జన్మే ఒక రాత్రి
శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ తెలుగు కీర్తనలు
జన్మే ఒక రాత్రి బాబు జన్మే ఒక రాత్రి శివుడని యనగా నెవడు వెలుగుల కిరణమె అతడు కిరణము మొలచెడి స్థలమేది పుటకల వెలుపల గల వేది అట్టది కిరణ మ్మెద మెదలు అంటవు దానిని తుద మొదలు అదియే రూపము చేకొనిన అభవుడు భవుడై శివుడగును జగముల మోసెడి కుండలిని ఆతని పదముల అందెయగు బహు గోళమ్ముల అంబరము ఆతని నడుమున పులితోలు జీవుల నడిపెడి త్రిపుటులను అతని త్రిశులము బలిగొనును మూలాథారపు భుజగపతి భూషణ మాతని కంఠతటి జగముల గాల్చెడి హాలాహాలం బాతని గళమున చిరుమచ్చ పగటిని రాత్రిని పాలించే రవి శశు లాతని నేత్రములు అన్నిటి తనలో కలుపుకొని అగ్నియె ఆతని పైకన్ను సెగల నదల్చెడు గంగమ్మ ఆతని శిరసున చిరుచెమ్మ లోపలి జ్ఞానపు వెలుగులకు మొలకే తలపై నెలవంక కాపున నాతడు గల రాత్రి సచిదానందపు శివరాత్రి వేది = (త్రేతాగ్నులు వుండే స్థలము) శివరాత్రి సందేశము - 1998 నుండి