందెననియు రణచికిత్స యవసర మయ్యెననియు దుర్వార్త ప్రపంచము నావరిం చెను. ఉత్సవమునకు సర్వసిద్ధముగ నుండిన లండను ప్రజ దీనివలన నెట్లు మ్రాన్పడినదియు నాఁటనుండిన వారేరును మఱవఁ జాలరు. దిగ్భ్రమ వాసిన తోడనె యానగరమునఁ జేయఁబడి యున్న ఏర్పాటు లెల్లయు మెక్క తృటి కాలమున నాపి వేయఁ బడెను. బ్రిటిషు ప్రజలును, నెడ్వర్డు చక్రవర్తి శాంతగుణము నెఱింగియున్న యితర దేశీయులును దుఃఖమున మునిఁగి పోయిరి. ఇట్లయ్యును నాతని వి శేషానుజ్ఞల ననుసరించి కొన్ని కొన్ని

విందులు మాత్రము నిలుపఁబడ లేదు. దైవాను గ్రహముచే స్వల్ప కాలమున నే ఎడ్వర్డు వ్యాధి విముక్తుడై బలమునంది యధావిధిగ మూర్థాభిషి క్తు. డయ్యెను. ఈ కాలమెల్ల దల్లి మొదలుగాఁ గల వారి దుఃఖము నాపుటయందును, బట్టాభి షేక మూత్సవమునకు నచ్చి రాజాధి రాజులకు సపర్యలు సలుపుటయందును వేల్సు రా కోమరుఁడుద్యుక్తుఁడయి యుండెను. 1902 న సంవత్సరము డిశంబరు 'నెల 20 న తేది యితనికి మఱియొక కుమారుడు జన్మించెను. అతనికి జారిజ్ ఎడ్వర్డ్ అలెగ్జాండర్ ఎడ్మండు' అని పేరిడిరి...

జపానీయులయెడ ప్రీతి.

1904 న సంవత్సగము: రుహ్య జపాను విగ్రహము జూర్జి దృష్టినంతయు నాకర్షించెను.. తాను నావికుడుగాన విగ్రహమునఁ బ్రయోగింపబడు సూతన నావికా వ్యూహ ములఁ బరిశీలించి యానందమిద వచ్చునని తలం చెను. ఆ యుద్ధమున నిరువారుల వారి కార్యముల యూ చిత్యా నౌచిత్య ములు విమర్శించుటకుఁ గూడ నెడము లేకుడెను. ఆ బాల్య స్నేహితుఁడు రుష్యాజారగుటవలనను, జపానుపక్షమునందలి ప్రముఖులోక కొందుఱు మిత్రులగుట వలనను నితనికి రెండు పక్షముల వారియందును సమాన గౌరవమే యుండెడిది. “ఊర్ట్సరు' అను నావకుఁ జేరిన నావి కా విద్యార్థుల కితఁడు బహు మానము లంబంచి పెట్టుచుం డెను. ఆప్పు డితఁడు "ఉత్తమ


నావికా నాయకుఁడని లోకమున విరివిగా ప్రసిద్ధి గాంచిన యడ్మి రల్ టోగో ఊర్ట్సరు' పయిఁ బదు నెనిమిది మాసములు పరిశ్రమ చేసినాఁడనుట ప్రతి “ఊస్టరు' బాలుఁడును గారవ ముతో స్మరింప వలెను.” అని నుడి వెను. జసానునకు నావికా నాయకత్వమున నగ్ర స్థానమును సంపాదించి పెట్టిన 'యడ్మిరల్ టోగోయింగ్లండునందలి యీ యీ ఊర్టరునావలోఁ బని నేర్చుకొని యచ్చట నెల్లరకును గావలసిన వాఁడై నెగడినవాఁడు. ఇంగ్లాం డుతో నిట్టి సంబంధము గలవాఁడు గావున నే జార్జిచక్రవర్తి గారి కట జరగిన పట్టాభిషేక మహోత్సవమును దిలకింప 'నాతఁ డాహూయమానుఁ డయ్యెను. అడ్మిరల్ టోగో యెడలను, “పోర్టు ఆర్థరును' రుష్యా వారి నుండి పట్టుకొనిస 'నోగీ' సేనాధి పతి యెడలను జార్జిచక్రని కత్యాదరముగలదు. వారి మూల మునను, నితర ప్రముఖులతో సంభాషించుట వలనను, గ్రంథావ లోక సమునను జార్జిచక్రవర్తి యు మేరీ చక్రవర్తినియు జపాను చీనాలను గూర్చి చక్కఁగ నెఱింగికొని యున్నారు.

