జయ గురు దత్త జయ గురు దత్త

శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ తెలుగు కీర్తనలు

పల్లవి:
జయ గురు దత్త జయ గురు దత్త జయ గురు దత్త జయ జయ

చరణం:
మానసంబె నీ మందిరమ్మురా మంచి నేస్తుడా మరచిపోకురా 
నీవులేనిచో గుండె కుదురులో తెరలు తేరలు గా దిగులు గుబులురా 

గుండె కోనలో కోర్కె సింహము మాటు వేశరా దూకుతుందిరా
వేటకాడా నేస్తకాడా ఆదుకోరా ఊతమీరా

గుండె బాటలో కోపమేనుగు దండు పైబడి తొక్కుతుందిరా 
దౌడూతీయగా శక్తి లేదురా దండి వీరుడా రావిదేమీరా

గుండె కోనలో కారుచిచ్చుదే కమ్ముకొచ్చెరా మోహమున్నది
నేర్పుకాడా నీవే దిక్కురా నీళ్ళు చల్లి నన్నీడ్చు కెళ్ళరా

దారిదోపిడీ దండు పడ్డది మత్సరమ్మనే మారు పేరున
పోటుగాడా ప్రోవవేమిరా నిన్నే నమ్మి నే నడచుచుంటిరా

మదము లోభము జంట పాములై వెంటనంటెరా పగబట్టెరా 
పరుగు తీసీ నే డస్సిపోతిరా ప్రాణభిక్షయే పెట్టు రమ్మురా 

శూలమెత్తితే సంహముండునా ఢక్క మ్రోగితే గజము పారదా 
శంఖమూదితే దొంగలేరిరా చక్రమేసితే పాము చచ్చురా

తెల్ల పూసల పేరు చేతిలో త్రిప్పుచుండిన సోకుగాడా 
నేస్తకాడా నీ నెమ్మి చేత నే బ్రతుక గల్గితీ బట్ట కట్టితీ 

తెల్లపూసల పేరు లోపల గల్గు కిటుకు నాకెరుక చెప్పరా
స్నేహమందునా చాటులుండునా సచ్చిదానందా జన్మమిత్రమా