జ్యోతిష్య శాస్త్రము/గుణచక్రములోని గుణముల వివరమేమి?

21. గుణచక్రములోని గుణముల వివరమేమి?

మార్చు

ఇంతవరకు బ్రహ్మ,కాల,కర్మ,గుణచక్రముల సముదాయములో కాలచక్రమును గురించీ, కర్మచక్రమును గురించీ కూలంకషముగ తెలుసు కొన్నాము. ఇక క్రింది చక్రమైన మరియు కర్మలకు కార్యములకు కారణమైన, 36 గుణములతో కూడి ‘మాయచక్రమని’ పేరుగాంచిన, గుణచక్రమును గురించి కొంత తెలుసుకొందాము. ఇవన్నియు కల్పన అని అనుకోవద్దండి. బ్రహ్మవిద్యా శాస్త్రమైన భగవద్గీతను అనుసరించి తెలుపునవని చెప్పు చున్నాము. గీతలో అక్షరపరబ్రహ్మయోగమందు నాల్గుచక్రముల మూలము కనిపించగా, గుణత్రయ విభాగయోగమను అధ్యాయమందు గుణముల గురించిన సమాచారము సవివరముగా కలదు. గుణచక్రము మూడు భాగములుగా ఎట్లున్నది, అందులో జీవుడు ఏ భాగములో ఉన్నపుడు ఏ పేరు కల్గియున్నదీ. ఒక్కొక్క భాగములో గుణములు ఎట్లు చీలియున్నదీ చిత్రపటముల రూపములో చూచెదము.

28 వ పటము. గుణచక్రములో జీవుడు


29వ పటము. తామసములో జీవుడు


30వ పటము. రాజసములో జీవుడు
31వ పటము. సాత్త్వికములో జీవుడు


32వ పటము. యోగములో జీవుడు


33వ పటము. చిన్న పెద్ద గుణములు
ఈ విధముగా గుణచక్రము, మూడు భాగములుగా ఉంటూ అందులో పక్ష, ప్రతిపక్ష గుణములు 12 రకములుగా ఉన్నవి. వాటిలో ఒక్కో గుణము 9 రకముల పరిమాణముగ చీలి ఉన్నవి. ఈ 108 గుణములనే భగవద్గీతలో మాయ అని చెప్పారు. గుణముల మాయనుండి ఉత్పన్నమైన కర్మ అనునది కర్మచక్రమును చేరి, పైనున్న కాలచక్రములోని పండ్రెండు గ్రహముల చేత, తిరిగి మానవుని మీద కష్టసుఖముల రూపముతో ప్రసరింపబడుచున్నది. దానిని ముందుగా తెలుసుకోవడమునే జ్యోతిష్యము అంటున్నాము. ఇది జ్యోతిష్యశాస్త్రము కావున గుణములను, కర్మలను, గ్రహములను చెప్పుకోవలసివచ్చినది.