'హిందూ దేశమునకు ప్రయాణము

.

1905వ సంవత్సరమున మార్చి నెలలో జరిగిన ఆంగ్లేయ రాజకీయ సభయందు వేల్సు ప్రభువును బ్రభ్వియు భరతవర్షమును దర్శించి వచ్చుట కై రు 3,00,000లు కర్చులకుగాను నుప యోగించు కొనవచ్చునని తీర్మానింపఁబడెను. జార్జి ప్రభువు బొంబాయి గ్రామరక్షక సంఘమువారి సమ్మాన పత్రికకు బదులు

చెప్పుటలో వక్కాణించిన విధమున నతఁడీ దేశమునకు వచ్చుటకుఁ బూర్వమె యిద్దానం గుఱించి శ్రద్ధఁ జేసి చదువుకొని యుండెను. కాని గ్రంథస్థ వర్ణనల వలన గ్రహించు జ్ఞానము నకును స్వయ ముగఁ బరిశీలించి విమర్శించి సంపాదించు జ్ఞానమునకును గడు దూరముగ దా. జార్జీ ప్రభువు దమసామ్రాజ్యమునకు శిరోమణి యనఁదగు నీభరతఖండమును గన్ను లారఁ జూచు వేడుకతో నా సంవత్సరము అక్టోబరు నెల 19న తేది యిలు నెడలి బయలు దేరెను. కన్న బిడ్డలను వెనుక విడనాడి ప్ర యాణమునకుఁ దరలుట యేరికై నను గష్టమే. మేరీరాణి గారికిఁ గూడనట్టి భావము పొడమెను. కాని యాయమ దన బిడ్డలు అలెగ్జాండ్రా మహారాణిగారి సంరక్షణలో నుందు రను గొప్పనమ్మకము వలన వారినుండి కొంతకాలము వేరుపడ వలసి యుండుటకు మనస్సును గుదుర్చుకొని భర్తతోఁ గూడ 'రినాన్' అను ఓడనొక్కి ప్రయాణమాయెను. భార్యా భర్త లిరువురును బొంబాయికి వచ్చి చేరిరి. భారతపుత్రు లచ్చట దమ ఈ భవిష్యత్పరిపాలకుల కొసఁగిన స్వాగతమును వర్ణింప నలవిగాదు. స్వాగత పత్రికకుఁ బ్రత్యుత్తర మిచ్చుటలో జార్జ్ ప్రభు విట్లు పలికెను:-

"ముప్పది సంవత్సరముల క్రింద ఒకనాఁడు నా ప్రియజనకుఁడగు చక్రవర్తి యీ ప్రాంతముననె నిలువ బడి తన జీవితమునందు భరతఖండమును జూడవ లెననుట

కలలయందుంగూడ దల పెట్టుచుండెనని వక్కాణించు చుండెను. నేనును నాభార్యయు నట్టి యూహలతోడనె యుంటిమి. మీరును మీసహకారులును ఈమా తలపోతల నింత జయప్రదముగఁ దీర్చినందులకు మేము మీ కెంతయుఁ గృతజ్ఞులము. తండ్రిగారి వలెనే మేమును నడచుకొనుటలో వారిచేఁ బ్రారంభిపఁ బడిన యాచారమును నెఱవేర్చిన 'వారమగు చున్నారము. ఆయా చారము దరతరముగఁ బూ ర్తి సేయఁ బడుచు నేయుండుఁ గాక యని మాయాశయము. నేనును రాకొమరితెయుఁ బూనుకొనిన యీభ్రమణముల నొక్క లోపముండక మానదు. ప్రతివస్తు వును జూచుటకును, గౌరవ మొనర్చు ప్రతివ్యక్తి కిని మాకృతజ్ఞత సూచించుటకును మాకు కాలముచాలదు. ఏరి సంస్మరణ మన కెల్ల రకును బ్రేమావహమో అట్టి నా మొదటి మహా రాజి యగు నాయవ్వనుండియు నా తండ్రినుండియు భరతవర్షము నెడను భారతీయుల యెడను బ్రేమ వంశపరంపరగ వచ్చి యున్నది. నాచిన్న తనమునుండి భరతవర్షమనిన దయ, భక్తి మర్యాద, ధైర్యము అను నీ సద్గుణములకుఁ బర్యాయ పదమని యెన్ను కొనుచున్నాఁడను. ముందు కొద్దిమాసముల లోపలన నాయనుభనములవలన నీప్రథమభావములు బలపడఁ గలవని నమ్ముచున్నాను. భారతీయుల యెడ సానుభూతియుఁ బ్రేమయు గల వారమగుటయే గాక వారి కొఱంతల యందును కామ్య ములయందును నెక్కుడు పరిచయముతో సంబంధము గలుగఁ 86 తులు. జేసికొని దై వనియోగము చే భరతవర్షపు 'క్షేమమును సం దలి. ప్రజల సౌఖ్యమును న నెడి ఏక పరిణామమున కై పాటుపడు ప్రజ లతో బ్రిటిషు వారనక భారతీయులనక రాజకీ యోద్యోగుల నక పరుల నక సర్వజాతుల సర్వశాఖల వారి స్నేహ ముల వడఁ జేసికొనన లెనను నదే మా ఋరువురి యాశయమయి యున్నది...."

