జయ సంవత్సరాదిని చేసిన ఉపన్యాసము/ఉపన్యాసము
ఓం
జయ సంవత్సరాదిని
శ్రీ రాజా గోడే
నారాయణ గజపతి రాయనీంగారు C. I. E.
వారి మహలులో
సంవత్సరాదియందు జరిగించిన
సంకీర్తనానంతరమందు చేసిన
ఉపన్యాసము.
====
ఏకస్య తస్యై వోపాసనయా పారత్రి క మైహికంద శుభం భవతి -
ఏకస్య = ఒక్కడైన, తస్యైవ = వానియొక్కయె, ఉపాసనయా = ఉపాసన చేత, పారత్రికమ్ = పరలోకసంబంధము కలదియు, ఐహికంచ = ఇహలోక సంబంధము కలదియును, శుభమ్ = శుభమైనది, భవతి= అగుచున్నది. 2
అనుశాసనికము.
తమేవ చార్చయ న్నిత్యం
భక్త్యాపురుష మవ్యయమ్|
ధ్యాయన్ స్తువన్ నమస్యంశ్చ
యజమాన స్తమేవచ|
లోకాధ్యక్షం స్తువవ న్నిత్యం
సర్వధు:ఖాతిగో భవేత్
అన్వయమ్-నాశములేనివాడును, నిత్యమ్-
ఎల్లప్పుడు నుండువాడును, లోకాధ్యక్షు
మ్- లోకముల కధిపతియునగు, తమేవ్-
వానినే, భక్త్యా=భక్తి చేత, అర్చయన్=
ఆర్పింపుచున్నవాడై, ధ్యాయన్=
ముసేయుచున్నవాడై, స్తువక్= స్తో
త్రము చేయుచున్నవాడై, సమస్యన్ = స్తో
త్రము చేయుచున్నవాడై, యజ
మాన:-పూజింపుచున్నవాడై.సర్వదు:ఖా
తిగకి = అన్నీదు:ఖములంగడచినవాడు, భవే
త్ = అగును.
------ .
భగవంతునియందు మనకున్న బాధ్యత
ను ఇప్పుడు కొంచెము ఆలోచింఉదము -
సమస్తసృష్టిజాల పదాధన్ ములయొ
క్క అనుభవమునిమిత్తము మన కింద్రియ్హ
ము లిచ్చినవాడును, మనస్సును బుద్ధియు
ను ఇచ్చినవాడును, వీనిని యుక్తముగా
ప్రవతిన్ంపజేసికొనుటకు మనకు వివేక
ముగూడ నిచ్చినవాడును భగవంతుడే
కదా - వానివిషయమై మన కెంతబాధ్యత
యుండవలసినది?
ఇది మనోజ్ఞానమువల్ల తెలియుటయే
కాక శాస్త్రమువల్లకూడ తెలియంబడుచు
న్నది.
-----
తస్తి, న్ప్రీతిప్తస్య ప్రిఅకార్య సాధనం
చ తదుపాసనమెవ.
తస్మిక్ = అతనియందలి, ప్రీతి:-ప్రేమయు
ను, తస్య=ఆతనియొక్క, ప్రియ్హకార్య
సాధనంచ = ప్రియమైన కార్యమును చే
యుటయును, తదుపాసనమెవ= వానియొ
క్కౌఉపాసనచేయుటయె.
భగ్ఫవద్గీతలు.
మయావేశ్య మనో యే మాం
నిత్యయుక్తా ఉపాసతే|
శ్రద్ధయా పర యోపేతా
స్తీమే యుక్తతమా మతా:||
యే మయి మన: ఆవేశ్య - ఎవారలు
నాయందు మనస్సును ఉనిచి, నిత్యయు
క్తా: పరయా శ్రద్ధయా ఉపేతాశ్చ స
న్త:యి ఎల్ల ప్పుడును సావధానముగా ప్ర
వతిన్ంపుచున్నవారును గొప్ప శ్రద్ధతో
గూడినవార్నగుచు, మాం ఉపాసతే=న
న్ను ఉపాసింపుచున్నారో, తే మే యు
క్తతమా: మతా:= వారునాకు యుక్తత
ములుగా సమంతులు.
