చేపట్టి మమ్ము గావు
ప|| చేపట్టి మమ్ము గావు శ్రీనరసింహా నీ- | శ్రీ పాదములే దిక్కు శ్రీనరసింహా ||
చ|| చెలగువేయిచేతుల శ్రీనరసింహా | చిలికేటినగవులశ్రీనరసింహా |
సిలుగులేనిమంచి శ్రీనరసింహా | చెలి దొడెక్కించుకొన్న శ్రీనరసింహా ||
చ|| క్షీరసముద్రమువంటి శ్రీనరసింహా దైత్యు | జీరినవజ్రపుగోళ్ళ శ్రీనరసింహా |
చేరి ప్రహ్లాదునిమెచ్చే శ్రీనరసింహా నుతిం- | చేరు దేవతలు నిన్ను శ్రీనరసింహా ||
చ|| శ్రీవనితతో మెలగు శ్రీనరసింహా | చేవదీరె నీమహిమ శ్రీనరసింహా |
శ్రీవేంకటాద్రిమీది శ్రీనరసింహా సర్వ- | జీవదయాపరుడ వో శ్రీనరసింహా ||
pa|| cEpaTTi mammu gAvu SrInarasiMhA nI- | SrI pAdamulE dikku SrInarasiMhA ||
ca|| celaguvEyicEtula SrInarasiMhA | cilikETinagavulaSrInarasiMhA |
silugulEnimaMci SrInarasiMhA | celi doDekkiMcukonna SrInarasiMhA ||
ca|| kShIrasamudramuvaMTi SrInarasiMhA daityu | jIrinavajrapugOLLa SrInarasiMhA |
cEri prahlAdunimeccE SrInarasiMhA nutiM- | cEru dEvatalu ninnu SrInarasiMhA ||
ca|| SrIvanitatO melagu SrInarasiMhA | cEvadIre nImahima SrInarasiMhA |
SrIvEMkaTAdrimIdi SrInarasiMhA sarva- | jIvadayAparuDa vO SrInarasiMhA ||
బయటి లింకులు
మార్చు
అన్నమయ్య పాటలు | |
---|---|
అ | ఆ | ఇ | ఈ | ఉ | ఊ | ఋ | ౠ | ఎ | ఏ | ఐ | ఒ | ఓ | ఔ | అం | అః | క | ఖ | గ | ఘ | ఙ | చ | ఛ | జ | ఝ | ఞ | ట | ఠ | డ | ఢ | ణ | త | థ | ద | ధ | న | ప | ఫ | బ | భ | మ | య | ర | ల | వ | శ | ష | స | హ | ళ | ఱ
|