జయ జయ జయ ప్రియ భారత

జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ దివ్యధాత్రి దేవులపల్లి కృష్ణ శాస్త్రి రచించిన లలితగీతం.


పల్లవి :

జయ జయ జయ ప్రియ భారత

జనయిత్రీ దివ్యధాత్రి

జయ జయ జయ శత సహస్ర

నరనారీ హృదయనేత్రి ||| జయ జయ జయ |||


చరణం 1 :

జయ జయ సశ్యామల

సుశ్యామచలచ్ఛేలాంచల

జయ వసంత కుసుమ లతా

చలిత లలిత చూర్ణకుంతల

జయ మదీయ హృదయాశయ

లాక్షారుణ పద యుగళ ||| జయ జయ జయ |||


చరణం 2 :

జయ దిశాంత గత శకుంత

దివ్యగాన పరితోషణ

జయ గాయక వైతాళిక

గళ విశాల పద విహరణ

జయ మదీయ మధుర గేయ

చుంబిత సుందర చరణ ||| జయ జయ జయ |||