----
ప్రెతికరములయిన కార్యములన్ సా
ధించుటయె అతని ఉపాసనమని పైవాక్య
ములో చెప్పబడియున్నది.
నాయందు మనస్సును ఉంచి ఎవ్వరు
సదా ప్రవతిన్ంపుచున్నవారో వారు నా
కు యుక్త్గతములు అని గీతలలో చెప్పబడి
యున్నది.
సమస్తసృష్టిజాలమును చేసిన భగవం
తునిచేవ్త సృజింపబడ్డ మనుష్యుడు జ్ఞా
న మివ్వబడ్డవాడు గనుక, సృష్టిలో ఒక
రికొకరు తోడుపడుటయును, అన్నిప్రాణు
లకును మనుష్యుడు సహాయము చేయు
టయును. అతనికి ప్రియకార్యసాధనమని
ఆలోచించుదము.
లోకవ్యాపారమును త్యజించి కేవల
ము భగవంతుని యెడల నే సదా ప్రవితిన్ం
పుచుండినవారలే మనుష్యులుకకు ముఖ్యస
హాయము చేయుచు వచ్చినవారు గదా -
ఋషులవల్లనేకదా మనుష్యునకు త
త్త్వజ్ఞానంబును ధమాన్ చరణోపదేశంబు
ను మొదటినుండి కలిగినవి.
పూర్వాచార్యులని ప్రసిద్ధులయినవారు
గూడ మనుష్యునకు తత్త్వజ్ఞానము కలుగు
టకు సిద్దాంతములు ఏర్పఱచియున్నవారు
గదా.
మఱియును శ్రీశంకరాచార్యులవారి వ
ల్లనేమి శ్రీ రామానుజాచార్యులవల్ల
నేమి శ్రీమధ్వాచార్యులవల్లనేమి స్థా
పింపబదిన ఆద్వైతవిశిష్టాద్వైత ద్వైతసి
ద్ధాంతములయొక్క జ్ఞానములవల్ల వ
ర్తమానములో హిందువులు ప్రవర్తింపు
చున్నారుగదా.
ఇవియును అతని ప్రియకార్య సాధన
ములే కదా.
ఇంక లౌకికులనుగుఱించిఆలోచింతము.
మనకు భగవంతుడు ఇంద్రియముల నిచ్చి
వివేకమునుగూడనిచ్చియున్నాడు.
కఠోపనిషత్తు
యస్తు విజ్ఞానవాన్ భవతి
యుక్తేన మనసా సదా !
సస్యేంద్రియాణి వశ్యాని
సదశ్వాఇవ సారధే:||
యస్తు= ఎవ్వడు, విజ్ఞానవాక్ = వివేకి
యును, సదా= ఎల్లప్పుడును, యుక్తేన
మనసా= యుక్తమైన మనస్సుతో గూడు
గొనినవాడును, భవతి=అగుచున్నాడో, త
స్య= వానియొక్క, ఇంద్రియాణి= ఇం
ద్రియములు, సారధే:= రదెహికునియొక్క,
సదాశ్వాఇవ్చ=మంచిగుఱ్ఱములవలె, వశ్వా
ని= స్వాధీనములగునవి, భవంతి= అగుచు
న్నవి.
----
ఇంద్రియములు స్వాధీనముములగుటవల్ల
ఏమికలుగుచున్నది? ధమాన్ చరణమేకదా-
సమస్తమతములును దహాన్ చరణము
నుగురించి యొక్కవిధముగానే చెప్పుచు
న్నవిగదా.
----
1 హిందూశాస్త్రము
----
1తైత్తిరీయోపనిషత్తు.
