జ్యోతిష్య శాస్త్రము/జ్యోతిష్యములో ప్రశ్నలు

48. జ్యోతిష్యములో ప్రశ్నలు

1) జాతకములో ఏ సమస్యనైనా తెలియవచ్చునా?

జ॥ జాతకము అనునది జాఫతకము అని ముందే చెప్పాము. ఫతకము అనగా ముందే నిర్ణయించుకొన్నదని అర్థము. జీవిత ఫతకము పుట్టిన సమయములోనే నిర్ణయించడము జరిగినది. అందువలన పుట్టుటను ‘‘జా’’ అన్నారు. అప్పుడు నిర్ణయము చేయబడిన ఫతకమును జాఫతకము అంటున్నాము. జీవితములోని అన్ని సమస్యలు జాఫతకములో ప్రారబ్ధకర్మ ద్వారా నిక్షిప్తము చేయబడియుండును. జాఫతకమును మనము పుట్టిన సమయమును బట్టి వ్రాసుకొన్నా జరిగెడు భవిష్యత్తు ఏమీ అర్థముకాక అంధకారముతో నిండియుండును. అందువలన భవిష్యత్తు అంధకారముతో కూడుకొనియున్నది. ఆ చీకటిలో ఏమీ కనిపించదు. అందువలన ముందు దినముగానీ, ముందు నిమిషముగానీ ఏమి జరుగునదీ తెలియదు. చీకటిమయమైన జాతకమును జ్యోతితో తెలియవచ్చును. జ్ఞానమను జ్యోతిని ఉపయోగించి చూచితే జీవితములోని ఏ సమస్యనైనా తెలియ వచ్చును. జ్ఞానజ్యోతికలవాడు జ్యోతిష్యుడు. అజ్ఞానముగలవాడు సమస్యను గురించి అడుగువాడు. జ్ఞానము తెలియనివాడు ప్రపంచ ప్రశ్నలనే అడుగును. ప్రపంచ ప్రశ్నలకు జవాబునిచ్చు జ్యోతిష్యుడు, తన పరిచయము చేత జ్ఞానము తెలియని వానికి కూడా జ్ఞానము మీద ఆసక్తి కల్గునట్లు ప్రశ్నకు జవాబివ్వవలెను.

2) జ్యోతిష్యమునకు భవిష్యత్తుకు తేడా ఏమి గలదు?

జ॥ చూచునది దృష్ఠి, చూడబడునది దృశ్యము. అలాగే తెలియబరచు నది జ్యోతిష్యము, తెలియబడునది భవిష్యత్తు. అట్లే జ్ఞానముతో కూడుకొన్నది జ్యోతిష్యము, భయముతో కూడుకొన్నది భవిష్యత్తు. జ్ఞానముతో కూడుకొన్న వాడు జ్యోతిష్యమును చెప్పును. అజ్ఞానముతో కూడుకొన్నవాడు భవిష్యత్తును అడుగును. భావితరము అంటే రాబోవు తరము అని అర్థము. జ్యోతితరము అంటే వెలుగునిచ్చుతరము. ఇప్పుడు జ్యోతిని (జ్ఞానమును) వెలగించితే అది రాబోవు వారికి (తెలియ గోరు వారికి) వెలుగై ఉండును.

3) జ్యోతిష్యము ఎన్ని రకములు కలదు?

జ॥ దేశములో ఎన్ని జ్ఞానములున్నా దేవుని జ్ఞానము ఒక్కటే గలదు. దేవుడూ ఒక్కడేగలడు. అదే విధముగా జ్యోతిష్యము అను పేరును ఎన్నో పద్ధతులుగా చెప్పే విధానములకు పెట్టుకొన్నా అవన్నియు జ్యోతిష్యములు కావు. వాటి వలన భవిష్యత్తు తెలియదు. ద్వాదశ గ్రహముల ద్వారానే కర్మ పాలింపబడుచున్న విధానమునే జ్యోతిష్యము అంటాము.

4) ముహూర్తమంటే ఏమిటి?

జ॥ ముందే నిర్ణయింపబడినది ముహూర్తము. మధ్యలో మనుషులు నిర్ణయించునది ముహూర్తము కాదు. అన్ని ముహూర్తములు జన్మలోనే ప్రారబ్ధ కర్మతోపాటు నిర్ణయించబడియుండును. మధ్యలో ఎవరూ నిర్ణయించ లేరు. నిర్ణయించినా దానిని ముహూర్తమనరు.

5) కొందరు తమ పిల్లలు పుట్టిన సమయములోనున్న నక్షత్రమునుబట్టి పేరు పెట్టుచుందురు. కొందరు ఏమీ చూడకనే పేర్లు పెట్టుచుందురు. అట్లు పెట్టు పేర్లలో బలముండునా? ఎలా పేరు పెట్టడము మంచిది?

జ॥ పుట్టిన సమయములో ఉన్న నక్షత్రమునుబట్ట్టి, ఆ నక్షత్రము యొక్క నాలుగు పాదములకు గుర్తుగా నిర్ణయించబడిన నాలుగు అక్షరములలో అప్పటి పాదమునకు సంబంధించిన అక్షరమును మొదటి అక్షరముగా ఉండునట్లు చేసి పేరును పెట్టుకోవడము జరుగుచున్నది. అలా పుట్టిన సమయములోనున్న నక్షత్రమునకు సంబంధిత అక్షరముతో పేరు పెట్టుకొనినా, అలా పెట్టుకొనక వేరే పేరును పెట్టుకొనినా, అందులో లాభముగానీ నష్టముగానీ ఏమీ ఉండదు. కొన్ని పేర్లు పలికే దానికి సులభముగా అందముగా ఉండవచ్చును. కొన్ని పేర్లు కష్టముగా అందహీనముగా మొరటుగాయుండును. అయితే వాటిలో బలముండడము గానీ, ఉండకపోవడముగానీ ఏమీ ఉండదు. ఏ మనిషికీ ఏ పేరువలనా ఎటువంటి బలాబలములుగానీ, లాభనష్టములుగానీ ఉండవు.

6) ఒకరి జీవితములో ఒకపెళ్ళిమాత్రము జరుగగా, మరొకరి జీవితములో రెండు పెళ్ళిళ్ళు జరుగుచుండుట చూశాము. దానికి కారణము ఏమి?

జ॥ ఒక వ్యక్తి జాతకములో ఏడవస్థానము కళత్ర స్థానమనబడును. కళత్ర స్థానమనగా భర్తకు భార్య కళత్రమగును. అట్లే భార్యకు భర్త కళత్రమగును. కళత్రస్థానమైన ఏడవ స్థానమున రాహువుగానీ లేక కేతువుగానీ ఉండినట్లయితే ఆ జాతకునికి రెండవ పెళ్ళి జరుగుటకు అవకాశమున్నది. కళత్రము అనగా పురుషునికి స్త్రీ కళత్రమగుననీ, స్త్రీకి పురుషుడు కళత్రమగునని మరొక అర్థము కలదు. అందువలన ఒకవేళ పెళ్ళికాకున్నా స్త్రీలకు పురుషులతో, పురుషులకు స్త్రీలతో అక్రమ సంబంధము ఏర్పడునట్లు రాహు కేతు గ్రహములే చేయును. కొందరి కుటుంబములో భర్త చనిపోయిన భార్యవుండినా అమె ముండమోసిన విధవగా మిగిలి పోవుచున్నది. అటువంటి ఒక స్త్రీకి ఎటువంటి ఇతర పురుషునితో సంబంధముండదు. అలా ఉండుటకు కారణము ఏమనగా! కళత్ర స్థానములో రాహువుగానీ, కేతువుగానీ ఉండినప్పుడు అక్కడే ఆ గ్రహములకు వ్యతిరేఖమైన రెండు లేక మూడు గ్రహములున్నట్లయితే అక్కడ రాహువు కేతువుల ప్రభావము అణిగిపోవును. వారు చేయు రెండవ పెళ్ళికిగానీ, రెండవ అక్రమ సంబంధముగానీ జరుగకుండపోవును. కళత్ర స్థానములో రాహువు కేంద్రమున్న చోట ఆ గ్రహముకు వ్యతిరేఖమైన గ్రహములు కాకుండ అనుకూలమైన గ్రహములుంటే అటువంటి జాతకునికి ఒక పెళ్ళికి బదులు రెండు లేక మూడు పెళ్ళిళ్ళు జరుగునట్లు చేయగలరు. అట్లే ఒక అక్రమ సంబంధమునకు బదులు మరికొన్ని అక్రమ సంబంధములు కల్గింతురు. ఇదంతయు జాతక చక్రములోని గ్రహములు ఆడిరచు ఆటలేగానీ మనిషి స్వయముగా ఎక్కడా ఆడడము లేదు.

7) ఒక వ్యక్తికి పెళ్ళి ఆలస్యముగా వయస్సు ముదిరిన తర్వాత అగుటకు కారణమేమి? అట్లే మరికొందరికి పూర్తి చిన్నవయస్సులోనే పెళ్ళి జరుగుటకు కారణమేమి ఉండవచ్చును?

జ॥ మనిషి జీవితములో యౌవ్వనమునకు అధిపతి కుజగ్రహము. అలాగే కళత్రమునకు అధిపతి శుక్రగ్రహము. ఈ రెండు గ్రహములు వేరువేరు వర్గమునకు చెందినవి. ఒక గ్రహము పాపవర్గము లేక శత్రువర్గము నకు చెందినదైతే మరియొక గ్రహము పుణ్యవర్గము లేక మిత్రవర్గమునకు చెందినదైయున్నది. మనిషి జాతకమునుబట్టి, అందులో జన్మలగ్నమునుబట్టి గ్రహములు రెండు వర్గములుగా విభజింపబడుచున్నవి. ఆ విధముగానున్న గ్రహములలో శనివర్గము వారు పుణ్యమును పాలించువారైయున్నారను కొనుము. అప్పుడు గురువర్గములోని గ్రహము లన్నియు పాపమును పాలించునవైయుండును. పుణ్యమును పాలించు గ్రహములను శుభగ్రహము లనీ మిత్రగ్రహములనీ, అనుకూలమైన గ్రహములనీ అంటుంటాము. అదే పాపమును పాలించు గ్రహములను అశుభగ్రహములనీ, శత్రుగ్రహములనీ, వ్యతిరేఖమైన గ్రహములనీ అంటుంటాము.

శనివర్గమునకు చెందిన జాతకునికి జన్మకుండలిలో కళత్రస్థానమైన ఏడవ స్థానమున శత్రువర్గమునకు సంబంధించిన అశుభగ్రహమైన కుజ గ్రహము ఉన్నాడు. అందువలన కుజగ్రహము యౌవ్వనముకు అధిపతియై నందున జాతకుని యౌవ్వనమును అడవిగాచిన వెన్నెలవలె చేసి, యౌవ్వనములో కళత్ర సుఖము లేకుండా చేయును. అందువలన అటువంటివానికి జీవితములో పెళ్ళియగుటకు ఆలస్యమగును. ఏదో ఒక కారణముచేత పెళ్ళి కుదరకుండా పోవుచు చివరకు వయస్సు ముదిరి పోవును. వయస్సు ముదిరిన తర్వాత పెళ్ళి కావచ్చును. కొందరికి శనివర్గము శత్రువర్గమైనప్పుడు కళత్రస్థానమున శుక్రుడున్నా లేక శుక్ర హస్తమున్నా కళత్రమునకు అధిపతియైన శుక్రుడు జాతకునికి అశుభమును కల్గించుచూ వానికి యౌవ్వనములో పెళ్ళి అయినా శుక్రగ్రహము వలన యౌవ్వనములో భార్య అనుకూలవతిగా లేకుండును. యౌవ్వనమంతా ఆ జాతకునికి భార్య అనుకూలములేక స్త్రీ సౌఖ్యము లేకుండాపోవును. కుజ గ్రహముగానీ, శుక్రగ్రహముగానీ శత్రువులుగా ఎవరున్నా వాని యౌవ్వన వయస్సంతయు సుఖము లేకుండా పోవును. కుజ మిత్రవర్గమువాడై శుభగ్రహమై ఏడవ స్థానములోయున్న చిన్నవయస్సులోనే పెళ్ళియగును. శుక్రుడు అశుభ గ్రహమైనా కళత్రమునకు సంబంధము లేకుండా వేరు స్థానములలో ఉండినా అతని కళత్రములో ఆటంకములు లేకుండా సాగి పోవును.

8) కొన్ని కుటుంబములలో భార్య భర్త ఇరువురూ ప్రతి చిన్న విషయము నకూ పోట్లాడుకొనుచూ, ఒకరిమాటను మరియొకరు వినకుండ కాపురము చేయుచుందురు. వారు అలా ఉండుటకు కారణమేమి?

జ॥ యౌవ్వన కారకుడు కుజుడు, కళత్ర కారకుడు శుక్రుడు అయినందున, వీరు ఇరువురూ శత్రువులగుట వలన చాలామంది జీవితములలో యౌవ్వనములో కళత్ర సుఖముండదు. అంతేకాక పూర్తి శత్రువులుగానున్న వీరు ఇద్దరూ ఒకే లగ్నములో కలిసియున్నప్పుడు జన్మించిన వారికి వారి జీవితాంతము భార్యాభర్తల అన్యోన్యత లేకుండా కాపురము చేయుదురు. కుజగ్రహము ఎవరికి అనుకూలముగాయుంటే వారికి కోపము ఎక్కువయుండును. అందువలన ప్రతి విషయములోనూ కోపగించుకొనుచుందురు. అట్లే కుజ గ్రహము అనుకూలముగాయున్న మగవారికి శుక్రగ్రహము ఇతర స్త్రీల సాంగత్యమేర్పరచును. కుజుడు శుక్రుడూ ఇద్దరూ శత్రువులగుట వలన మనుషుల జీవితములో భార్యాభర్తలు ఏమాత్రము పొందిక లేకుండ జీవితము సాగునట్లు చేయును.

