జేసుదాస్
- దేవుడు ఉన్నాడో లేడో మానవుడున్నాడురా
వాడే దేవుడు కలడో లేడని తికమకపడుతున్నాడురా మానవుడున్నంతవరకు దేవుడు ఉంటాడురా వాడినితలచేందుకు మానవుడుండాలిరా [దేవుడు ]
- తనలో మంచిని పెంచుకునేటందుకు తానే దేవుడు అయ్యేటందుకు
మనిషొకరూపం కల్పించాడు అది మనిషి మనిషికొక రూపమయి పలుమతాలుగా మారాయిరా [దేవుడు ]
- భయంనుంచి దేవుడు పుట్టాడు
భక్తి నుంచి దైవత్వం పుట్టింది భయం భక్తులను మించిన స్థితినే ముక్తి అంటారురా [దేవుడు ]
- మనిషికోసం బ్రతికే మనిషే దేవుడు
దేవుడి కోసం మనిషిని మరిచే వాడే మూఢుడు ప్రేమ త్యాగం తెలిసిన వాడే మానవుడూ దేవుడి పేరిట మూఢుడైతే వాడే దానవుడు [దేవుడు ]