సత్యాన్న ప్రమదితవ్య్హమ్| ధమాన్ న్నప్ర
మదితవ్యమ్| కుశలాన్నప్రమదితవ్యమ్|
2 ప్రశ్నోపనిషత్తు.
స్ద్సత్య్హం వధ| సమూలోవా ఏషరిశుష్యతి
యోనృత మభివదతి||
శితైత్తిరీయోపనిషత్తు.
ధమన్ంచర| ధమాన్ త్పరంనాస్తి| ధమన్
స్సర్వేషాం భూతానాం మధు|
4 మను:
ధృతి: క్షమా దమోస్తేయం
శౌచ మిన్ద్రియనిగ్రహ;|
ధీర్వి ద్యాసత్య మక్రోధో
దశకం ధమన్ లక్షనమ్||
5 భారతము- శాంతి||
ఆక్రోధ స్సతవచనం
సంవిభాగశి క్ష్సమా తధా|
ప్రజన స్స్వేషు దారేషు
శౌచ మద్రోహ ఏవచ|
ఆజన్ వం భృత్యభరణం
నవైతే సార్వవణిన్ కా:|
6 రాఘవపురాణము
అహింసా సత్య మస్తేయం
బ్రహ్మచర్యం ప్రకీతిన్ తమ్|
ఏతాని మానసా న్యాహు
ర్వ్రతానితు ధరా ధరే
-----
2బౌద్ధ శాస్త్రము ---- 2 శాక్యబుద్ధుడు చెప్పినది| ప్రాణహరణము- వ్యభిచారము-అబద్ధమాడుట- ఒకరి వస్తువునుకాంక్షించుట-
అసూయ.ఇవిపరిహరించ తగినవి-
స్వెకరించ తగిన వేమనగా- ధమన్ ము చేయుట- సౌలభ్యము- దయ- అన్యులను తనవలె చూచుకొనుట, ఇవి స్వీకరించ గగినవి. 2 ప్రభావస్వామియనెడు జైనఋషి చెప్పినది.
పరిష్టపర్వము.
ప్రజ్భవస్వా మ్యధాచఖ్యా
వహింసా ధమన్ ఆదిమ:|
దింతనీయ శ్ముభోదర్కో
యధాత్మని తధా పరే||
----
3 చీనాదేశపు కాన్ ఫిస్ క్యుయస్
అనుఋషి చెప్పినది.
తల్లిదండ్రులయందు భక్తియుంచుము. ఆనుజమ్మలయందు ప్రేమ యుంఛుము. ఋజుమాగన్ ముగా నుండుము. నీకున్నది ఎక్కువవా సమర్పించుము. అన్యులయొక్క దుష్కమన్ మున్ బయటబెట్టకుము. నీయొక్క అధిక్యమును గురించి యెంచకుము. అన్యులయొక్క బాగునుగురించి సంతోషించుము- లోకులకు వచ్చెడి ఆపదలనుగురించి కనికరించుము. అనగా సహాయము చేయుము. పురుగులకు సయితము, బ్లకుసయితము, దినవిన్న మొక్కలకుసయితము, ఏవిధమైన హానిని చేయకుమ్-
3 జందొనస్త అనెడు
పారసీ శాస్త్రములో చెప్పినది.
----
1 శువిగానుండుటను నేర్చికొనుము- యోగ్యప్రశంసకు తగినట్లుండుము. మనస్సున మంచి తలపులు తలంచుము- వాక్కులు శుభంగా పలుకుము- కార్యములు శుభముగ జేయుము. చెడుతలంపులను పోగొట్టివేసికొనుము- చెడ్డమాటలను తగ్గించివేయుము. దుష్టకార్యములను దగ్దముచేయుము.