9) కొందరు మనుషులు చూచేదానికి అందముగా లేకున్నా బుద్ధి మాత్రము గొప్పగాయుండి వారి ప్రవర్తన గొప్పదిగాయుండును. వారి మేధాశక్తితో ఏ సమస్యకైనా సులభముగా జవాబు చెప్పుచుందురు. కొందరు అందముగాయున్నా తెలివితక్కువవారుగా యుందురు. వారి ప్రవర్తన కూడా తెలివి తక్కువగానే కనిపించుచుండును. అలా ఉండుటకు కారణమేమి?

జ॥ కర్మచక్రములోని కర్మ రాశులున్న భాగములలో ఐదవ భాగము లేక ఐదవ స్థానమునందు మనిషి మేధస్సుకు సంబంధించిన కర్మలుండును. అలాగే కాలచక్రములోని పన్నెండు గ్రహములలో బుద్ధికి అధిపతియైనవాడు చంద్రుడు. జాతకచక్రములో చంద్రుడు ఐదవ స్థానములో ఉన్నా లేక చంద్రుని హస్తము అక్కడున్నా అటువంటి వ్యక్తులు మంచిబుద్ధిగలవారై ఉందురు. ఐదవ స్థానము కాకుండ మిగత పాపస్థానములైన 3,7,11 స్థానములలో ఉండినట్లయితే ఉన్న స్థానమునుబట్టి పూర్తి తెలివితక్కువగా యుండును. చంద్రునితోపాటు శత్రు గ్రహములు కలిసిన అక్కడ కలిసిన గ్రహములనుబట్టి తెలివితక్కువ తనముండును. చంద్రునితోపాటు బుధుడు శత్రువై కలిసియుండడము వలన వ్యాపారములో తెలివితక్కువగాయుండు నని తెలియవచ్చును. అట్లే ఆయా గ్రహములనుబట్టి చెప్పవచ్చును.

10) కొందరు కాలము కర్మ అనుచుందురు. మీరు కాలచక్రము, కర్మచక్రము అన్నారు. అవి కనిపిస్తాయా?

జ॥ ఏ మనిషికైనా ఏ కర్మయున్నదీ తెలుసుకొనుటకు వీలుపడదు. ఎందుకనగా జాతక చక్రములోనున్న గ్రహములను కాలచక్రములోని లగ్నములందున్నట్లు చెప్పుకొంటున్నాముగానీ, రాశులలోనని చెప్పలేదు. రాశులు కర్మచక్రములో, లగ్నములు కాలచక్రములో ఉంటాయి అని చెప్పుకొన్నాము. రాశియే కనిపించనప్పుడు దానిలోని కర్మ కూడా కనిపించదు కదా! జన్మకుండలిలో వ్రాసుకొను భాగములను జన్మలగ్న కుండలి అంటున్నాము. అంతేగానీ జన్మరాశికుండలి అని అనడములేదు. పంచాంగమును ఉపయోగించి వ్రాసుకొన్న లగ్న కుండలిలో గ్రహములు తెలియుచుండునుగానీ, కర్మ కనిపించడము లేదు. అయినా ప్రతి పనికీ కర్మే కారణమంటున్నాము, గ్రహమే కారణమనడములేదు. కర్మ ఉన్నది గానీ కనిపించడము లేదు. గ్రహములు మాత్రము కనిపిస్తున్నవి గ్రహములు ఉన్నది కాలచక్రములో, అయితే చక్రములోని గ్రహములు కనిపిస్తున్నవిగానీ, కాలము కనిపించడములేదు. కాలము క్రిందనున్న కర్మచక్రము కనిపించుచున్నదిగానీ అందులోని కర్మ కనిపించడము లేదు. క్రిందికి వస్తే గుణచక్రమూ కనిపించడము లేదు. అందులోని గుణములుగానీ, జీవుడుగానీ ఎవరికీ ఏమాత్రము కనిపించడము లేదు. పైనగల కాల చక్రములో చక్రమూ, చక్రములోని గ్రహములూ కనిపించగా, కాలము కనిపించడములేదు. క్రిందయున్న కర్మచక్రములో చక్రము మాత్రము కనిపించుచున్నదిగానీ, చక్రములోని కర్మ కనిపించడములేదు. ఇక ఇంకా క్రిందికిపోతే గుణచక్రమున్నది. అయితే అక్కడ చక్రమూ కనిపించడము లేదు. అందులోని గుణములూ కనిపించడములేదు. గుణములలోనున్న జీవుడూ కనిపించడము లేదు. మనము బాగా మనోదృష్ఠి పెట్టి ఆలోచించాలి. పైనగల కాలచక్రములో చక్రమూ గ్రహములు రెండూ కనిపించగా, దాని క్రిందగల కర్మచక్రములో చక్రము మాత్రము కనిపించగా, దానికంటే క్రింద గుణచక్రము, గుణములు, జీవుడులో ఏ ఒక్కటీ కనిపించలేదు. దీనినిబట్టి పైకి పోయేకొద్దీ దృష్ఠి పెరుగుతుందనీ, క్రిందికి వచ్చేకొద్దీ దృష్ఠి తరుగుతుందనీ అర్థమగుచున్నది. మీకు అర్థమైనా అర్థముకాకున్నా మేము చెప్పునదే మనగా, కాలమూ కనిపించదు, కర్మమూ కనిపించదు. కాలము కర్మ ఎవరి కోసమున్నాయో ఆ జీవుడూ అక్కడేయున్న గుణములూ ఏమాత్రము కనిపించవు. ప్రపంచములో ఏ మనిషీ ఈ మూడునూ చూడలేడు. అయితే ఇప్పుడు కొందరు తెలివిగా నన్ను ఒక ప్రశ్నను అడుగవచ్చును. అదేమనగా! ‘‘మీరు వ్రాసిన గ్రంథములలో ఇది కాలచక్రమని, దానిక్రింద ఇది కర్మ చక్రమనీ, దానిక్రింద గుణచక్రమని బొమ్మవేసి చూపి అందులో జీవుడిట్లున్నాడనీ, గుణములు ఇట్లున్నవనీ బొమ్మతో సహా చూపారు. ఏ మనిషీ చూడలేదని చెప్పిన మీరే ఆ బొమ్మలను చూపారు కదా! గుణచక్రము అందులోని మూడు భాగములు ఎట్లుండునో తెలియని మాకు గుణభాగము లనూ జీవుని ఆకారమునూ చూపారు కదా!’’ అని అడుగవచ్చును. దానికి మా జవాబు ఇలాయున్నది చూడండి. ప్రపంచములో ఏ మనిషీ చూడలేదు అనేమాట బ్రహ్మవిద్యా శాస్త్రములోని శాసనము. ఆ శాసనము ఎప్పటికీ మారదు, అసత్యమూ కాదు. అయితే మీరెలా చెప్పారు అని మీరు అడిగినది హేతుబద్ధమే అయినా దానికి నేను కూడా హేతుబద్ధముగానే సమాధానము ఇస్తున్నాను. అక్కడ వాక్యములో ఏ మనిషీ చూడలేదు అన్నమాటను చూచిన తర్వాత మీకు మరొక జ్ఞప్తి కూడా రావలసింది. జనన మరణ సిద్ధాంతమును చెప్పినప్పుడు ఈ విషయము ప్రపంచములో పుట్టినవానికి ఎవనికీ తెలియదని చెప్పినప్పుడు ఇప్పుడు అడిగిన ప్రశ్న అప్పుడే అడుగవలసింది. అయినా ఫరవాలేదు. ఇప్పుడు అడిగారు కాబట్టి సంతోషిద్దాము. జనన మరణ సిద్ధాంతములోని విషయముగానీ, ఇప్పుడు చెప్పిన కాలము, కర్మము చెప్పిన విషయముగానీ ఏ మనిషికీ తెలియదు అని చెప్పినప్పుడు ఇది ఒక మనిషి చెప్పిన విషయమని మీరెలా అనుకుంటు న్నారు? మీకు కనిపించేది మనిషే అయినా నేను చెప్పినట్లు అనుకోవడము మీ పొరపాటు. నేను ఎన్నోమార్లు చెప్పాను. ఇప్పుడు కూడా గుర్తు చేయుచున్నాను. నాకు ఏమీ తెలియదు. అందువలన ఎవరికీ తెలియదని చెప్పిన దేవునిమాట వాస్తవము. ఏ రహస్యమైనా మన శరీరములోనున్న ఆత్మకే తెలుసు.

ఆత్మ అందరినీ నడిపించుచూ ఇటు జీవునిగా అటు దేవునిగా భ్రమింపజేయుచూ, తాను మాత్రము ఎవరికీ తెలియక నిశ్శబ్ధముగా యున్నది. అన్నిటికీ అధిపతియైన దేవుడు తనకు మనకు మధ్యలో ఆత్మనుంచి సాక్షిగా వినోదమును చూస్తున్నాడు. ఎలాగైతేనేమి, అన్నీ తెలుసుననుకొన్న జీవునికీ ఏమీ తెలియదని నిజంగా ఏ జీవునికీ తెలియదు. అందువలన కాలము ఎవరికీ తెలియదు. అట్లే కర్మ కనిపించడము లేదు. జీవుడు, గుణములను స్వయముగా ఎవరూ చూడలేదు. మేము చూపితే మీరు చూడగలిగారు, మేము చెప్పితే వినగలిగారు. అంతేగాని దేవుని మాట ప్రకారము మేము తప్ప ఎవరూ స్వయముగా చూడలేదని చెప్ప వచ్చును.

11) మాకు జ్యోతిష్యము తెలియాలంటే ఈ గ్రంథము చదివితే అర్థమవు తుందా?

జ॥ సహజముగా ఎవరి గ్రంథమును వారు గొప్పగా చెప్పుకొందురు. అందువలన ఈ గ్రంథము చదివితే బాగా అర్థమవుతుందని నేను చెప్పినా, అది అర్థమగుటకూ, అర్థము కాకుండుటకూ ఒక విధానమును అనుసరించి చూస్తే ద్వాదశ గ్రహములలో ఒక బుధగ్రహము అనుకూలము లేనప్పుడు జ్యోతిష్యము అర్థముకాదు. బుధగ్రహము జన్మ లగ్నమున అనుకూలమైన మిత్ర గ్రహమై ఐదవస్థానములో ఉన్నా, తన చేతితో తాకినా, అటువంటి జాతకునికి జ్యోతిష్యము మీద ఆసక్తికల్గి దానిని తెలియునట్లు చేయును. ఆసక్తి పెరుగుకొద్దీ జ్యోతిష్య శాస్త్రము అర్థమగుచూవచ్చును. ఏదీ ఒక్కమారు రాదు కాలక్రమేపీ రాగలదు. 12) గతములో చాలామంది జ్యోతిష్యశాస్త్ర రచయితలు వారివారి గ్రంథములైన జ్యోతిష్య ఫలగ్రంథము, యవన జాతకము, జాతక మార్తాండము, జాతక చంద్రిక మొదలగు పుస్తకములందు సూర్యుడు, కుజుడు, శని, రాహువు, కేతువులను కౄరులనీ, బుధ, గురు, శుక్ర, చంద్రులను సౌమ్యులనీ చెప్పారు. ఇంకనూ చాలా పుస్తకములలో ఈమాటే ఉన్నది. వేరు జ్యోతిష్యులందరూ ఈ విషయమునే చెప్పుచున్నారు. అది ఎంతవరకు వాస్తవము?

జ॥ అది ఏమాత్రమూ వాస్తవము కాదని చెప్పుచున్నాము. మంచి పనిని చేయువారిని శుభులనీ, చెడు పనిని చేయువారిని అశుభులనీ అనవచ్చును. కాలచక్రములోని గ్రహములు కొన్ని పుణ్యమును పాలించునవిగ, కొన్ని పాపమును పాలించునవిగ ఉన్నమాట వాస్తవమే.

పాపమును పరిపాలించువారిని కౄరులు, పాపులు, అశుభులు, శత్రువులు అని పిలువవచ్చును. అలాగే పుణ్యమును పాలించువారిని సౌమ్యులు, పుణ్యులు, శుభులు, మిత్రులు అని పిలువవచ్చును. గ్రహములు రెండు గుంపులుగా ఉండడము వాస్తవమే అయినప్పటికీ, ఒక లగ్న జాతకునకు పాపమును పాలించుచు కౄరులుగా ఉండినవారే మరొక లగ్న జాతకునకు పుణ్యమును పాలించువారై సౌమ్యులుగా ఉన్నారు. జాఫతక లగ్నములను బట్టి కొందరికి శాశ్వితముగా కౄరులుగానున్న గ్రహములు, మరొక జాఫతక లగ్నమును బట్టి మరికొందరికి శాశ్వితముగా సౌమ్యులుగా ఉన్నారు. అందువలన అందరికీ శాశ్వితముగా కౄరగ్రహములు లేవు, అట్లే సౌమ్య గ్రహములు లేవు. అలా అందరికీ శాశ్వితముగా కొన్ని గ్రహములు కౄరులుగా ఉన్నారని అంటే, అది శాస్త్రబద్దత లేకుండ ఇష్టమొచ్చినట్లు చెప్పినదగును. జ్యోతిష్యము షట్‌శాస్త్రములలో ఒక శాస్త్రము కావున సూత్రబద్దత కల్గియున్నది. 2:1 అను సూత్రము ప్రకారము, మిత్రులు శత్రువులు అను రెండు వర్గములను విభజించాము. దానిప్రకారము ఒకనికి మిత్రులైన గ్రహములు మరొకనికి శత్రువులు కావచ్చును. ఆరు లగ్నములకు శత్రువులై, కౄరులుగా వర్తించు గ్రహములు, మరొక ఆరు లగ్నములకు మిత్రులై, సౌమ్యులుగా వర్తించుచున్నారు. ఒక శాస్త్రమును అనుసరించి, అందులోనూ ఒక సూత్రమును అనుసరించి ఎవరు ఎవరికి సౌమ్యులో, ఎవరు ఎవరికి కౄరులో మేము వివరించి చెప్పాము. అట్లుకాక ఏ లగ్నమునూ ఆధారము చేసుకొని చూడక, ఏ సూత్రమునూ అనుసరించకుండ రవి, శని, కుజ, రాహు, కేతువులను కౄరులనడము, గురు, బుధ, శుక్ర, చంద్రులను సౌమ్యులు అనడము పూర్తి శాస్త్రవిరుద్ధమని చెప్పుచున్నాము. సంస్కృతములో ఇష్టమొచ్చినట్లు శ్లోకములను అల్లి చెప్పినంతమాత్రమున అందులో శాస్త్రీయత లేకపోతే అది వాస్తవము కాదు. ఇక్కడొక ఉదాహరణను చూస్తాము.