ఇట్టి యుత్కృష్ట వాక్యములకు భారతీయు లలరి రని వేరుగఁ జెప్పన లెనా? ఇట్టి సౌమనస్యముగల ప్రభువు నెడనానికి గృతజ్ఞత యపారమనిన యొక వింతయా! వేల్సు గాకొమడుఁ డును గా కొమరితయు బొంబాయి సదలి భరతఖండమునఁ బ్రయాణమై పోయిన మార్గము నంతయు నిట విస్తరించి వ్రాయఁ బని లేదు. వీరి నిహారమును గురించి సాధ్యమగు నంత సంగ్రహముగ బార్టీ రాకొమరులకు గిట్టుహాలు 'భవ; మున ఉపన్యసించిన వాక్యములతోడనె వర్ణించెదము.

హిందూ దేశ విహారము.

4.నవంబరు నెల 9వ తేది జొంబాయి నగరమున స్వాగత మందినది మొదలు మార్చి నెల 19న తేది కరాచిగేవునందు నింగ్లాండు ముఖమయి యోడ నెక్కునఱకు విహరించినస్థలము లలో నెల్లనూకు ప్రజలు గనుషచిన గౌరనమును ప్రేమయును నపారములు. అవిమాకు హృదయంగమము లయియున్నవి. మేమెప్పుడును మనఁజూలము.... మేము వెళ్లినచోట్ల నెల్లయు .

వీధులు చక్కగ నలంక రింప బడి జనులు గుంపులు గుంపులుగ మనోహరమగునుడువులు ధరించి మము నెదుర్కొను చుండినను, కొన్ని భాగములందు క్షామమువలనఁ బీడింపఁబడి దరిద్రులై కష్టము లందుచుండిన దురదృష్టులను మేము మఱవ లేదు. నేను గ్వాలియునందు దుర్భిక్షమువాతఁ బడకుండ సంరక్షింపఁబడు చుండిన 6000 జనమును పురుషులు స్త్రీ లు బిడ్డలను నొక్క యెడఁ జూచుటతటస్థించెను. అనగరమును గాంచుట దుఃఖకరముగ నే యుండెనుగాని, యాబీదలను గాపాడుటకుఁ చేయఁబడియుండిన సంపూర్ణ ప్రయత్నములఁ జూచిన నాకు సంతోషముగలిగెను. సామంత రాజుల రాష్ట్రములను జూచుట మా యనుభనములలో ముఖ్యతమముగను, నెక్కు. డానందదాయిగను గణింపఁ బడవ లెను. ఆయాప్రభువులును వారి వారి ప్రజలును మిక్కిలి యుత్సా హముతోడను గౌరవము తోడను మమ్మును సత్కరించిరి.. ... కొద్దిపాటి యనుభవముతో నామనస్సున భరత వర్షమును గుఱించి నిలచిన భావములను నునువుచున్నాను. భరతవర్షము నొక్క. దేశ ముగఁ బరిగణింపఁ గూడదు. అది రుప్యాదక్క దక్కిన కోపాఖండమునకు సమానమగు వి స్తీర్ణ ముగల ఖండము. జాతి మత భాషలచే భిన్ను లగు పెక్కు తెగల జనులు మొత్తమునకు 300, 000, 000 ఆఖండమున నివసించు చున్నారు. దాని యపరిమిత వి సతీర్ణమును, అద్భుత తేజంబును, మారుచుండెడి శీతోష్ణ స్థితియు, అందలి విస్తారమగు నెడారు


