జాన్ గిల్పిన్
జాన్ గిల్పిన్
గీ. లండ ననియెడుపట్టణ మొండుగలదు,
దాన, గన్యతయుఁ బ్రసిద్ధితద్దగలిగి,
యుద్ధవేళనె పనిచేయు యోధవరుఁడు,
జానుగిల్పిను వసియించు సంతమును. 1
గీ. భార్యయిట్లనె౼ ౼"బాగగఁ బలికితీవు;
ద్రాక్షసారాయి ప్రియమౌట దానికొఱకు,
రంగుగలదిగాను, గడుసుభ్రంబుగాను
నున్నమనదెకొంపోవుద మెుండుదక్కి."
గీ. దానికపరిమితానందమూని, యాతఁ,
డట్టిసంతోషసమయంబునందుఁగూడఁ,
బ్రియవధూమణితామితవ్యయమునంచె,
పెద్దతవిలియుంటకుముద్దు పెట్టుకొనియె.
గీ. తెల్లవాఱెను, బండియు నల్లవచ్చెఁ,
గాని, యెల్లరు గర్వముఁగలదటంచుఁ
దనుఁదలఁతురంచు, గుమ్మముదరికిదానిఁ,
దీసికొనిరాకయుండంగఁదెఱనపనిచె.
గీ. అందుచే, మూడుగుమ్మములంతదూర,
ముననెయాగెనుశకటంబు, పోయియటకు
నొకరినొక్కరుమించఁగనొక్కసారి,
యాఱుగురునందుఁజొచ్చిరియాత్రముగను.
గీ. చబుడుకదలెను; జక్రముల్ సరిగఁదిరిగె;
బండిలోనివారానందభరితులయిరి;
కలగలమటంచు దిగువను శిలలు మెురసె,
నడుగుతట్టునకును వెఱ్రితొడరినట్లు.
గీ. జానుగిల్పును గుఱ్రపుసరసకరిగి,
వ్రేలుజూలును గరమునవేగ బట్టి,
స్వారిసేయంగఁబై కెక్కె సంభ్రమమున;
కానిశీఘ్రంబదిగియెనుగ్రమ్మఱంగ.
గీ. తనదుపయనంబుసాగింపఁదలఁచియతఁడు,
వారువపుఁబల్లమునొకింతచేరతడవ,
వెనుకవంఖాఖూ దలద్రిప్పి కనియెనపుడు,
మూవుర, సరకుఁగొనలోనఁబోవువారి.
గీ. కాలయాపనమగుటకుఁజాలచింత,
గదిరియును, సొమ్మచనుటంతన్నఁదన్నుఁ
జింతనొందించునని తనచి త్తమందు,
నెఱుఁగుఁగావున, దిగివచ్చినింటికతఁడు.
గీ. చాలసేపటిదాఁకను, సరకుఁగొనెడు,
వారిమదికీఁ గుదురయ్యె బేర మపుడు;
ద్రాక్షసారాయిమఱయెతరలిరంచు,
నరచుచునుమేడదిగివచ్చెనబలయేర్తు.
గీ. "అయ్యయే! యెంతమఱపయ్యె! నయిననేమి ?
లెమ్ము నాకడకది; సాధకమ్ముచేయు
నపుడు క త్తినివేసెడు నట్టినడుము
పటకయున్నదిలే" యని పలికె నతఁడు.
గీ. శ్రద్ధ కలయి యాతనిచాన, తనకుఁ,
బ్రాణపద మైనసారాయి పట్టుటకును
రాతిజాడీల రెంటి జాగ్రత్తచేసి
భద్రముగ దానివానిలోపలనుబోసె.
గీ. ఉండె బుడ్డిబుడ్డికి నొక్క యుంగ్రపుఁజెవి,
దానిలోనుండి తనపటకాను దూర్చి,
రెండుప్రక్కలఁ దూఁకంబు నిడియుండఁ
బ్రక్క కొక్కటి వ్రేలాడఁబడఁగఁ గట్టె.
గీ. అంతయును గానరాకుండ, నడుగుమెుదలు,
శిరసువఱకునువలువఁగై నేసికొనఁగ
నుదికిదెచ్చినపొడుగంగి నొక్కదాని,
నెఱ్రదానిఁ జక్క ఁగధరియించుకొనియె.
గీ. అవలఁజుఱుకై నతనపూర్వహయమునెక్కి,
తిరిగిపయనంబుసాఁగించె దిగుననున్న
రాళ్ళపై గుఱ్ర మధికజాగ్రత్తతోడఁ,
గడుమెలంకువ మెల్లఁగానడుచుచుండ.