శ్లో॥ దుఃఖావహా ధనవిశాకరాః ప్రధిష్టా విత్తస్థితా రవిశనైశ్చర భూమిపుత్రాః
చంద్రోబుద్దస్సుర గురుర్భృగునందనోవా, సర్వేధనస్య నిచయల కురుదే ధనస్థాః


తాత్పర్యము : ద్వితీయ స్థానములో రవి,శని,కుజులలో ఎవరున్ననూ ధననాశనమును, అధికదుఃఖమును కల్గించి బాధింతురు. చంద్ర,బుధ, శుక్రులలో ఏ ఒక్కరున్ననూ ధనలాభమును కలిగింతురు.

ఈ శ్లోకమూ దాని తాత్పర్యమూ ‘‘యవన జాతకము’’ అను పుస్తకములో వ్రాయబడియున్నది. ఇందులో మేము అడుగునదేమనగా! ద్వితీయమున చెడు గ్రహములుంటే, ధన నాశనము దుఃఖము కల్గుననుట ఒప్పుకుంటాను. కానీ ఏ లగ్నము ద్వితీయమున వీరు చెప్పిన గ్రహములు ఉన్నారో చెప్పకపోవడము, మరియు రవి,శని,కుజులు, ఏ లగ్నమునకు కౄరులో, ఎట్లు కౄరులైనారో చెప్పకపోవడము పూర్తి అశాస్త్రీయత అని చెప్పవచ్చును. మేము 2 :1 అను ఆత్మల సూత్రమును అనుసరించి గ్రహములను రెండు గుంపులుగా చేశాము. వాటినే గురువర్గము, శని వర్గము అని కూడా చెప్పాము. శని, బుధ, శుక్ర, రాహువులను ఒక గుంపులో; సూర్య, చంద్ర, కుజ, గురు, కేతులను ఒక గుంపులో ఉన్నాయని మేము చెప్పితే జ్యోతి తెలియనివారు రెండు గుంపులలోని వారిని కలుపుకొని సూర్య, కుజ, శని, రాహు,కేతులను కౄరులన్నారు. ఇందులో మా లెక్కప్రకారము సూర్య, కుజ, కేతువులు గురువర్గములోనివారు కాగా, ఈ ముగ్గురిలో ప్రతిపక్ష గుంపులోని రాహువు,శని కలిసిపోవడము పూర్తి తప్పు. అంతేకాక 1×7 అను సూత్రము ప్రకారము సూర్యునకు బద్ద శత్రువు శని అగును. అలాగే శనికి బద్దశత్రువు సూర్యుడగును. అటువంటివారు ఒక గుంపులో కౄరులుగా ఉన్నారని చెప్పడము అసంబద్దము, అశాస్త్రీయము. అందువలన సంస్కృత శ్లోకములోనున్న తప్పుడు సమాచారమును నమ్మ వద్దండి. ఇటువంటి అశాస్త్రీయత జ్యోతిష్యములో కనిపిస్తున్నది. కావున నేటి హేతువాదులు, నాస్తికవాదులు జ్యోతిష్యము శాస్త్రము కాదంటున్నారు. టీవీ9 వారు జ్యోతిష్యము మూఢనమ్మకము అంటున్నారు. అందువలన మేము పూర్తి శాస్త్రీయతతో ఈ గ్రంథమును వ్రాసి, జ్యోతిష్యశాస్త్రము షట్‌శాస్త్రములలో ఐదవశాస్త్రమని చెప్పుచున్నాము.


13) ఇంతవరకు చెప్పిన అతిరథులు, మహారథులు గ్రహములు తొమ్మిదే అని చెప్పగా, ఎవరూ చెప్పని మూడు గ్రహములను మీరు చెప్పారు. మీరు ఎక్కడా ఎవరికీ జ్యోతిష్యము చెప్పినది కూడలేదు. భవిష్యత్తు (జ్యోతిష్యము) చెప్పు అనుభవముగానీ, అలవాటుగానీ లేని మీరు ఏకంగా ద్వాదశ గ్రహములను ప్రకటించి, జ్యోతిష్య గ్రంథమును శాస్త్రబద్దముగా, సూత్ర యుక్తముగా వ్రాస్తున్నామంటున్నారు. ఇది సంభవమగునా?

జ॥ ఇంతవరకు చెప్పినవారు రథులో, అతిరథులో, మహారథులో, వీరులో, శూరులో నాకు తెలియదు. జ్యోతిష్యములో నేను మాత్రము కేవలము రథుడను కూడా కాను. అటువంటపుడు నీవు వ్రాయునది సక్రమమేనా అని నన్ను అడుగుటలో మీ తప్పేమీలేదు. మీ ప్రశ్నకు మేము చెప్పు సమాధాన మేమనగా! నాకు జ్యోతిష్యము తెలియదు కానీ, నా శరీరములో నా ప్రక్కనేయున్న వానికి, షట్‌శాస్త్రములు సంపూర్ణముగా తెలియును. ఇక్కడ ఒక సూత్రమును ఉదహరించితే ఒక ఇనుప ముక్క ప్రక్కలో అయస్కాంతము ఉండినా, ఒకవేళ అయస్కాంతము ప్రక్కలో ఇనుపముక్క ఉండినా ఇనుప ముక్కే అయస్కాంతముగా మారుతుంది, కానీ అయస్కాంతము ఇనుప ముక్కగా మారదు. అలాగే ఒక తెలియని వాని ప్రక్కలో తెలిసినవాడుండినా, ఒకవేళ తెలిసినవాని ప్రక్కలో తెలియని వాడుండినా, తెలియనివాడే తెలిసినవాడుగా మారును. కానీ తెలిసినవాడు తెలియనివానిగా మారడు. ఈ సూత్రము ప్రకారము, నేను జ్యోతిష్యము తెలియనివాడినే, కానీ జ్యోతిష్యము తెలిసినవాని ప్రక్కన ఉన్నాను. కనుక అసలైన జ్యోతిష్యమేమిటో నాకు తెలిసింది. ఇద్దరము కలిసి మీకు చెప్పగలుగుచున్నాము. ఈ సూత్రము ప్రకారమే సైన్సు అభివృద్ధి కాని పురాతన కాలములోనే, పాశ్చాత్యులు గుడ్డలు కూడ కట్టని అనాగరిక కాలములోనే, ఖగోళ పరిశోధనలు లేని కాలములోనే, ఏ వ్యోమనౌకలు ఆకాశములోనికి పోని కాలములోనే, కొందరు మహర్షులు తొమ్మిది గ్రహములనూ, వాటి వేగమునూ, గ్రహణములనూ పసిగట్టి చెప్పగలిగారు. తమ ప్రక్కవానిని గుర్తించినవారు ప్రక్కవాడు చెప్పినట్లే చెప్పారు. ఈనాడు ఎంతో వ్యయప్రయాసలతో ఆకాశములోనికి ఉపగ్రహమను రాకెట్‌ పంపి, కుజగ్రహము ఎర్రగ ఉన్నదని, ఇప్పుడిప్పుడు ఖగోళశాస్త్రజ్ఞులు చెప్పు చున్నారు. కుజగ్రహము ఎర్రగ ఉన్నదని కొన్ని లక్షల సంవత్సరముల పూర్వమే మన మహర్షులు చెప్పారు. ఏ శాస్త్రమూ అభివృద్ధికాని ఆ కాలములోనే, వారు చంద్రుడు తెల్లని చౌడు భూమియని కూడ చెప్పారు. వారు ఆ రోజులలో వారి ప్రక్క వానిని గుర్తించి, వాడు చెప్పినట్లు చెప్పారు తప్ప, వారు చంద్రుని మీదికి, కుజుని మీదికి పోయి చూడలేదు. అలాగే వారు చెప్పిన పద్ధతి ఏదో, దాని ప్రకారము నా శరీరములో, నా ప్రక్కనేయున్న వాని సహకారముతోనే, నేడు నేను గ్రహములు తొమ్మిది కాదు మొత్తము పండ్రెండని చెప్పుచున్నాను. అర్థమైందా, ఇంకా ఏమైనా అనుమానముందా? ప్రక్కవాడు మీలో కూడా ఉన్నాడు, కానీ మీలో మీరు తప్ప ఎవరూలేరను గ్రుడ్డితనములో ఉన్నారు. కావున ప్రక్కవానిని విస్మరించిపోయారు. వానిని తెలియాలంటే ‘జ్ఞానాంజనము’ అను కాటుక కావాలి. కాటుకతోనే గ్రుడ్డితనము పోయి అతడు కనిపిస్తాడు. జ్ఞానాంజనము కావాలంటే ఎటు తిరిగీ షట్‌శాస్త్రములలో చివరి ఆరవ శాస్త్రమైన బ్రహ్మవిద్యాశాస్త్రమును తెలిసి తీరాలి. అదెక్కడుండేది మాకు తెలియదే అనుకోవద్దండి. అదియే భగవద్గీత. సూటిగా చెప్పాలంటే అదే ‘‘త్రైతసిద్ధాంత భగవద్గీత’’. దానిని చదివితే మీలోనే మీ ప్రక్కనేయున్న వాడు తెలియును. వానిని తెలుసుకొంటే వాని ద్వార ఏ రహస్యమైనా తెలుసుకోవచ్చును.

14) ఒక వ్యక్తి వ్యవసాయము కొరకు బావి త్రవ్వితే నీరు రాలేదు. బోరువేస్తే నీళ్ళు పడినాయికానీ బోరు పూడిపోతున్నది దానివలన నీళ్ళు రాలేదు. రెండుచోట్ల బోరువేసినా అట్లే అయినది. అతనికి నీరు అనుకూలము లేదా? జ॥ నీరుగానీ, నిప్పుకానీ, ప్రపంచములో ఏ వస్తువుగానీ, అన్నియూ గ్రహముల ఆధీనములో ఉండును. ఎవరికీ నీళ్ళు అనుకూలము అనాను కూలము లేదు అనుట సరిjైునది కాదు. ఎందుకనగా నీరు చంద్రగ్రహము యొక్క ఆధీనములో ఉండును. చంద్రగ్రహము అనుకూలము ఉంటే నీళ్ళు అనుకూలమగును. చంద్రుడు అనుకూలము లేకపోతే నీరు అనుకూలము ఉండదు. ఏ వస్తువుకైనా ఆ వస్తువు యొక్క అధిపతి గ్రహము ఎవరో ఆ గ్రహము అనుకూలము అనానుకూలము మీద ఆధారపడి ఆ వస్తువు లభించేది, లభించనిది తెలియును. లభించినా మంచిది లభిస్తుందా లేదా అను విషయము కూడా ఆ గ్రహమునుబట్టి మరియు ఆ గ్రహముతో కలిసిన మిగత గ్రహములనుబట్టి, ఆ వస్తువున్న రాశి స్థానమునుబట్టి వస్తువు లభ్యమగునా లేదాయని లభ్యమైనా ఎటువంటిది లభ్యమగునని తెలియ గలదు. చంద్రుడు అనుకూలమున్నట్లయితే బావిని త్రవ్వినా, బోర్లు వేసినా నీళ్ళు సులభముగా లభ్యమగును. ఒకవేళ చంద్రుడు శత్రు గ్రహమైతే నీళ్ళు పడవు. చంద్రుడు శత్రుగ్రహమై నాల్గవ స్థానమును తాకినప్పుడు లేక నాల్గవ స్థానములోనేయున్నప్పుడు అతని నివాసగృహములో కూడా నీళ్ళు అనుకూలముగా ఉండవు. వర్షము వస్తే ఏదో ఒక విధముగా నీరు ఇంటిలోనికి వస్తుంది. ఎంతమంచి ఇల్లయినా చంద్రుడు సరిగా లేకపోతే ఆ ఇల్లు నీరుకారే ఇల్లుగా ఉండును. అదంతయు బాగుంది అంటే బాత్‌రూమ్‌లో నీళ్ళు రాకుండాపోవడమో లేక మురికినీరు బయటికి పోకుండా ఉండడమో జరుగును. ఒకదానిని సరిచేస్తే నీటిని గురించిన క్రొత్త సమస్యలు వస్తూనే ఉండును. మంచినీరులో ఉప్పునీరు మిశ్రమమై కూడా వచ్చును. అట్లే బోరు నీళ్ళలోనికి మురికినీరు చేరి అదే నీరు రావచ్చును. ఇట్లు అనేక నీటి సమస్యలు రాగలవు. 15) కొంతమంది తమ పొలము దగ్గర దారి సరిగా లేక ఇబ్బంది పడుచుందురు. అట్లే కొంతమంది తమ ఇంటివద్ద దారిలేక ఇబ్బంది పడుచుందురు. అదెందుకు జరుగుచుండును?