హిమాచ్ఛాదిత శిఖరములును, సుందరమగు నడవు లును, మహానదులును, ప్రాచీన శిల్పికా వైచిత్రములును, పురాతన గాథలును నాకాశ్చర్యమును బుట్టించెను. భారతీ యులు మిక్కిలి యోర్పు గలవారనియు, జీవనమున నాడం బగము లేని వారనియు, రాజభక్తి పరులనియు, దైవభక్తి పూర్ణ లనియు నాకు దృఢమగు నమ్మకము కలిగినది. మన పరిపాలన న్యాయపరిపాలనయనియు ధర్మ పరిపాలన యనియు విశ్వసించి రనినే నెఱుగఁ గలిగితిని.

" నేనుజూచిన విషయములను బట్టియు, వినిన సంగతులను బట్టియు మనము రాజ్య కార్య నిర్వహణమున జనులయెడ నెక్కు డు సానుభూతి గనుపలుకఁ గడంగినచో భారత వర్షము నేలుట మనకింకను మిక్కిలి సులభముగా గలదని తీర్మానించి తీరవల సినవాఁడనై యున్నాను.

""అట్టి సానుభూతికి నెల్లప్పుడును జనులు గొల్లలుగ నిజమగుఁ గృతజ్ఞతఁ జూవుదురని నేను నిశ్చయముగఁ జెప్పఁ గలను... పూర్వ దేశములకు సహజమగు నిర్మలా కాశము ఛత్రముగఁ దరలివచ్చి నానావర్ణ వస్త్రములు ధరించిన సర్వ జాతి జనులును బొంబాయిలో కరాస్ఫాలనాది శుభచిహ్న ములతో నాకొసంగిన స్వాగతమును చిత్రించుటకు నాకు శక్తి

యుండిన బాగుండు నేయుని మనసు ఉవ్విళ్లూరు చున్నది. కాని
కై బరుకనుమ.

కై బరుకనుమ.

ఉష్ణ భూమియగు బొంబయినుండి నాభావములు కటిక చలి సీమ యగు ఖైబరు కనుమ ప్రాంతములకుఁ బరు నెత్తుచున్నవి... అచ్చటఁ జరిత్రయందుఁ బ్రసిద్ధమగు ఆలీమసీదు గలదు.అచ్చ టికిఁ జుట్టుముట్టు నధికారమువహించు ఖానులు దమ మందల లో నుండి యేరిన పొటేళ్ళను, మంచి తేనెను గానుకగఁ గొని నచ్చిరి. ఇట్టి యాటవికములును, స్వల్ప నాగరికతా సూచక ములును నగు ప్రదేశములకునుఁ గళా కౌశలమునకు ముకుర ములు పోలి ప్రాచీన వైభనమును నెల్లడించు శిధిలభవనముల కిరవు లై శోభిల్లు ఢిల్లీయాగ్రాలకును దారతమ్యముఁ బరిశీ లించిన నెంత మనోరంజకముగను నుండునో గనుఁడు.. అటనుండి, 'మేము గ్వాలియరుకును, కాశికిని దరలితిమి. లోకమున మరె చ్చటను సాధ్యముగాని సందర్భము లచ్చట మాకు సమకూ రెను. చిత్రవిచిత్రములగు రంగువస్త్రములు తొడుగుకొని ఐరోపాఖండము నందలి మధ్య కాలపు (క్రీ. శ|| 14, 15, 16 శతాబ్దములు) సైనికులను స్మరణకుఁ దెచ్చు పార్శ్వవర్తులు బారులు బారులుగఁ జుట్టినడువ విలువఁగల యంబారులచే 'నలకరింపఁబడిన ఏనుంగుల పై నెక్కించి మమ్మును బట్టణము లలోనికిఁ బిలుచుకొని పోయి.....క్రొత్త సంవత్సరము పుట్టు నప్పటికీ - మేము , మన సామ్రాజ్యమున "రెండవ సగరమయిన కలకత్తాయం దుంటిమి. తగినంత కాలము "లేదుగాని

లేనిచో జాతి విషయమునను, సాంఘికాచార విషయములను,
బోలన్ కనుమ.