2. ఎవరైతే బీదవాండ్రను భోజనపదోదన్ ములిచ్చి పోషింతురో వారిని కొని యాడుదము-
3. సత్యమైన్ ఆలోచనము- సత్యము గ మాటలాడుట-సత్యముగ ప్రవర్తించుట- వీటిని బట్టి పరిశుద్దుడైన పూరుషుని కలసికొనును.
----
4 యెహూదిశాస్త్రములో
అనగా బైబిలులో పూర్వభాగములో
మోజెస్ అనెడిఘన్ దర్శి
యాత్రాపుస్తకములో వ్రాసినది.
-----
బైబ్నిలులో ఉత్తరభాగము
క్రీస్తువరి శిష్యులగు మాధ్యూఅను నాయిన
క్రీస్తువారు చెప్పినసంగతులు వ్రాసినది.
------
1 యాయం స్వశత్రూన్ ప్రతి ప్రేమకురుత- యేయుష్మాన్ శపన్తి, తానాశిషం వడత- యేయుష్మాన్ ద్విషంతి తేషాంహిత మాచరత - యేయుష్మా నపవదన్త్యుపద్రవన్తి చతేషాంకృతే ప్రాధన్ నాం క్రుత.
2. అతస్త్వయా స్వకీయోపహారే యజ్ఞ వే$దమానీతే, తనభ్రాతుర్మనసి తద్విరుద్ధా కధానిద్యతఇతి తత్రచేత్ స్మల్రసి, తర్హితత్ర స్వకీయోపహారఖ్ంయజ్ఞ వేద్యాస్సమ్ము ఖేవిహాయ యాహి- ప్రధమం స్వభ్రాత్ రాసంమిలితో భవ-తత: పరమ్మగత్య్హ స్వకీయోపహారంనివేదయ.
3.య: కశ్చిత్ తన దక్షిణకపోలే చ పేటాఘాతం కరోతి, తంప్రతూన్యతరం కపోలమపి వ్యాఘోటయ
-----
5. మహమ్మదీయి శాస్త్రమైన ఖురానులో చెప్పబడ్డది.
----
న్యాయమునకును ధర్మమునకును ఒకరి కొకరు సయాయముగ నుండుండి. మఱియును అన్యాయమునకును ఇంక అసూయకును ఒకరి కొకరు తోడుపడవలదు.
-----
మనము ఈశ్వరుని గుఱించి మిక్కిలి ప్రసన్నులమై ప్రాణిఫ్వ్యవహారమును అనుసరించి నడవలసినదే కదా.
కొసకు యోగులుగూడ ఇంద్రియవశ్యత వల్ల నేకదా భాగవద్ధ్యాన పరాఅణత కలిగి మార్గముయొక్క అంతమును అనగా విష్ణు పరమపదమును పొందుచున్నారు.
మను:
విజ్ఞాన సారధి ర్యస్తు మన: ప్రగ్రహవా న్నర:|
సొధ్వన: పారమాస్నోతి
తద్విష్ణో: అరమం పదమ్|
య: నర:- ఏ నరుడు, విజ్ఞానసారధి:- విజ్ఞానమే సారధిగాగలవాడో, మన: ప్రగ్రహవాన్ = మనస్సే పగ్గములుగాగలవాడో సవి=వాడు అధ్వన:-మగన్ ముయొక్క, పారం = అంతమును, అప్నోతి= పొందుచున్నాడు. తత్ = అదియె, విష్ణో:= విష్నువూయొక్క, ప్రమమ్= ఉత్కృష్టమైన, పదమ్= స్థానము.
