చేకొనువారికి చేరువిదే పైకొనిజీవులభాగ్యమిదే
చేకొనువారికి చేరువిదే పైకొనిజీవులభాగ్యమిదే
యేకడ జూచిన యితరము లేదు.
తలపులోన నంతర్యామిదివో
తెలిసిచూచితే ద్రిష్టంబు
చలమున దనమతి సందేహించిన కలగి మూడులోకంబుల లేడు
వెస గనుదెఱచిన విశ్వాత్మకు డిదె
దెపల నింతటా ద్రిష్టంబు
పసిగొని తను బాపములు భ్రమించిన
కసరి సృష్టి చీకటివడు నపుడే.
చేరి కొలిచితే శృఈవేంకటపతి
సారె బ్రతుకునకు శాసనము
పైరగుతనలో భక్తి వదలితే
కూరిమి తెరమఱగునకును మఱగు.
Chaekonuvaariki chaeruvidae paikonijeevulabhaagyamidae
Yaekada joochina yitaramu laedu.
Talapulona namtaryaamidivo
Telisichoochitae drishtambu
Chalamuna danamati samdaehimchina kalagi moodulokambula laedu
Vesa ganude~rachina visvaatmaku dide
Depala nimtataa drishtambu
Pasigoni tanu baapamulu bhramimchina
Kasari srshti cheekativadu napudae.
Chaeri kolichitae sreevaemkatapati
Saare bratukunaku saasanamu
Pairagutanalo bhakti vadalitae
Koorimi terama~ragunakunu ma~ragu.
బయటి లింకులు
మార్చు
అన్నమయ్య పాటలు | |
---|---|
అ | ఆ | ఇ | ఈ | ఉ | ఊ | ఋ | ౠ | ఎ | ఏ | ఐ | ఒ | ఓ | ఔ | అం | అః | క | ఖ | గ | ఘ | ఙ | చ | ఛ | జ | ఝ | ఞ | ట | ఠ | డ | ఢ | ణ | త | థ | ద | ధ | న | ప | ఫ | బ | భ | మ | య | ర | ల | వ | శ | ష | స | హ | ళ | ఱ
|