గీ. బాగుగా నాడకట్టినసాదములకు
శీఘ్రమే మంచిమార్గంబు చిక్కిఁగాన,
హెచ్చి దాఁటులువేయంగఁజొచ్చి హయము
రాపిడిని నాతంఁడెంతయు వ్రంతనొంద.
గీ. అందుచే, జానటంచునువఱచెనతఁడు,
స్పష్టంఊగమెల్ల నదియెల్ల వ్యర్ధమయ్యె
పగ్గమును గళ్ళెమునుగల్గి పనికిరాక,
యల్లదాఁటులె వడిబఁరుయ్యెఁగాన.
గీ. తిన్నఁగాఁ గూరుచుండలేకున్న వాఁడు,
గాన, దానిపై నడ్డముగాఁగ వంగి
రె ండుచేతులతో నేకరీతిగాను,
బలముకొలఁదిని జూలును బట్టుకొనియె.
గీ. తొల్లియెన్నఁడు నారీతిఁ దురగ మద్ది,
యూఁది పట్టుకోఁబడ్డదికాదుగానఁ
దనదునీవుపై నెద్దియెక్కెనొయటంచు,
జడిసిమఱియద్భుతపడుచునుండె.
గీ. దూరముగఁ బోయెగిల్పిను, దూరముగను
బోయెజుట్టును టోపి బోడితలగ;
నతఁడు బయలుదేఱేడియప్పు డత్మయందు
నింతపని సంభవించునం చెరుఁగఁడయ్యె.
గీ. గాలివీపంగఁజొచ్చెను, గదలఁ దొడఁగె
నంగియును బెద్దధ్వజపటమట్లు మిగుల;
కొక్కెములును గుండీలును గూడనూడి
తుదకుఁ బైనుండి యంగియుఁ దొలఁగిఁపోయె.
గీ. పయిని జెప్పినరీతిని బ్రక్క కొకటి
వ్రేలునట్టుగఁ గట్టినవింతయైన
బుడ్లు రెండును జనులెల్ల బ్రోవుగూడి
చోద్యపడిచూడఁ దగియుండె సూటిగాను.
గీ. కుక్క లఱచెను, వీధిలోఁ గుఱ్రవాండ్రు
పెద్దకేకలువైచిరి, పెద్దవారు
తమగవాక్షములనుజేరి తగినయట్టు,
లయ్యెనంచును గట్టిగా నఱచిరొకట.
గీ. ఒక్కవడిఁ బోయె జాన్ఘిల్పినొక్కరుండ--
" బున్ల కట్టుకొనియె! పందెమును వహించె!
లక్షనేయు!" నటంచును దత్షణంబ
యతనికీర్తి వ్యాపించెను నన్నికడల.
గీ. వాయువేగంబుతోఁ జేర వచ్చినపుడు,
వీధికావలివారలు వింతగాను
నిమిషమాత్రంబులోపల గమిడినెట్లు,
తెఱచిరోచూడఁజిత్రంబుమరియుఁగరము.
గీ. పొగలువెడలెడుతనతనలమిగులఁగుంచి,
బోరగిలఁబండుకొనిక్రిందఁబోవునపుడు
మున్నవెనుకను గట్టినబుడ్లురెండు,
నొక్కదెబ్బను బగలెను వ్రక్కలుగను.
గీ. కాంచుటను నెంతయునుజాలిగదురునట్లు,
తెరువునిండనుసారాయిది గుపఁగాఱె;
మున్నకఱ్రతోఁగడుగొట్టియున్నకతన,
హయముప్రక్కలఁ బొగలేచెనందుచేత.
గీ. తోలునడికట్టుబిగియింపుతోడ, నింక
బరువు మేచునట్టులె కానఁబడియె నతఁడు,
నడుమునను ఁవేలుజాడీలమెడల, నెల్ల
వారునిప్పుడుఁ జూడంగవచ్చ ఁ గాన.
గీ. అంతబిగిని, నెడ్మాంటనునందు నుండు,
వాషనుప్రదేశమునకును వచ్చుదాఁక,
నాతఁ డై స్లింగుటనుగుండ నాడెనిట్టి,
నాటకంబును సంతతానందమునను.
గీ. పధముపొడుగున రస మిరుప్రక్కలందుఁ
గలయఁ గలయంపి చల్లె నక్కడ నతండు;
అలుకుగుడ్డ నొండెను, బాతులాటయందుఁ
బాచికల నొండె, దొరలించుపగిది తోఁప.