జ॥ ప్రపంచములో ప్రతి దానికీ గ్రహములే అధిపతులు. అట్లని గ్రహములను దేవుళ్ళని అనుకోకూడదు. ప్రభుత్వము నుండి కరువు సహాయము అందినప్పుడు మొదట ఆ డబ్బు జిల్లా కలెక్టర్‌వద్దకు వచ్చి, కలెక్టర్‌నుండి మండల ఆఫీసర్‌వద్దకు వచ్చి చివరకు బ్యాంకు క్యాషియర్‌ ద్వారా నీకు వచ్చినదనుకొనుము. ప్రతి సహాయము ఎక్కడినుండి డబ్బు వచ్చినా బ్యాంకు క్యాషియర్‌ నుండే తీసుకోవలసియున్నది. అట్లని క్యాషియర్‌నే ప్రభుత్వము అనుకోకూడదు. అలాగే గ్రహములు ఉన్న కర్మను ఇచ్చు క్యాషియర్‌లాంటివి. మనిషికి సృష్ఠినుండి ఏది లభించినా గ్రహముల ద్వారానే లభించాలి. గ్రహములన్నియూ ప్రకృతి ఆధీనములో ఉండగా, ప్రకృతి పరమాత్మ ఆధీనములో ఉన్నది. చివరికి అన్నిటికీ పెద్ద దేవుడే. ఇప్పుడు అసలు విషయానికి వస్తే భూమిమీద దారులన్నీ కుజగ్రహము ఆధీనములో ఉండును. జాతకములో కుజగ్రహము వ్యతిరేఖియై నాల్గవ స్థానములోయున్న, నాల్గవ స్థానమును తన చేతితో త్రాకినా, పొలములు గృహముల దారులలో ఆటంకములు ఏర్పడును. తరచూ త్రోవలకు సంబంధించిన పేచీలు వచ్చుచుండును. కుజుడు దక్షిణ దిశకు అధిపతియైనందున దక్షిణ దిశకున్న దారులలోనే ఎక్కువ పేచీలు వచ్చును. దారులేకాక ఇళ్ళు కూడా దక్షిణమువైపు కృంగుటయో లేక దక్షిణవైపు గోడలు చీలుటయో జరుగుచుండును. ఇటువంటి కుజ దోషములకు ఏ గృహశాంతులుగానీ, అష్టదిగ్భంధన యంత్రములుగానీ, ఏ విధమైన ఉపశమన మార్గములూ పనికిరావు. 16) కొందరు ఎంత సంపాదించినా చివరకు డబ్బులతో ఇబ్బంది పడుచుందురు. ఎప్పుడూ అప్పులలో కూరుకుపోయివుందురు. అదెందుకు జరుగుచున్నది?

జ॥ ‘‘ధనమూల మిదమ్‌ జగత్‌’’ అని కొందరనుచుందురు. ప్రతి దానికీ ధనమే మూలమైనదిగా కనిపించుచుండినా, ధనమునకు మూలము శుక్రగ్రహము మరియు గురుగ్రహమని చెప్పవచ్చును. గురుగ్రహము డబ్బును నిలువజేసి ధనికులను చేయును. శుక్రగ్రహమైతే డబ్బును నిలువ చేయక ప్రవాహములాగ కదలించుచూ డబ్బు ద్వారా అన్ని సుఖములను అనుభవింపజేయును. అందువలన కదలే డబ్బుకు శుక్రగ్రహము, కదలని డబ్బుకు గురుగ్రహము అధిపతులుగాయున్నారు. ఈ రెండు గ్రహములు వారి జాతకములో వ్యతిరేక స్థానములలో ఉండినా, వ్యతిరేక గ్రహములతో కలిసినా డబ్బు వస్తున్నా అది తమవద్ద నిలువక అవసరములకు తక్కువ వస్తూ ఇబ్బంది పడవలసివచ్చుచుండును. గురు, శుక్రులు జాతకునకు అనుకూలముగాయుండిన అంటువంటివారు డబ్బుతో ఏ ఇబ్బందులూ పడకుండా బ్రతుకుచుందురు.

17) కొందరు పేదవారైనా వారికి స్వంత ఇల్లు ఉండును. కొందరు ధనికులైనావారికి స్వంత ఇల్లు ఉండదు. దానికి కారణమేమి ఉండవచ్చును.

జ॥ స్వంత ఇల్లుగానీ, స్వంత భూములుగానీ అన్నియు స్థిరాస్తులు అనబడును. స్థిరాస్తులకు స్థానము జన్మకుండలిలో నాల్గవ స్థానము. అక్కడ ఒక శుభగ్రహమున్నట్లయితే అతనికి స్వంత ఇల్లు మొదలగు స్థిరాస్తులు కల్గును. అక్కడ అశుభగ్రహముండినట్లయితే స్వంత స్థిరాస్తులు ఏమీ ఉండవు. జాతకములో నాల్గవ స్థానములో ఒక మంచి గ్రహమున్నా లేక తాకినా అతనికి స్వంత గృహముండును. అట్లు గ్రహచారము మంచిగ లేని వానికి స్వగృహముండదు.

18) మీరు మూడు కొత్త గ్రహములను గురించి చెప్పారు. వాటి ప్రభావము అందరిమీదా ఉంటుందా? లేక కొందరిమీదనే ఉంటుందా?

జ॥ అందరిమీదా సమానముగా వాటి ప్రభావముంటుంది. కొందరి మీద వాటి ప్రభావముండి కొందరి మీద ఉండదనుటకు అవకాశమేలేదు. ఇంతవరకు ఏ గ్రహమూ అట్లు ఉండలేదు. అన్ని గ్రహములు అందరికీ సమానముగా ఉన్నాయి.

19) క్రొత్త గ్రహములను అందరూ ఒప్పుకుంటారా? మీ మాట సత్యమని నమ్ముతారా?

జ॥ ఒప్పుకోవడమూ, ఒప్పుకోక పోవడమూ నాకు సంబంధములేదు. నా మాట సత్యమని కూడా నేను చెప్పను. దేవుడు చెప్పిన జ్ఞానాన్నే కొందరు ఒప్పుకొంటున్నారు. కొందరు ఒప్పుకోవడములేదు. అటు వంటపుడు దేవుని జ్ఞానాన్నే ఒప్పుకోని వారున్నప్పుడు, నా జ్ఞానాన్నిగానీ, నా సూత్రములనుగానీ ఒప్పుకోమని నేను చెప్పడము లేదు. తెలుసుకోండి యని, ఆలోచించండని మాత్రమే చెప్పుచున్నాము.

20) పదిహేను రోజుల క్రిందట హైదరాబాద్‌ హైవే మీద బస్సు అంటుకొని కాలిపోయింది. అందులో 44 మంది చనిపోవడము జరిగినది. డ్రైవర్‌ క్లీనర్‌ తప్ప వారితోపాటు తప్పించుకోగల్గిన ఇద్దరికీ కూడా కొద్దిగ కాలడము జరిగినది. తెల్లవారుజామున ఐదు గంటలప్పుడు పోతూవున్న బస్సుకు కొద్దిగా ప్రమాదము జరిగి అంతమంది చనిపోవడము జరిగినది కదా! అక్కడ చనిపోయినవారి గ్రహచారములను చూస్తే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకముగాయుండును. అటువంటప్పుడు, అందరికీ కర్మ ఒకే విధముగా లేదని తెలియుచున్నది. అందరి కర్మ ఒకే విధముగా వారి జాతకములలో లేకున్నా అందరూ ఒకేచోట బస్సులోనే బయటపడకుండ చనిపోవడమునకు కారణమేమి? మేము ఈ విధముగానే ప్రశిస్తే చాలామంది జ్యోతిష్యులు సరియైన జవాబు చెప్పలేదు. మీరు మా ప్రశ్నకు సరియైన జవాబు చెప్పగలరా?

జ॥ చివరిలో మా ప్రశ్నకు మీరు జవాబు చెప్పగలరా? అని అడిగారు. వారు చనిపోయినందుకు జవాబు చెప్పాలా? లేక మీరు చెప్పగలరా చెప్పలేరా అను ప్రశ్నకు జవాబు చెప్పాలా? దేనికి జవాబు కావాలో ముందు మీరు చెప్పితే తర్వాత నేను చెప్పగలనో లేదో చెప్పగలను.

21) మేము చివరిగా అడిగిన మాటకు మీరు చెప్పగలరా అనుమాటకే జవాబు చెప్పండి?

జ॥ మీరు చేపలు అమ్మే వానివద్దకు పోయి ‘‘నీవు నాకు కావలసిన చేపను అమ్మగలవా’’ అని అడిగినట్లున్నది. చేపల వానిదగ్గర అన్ని రకముల చేపలూ ఉంటాయి. ముందు నీకు కావలసిన చేప ఏదో అడిగితే బహుశా ఉంటే ఇస్తాము, లేకపోతే లేదు అని చెప్పుతారు. అట్లు కాకుండా ముందే నాకు కావలసిన చేప అంటే తిరిగి నేను ఏ చేప అని అడగడము తర్వాత నీవు చెప్పడము దానికి బదులుగా అప్పుడు నేను చెప్పడము జరుగవలెను. అంత రాద్ధాంతము లేకుండా నీకు కావలసిన సిద్ధాంత చేప ఏదో చెప్పితే నావద్ద ఉత్త చేపలున్నాయో, సిద్ధాంత చేపలున్నాయో నాకు కూడా తెలిసి పోతుంది కదా! ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న సూత్రబద్దమైనది. దానికి నావద్దయున్నవన్నీ సిద్ధాంతబద్దమైనవి, సూత్రబద్దమైనవి కావున మేము సులభముగా చెప్పగలము. అదే ప్రశ్ననే మరియొకమారు చిన్నచిన్న ప్రశ్నలుగా అడుగు.

22) ఒకే సమయములో, ఒకే విధ కర్మలేనివారికి, వేరువేరు కర్మలున్న వారికి ఒకే ప్రమాదము జరుగగలదా?