“భరతవర్ష మును .. మిక్కిలి భిన్నమయిన బర్మాను గుఱించియు, రంగూనునందలి సువర్ణాలయమును గుించియు, మండ లేపట్ట ణమందలి దర్శనీయ వస్తుపులను గుఱించియు, ఐరావతిపయి మేము మూఁడు దినములు గాంచిన యనుభవములను గురించియు నుప స్యసింపన లెనను కోరిక కలదు. అయిన నిది యదను కాదు. మనము మద్రాసు వైపునకుఁ బోవలసియున్నది. ఆనగరము


మన సామ్రాజ్య స్థాపన చరిత్రమున నెక్కుడు సంబంధము గలది.*[1] అచ్చటినుండి దక్షిణ ఇండియా యందలి యుష్ణ భూములను దాఁటి యుత్తరాభిముఖులమయి పవిత్ర క్షేత్రమయి హిందూ మతమునకు రాజధాని యనఁదగి పుణ్యనదికిని ప్రసిద్ధ దేవాలయ ములకును నావాసమయిన వారణాసింగడచి మరల కటికచలికిని మంచునకును బుట్టి నిల్లయిన క్వెట్టా ప్రదేశమును జొచ్చితిమి. దానిని వదలి బోలను కనుమ ద్వారా నత్యద్భుతమగు రైలుమార్గ మున సముద్రతీరమునకు 5500 అడుగుల పైనుండి దిగి సింధు మండలములోని తీక్షాతపమున కాకరమగు మైదానములను దరించి కరాచీ రేవు చేరితిమి” అని జార్జి రాకొమరుఁడు ఇంగ్లాండు చేరిన తరువాత గిల్లుహాలుభ వనమున నుడివెను.

ఇతని వాక్యములన్ని యు మనము సంతోషముతో జ్ఞాపకముంచుకొనఁ దగిన వే. అందులోఁ గ్రిందగీతలు వేయఁ బడిన భాగము మనచక్రవర్తిగారి హృదయస్థ ప్రేమను వెల్ల డించుచున్నది గావున నది మనకు సర్వకాలముల యం దును స్మరణీయము. “నేను జూచిన విషయములను బట్టి యు వినిన సంగతులను బట్టియు మనము రాజ్య కార్యనిర్వ హణమున జనులయెడ నెక్కుడు సానుభూతిగనుపుపఁ గడం గినచో" యను పదములు జార్జి ప్రభువుగారు భారత వర్షమును ......................................................................................................

యని చక్రవర్తి గారిభావము .

గుజించి యెన్ని యో విషయముల నెఱింగికొని యుండిరనుట విశదపఱుచుచున్నవి.

పత్రికా ప్రతినిధికి దర్శన మొసంగుట.

మన దేశము నందలి పత్రికలలో నెల్ల పత్రిక యని పేరుఁ గాంచిన అమృత బజారు పత్రికను మన ప్రభువు విడువక చదువుచుండెడి వాఁడఁట. నిర్భయముగ నధికారుల లోప ములను ఖండించుటకుఁ బ్రసిద్ధిచెందిన యీపత్రికను జదువు చుండుటయే కాక, తాను కలకత్తాకుఁబోయి యుండిన సమయ మున నీపత్రికా ప్రతినిధికి దర్శనమిచ్చి యతనితో సంభాషిం చెను. ఎప్పుడును నధికారుల వలన సందేహము చేఁ జూడఁబడుచు కఁబడుచు వచ్చిన యి" ప్రతినిధిగారికి యువ రాజుగారు దయలో స్వాగత మిచ్చినపు డతని మనస్సు కరగి కన్ను లనుండి జారఁదొడంగెనో నాఁగసంతో పాత్రు లుబుక పొర లెను. కృతజ్ఞతావాక్యము లొక్క. టి ఒక్కటి యొరసికొని రాఁ బ్రయత్నించి కంఠమున బెనఁగుచుండెనో యన నాతని స్వనము కంపమందెను. ఇట్టి సందర్భముల నతఁడు జార్జి రాకొమరునితో “ప్రభువుగవా ! చిత్తగింపుము. క్షుద్రుఁడనైన నాకుఁ దమ యీదర్శనమువలన మహాగౌరవ మలవడినది. ఇద్దానిని నేనెల్లప్పుడును గృతజ్ఞత జ్ఞాపకముంచుకొనియెదను. భవిష్యత్తున మాకు చక్రవర్తి కాంగల తమ యెదుట నున్నాడను గాన , భరతవర్షము దుస్థితి యందున్నదని చెప్ప సెలవు వేడు చున్నాఁడను. తమరు మున్ను