గీ. అప్పు డెడ్మాంట ననుగ్రామమందు నుండి,
యతనిప్రియభార్యయు వసారయంచు నిలిచి
కాంచె హృదయేశ్వరునివంక ఁ గన్నులార,
నట్లు స్వారిచేయుట కెంతొ యబ్రపడుచు.
గీ "ఆఁగు మాఁగుము; గృహ మిదె; యరుగ వలదు;
భోజనపువేళ యయ్యె ; మేము నలసితిమి"
యంచు నందఱు నొకపెట్ట నఱచి రవుడు ౼౼
"నేను నట్లైతి" ననియెను జాను నంత.
గీ. కాని, గుఱ్ఱంబు రవ్వంతయైన నచట
నిలువ నిష్టంబు పడకుండె; నేలనిలుచు
దానియజమానుఁ డామడదవ్వు నందు
వేరనెడిచోఁ గలిగియుండవేఱెయిల్లు.
గీ. బలముగలయట్టి నెఱవింటివాని చేత
విడువఁబడినట్టిబాణంబువిధముగాఁగఁ
బఱచె నశ్వంబు , దానిపైఁ బఱచెనతఁడు_
కథయు సగమయ్యె నాకు నిక్కడకుఁ జూడ. 39
గీ. తనదుమిత్రుఁ డౌపట్టు వర్తకునియింటి
వెలుపలఁదుదకుఁదురగంబునిలుచు దాఁక
దవ్వుగాఁబోయె గిల్పిను, తనకొకింత
యిష్టమేనియ లేకుండ నింతలోన. 40
గీ. తనదుపొరుగువాఁ డావేషమునను వచ్చు
టద్భుతంపడి చూచి పొగాకుగొట్ట
మచటఁ బడవైచి, గుమ్మంబునండ కరిగి
తొలుతనీరీతి నాతనిఁ బలుకరించె 41
గీ." వార్తలేమిటి ? యేమిటి? వడిగఁజెప్పు;
చెప్పు నీవర్తమానంబు శీఘ్రముగను
వట్టితలతోడ నేటికి వచ్చి తీవు?
కదలి యిచటకు రానేల మొదలు నీవు? 42
గీ. అవసరోచిత మైనట్టిహాస్యమందు
మిగులఁ బ్రియుఁ డౌటఁ దన నేర్పు మెఱసి యతఁడు
ముఖవికాసంబు నటియించి , మురువుదోఁపఁ
బట్టువర్తకుతోడుతఁ బలికెనిట్లు. 43
గీ." వారవం బిటు రాఁగోర, వచ్చితేను;
చక్కఁగా జ్యౌతిషము చెప్పఁజాలితిని
నాకృతశిఖ కుళ్ళాయినన్నుఁజేరు;
తెన్నునడుమను నవిపయున్న విపుడు" 44
గీ. ఆత్మసఖుఁడు కుతూహలాయత్తుఁ డగుచు
నుంట కెంతయు నలరారి, యెక్కమాట
యైన మాఱుగాఁ బల్కక, యవుడ తనదు
భవనమును జొచ్చి యాపట్టువర్తకుండు. 45
గీ. కల్లజుట్టు టోపియుఁ గొంచునల్ల వచ్చె
మందిరమునుండి ; రెండునునందముగనె
యుండె_ జుట్టది వ్రేలాడుండెవెనుక
కరముఁగుళ్ళాయి చెడ్డదికాకయుండె. 46
గీ. వానిరెంటిని బైకెతి పట్టిచూపి
తనచమత్కారమును దోఁపననియెనిట్లు
కనఁగ నాతల నీతలకంటె రెట్టి
గాన సరిపెట్టుకొనవలెవీని నీవు.' 47
గీ.నీదు నెమ్మోమునందును నెలవుకొన్న
దుమ్ము నించుక దయచేసి తుడువనిమ్ము ;
నిండ నీ వాఁకిలిని గొని యుండవచ్చు;
నిప్పుడిటనిల్చి భుజియించి యేగుమవల 48
గీ. అందుమీదఁను జానిట్టు లనియె _ " నేఁడు
నావివాహదినము ; వేరునందు నేను,
భార్య యెడ్మాంటనున, విందుఁ బరఁ గఁగొన్న
లోకమెల్లను మముఁజూచిలోన నగరె?" 49
గీ. వాని నాలించి తనతేజివంక మరలి
యనియె _ ' నే నిప్డు గుడువంగఁ జనఁగవలయు ;
నీవు నీయిష్టమును బట్టి యిటకు వచ్చి
తట్ల నా యిష్టమునుబట్టి యరుగు మరల" 50
గీ. అహహ! దురదృష్టవాక్యంబు ! వ్యర్ధదంభ !