జ॥ ఇప్పుడు నాది జవాబు కాదు ప్రశ్న. ఒకే కర్మయనిగానీ, వేరువేరు కర్మలనిగానీ అనుటకు కర్మలేమైనా కనిపిస్తాయా? కనిపించని దానిని మీరు ఎలా నిర్ధారణ చేసి చెప్పుచున్నారు? ఇది నా తరపున ప్రశ్న అయినా దీనికి మీరు జవాబు చెప్పలేరు. ఎందుకనగా కర్మలు ఎవరికీ కనిపించవు. కనిపించని కర్మలను గురించి అపోహపడే దానికంటే కర్మలను మించినది, కర్మలను చూడగల్గునది మరొకటి గలదు. అదియే దేవునిజ్ఞానము. దేవుని జ్ఞానము కల్గి చూడగల్గితే వారు అందరూ అలా చనిపోవడానికి కారణము తెలియగలదు. మేము చెప్పినదానినే అందరూ నమ్మాలి అని నేను చెప్పడము లేదు. ఎందుకనగా మేము చెప్పేమాట అందరికీ అర్థము కాకపోవచ్చును. అర్థము కాకపోయినప్పుడు నమ్ముటకు అవకాశము ఉండదు. అందువలన నేను చెప్పునది అందరికీ జవాబు కాదు. అర్థముకాగల కొందరికి మాత్రమే జవాబని తెలియాలి. నాకు తెలిసినంతవరకు దేవునికి తెలియకుండ ఏమీ జరుగదు. దేవుడు అన్నిటికీ సాక్షి అనికూడ మరువకూడదు. బస్సులో చనిపోయినవారందరూ తమ మరణమును ఊహించుకొని ఉండరు. వారి కర్మప్రకారము వివిధ పనుల నిమిత్తము బయలుదేరిన వారికి కర్మలన్నీ ఒకే విధముగా కూడా లేవు. వాస్తవముగా వారి కర్మప్రకారము వారు హైదరాబాద్‌ పోయి వివిధ పనులలో లగ్నము కావలసియున్నది. వాస్తవముగా మీరు అనుకొన్నట్లే ఆ సమయమునకు చనిపోవునట్లు ఎవరి కర్మాలేదు. అయినా చనిపోయారు. కర్మ మినహా జరుగదని కర్మ సిద్ధాంతమున్నప్పుడు వారి కర్మప్రకారము వారు హైదరాబాద్‌ పోకుండ మధ్యలో చనిపోవడమేమిటని మాకు కూడా ప్రశ్న వచ్చినది. శాస్త్రము శాసనముగా జరిగితీరును. కర్మసిద్ధాంతము ప్రకారము కర్మవేరుగా యున్నప్పుడు, జరగరానిది ఎలా జరిగిందను ప్రశ్న ఎవరికైనా రాక తప్పదు. ఒక సంఘటన జరిగిందంటే అది సత్యమే. జరిగినది సత్యమే అయినప్పుడు దానిని శాస్త్రము అంటాము. ఎందుకనగా శాస్త్రము అనగా సత్యము అనియు, సత్యము అనగా శాస్త్రము అనియు సూత్రము గలదు. శాస్త్రము ప్రకారము వారి పనులు హైదరాబాద్‌లో జరుగవలసియుండగా దానిని కాదని మధ్యలో ప్రమాదము జరిగినది. జరిగినది ప్రత్యక్ష సత్యము కావున అదియూ శాస్త్రము ప్రకారమే జరిగిందంటే ఇక్కడ శాస్త్రము అనునది పరస్పర విరుద్దమగును. బాగా యోచిస్తే శాస్త్రము ఎప్పటికీ పరస్పర విరుద్దముగా ఉండదు. ఇక్కడేదో చిక్కు ముడిపడినదని అర్థమగుచున్నది. మనకు అర్థముకాని చిక్కుముడిని విప్పుకొని చూస్తే ఒక విషయము అర్థమగు చున్నది. ప్రపంచ కర్మల రికార్డును మార్చివేయునది ఒకే ఒక్కటి గలదు. అదియే దైవజ్ఞానము. దైవజ్ఞానము ప్రపంచ కర్మను అతిక్రమించగలదు గానీ, ప్రపంచ కర్మ దైవజ్ఞానమును ఏమీ చేయలేదు. ఎవరైతే దైవజ్ఞాన దూషణకు పాల్పడినారో వారందరినీ జ్ఞానము గుర్తించుకొని సమయమును చూచి ఒకచోట చేర్చి అందరినీ వారి కర్మలకు అతీతముగా కాల్చివేసినది. ఈ మాటను మేమంటే ఇదంతా కట్టుకథయని కొందరనవచ్చును. ఎవరు ఎలా అనుకొనినా ఫరవాలేదు. నాకు తెలిసిన సత్యమును నేను చెప్పాను. వారు ఎప్పుడు జ్ఞానమును దూషించారో మీరు చెప్పగలరా అని కొందరు, మా వాడు మంచివాడు దైవభక్తికలవాడు అటువంటివాడు దైవజ్ఞానమును ఎందుకు దూషిస్తాడు మీరు చెప్పునదంతా అసత్యము అని కొందరూ అడుగ వచ్చును. వారు ఎప్పుడు దూషించినదీ, ఎలా దూషించినదీ నాకు కూడా తెలియదు. కానీ దూషించినది మాత్రము వాస్తవమే. నా మాట సత్యమను టకు ఇప్పుడు ప్రస్తుతము అటువంటి పాపము చేసుకొన్న వారిని గురించి చెప్పుతాను వినండి. దేవుని మీద విశ్వాసముగలవారు, ధర్మరక్షకులైన వారు, నిత్యము భక్తితో ఏదో ఒక దేవున్ని పూజించేవారూ నేడు దైవజ్ఞాన దూషణ చేస్తూ అటువంటి పనిని మేము చేస్తామా? మేము చేసినదంతా మంచిదే అని అనుకొంటున్నారు. అయినా అటువంటివారు ఇప్పటికే చాలామంది వారు దైవజ్ఞానమునకు వ్యతిరేఖులైయున్నారు. అటువంటి వారందరికీ ఎప్పుడో ఒకమారు చెప్పకనే జరిగిన బస్సు ప్రమాదములాగ ఏదో ఒక ప్రమాదము జరుగును. అప్పుడు వారందరూ అక్కడ జమకూడుదురని మాకు తెలుసు, దేవునికి తెలుసు ఎవరు ఏమీ తప్పు చేసినది. అందువలన ఎవరినీ దేవుడు కాపాడలేదు. తనకే వ్యతిరేఖులైనవారిని ఆయన ఎందుకు కాపాడును? ప్రస్తుత కాలములో దేవుడు భగవంతునిగా వచ్చి చెప్పిన భగవద్గీతను కాలితో తన్ని నడిరోడ్డులో అగ్గిపెట్టి కాల్చినవారు దైవభక్తి కలవారే. మేము సృష్ఠికర్త కోడ్‌ యని భగవద్గీతలో 15వ అధ్యాయమున 16,17 శ్లోకముల నంబర్లను కూడా వ్రాసి ‘‘9 6 3’’ అని గోడలమీద వ్రాస్తే ఇది క్రైస్తవులదని దానిమీద మలము చల్లినవారుగలరు. మేము (మా భక్తుల బృందము) భగవద్గీతనూ దానికి అనుబంధమైన గ్రంథములనూ ఇల్లిల్లూ తిరిగి భగవద్గీతా ప్రచారము చేస్తే క్రైస్తవులు తప్ప హిందువులు ఇట్లా తిరుగరు మీరు భగవద్గీత ముసుగులో క్రైస్తవమును ప్రచారము చేస్తున్నారని దూషించి ఆ ఊరినుండి పొమ్మని, పోకపోతే మీ బుక్కులను కాల్చివేస్తాము, మిమ్ములను తంతామనినవారు కూడా కలరు. త్రైత సిద్ధాంత భగవద్గీతను చదవండియని మేము ఎంతో ఖర్చుపెట్టి గోడలమీద వ్రాయిస్తే దాని కారణముతో కేసుపెట్టి కోర్టుకీడ్చి 20 రోజులు జైలుశిక్ష వేయించిన వారున్నారు. ఆ దినము కోర్టులో ఇది తప్పా ఒప్పాయని చూడకుండా, ఏమాత్రము ఆలోచించకుండా తీర్పు చెప్పి జైలుకుపంపిన జడ్జిని కూడా జ్ఞానము గుర్తుపెట్టుకొనియున్నది. ముందు తరములో జ్ఞానదూషణ చేసిన వారందరూ బస్సులో కాలిపోవడము జరిగినది. ఈ తరములో జ్ఞానదూషణ చేసినవారు మహనంది, గుంతకల్లు, హైదరాబాద్‌, భువనగిరి, కడపలో దేవుని దృష్ఠియందు నమోదు చేయబడియున్నారు. నేడు హిందూధర్మ రక్షణ చేయువారమనువారే ఎక్కువ గుర్తింపబడినారు. మేము వ్రాసినది ఏమున్నదని చూడకుండ జ్ఞానమును హేళనగా మాట్లాడినప్పుడు దేవునికి కోపము రాదా! ఎంతోమంది జ్ఞానులైన హిందువులు ఇది గొప్ప జ్ఞానము మా అదృష్టముకొద్దీ ఇంతకాలమునకు దొరికింది అని సంతోషిస్తూవుంటే హిందూధర్మములంటే ఏమిటో తెలియని మూర్ఖులు మేము హిందూ రక్షకులమని చెప్పుచూ, ఏ జ్ఞానమూ తెలియనివారై జ్ఞానమును గురించీ, గ్రంథరూపములలోయున్న జ్ఞానమును గురించీ దూషించి మాట్లాడితే అది ప్రత్యేకమైన కర్మాతీత పాపముకాక ఏమౌతుంది. భగవద్గీతలో క్షరాక్షర పురుషోత్తములుగా దేవుడు తనను గూర్చి వర్ణించి చెప్పితే, త్రైత సిద్ధాంతము ద్వారా ఆ విషయమును మేము చెప్పినప్పుడు ఇది అద్వైతము, ద్వైతములాగ త్రైతము హిందూమతములోనిదే అను పరిజ్ఞానము లేకుండా త్రైత సిద్ధాంత భగవద్గీతను మేము ఒప్పుకోము అని కాల్చినవారిని మేము భక్తిపరులమే అంటే దేవుడు ఒప్పుకుంటాడా! జ్ఞానము అంటే ఏమిటి అది ఎంత శక్తివంతమైనదని ఏమాత్రము తెలియకుండా మేము మంచివారమే మేము హిందూ రక్షకులమే అంటే దేవుడు ఒప్పుకుంటాడా? అంతటా నిండియున్న దేవుని ముందరే ఆయన గీతను కాల్చినవారినీ, ఆయన జ్ఞానమును దూషించిన వారినీ వదలకుండా రాబోవు కాలములలో ఎప్పుడో ఒకమారు తప్పుకు తగిన శిక్షవేయకమానడు. మాచేత వ్రాయబడిన గ్రంథములు కొన్ని శక్తివంతమై ప్రత్యక్షముగా కనిపిస్తున్నవి. గ్రంథమును చదివితే ఎంతో జ్ఞానశక్తి కల్గుచున్నది. దగ్గరుంచుకొంటే కొన్ని రోగములు సహితము దూరమగుచున్నవి. 48 పేజీలుగల ‘‘మంత్రము-మహిమ’’ అను చిన్న గ్రంథమే దగ్గరుంచితే తేలునొప్పిని నిమిషములో లాగివేయుచున్నది. ఇంత ప్రత్యక్షముగా ఒక గ్రంథమేయుంటే దానికంటే పెద్దగయున్న కొన్ని గ్రంథములలో ఎంతో దైవశక్తియున్నది. భగవద్గీత అన్నిటికంటే మించిన శక్తికలది. అటువంటి వాటిని దూషించితే దాని ఫలితమెట్లుంటుందో తెలివైనవారు ఊహించుకోవచ్చును. ‘‘సృష్ఠికర్త కోడ్‌ 666’’ యని క్రైస్తవులు వ్రాస్తే వారికి వ్యతిరేఖముగా అది మాయ కోడ్‌యని దేవునికోడ్‌ ఇదియని 9 6 3 ను మేము వ్రాస్తే అది ఏమిటి 64 పేజీలుగల ఆ గ్రంథములో ఏముంది అని చూడక గ్రుడ్డిగా జ్ఞానమును దూషించినవారికి వారికి పడిన శిక్షే పడుతుందని హైదరాబాద్‌ వస్తున్న బస్సు ప్రమాదము సాక్షిగా నిలచినది. మీరెలా చెప్పగలరని మీ మాట వాస్తవమని మేము నమ్ముటకు ఆధారమేమి యని ఎవరైనా అడిగితే వారికి మేము చెప్పునదేమనగా! దేవునికి అందరూ సమానమే ప్రపంచ సంబంధ కర్మలు ఎలాయున్నా అవి కేవలము కష్ట సుఖములతోనే తీరిపోతాయి. అయితే దేవుని సంబంధమైనవి ఘోరముగా ఉంటాయి. అవి ఒక జన్మకే పరిమితికావు. రెండు యుగముల పర్యంతము జన్మజన్మలకు బాధించును.

ప్రస్తుత జన్మలో అందరి ఎదుట అన్ని మతములకు మించిన జ్ఞానము ఇందూ (హిందూ) మతములోనే కలదు. అంతపెద్ద జ్ఞానము మనముందర ఉన్నప్పుడు దానిని గుర్తించక అనవసరముగా దైవదూషణ, జ్ఞానదూషణ చేసినవారికి శిక్షలు పడుట ఖాయమని నిరూపించుటకు బస్సు ప్రమాదము జరిగిందని మేము నమ్ముచున్నాము. ఇప్పుడు ప్రమాదములో పోయిన వారందరూ గతములో, గత జన్మలో ఎటువంటివారో తెలియదు కదా! మీకు తెలియకున్నా మాకు తెలిసిన సత్యముతో నేడు కూడా దేవుని జ్ఞానమును దూషించినవారు అనవసరముగా దైవాగ్రహమునకు గురియైనా రని తెలియుచున్నది. అటువంటి వారందరికీ ఇటువంటి శిక్షయే పడునని దేవుడే తెల్పునట్లు హైవేలో కాలిపోయిన హైదరాబాద్‌ బస్సు నంబర్‌ ‘‘963’’ ఇది మేము దేవుని గుర్తని చెప్పిన నంబరేనని గుర్తుంచుకోండి. బస్సు బెంగుళూరివారిదైనా మొదట మా ఆశ్రమముగల తాడిపత్రిలోనిదేనని తెలియండి. మేము దేవుని గుర్తు 9 6 3 అని వ్రాసిన తర్వాత అదే నంబరుతో మేమున్న ఇదే ప్రాంతములో వచ్చినది. ఈ ప్రాంతమునుండి వచ్చిన బస్సు, మేము ప్రకటించిన 9 6 3 నంబరేగల బస్సులో ప్రమాదము జరిగిందంటే ఇక్కడి జ్ఞానము అగ్నిలాంటిదని దైవదూషణ చేసిన మిమ్ములను కూడా వదలక మరుజన్మలోనైనా ఇలాగే కాల్చగలనని చెప్పినట్లున్నది. అందువలన ఇప్పటినుండియైనా ఇది అసలైన హిందువుల జ్ఞానమనీ, ఇది అగ్నిలాంటి జ్ఞానమని తెలిసి జాగ్రత్తపడండి. ఇప్పటినుంచైనా ఎవరూ దైవాగ్రహమునకు గురికాకుండ ఉండమని తెల్పుచున్నాము. ఇప్పుడు వ్రాయబడిన గ్రంథము జ్యోతిష్యగ్రంథము. జ్యోతిష్యము ఒక్క హిందువులకు తప్ప వేరెవరికీ తెలియదు. కొందరు హిందువులకు జ్యోతిష్యము తెలిసినా, జ్యోతిష్యశాస్త్రము పూర్తి సక్రమముగా తెలియదు. ఇప్పుడు ఇందువులలోనే (హిందువులలోనే) ఎవరికీ తెలియని రహస్యముగాయున్న జ్యోతిష్య సూత్రములను ఈ గ్రంథములో వ్రాయడము జరిగినది. జ్యోతిష్యములో కొమ్ములు తిరిగినవారికి కూడా తెలియని రహస్యములను చెప్పడము జరిగినది. ఇటు జ్యోతిష్యులకు అటు జ్ఞానులకు ఇరువురకు ఉపయోగ పడునట్లు జ్యోతిష్యములోని దశాచారమును గురించి చెప్పడము జరిగినది. దశాచారము అంటే ఏమిటో తెలియగల్గితే వాడు జ్యోతిష్యుడైనా పూర్తి జ్ఞానికాగలడు.