మాకు పరిచితులగుదురుగాన నీ దేశము దమ సంరక్షణకుఁ బాత్ర మనివక్కాణి, పనిండు. దయయుంచుఁడు. భారతీయుల మఱవఁ బోకుఁడు. ఇగ్లాండు నందలి నాలుగుకోట్ల బలె వీరును తమవ్ర జలేయనునది జ్ఞాపకముంచుకొనుఁ. వీరికి నలయు విషయ ములలో ముఖ్య తమము పరిపాలకుల నిర్మలసానుభూతి" యని మోకారించి నిలచి ముకిళిత కరకమలుండయి విన్నవించెను. ఈ పదములు జార్జి ప్రభువు మనస్సునాకర్షించె ననుటకు సందియము లేదు.. వెటనే యతడు పత్రికా ప్రతినిధిని దయారస పూరిత వాక్యములతో లేవఁ జే.సి " నిన్ను గాంచుటచే నాకు మిక్కిలి . యానందము గలిగినది. భారతీయుల మఱనకుందునని. యభ యమియ్య మనుచున్నాఁడవు. సరి. నే నెప్పుడును వారిని ముఱ వను. మఱవఁజాలను. ఎల్లప్పుడును గ్నాపకముంచు కొనుటయే కాక దేశీయులు నాకొసంగిన యత్యుత్తమ స్వాగతము చే నేనెంతయలరి నదియుఁ దప్పక నాతండ్రిగారి కెరుక పరచెదను. మీయెడనింకను నెక్కుడు సానుభూతి: గనుపఱచుట గ ర్త్వవ్య మని నా తండ్రిగారితో జెప్పుట నాకు సంతస మీను ధర్మము. భరత వర్షమును గుఱించి నామనన్సున నిశ్చల భానములు నెలకొని యున్నవి " యని ప్రత్యుత్తర మిచ్చెను. "

ఇంగ్లండు నందలి కక్షలు.

జార్జి ప్రభువీ విధమున 'భార తీయుల నిరాశనుడిపి వారిమన ముల నుల్లాసమునించి, యింగ్లాడునకుఁ బయనమయి పోయి

1906న సంవత్సరము మే నెల 1 న - తేది యిలు సేరెను. ఇంగ్లాండున రాజ్యాంగము నడుపు నట్టి మంత్రిమండలము (Cabinet) 1905 మొదలు 1908లోపల రెండు మారులు మారుట తటస్థించెను.. ఆ దేశమున మంత్రులు జన ప్రతినిధిసభ (House of commons.) లో నుండి యెన్నికొనఁబడు చుండుటచేతను, ప్రతినిధి సభకు సభ్యులను ప్రజలే నిర్వచించుటవలనను మంత్రులు మారుట యనిన సర్వరాజ్యాంగాధి కారులును షూరుటయే యయి, ప్రజలు దమహక్కుల ననుసరించి నూతనముగ ప్రతినిధి సభను నిర్వ చించుటే యగు చున్నది. ఇట్టి మార్పులు గలుగు కాలమునఁ దట స్థించు విశేషాంశములన్నియు జార్జి ప్రభువు ఇంగ్లాడున నున్నను లేకున్నను గూడ మిక్కి-లి శ్రద్ధతో గమనించు చుండెను. 1908 వ సంవత్సరమున నితఁడు కనడాకు మరల దర్శనమిచ్చి రా వెడ లెను. అచ్చట నీతని యొక్కయు రా కొమారి తెమేరీయొక్క " యు విగ్రహములతో తపాలాబిళ్లలు అచ్చు వేయఁ బడియెను.. వీరి జ్ఞాపకార్థమయి పతకముల చ్చొ త్తింపఁబడిపంచి పెట్టఁబడెను. 1910 వ సంవత్సరమున నింగ్లాండుకు ప్రభువుల సభ వారు (House of Lords.)జన ప్రతినిథి సభ వారి చే సిద్ధపఱుపఁబడిన బడ్జె ట్టు బిల్లును అనఁగా ముందు సంవత్సరపు ఆదాయవ్యయ పట్టికను త్రోసివేసిరి. దానివలన రెండు సభల వారికిని భేదములు గలిగి యప్పటి మంత్రిమండలమువారు రాజు ననుమతిపయి పార్లమెంటు కూడుటను నిలిపి ప్రజలను వేరొక ప్రతినిధి సభ నేరుకొనుఁడనిరి.