------ ఇంక అతనియందు భయభక్తులతోగూడినడవలసినదిగదా. భక్తిలోనే ప్రేమయును కృతజ్ఞ తయును గూడ చేరియున్నవి. బృహన్నారదీయపురాణము.విష్ణోర్భక్తి: పరా నృణాం
సర్వపాప ప్రణాశనీ|
భక్తి మద్భి: కృతంకమన్
సఫలం స్యాన్మహీపతే
హే మహీపతే= ఓ రాజా, నృణామ్=నరులకు, విష్ణో:- అంతటవ్యాపించియున్న భగవంతునియొక్క, సర్వపాప ప్రణాశనీ=సమస్త పాపంబులను నశింపజేయు, భక్తి:=భక్తి, పరా=శ్రేష్ఠమైనది-భక్తిమద్చి:=భక్తిగలవాలచే, కృతమ్=చేయబడిన, కర్మ=పని, సహలమ్=ఫలవంతమైనది, స్యాత్ =అగును.
పునశ్చ.
యే భినద్దన్తి నామాని
హరే శ్శ్రుత్వా తిహషిన్ తా:|
రోమాంచిత శరీరాశ్చ
తేవై భాగవతొత్తమా:
యే= ఎవ్వరు, హారేశ= హరియొక్క, నా మాని= నామములను, శ్రుత్వా= విని, అతిహషిన్ తా:=మిక్కిలి సంతొషింపు చున్న వారై, రోమాఖ్చిత శరీరా:=గగుర్పాటు తోగూడిన దేహములుకలవారై, అభిన నన్దని= ఆనందింపు చున్నారో, తేనై= వారలే, బాగవతోత్తమా:=భాగవత శ్రేష్టులు.
----
ఈ పృధివిలో నొకరాజు శాసించునని భయముండి యుక్తముగ పనులు చేయుచుండగా, సర్వశాసకుడైన అతనియందు భయము మనకు లేకుండ నుంటే నెపనిని మనము యుక్తముగా చేయగలము?
కనుకనే
మహద్భయం వజ్రముద్యతం, అనిచెప్పబడి యున్నది.
అతని ప్రియ కార్యములు చేయుచునున్నప్పటికిని అతనియందు భయభక్తులు క లిగియున్నప్పటికీనిఅతనిఅర్చనయును అతనిధ్యానమును చేయుటమనకు ముఖ్యముగదా-
అందువల్ల మనము భగవంతునియందు సదా నిష్ఠకలవారమై యుండుటయే కాక అతని ప్రియకార్యములు చేయుటకు మఱియింత ప్రొత్సాఅము కలుగుచున్నది.
మఱియును మన శక్త్యనుసారముగ చేసెడి అర్చనయును ధ్యానమును ఆతనిచేనంగీకరింపబడుచున్నవనికూడ చెప్పబడ్డదిగరా-
గీతలు-
పత్రం పుష్పం ఫలంతోయం
యోమే భక్త్యా ప్రయచ్చతి|
తదహం ణ్భక్త్యు పహృత
మశ్నామి ప్రయతత్మన:||
య:- ఎవ్వడు, భక్త్యా=భక్త్యా=భక్తితోడను, పత్రం పుష్పం ఫలం తోయం మే ప్రయచ్చతి= ఆకునును పూవునును పండునును నీటి నిన నాస ఇచ్చుచున్నాడో, తస్యప్రయతాత్మన:= ఆ పరిశుద్ధమైనమనస్సు కల వానియొక్క, భక్త్యాహృతం తత్ అహం ఆశ్నామి-భక్తి చేత సమర్పింపబడిన దాని ని నేను అనుభవింఫు చున్నాను-
పునశ్చ
అనవ్యాశ్చింతయన్తో మాం
యే జవా: పర్యుపాసతే |
తేషాం నిత్యాభి యుక్తానాం
యోగక్షేమం వహామ్యహమ్||
అనన్యా: మాం చిన్త యంత: యే జనా: సర్యుపాస్దతే= అనన్యులై నన్ను చించింపుచున్న ఏజనులు ఉపాసింపుచున్నారో, నిత్యాభియుక్తానాం తేషాంయోగ క్షేమమ్-- నిత్యాభియుక్తులగు వారియొక్క యోగక్షేమములను, అహం వహామి= నేనువహింఉచున్నాను.