23) బస్సు ప్రమాదమును గురించి చెప్పుతూవుంటే అంతా మాకు క్రొత్తగాయున్నది. మాకు పూర్తి ఏమీ తెలియకపోయినా మీరు చెప్పేమాట నిజమే అయివుండవచ్చునని కొద్దికొద్దిగా అర్థమగుచున్నది. కొన్ని రోడ్డు ప్రమాదములను నేను నా స్నేహితులు చూచాము. రోడ్డు బాగున్నా ఏ ఆటంకములు ఇబ్బందులు లేకున్నా ఒకే స్థలములో ఎక్కువ ప్రమాదములు జరుగుచుండును. అది స్థల ప్రభావమంటారా? గ్రహ ప్రభావమంటారా?

జ॥ ఎక్కడ ఏమి జరిగినా అది అంతయు ద్వాదశ గ్రహముల ద్వారానే జరిగితీరాలి. గ్రహములు కర్మను పంచువారు మాత్రమే, కార్యములను గ్రహములు చేయరు. కార్యములను చేయువారు కనిపించెడివారు కొందరు కనిపించనివారు కూడా కొందరు కలరు. రోడ్డు ప్రమాదములు జరుగుటలో కనిపించనివారి పాత్ర ఎక్కువ కలదు. రోడ్డు ప్రమాదములలోనేకాక మరెన్నో కార్యములను కనిపించనివారు చేయుచున్నారు. అమెరికా మరికొన్ని దేశములలో అటువంటి పనులను చేయువారందరినీ గ్రహాంతరవాసులని పేరుపెట్టి వారు వారి వాహనములైన ప్లయింగ్‌సాసర్స్‌ అను వాటి ద్వారా (U.F.O ల ద్వారా) భూమిమీదికి వచ్చి కొన్ని కార్యములను చేసిపోయారని అవి ఇంతవరకు అర్థముకాని మిస్టరీలూగ మిగిలిపోయాయని చెప్పు చుందురు. మనదేశము (భారతదేశము)లో ఎవరికీ అర్థముకాని పనులు జరిగితే ఏవో శక్తులు చేశారని అంటారు. అదే అమెరికాలో అయితే ఏకంగా గ్రహాంతరవాసులని ఏలియన్స్‌ అని పేరుపెట్టి చెప్పుచుందురు. ఎవరు ఏమి చెప్పినా ఒక పని జరిగింది అంటే అది పన్నెండు గ్రహముల ద్వారానే జరగాలి. పైనున్న గ్రహములు నడిపితే కనిపించేవారు, కనిపించనివారు అందరూ నడుస్తున్నారు. అంతేతప్ప స్థల ప్రభావములంటూ ఎక్కడా ఉండవు. స్థల ప్రభావము అంటే అది మూఢనమ్మకమౌతుంది.

రోడ్డు ప్రమాదములకు కారణము కనిపించని కర్మకాగ అమలు జరుగునది ఎన్నో రకములుండును. ఒకే స్థలములో ఎక్కువ ప్రమాదములు జరుగడము అక్కడ ప్రమాదములు జరుగుటకు అవకాశము లేకున్నా, రోడ్డు అన్ని విధముల బాగున్నా, ఊహించని రీతిలో ప్రమాదములు జరగడమును చూస్తే మనకు తెలియనిదేదో అక్కడ జరుగుచున్నదని అర్థము కాగలదు. ప్రారబ్ధము ప్రకారము కొన్ని కర్మలను అనుభవింపజేసినా వాటిని చూసి ఇతరులు కొంత జ్ఞానులుగా మారగలరనీ, జ్ఞానము మీద ఆసక్తి పెరుగునని తలచి ప్రమాదములను కలుగజేయుచుందురు. భూమిమీద దైవజ్ఞానము కల్గినవారు కనిపించని సూక్ష్మరూపమున ఎందరోయున్నారు. వారు జ్ఞానము మీద శ్రద్ధగలవారైయుండి, జ్ఞానమును తెలిసినవారైయుండి అజ్ఞానులను చూచి వారిని జ్ఞానులుగా మార్చేదానికి ప్రయత్నము చేయుచుందురు. ఎంత ప్రయత్నము చేసినా జ్ఞానమును తెలియక అజ్ఞానమార్గమున పోవు వారిమీద కోపముకల్గి ప్రమాదములను కలుగజేతురు. ఎక్కువ ఒకే స్థలములో ప్రమాదములు జరుగుటకు కారణము ఆ స్థలములో కనిపించని శక్తి ఒకటి రోడ్డుమీద కాపలాకాస్తూ వచ్చిపోయే వాహనములను గమనిస్తూ యుండును. బ్రేక్‌ ఇన్‌స్పెక్టర్లు తమకు అనుకూలమైనచోట రోడ్డు ప్రక్కన ఉంటూ వస్తూ పోయే వాహనములను గమనిస్తూ అనుమానముగల కొందరిని ఆపి తనిఖీ చేసి పంపునట్లు కనిపించని శక్తులు కొన్ని రోడ్డు ప్రక్కనయుండి, దూరమునుండి వచ్చు వాహనములో వ్యక్తులు ఎవరైనదీ, ఎక్కడికి పోవునదీ, ఏ కార్యము మీద పోవునదీ గ్రహించగలుగుదురు. వాహనము దగ్గరకు రాకముందే అన్ని విషయములను గ్రహించగల్గును. వాహనములో వచ్చేవారు పెళ్ళికార్యమునకు పోవువారుగానీ లేక దేవతల వద్దకు పోవువారుగానీ ఉండినట్లయితే, అటువంటివారిని ఎంచుకొని ప్రమాదములను కల్గింతురు. రోడ్డు ప్రక్కనయున్న భూతములు దేవుని జ్ఞానమును కల్గియుందురు. దేవుని జ్ఞానములేనివారు రోడ్డు మీద వస్తునప్పుడే గ్రహించిన భూతములు వారిని ఏమీ చేయక వదలివేయు చుండును. అట్లు భూతములు రోడ్డుమీద కాపలా కాస్తున్నప్పుడు దేవాలయములకు పోవువారుగానీ, ఏ దేవత నిమిత్తము పోవువారుగానీ లేక పెళ్ళికార్యమునకు పోవువారుగానీ ఆ రోడ్డుమీద దూరముగా వస్తున్నప్పుడే అక్కడున్న భూతములు వారిని గ్రహించగలిగి దేవాలయము లకు పోవు దేవతాభక్తుల మీదనూ, పెళ్ళి కార్యముల నిమిత్తము పోవు వారిమీదనూ కోపము కల్గినవై వారు ప్రయాణించు వాహనమును ప్రమాదమునకు గురిచేయుదురు. అట్లని పెళ్ళికి పోవు అన్ని వాహనములకూ ప్రమాదములు జరుగవు. అలాగే దేవతలకు పోవు వారి వాహనములు అన్నీ ప్రమాదమునకు గురికావు. కొన్ని వాహనములు పెళ్ళివారివిగానీ, దేవతలకుపోవువారివిగానీ ప్రమాదమునకు గురికావడము కొన్ని కాకుండ పోవడము జరుగుటకు కారణము గలదు. అదేమనగా! వాహనములకు అధిపతి శుక్రుడు. రహదారులకు అధిపతి కుజగ్రహము. దేవతలకు పోవు వారిమీద, పెళ్ళిళ్ళ విషయముమీద కోపముకల్గిన భూతములు రోడ్డు ప్రక్కనయుండినప్పటికీ, అందరినీ గ్రహించుచున్నప్పటికీ శుక్రగ్రహము యొక్క చూపులేక వాహన బలములేని వారినీ కుజగ్రహము వ్యతిరేఖముగాయున్న వారినీ తప్పక ప్రమాదమునకు గురి చేయును. కుజ,శుక్రులు ఒకరికొకరు పూర్తి శత్రువులు. కుజగ్రహము ఎరుపురంగుగలది. శుక్ర గ్రహము తెలుపు రంగుగలది. ఎరుపురంగు కల్గిన వాహనము కుజునకు పూర్తి వ్యతిరేఖ మగుట వలన అటువంటి రంగు వాహనములు ప్రమాదమునకు గురి కాగలవు. శుక్రుడు తన వాహనమును కాపాడుకోవాలని ప్రయత్నించినా రోడ్డంతా కుజునిదే కాబట్టి రోడ్డు సరిగాలేకపోవడము వలన కూడా ప్రమాదము జరుగవచ్చును. రోడ్డుకు వాహనములకు అధిపతులైన కుజ శుక్రులను అనుసరించి భూతములు ప్రమాదమును కల్గించును. భూతములు రోడ్డు ప్రక్కన ఒకేచోట వుండుట వలన ఒకే స్థలములోనే ప్రమాదములు ఎక్కువ జరుగుచుండును. బ్రేక్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎప్పుడూ ఒకేచోట ఉండడన్నట్లు కొన్ని భూతములు కూడా స్థలములు మార్చి ప్రమాదములు చేయును. శుక్రుడు అగ్నికి కూడా అధిపతి అయినందున కుజగ్రహము అనుకూలము కల్గినవారు ప్రయాణించు వాహనము తనదేయైనందున శుక్రుడు తన వాహనమును తన అగ్నితో కాల్చివేయును. అప్పుడు ఆ ప్రమాదములో నల్లగమారిపోయి చనిపోవుదురు. కుజుడు ఎరుపురంగుకూ, ఎరుపురంగు కల్గిన రక్తమునకూ అధిపతియైనందున ప్రమాదములో రక్తము బయటికి రాకుండ ఎరుపుతనము ఎక్కడా కనిపించకుండా మనుషుల దేహాలను నల్లగ చేయును. అటువంటి ప్రమాదములను చూచిన వెంటనే ఇది శుక్ర గ్రహము చేసిన ప్రమాదమని చెప్పవచ్చును. అట్లు కాకుండ రక్తసిక్తముగా కనిపించు ప్రమాదములను కుజుడు చేసినవని చెప్పవచ్చును. పెళ్ళి అంటే కుజునకు సరిపోదు. దేవతా భక్తియంటే శుక్రగ్రహమునకు సరిపోదు. శుక్రుడు రాక్షస గురువు కావున దేవతలంటే ద్వేషము. ఇట్లు ప్రమాదములు జరుగుటకు గ్రహములు కారణముకాగా, వాటిని అమలు చేయు భూతములు కొన్ని భూమిమీద ఉన్నవని చెప్పవచ్చును. ఒక రోడ్డుమీదనే కాకుండా ఎక్కడైనా పెళ్ళి విషయములో కుజుడు, దేవతల విషయములో శుక్రుడు వ్యతిరేఖముగానే యుందురు. అందువలన ఈ రెండు విషయములలో ప్రమాదములు ఎప్పుడైనా ఎక్కడైనా జరుగవచ్చును.

24) శుక్రుడు వాహనములకు అధిపతియైనందున శనివర్గములోని వారందరికీ వాహన యోగముండవచ్చును. గురువర్గములోని వారందరికీ వాహన యోగముండదని వారికి వాహనములుండవని చెప్ప వచ్చునా?

జ॥ అలాగైతే ప్రపంచములో కొన్ని వస్తువులు కొందరికే పరిమితమై ఇతర వర్గమునకు లేకుండపోవచ్చును. వస్తువులు ఎవరి అధీనములోయున్నా వారివారి కర్మనుబట్టి లభించవలెనను సూత్రము ప్రకారము లభించవలసి యున్నవి. అట్లుకాకపోతే అంతా గందరగోళమైపోవును. భూమిమీదున్న మనుషులందరూ గురువర్గమువారుగానూ, శనివర్గమువారుగానూ ఉన్నారు. మీరనుకొన్నట్లయితే గురువు ఆధీనములోనున్న బంగారు శనివర్గీయుల వద్ద లేకుండపోవాలి, అలాగే శనివర్గములోని వాహనములు గురువర్గము వారివద్ద లేకుండపోవాలి. అట్లుకాకుండ వారి కర్మానుసారము అన్నీ అందరికీ లభించునట్లు దేవుడు చేశాడు. ఒక వర్గములోని వస్తువు మరొక వర్గములోని వారికి ఎట్లు లభించుచున్నదీ ఒక ఉదాహరణ ద్వారా తెలుసు కొందాము. రాజీవ్‌గాంధీ జాతకమును చూచినప్పుడు ఆయనకు శత్రు గ్రహములు గురువర్గము వారనీ, శనివర్గము వారు మిత్రుగ్రహములనీ తెలిసినది. రాజీవ్‌ చనిపోయిన రోజు ఆయుష్షుకు అధిపతి శనియైనందున శనికి శత్రువులైన గురు, కుజులు మరియు సూర్యుడు ముగ్గురూ కలిసి శనిమీద దాడిచేసి శనివద్దయున్న రాజీవ్‌గాంధీ ఆయుష్షునులాగుకొన్నారు. దీనినిబట్టి ఒకే పక్షమువారైన ఇద్దరు ముగ్గురు గ్రహములు ఒకటై ఇతర గ్రహములవద్దయున్న ఫలితములను కూడా లాగుకొందురు. గురు వర్గీయుల మధ్యలో చిక్కి శుక్రుడు తన వస్తువులను శత్రువర్గమునకు ఇవ్వవలసి వస్తున్నది. అందువలన శనివర్గీయుల దగ్గర గురువు బంగారున్నది. అట్లే గురువర్గీయులవద్ద శుక్రుని వాహనములు, శని ఇనుము, బుధుని రంగు రాళ్ళు, వజ్రములు కలవు. ఇట్లు కర్మనుబట్టి ఏ వస్తువు ఎవరివద్దయినా ఉండవచ్చును.