మందునకు ఁదొడనే తగినట్టులయ్యె_
నంచు ముచ్చటించుచునుండ నఱచెనొక్క
ఖరము సంగీతసరణిని గట్టిగాను. 51
గీ.అందు పై సింహగర్జనం బాలకించి
నట్టులికిలించుచును లేచి, యడరి పట్టఁ
బగ్గములు లేక, యొక్కటఁ బరుగువాఱెఁ
దొంటికై వడినేయల్లతురగమపుడు. 52
గీ.దూరముగఁబోయెగిల్పిను, దూరముగను
బోయెమాయజుట్టుఁ బెనుకుళ్ళాయిమిగులు;
తొంటికంటెను నీసారి తొలఁగెవేగ
నవియు, ముక్కిలి పెద్దవియౌటకతన 53
గీ. ఊరుదాఁటి పయికి ఁ జాలదూరమునగను
దనద పెనిమి పఱగడఁ జనఁగఁ జూచి
నప్పు డాతని భార్యయు నాత్రముగను
బంగరువరాను నొకదానిఁ బైకిఁదీసి. 54
గీ.బెల్లునకుఁ దమ్ముఁ గొనివచ్చి విడిచినట్టి
బండికుఱఁగనొని పలికె నిట్లు_
సుఖముగా నాదునాధునిసొంపు చెడక
నిలిపి తెచ్చి తేనియు నిది నీదిసుమ్ము. 55
గీ. వాఁడును దురంగమునునెక్కి వడివెనుకకుఁ
గ్రమఱఁగవచ్చు జానును గలిసికొంచుఁ
గళ్ళెమును బట్టుకొంటచేఁ గడలకుండ
నిలుప యత్నించె దానిని నిమిషమునను. 56
గీ.సంతసంబున నాలాగా సలుపుఁగాని
యైన, నను కొన్నయట్టు చేయంగలేక,
భీతవాహమును మఱింత బెదరఁగొట్టీ
మఱియు వేగంబుగాదాని ఁ బఱవఁజేసె. 57
గీ.దవ్వుగను నేగెగిల్పిని, దవ్వుగాను
జాంఘికుఁడు నేగె వెన్నంటి జానుతోడ;
బండికుఱ్ఱనిగుఱ్ఱంబు బండియెక్క
చక్రముల బాధపోకకు సంతసించె. 58
గీ. పధికు లార్గురు, త్రోవలోఁ బరుగువాఱు
జాను, నతనివెనుకను సత్వరముగఁ
దఱుముకొని పోవుకుఱ్ఱని, దవులఁ గాంచి
దొంగయని యెంచి యార్చి రందఱును నిట్లు _ 59
గీ.' తస్కరుఁడ! యాగు మాగుము దారిదొంగ! '
యొక్కరుఁడు నందు నూరక యుందు రైరి
యొక్కరుఁడు పోయెడువార లెల్లఁ
దప్పకుండఁగఁ జేరి రాతఱుముటందు. 60
గీ. పన్నుఁగొనివారు ' మునుపటివలె నెజాను
పందియము వాఱుచున్నట్టు డెందమందుఁ
దలచుటను, వీధి కడ్డగుతలుపు లపుడ
తీయఁబడియెను జనుటకుఁ దెఱపగాఁగ. 61
గీ.అట్లు చేని యీపందెము నతఁడెగెల్చెఁ
దానెముందుగఁబురిచొచ్చెఁగాననిపుడు
ఎందునాఁడయ్యెను బూర్వమెక్కినట్టి
తిన్నెచెంతను క్రమ్మఱదిగినదాఁక 62
గీ.నృపుఁడు ! చిరజీవివిగఁగమ్ము నీవు; జాన!
నీవునట్లెకమ్మంచు వర్ణింతమిపుడు
వెండీయును నాతఁడిటుస్వారివెడలునపుడు
కనుటకును నేనునచటకుఁ జనుదుగాక! 63
గీ.కౌపరని యెడియింగ్లీషుకవిరుండు
హాస్యకృతిగాఁగమును చేసినట్టిదీనిఁ
' డేటగీతులతోడను దెనుఁగునందుఁ
గందుకూరి వీరేశలింగము రచించె. 64