ఇంగ్లాండున బహుకాలముగ రాజకీయ కక్షలు రెండుగలవు. లిబరలుల కక్ష యొకటి. వీరెప్పుడును సంసార పక్షమువారు. కాంసర్వేటివుల కక్ష రెండవది. వీరు సర్వ సాధారణముగఁ బూర్వ పద్ధతుల విడచువారుగారు. పార్లమెంటు సభయందు, అందుముఖ్యముగఁ బ్రతినిధి సభయందు, రెండు తెగల వారును నుందురు. కాని ఏ తెగ వారి సంఖ్య యెక్కుడుగ నుండునో ఆ తెగ సభ్యులనుండియే మంత్రులను రా జెన్ను కొన లయును. వీరె రాజ్య కార్య నిర్వాహకులు. కావున వీరి కక్షయ తత్కాలమునకు నధికార కక్ష. 1910 నసంవత్సర మునకుఁ బూర్వము లిబరలు లే నధికార కక్షగ నుండిరి. ఆ సంవత్సరమున నడచిన నిర్వచనమునఁ గూడ వీరే యధికార కక్షయయిరి. అయినను వీరి సంఖ్య మాత్రము మొదటి కంటెఁ దక్కువయయి యుండెను. ప్రజాప్రతినిధుల 'సభకును ప్రభువుల సభకును గల పరస్పర సంబంధమును గుజించి వివాదములు ప్రారంభమగుట వలన రాజునకును నతని సాహాయ్యులకును మనోవ్యధ గలుగఁ జొచ్చెను. ఎడ్వర్డు చక్ర వర్తి యప్పుడు కొంత జబ్బు వడియుండెను. అట్లుండియు 1910 వసంవత్సరము ఫిబ్రవరి నెలలో నతఁడు పార్లమెంటు సభ, దెఱ చెను. అదియే యాతని కడపటి రాజకీయ కార్యమయి పరిణ మించెను. మే నెల 5 వ తేది యతఁడు మిక్కిలి యెక్కుడగు ఋజచే బాధింపఁ బడుచున్నాఁ డనువార్త బయట వెడ లెను.

రెండవనాఁడర్ధ రాత్రమున నామహామహుఁడు పరలోక జెందెను. రాజ్యాంగ కార్యములు చక్రవర్తి కొఱకై నను నిలువఁ జాలవుగదా! తండ్రి మరణమందిన కొన్ని గంటలలోపు గనే జాగ్జి రాకొమరుఁడు రాజును చక్రవర్తి యునయి యాలో చన సభాభవనమునకు స్వారి వెడలవలసిన వాఁడాయెను. యధా విధిగ నెడ్వర్డు చక్రవర్తి కుత్తరక్రియలు జరిగెను. సంవత్సర కాలము శోకచిహ్నములతో సర్వ కార్యములును నడుపఁ బడెను. 1911 వ సంవత్సరము జూన్ నెల 22వ తేది ఇంగ్లాండున పంచమజార్జి చక్రవర్తికిని మేరీ చక్రవర్తినికిని పట్టాభి షేక మహోత్సవము జరిగెను. అదే సంవత్సరము వీరిరువురును డిశెంబరు మాసమున భరతవర్షమునకుఁ దరలి వచ్చి భారతీ యుల నెల్ల సంతోషాంబుధి నోలలాడఁ జేయుచు ప్రాచీన చక్ర వర్తులంబలే పురాణ ప్రసిద్ధంబగు ఢిల్లీ నగరమున సామ్రాజ్య పట్టభద్రులయిరి. ఆమహోత్సవమును ముందు దర్బారుల విషయమయి వ్రాయు ప్రకరణములో వర్ణింతుము. ఆ సమ యమున విచ్చేసిన కొందఱు సామంత రాజులను గుఱించియు వారి రాజ్యములను గుఱించియు రాఁబోవు ప్రకరణములలో దెల్పెదము.

  1. తూర్పుతీరమున నాంగ్లేయుల మొదటి స్థానములలో నిది యొకటి.