25) ఒక వ్యక్తి ఎంతో ఎత్తునుండి క్రిందపడినా అతనికి ఒక ఎముక కూడా విరుగలేదు. మరియొకడు రెండు అడుగుల మంచము మీదనుండి క్రిందపడితే కాలు, చేయి రెండూ విరిగాయి. మీ మాట ప్రకారము ప్రతీదీ గ్రహముల వలననే జరుగుతుందనుచున్నట్లయితే చివరికి ఎముకలు విరిగేది కూడా గ్రహముల వలననే జరిగియుండవలెను కదా! అలాంటప్పుడు ఎంతో పైనుండి పడిన ఒకనికి ఏమాత్రము ఎముకలు విరగకపోవడము, మరొకనికి మంచము మీదనుండి దొర్లితే ఎముకలు విరగడము ఎందుకు జరిగినది?

జ॥ ప్రపంచములో రాయికీ, శరీరములో ఎముకకూ అధిపతి కుజ గ్రహమే. గ్రహచారములో కుజగ్రహము వ్యతిరేఖమైనప్పుడు ఎవనికైనా క్రిందినుంచి పడినా ఎముకలు విరుగునట్లు చేయును. అదే కుజగ్రహము అనుకూలమైనదిగా ఉన్నప్పుడు వాడు ఎంత ఎత్తునుండి క్రిందపడినా ఎముకలు విరగక పోవచ్చును. కుజగ్రహము శత్రుగ్రహమై ఆరవ స్థానమును తాకినా అక్కడ ఉండినా ఆ జాతకునికి కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు వచ్చును. కళ్ళనుండి రక్తముకారును. రక్తలేమి రోగము వచ్చును. ఎముకల విషయమంతా కుజుడు అధిపతిగాయుండి చూచు కొనును.

26) కొందరు సంగీతమును నేర్చి దానిలో ఎంతో ప్రావీణ్యత చెంది యుందురు. దానికి ఏ గ్రహము అనుకూలముగాయుండవలెను.

జ॥ సంగీతమునకు శుక్రుడు అధిపతి ఆ గ్రహము చూపులేకున్న ఎవరికీ సంగీతము పట్టుబడదు.

27) మాకు తెలిసినంతవరకు రాజీవ్‌గాంధీ రక్తసిక్తమై చనిపోయాడు. మహాత్మాగాంధీ కూడా రక్తము కారి చనిపోయారు. మంచి వ్యక్తులైన వారు ఇద్దరూ అలాగే చనిపోవడము వలన మనకు అంటే ప్రజలకు ఏమైనా మంచి జరుగుతుందా?

జ॥ వాళ్ళు చనిపోవడానికీ మీకు మంచి జరుగడానికీ సంబంధమేమి ఉన్నది. అలా అనుకొనుటకు వీలులేదు. వారి కర్మప్రకారము వారు చనిపోవడము జరిగినది. వారిని చంపినది ప్రజలే తిరిగి వారి చావు ప్రజలకు మేలు చేస్తుందా అని అడగడమేమిటి? నీవు మాకువద్దు అని గాంధీని, రాజీవ్‌గాంధీనీ చంపిన మనుషులకు వారి చావు ఏమైనా మంచి చేస్తుందా అని అడగడము చాలా తెలివి తక్కువ ప్రశ్న అని అంటున్నాను.

28) ఎప్పుడో చనిపోయిన ఏసు కూడా రక్తముకారే చనిపోయాడు కదా! ఇప్పుడు ఈ నాయకులను ప్రజలు చంపినట్లు అప్పుడు ఆయనను కూడా ప్రజలే చంపడము జరిగినది కదా! ఆయన తన రక్తము కార్చి చనిపోయాడు కదా! అట్లే వీరు కూడా వీరి రక్తమే కార్చి చనిపోయారు కదా! అటువంటప్పుడు వీరివలన ఏమీ ప్రయోజనముండదా? ఎప్పుడో రెండు వేల సంవత్సరముల పూర్వము చనిపోయిన ఏసువలన ఇప్పుడు కూడా పాపాలు పోతాయి పాపక్షమాపణకే రక్తము కార్చినదని అంటున్నారు కదా! అలాంటప్పుడు లేటెస్టుగా ఇప్పుడే చనిపోయిన వారి రక్తము వలన మన పాపము పోదా?

జ॥ ఏసు తన రక్తము ద్వారా మీ పాపములు పోతాయి అని ఎక్కడా చెప్పలేదు. ఒకచోట నా నిబంధన రక్తము అని ఉచ్చరించాడు. ఆ మాట జ్ఞానమును గురించి అనినమాటగానీ వేరుకాదు. ఏసు విషయములో క్రైస్తవులందరూ పొరపాటుపడినారు. ఇకపోతే మహాత్మాగాంధీగారు గానీ, రాజీవ్‌గాంధీగారుగానీ వారి కర్మవలన గ్రహచారము బాగాలేక పోయారు. వారిని చంపిన పాపము చంపిన వారికి వచ్చియుంటుంది. అంతేగానీ పాపముపోయివుండదు. ఇద్దరూ కర్మవలనే చనిపోయారు అనుటకు పూర్తి ఆధారములున్నవి. ఇంకా ముఖ్యముగా గమనించవలసిన విషయమేమనగా! ఇద్దరూ కుజగ్రహము యొక్క ప్రథమశ్రేణి ఆయుధము చేతనే చనిపోవడము జరిగినది. రాజీవ్‌గాంధీగారి జాతకచక్రమును చూచారు. మహాత్మాగాంధీగారి జాతకము బహుశా ఎవరికీ తెలియదను కొంటాను. ఇప్పుడు మరణమును గురించిన కర్మసమస్య వచ్చినది కాబట్టి, ఒకమారు రెండు జాతకములను పరిశీలించి చూద్దాము.

1) ఆయు స్థానమైన ఎనిమిదవ స్థానమును కుజుడు తాకినాడు.

2) ఆయుస్సుకు అధిపతియైన శనిని గురువు తాకుచున్నాడు.

ముఖ్యముగా ఈ రెండు విషయములను మహాత్మాగాంధీ గారి జాతకమునుండి చూచాము. కుజుడు ఎనిమిదవ స్థానమును చూచుట వలన అకాలమరణమునే కల్గించునని చెప్పవచ్చును. గురువు తనకు తోడుగా ఇంకా ఒకటి రెండు గ్రహములు వచ్చినప్పుడు ఆయుష్షును బలవంతముగా లాగుకొనుటకు ప్రయత్నించును.

1) ఆయుస్థానమైన ఎనిమిదవ స్థానమును కుజుడు తాకినాడు

2) ఆయుష్షుకు అధిపతిjైున శనిని కుజుడు తాకుచున్నాడు.

రాజీవ్‌గాంధీగారి జననములో కూడా మహాత్మాగాంధీగారి జననము లో ఉన్నట్లే గలదు. ఆయుస్థానమును కుజుడు ముట్టుకోవడమూ, ఆయువుకు అధిపతియైన శనిని శత్రువైన కుజుడు చూడడమూ కలదు.

ఈ మూడు జాతకములలోనూ ఆయుస్థానమును రక్తపిపాసియైన కుజగ్రహమే తన చేయినుంచి చూడడము విశేషము. రెండవ సూత్రములో మూడు జాతకములలోనూ ఆయుష్షునిచ్చు శనిని గాంధీగారి జాతకములో గురువుచూడగా, మిగతా రాజీవ్‌, జగన్‌ జాతకములలో కుజుడే తాకినాడు.

1) ఆయుస్థానమైన ఎనిమిదవ స్థానమును కుజగ్రహము తాకినది

2) ఆయుష్షుకు అధిపతియైన శనిని కుజుడు తాకుచున్నాడు.

గాంధీ, రాజీవ్‌గాంధీగారి ఇద్దరి జాతకములు ఆయుష్షు విషయము లో ఒకే విధముగాయున్నవి. అందువలన ఈ ముగ్గురి మరణములు ఒకే విధముగా జరిగాయి. 29) ఒక వ్యక్తికి నాగుపాముకరచినప్పుడు ఒక వైద్యునివద్దకు తీసుకు పోయి వైద్యము చేయించాము. అతడు విషమునుండి బయటపడి బ్రతక గలిగాడు. తర్వాత పది దినములకు మరియొక వ్యక్తి నాగుపాము కాటుకే గురిjైునాడు. అప్పుడు అతనిని వైద్యునివద్దకు తీసుకుపోవడము జరిగినది. వైద్యుడు అందరికీ చేసినట్లే శ్రద్ధగా వైద్యము చేశాడు. అయినా పాము కాటుకు గురియైన మనిషి బ్రతుకలేదు. ఒకే వైద్యుడు, అదే వైద్యము ఒకరికి బాగుకావడము మరియొకరికి బాగుకాకుండ పోవడమునకు కారణమేమి ఉండును. దీనికి కూడా గ్రహచారముండునా?

జ॥ ప్రపంచములో ప్రతిదానికీ గ్రహచారమే కారణము. గ్రహచారము లేకుండా ఏమీ జరుగదు. ప్రపంచములో పాములకు, వాటి విషమునకు అధిపతి రాహుగ్రహము. రాహుగ్రహము వ్యతిరేఖమున్నవానికి ఉన్న స్థానమునుబట్టి గ్రహబలమునుబట్టి పాము కరుచుట సంభవించును. రాహువున్న చోట శుభగ్రహములు రెండుయున్నా ఒకటియున్నా అతడు వైద్యముతో బ్రతుకగలడు. రాహుగ్రహము ఆయుస్థానమైన ఎనిమిదవ స్థానమున ఉన్నా, రాహుగ్రహముతోపాటు ఆయు కారకుడైన శనికూడ ఉంటే అటువంటివాడు కాటు తర్వాత బ్రతుకుట కష్టము. రాహుగ్రహము కొందరికి అనుకూలగ్రహమైయుండుట వలన పాములు వారిని ఏమీ అనవు, కాటువేయను పూనుకోవు. రాహువు అనుకూలముగాయున్నవాని ఇంటిచుట్టూ పాముల సంచారమున్నా వాటివలన ఎటువంటి ఇబ్బందులు ఉండవు. దోమలు, చీమలు, క్రిమికీటకాదులు, సర్పములు అన్నియు రాహువు యొక్క ఆధీనములో ఉండును. రాహువు అనుకూలము లేకపోతే ఇంటిలో చీమలతో కూడా ఇబ్బంది పడవలసి వస్తుంది. ఇదంతయు గ్రహచారమునుబట్టియే జరుగుచుండును. 30) ప్రపంచములో ప్రతిదీ గ్రహముల ఆధీనములో ఉండునని చెప్పు చున్నారు కదా! అయితే జ్ఞానమనునది ఎవరి ఆధీనములో ఉండును?

జ॥ జ్ఞానము అంటే, రెండు రకముల జ్ఞానములున్నవి. ఒకటి ప్రపంచ జ్ఞానమున్నది. రెండవది పరమాత్మ జ్ఞానమున్నది. వాటిలో ఏ జ్ఞానమును ఉద్దేశించి అడుగుచున్నారో చెప్పండి.

31) మేము అడుగునది రెండు జ్ఞానముల గురించి?

జ॥ ఒక కత్తి పిడిభాగము కొనభాగము అని రెండు భాగములుగా ఉండును. కొన భాగము మాత్రము ఇతరులను పొడవగలదు. పిడి భాగము ఎవరినీ పొడిచి చంపలేదు. కత్తి అనునది ఒకటే అయినా పిడి భాగము కొనభాగము ఒకే కత్తిలోయున్నట్లు జ్ఞానము అను పేరు ఒకటే అయినా అందులో కర్మయున్నదీ, కర్మలేనిదీ అని రెండు రకముల జ్ఞానములు గలవు. ఒకటి ప్రపంచజ్ఞానము, అది కర్మ ఆధీనములో ఉండును. రెండవది పరమాత్మ జ్ఞానము. ఇది కర్మ ఆధీనములో ఉండదు. పరమాత్మ జ్ఞానమంతా దేవుని ఆధీనములో ఉండును. ప్రపంచ జ్ఞానము కర్మ ఆధీనములోయుండి గ్రహచారము ద్వారా లభించును. దేవుని జ్ఞానము దేవుని ఆధీనములో ఉండి దేవుని వలననే లభించగలదు.

32) పిల్లలులేని స్త్రీలు నాకు సంతతి లేదు. భవిష్యత్తులో పిల్లలు పుట్టుతారా అని అడిగితే జ్యోతిష్యము ప్రకారము ఎలా చెప్పాలి?

జ॥ ఎవరు సంతతిని గురించి అడిగారో వారి జాతక కుండలి చూచి అందులోనుండి జవాబు చెప్పవలసియుండును. జాతక లగ్నములో ఒక విషయమును గురించి చూచునప్పుడు ఆ విషయమునకు సంబంధించిన స్థానమునూ, ఆ విషయమునకు సంబంధించిన గ్రహము గురించి చూడ వలసియుండును. స్థానబలమును గ్రహబలమును రెండిటిని సమన్వయ పరచుకొని చూచినప్పుడు సరియైన ఫలితమును తీసి చెప్పగలము. ఇప్పుడు అడిగిన విషయము సంతతికి సంబంధించినది, కావున సంతతి యొక్క విషయము కర్మచక్రములో ఏ స్థానములో ఉండునని చూచిన అది ఐదవ స్థానమని తెలియుచున్నది. ఐదవ స్థానములో పుణ్యము ఉంటుంది. ఆ పుణ్యములో ప్రపంచజ్ఞానము, విషయగ్రాహితశక్తి, సంతతి మొదలగు విషయములన్ని రాశులుగా (కుప్పలుగా)యుండును. అందువలన ఐదవ స్థానములో సంతతికి సంబంధించిన విషయమును చూడవలసియుండును. ఒకటి స్థానమునుబట్టి, రెండు గ్రహమునుబట్టి చూడవలెను. సంతానము నకు సంబంధించిన గ్రహములు రెండు గలవు. అందులో ఒకటి చంద్రుడు, రెండవది గురువు. కొడుకులను గురించి చూడవలసివచ్చినప్పుడు గురువును చూచి చెప్పాలి. కేవలము సంతతిని గురించి అడుగునప్పుడు చంద్రున్ని చూచి చెప్పాలి. ఐదవ స్థానములో అశుభగ్రహములున్నా, సంతాన కారకులైన చంద్రుడు అశుభస్థానములోయున్నా అశుభగ్రహములచే కలిసి యున్నా వారి సంతానమును అశుభగ్రహములు లాగుకొని సంతానము లేకుండ చేయుదురు. గురువుకానీ, చంద్రుడుగానీ మంచిస్థానములోయున్నా ఐదవస్థానములో శత్రుగ్రహములు లేకుండా శుభగ్రహముండిన, వారికి తప్పక సంతానము తొందరలో కల్గునని తెలియుచున్నది.

