జ్వాలలందున జన్మమెత్తిన
శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ తెలుగు కీర్తనలు
రాగం: వాసంతి తాళం: తిస్రనడ పల్లవి: జ్వాలలందునా,, జన్మమెత్తినా,, మంచు కూతురా! మా మంచి చూడవా జీవసారమే బూడిదైననూ వట్టి బూదిలో మొక్క మొల్చెను మొల్చినట్టి ఆ మొక్క చూడగా వట్టి దుంగగా స్థాణువాయెను మండు మంటలే సాగి తీగలై ప్రేమ పూని యా స్థాణుమూర్తినీ చుట్టుముట్టగా దానిలోపలా ప్రాణచేతనా స్ఫూర్తి విచ్చెను ఆమె అమ్మగా తాను నాన్నగా లోక సంతతి వ్యాప్తి కల్గెను ఇట్లు నాన్నకే ప్రాణదీప్తిగా వెల్గు సచ్చిదా నంద వీవుగా