33) ఇప్పుడు ప్రపంచములోనే ఇస్లామ్‌ సమాజమునకు పూజ్య భావము, గౌరవ భావము కల్గియున్న ముహమ్మద్‌ ప్రవక్తగారి జాతకమును ఇస్తాము. ఆ జాతకములో విశేషత ఏమి ఉన్నదో తెలుపగలరా?

జ॥ ఈయన యొక్క విశిష్ఠత పూర్తి ప్రపంచమునకే తెలియును. ఈయన ప్రపంచములో ఒక క్రొత్త సమాజమునే తయారుచేసి అది శాశ్వతముగా ఉండునట్లు చేశాడు. అందువలన ముహమ్మద్‌ప్రవక్తగారి పేరు తెలియనివారు ఎవరూ ఉండరు. మీరు ఎందుకు ప్రవక్తగారి జాతకమును చూపి అడుగుచున్నారో మీరు చెప్పకున్నా నాకు అర్థమైనది. మీ ఉద్దేశ్యములో జ్యోతిష్యము హిందూమతస్థులకు తప్ప ఇతర మతముల వారికి వర్తించదను భావము కలదు. అందువలన మేము ఏమి చెప్పుదుమో నని అడుగు చున్నారు. సరే మీలాంటి భావమే ఇతరులకు కూడా ఎంతో మందికి ఉండవచ్చును. మీ అనుమానము ఎవరికీ లేకుండుటకు మీమాట కు ఏమి చెప్పుచున్నామనగా! ప్రపంచములో మతము అనునది మనుషులు పెట్టుకొన్నదేగానీ, దేవుడు పెట్టినదికాదు. దేవుని దృష్ఠిలో మనుషులంతా సమానమే! అందువలన జ్ఞానముతో చూస్తే, జ్ఞానము వలన పుట్టుకొచ్చిన జ్యోతిశాస్త్రమైన జ్యోతిష్య శాస్త్రము ప్రపంచములో అన్ని మతముల వారికీ, అన్ని సమాజముల వారికీ సమానముగా వర్తించును. ప్రపంచములో పుట్టిన ప్రతి జీవరాశీ, ప్రతి మనిషీ గ్రహచారము ప్రకారమే కదలించబడు చున్నారు. ఆడిరచబడుచున్నారు. అందువలన జ్యోతిష్యము ఒక్క హిందువు లకే అనుకోవడము పొరపాటు.

ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న దగ్గరకు వస్తాము. మీరు ఈ జాతకములోని విశిష్ఠతను గురించి అడిగారు. ప్రపంచములో ఎవరికి ఏది విశేషముగాయున్నా, జ్ఞానుల దృష్ఠిలో దేవుని జ్ఞానమే విశేషముగా యుండును. అందువలన ప్రవక్తగారి జాతకములోనున్న ముఖ్య సారాంశ మైన దానిని గురించి చెప్పుకొందాము. మనిషి కొన్నాళ్ళు బ్రతికి భౌతికముగా చనిపోయినా, అతనిని చాలాకాలము మనుషుల మధ్య బ్రతికింపజేయునది అతని కీర్తి ప్రతిష్ఠలని చెప్పవచ్చును. ఒక్క దైవజ్ఞానము తప్ప ప్రతిదీ జాతకములో ఉండును. కీర్తి ప్రతిష్ఠలు ఎవరి జాతకములోనైనా పదవ స్థానమున ఉండును. 14 వందల సంవత్సరముల పూర్వము చనిపోయిన ముహమ్మద్‌ ప్రవక్తగారు నేటికినీ మనుషుల మధ్య జ్ఞాపకముగా ఉన్నాడను టకు కారణము అతని జీవితములో అతడు సాధించుకొన్న కీర్తియేనని చెప్పవచ్చును. అతని కీర్తి ఎటువంటిదని చూచిన అది పదవ స్థానమున ఉండుననుకొన్నాము కదా!

ప్రవక్తగారి జాతకమున పదవస్థానములో ఏమి కలదో ఇప్పుడు గమనిద్దాము. ప్రవక్తగారి జాతకములో పదవస్థానము వృశ్చికలగ్నము అగుచున్నది. పదవ స్థానమున ప్రవక్తగారి జనన సమయమునకు శని, కేతు గ్రహములు రెండు గలవు. ఈ రెండు గ్రహములు చాలామందికి తెలిసినవే. జ్యోతిష్యులైనవారందరికీ సుపరిచయ గ్రహములే. అయితే అదే దశమ స్థానమున మిత్ర గ్రహము మరొకటి కలదు. మిత్రగ్రహము ఎవరికీ తెలియదు. ఎవరికీ తెలియని మిత్రగ్రహము పూర్తి చీకటి గ్రహము. ఎవరూ దానిని గుర్తించలేరు. ఏ పరికరముల ద్వారానైనా, ఏ రేడియేషన్‌ కిరణముల ద్వారా అయినా గుర్తింపబడని గ్రహము మిత్రగ్రహము. నేడు ముహమ్మద్‌ప్రవక్తగారి పేరు శాశ్వతముగా మనుషుల మధ్యలో ఉండుటకు కారణము మిత్రగ్రహమేనని చెప్పవచ్చును. రాహువు విగ్రహారాధన భక్తిని కల్గించువాడైయుండగా, కేతువు నిరాకార భక్తిని కల్గించునదై ఉన్నది. బాగా జ్ఞాపకముంచుకోండి మేము చెప్పునది నిరాకారభక్తినిగానీ, నిరాకార జ్ఞానమును కాదు. జ్ఞానము ఎప్పటికీ గ్రహముల ఆధీనములో ఉండదు. రాహువుది భక్తియే రాహువుకి వ్యతిరేఖమైన కేతువుదీ భక్తియే. రాహువుది సాకారభక్తియైతే, కేతువుది నిరాకార భక్తియని గుర్తుంచుకోవలెను. కేతువు పదవస్థానమున ఉండుట వలన, అతని జీవిత వృత్తి, ప్రవృత్తి రెండూ నిరాకార భక్తిమీద సాగునట్లు చేసినది. నిరాకార భక్తిలోనున్న ప్రార్థన వారి జీవితములో ఉండేది. నిరాకార ప్రార్థన అయిన నమాజ్‌ నేడు ముస్లీమ్‌ సమాజములో పూర్తిగాయున్నది. ప్రవక్తగారు స్థాపించిన ప్రార్థన నేటికీ చెక్కుచెదరకుండ ముస్లీమ్‌లలో పాతుకొని పోవునట్లు చేసినది మిత్రగ్రహము. నిరాకార భక్తిని కల్గించినది కేతు గ్రహముకాగా, దానినే ప్రవక్తగారి కీర్తికి ఆధారముగా అందరిలో నిలిపినది మిత్రగ్రహము. సాకార భక్తిలో హిందువులు మరికొందరు మునిగిపోయి సాకారభక్తికి కేంద్రములుగా దేవాలయములను నిర్మించుకోగా, ప్రవక్తగారు దానికి భిన్నముగా ముస్లీమ్‌ సమాజమును తయారు చేసి నిరాకారభక్తిని వారియందుంచి, నిరాకార భక్తికి కేంద్రములుగా ప్రార్థనామందిరములైన మసీద్‌లను నిర్మించాడు. ఆనాడు ప్రవక్తగారు ప్రత్యేక సమాజమును (నిరాకారభక్తి సమాజమును) స్థాపించుటకు కారణము కేతు గ్రహముకాగా, ఆయన కీర్తిని ఎల్లకాలము ఉండునట్లు మిత్రగ్రహము ముస్లీమ్‌ సమాజము మొత్తము ప్రవక్తగారినీ, ఆయన ఏర్పరిచిన విధానమును మరచిపోకుండునట్లు ఆచరించునట్లు చేసినది. ప్రవక్తగారి జీవితములో ముఖ్యమైన విశిష్టత అదేనని మేము చెప్పుచున్నాము.

34) జ్యోతిష్యము గ్రహచారము, దశాచారము అని రెండు రకములుగా ఉన్నది కదా! జ్యోతిష్యము రెండు రకములుగాయున్నప్పుడు, దానిని చెప్పు జ్యోతిష్యులు ఒకే రకముగాయున్నారు కదా! దీనికి మీరేమంటారు.

జ॥ జ్యోతిష్యము రెండు రకములుగాయున్నది వాస్తవమే. అయితే జ్యోతిష్యులు కూడా రెండు రకములుగా ఉండాలి. కానీ అందరికీ ఒకే రకము జ్యోతిష్యులు కనిపిస్తున్నారు. పంచాంగమును తీసుకొని, తిథి, వార, నక్షత్రముల ఆధారముతో చెప్పు జ్యోతిష్యులందరూ ఒకే రకము జ్యోతిష్యులగుదురు. అటువంటి మొదటిరకము జ్యోతిష్యులే ఎక్కడైనా కనిపించుచుందురు. రెండవ రకమునకు చెందిన జ్యోతిష్యులు ఉండాలి కానీ వారు ఎవరైనా ఉన్నారో లేదో తెలియదు. ఎక్కడైనా ఉండవచ్చును, ఉండకపోవచ్చును. మొదటి రకమునకు సంబంధించిన జ్యోతిష్యమునే మనము కూడా ఇంతవరకు వ్రాసుకొన్నాము, చెప్పుకొన్నాము. రెండవ రకము జ్యోతిష్యున్ని గురించి చెప్పుకుంటే అతను నేను జ్యోతిష్యుడని ప్రత్యేకముగా ఉండదు. అటువంటి రెండవరక జ్యోతిష్యుడు ఉన్నట్లుండి భవిష్యత్తును చెప్పును. అతను పంచాంగముతో పనిలేకుండా, ఏమాత్రము జాతకమును చూడకుండా చెప్పిన దానిని జ్యోతిష్యము అనకుండ జరుగ బోవు దానిని చెప్పగలడు. మొదటి రకము జ్యోతిష్యుడెవరైనా గ్రహచారమును బట్టి చెప్పును. రెండవ రకము జ్యోతిష్యుడైనవాడు దేనినీ ఆధారము చేసుకొని చెప్పడు. అటువంటివాడు ఏది చెప్పితే అదే జరుగును. ఉన్నదానిని అనుసరించి చెప్పువాడు జ్యోతిష్యుడు. చెప్పినదానిని అనుసరించి జరుగునది కాలజ్ఞానము. భవిష్యత్తు అనినా కాలజ్ఞానమనినా రెండు ఒకటే అయినా చూచి చెప్పునది జ్యోతిష్యము. చూడక చెప్పునది కాలజ్ఞానము. దేనినీ చూడకుండా చెప్పిన వారిలో మనకు తెలిసినంతవరకు శ్రీ పోతులూరి వీరబ్రహ్మముగారు కలడు. తాము జ్యోతిష్యులమని ప్రకటించుకోని వారిలో రెండవ రకమునకు చెందిన జ్యోతిష్యులుండవచ్చును.

పూర్వకాలములో రెండవరకము జ్యోతిష్యులు అప్పుడప్పుడు కొందరున్నట్లు వినికిడి. అటువంటి వారిలో ముఖ్యుడు త్రేతాయుగమున గల రావణబ్రహ్మ. గత కొంతకాలము క్రింద ఉదాహరణగా చెప్పుకొనుటకు వీరబ్రహ్మముగారు కనిపిస్తున్నారు. రావణబ్రహ్మ కాలజ్ఞానమును పూర్తిగా తెలిసిన త్రికాల జ్ఞాని. రావణబ్రహ్మ త్రికాలజ్ఞాని అని పేరుగాంచితే, వీరబ్రహ్మము కాలజ్ఞాని అని పేరుగాంచియున్నారు. రావణబ్రహ్మ మూడు కాలములకు జ్ఞానియై నేటికినీ త్రికాలజ్ఞానిగా పేరుగాంచియున్నాడు. వీరబ్రహ్మము భవిష్యత్‌ కాలమునకు జ్ఞానియై కాలజ్ఞానియని పేరుగాంచి యున్నాడు. వీరు ఇద్దరూ మనకు నమూనాకు చెప్పబడే రెండవరక జ్యోతిష్యులని తెలియుచున్నది. పూర్వము పెద్దలైనవారు రెండవ రక కనిపించని జ్యోతిష్యులుగా ఉంటే, నేడు మొదటి రక జ్యోతిష్యమును కూడా సరిగా తెలిసినవారు లేకుండా పోవడము మనకే అవమానము. అందువలన మొదటి రక జ్యోతిష్యులు ఒకరిద్దరుండినా ఫరవాలేదు. వారు సక్రమమైన జ్యోతిష్యము తెలిసియుండాలి అను ఉద్దేశ్యముతో ఇప్పుడు పన్నెండు గ్రహములతో కూడుకొన్న జ్యోతిష్యశాస్త్రమును వ్రాయడము జరిగినది.

ni ni ni CT huMo CT