చెప్పులు కుడుతూ కుడుతూ/ఒక పురాతన తెగ

1. ఒక పురాతన తెగ

ఇరవై ఏళ్ళ క్రితం దక్షిణ భారతదేశంలోని ఒంగోలు పట్టణంలో ఒకే ఏడాది పదివేల మంది మాదిగలు క్రిష్టియన్లుగా మారారు. దానికి కారణాలేమిటా అన్న ప్రశ్న వచ్చింది. ఒకేరోజు రెండు వేల రెండు వందల యిరవై రెండు మంది బాఫ్టిజం తీసుకున్నపుడు (శ్రద్ధాళువులు పండగ చేసుకున్నారు. ఆశ్చర్యముతో కృతజ్ఞతతో నిండిపోయారు.

అయితే దానికి దారితీసిన పరిస్థితులను గురించి శ్రద్ధగా చర్చించినవారు, ఈ క్రిస్టియానిటీ మార్పిడి ఉద్యమానికి ముందుగా వచ్చిన కరువు గురించి తెలునుకొని, అదే అనలు కారణమని సరిపుచ్చుకున్నారు. మలమల మాడ్చే ఆకలికి క్రైస్తవ మతానుభవం మీద కాంక్షకూ అనులోమానుపాతమని భావించారు. కరువు గడచిపోయిన చాలాకాలం తరువాత కూడా క్రిస్టియానిటీ ప్రజా ఉద్యమం కొనసాగింది. అరవైవేల మంది మాదిగలు క్రైస్తవులుగా పరిగణించబడుతున్నారు. తెలుగుదేశంలో ఒక ప్రాంతంలోని మాదిగ వారందరూ కైస్తవులయ్యారు.

ఈ తెలుగు మాదిగల గాథలను క్రైస్తవులూ, క్రైస్తవేతరులూ చెపుతూంటే వింటూ గడిపిన కాలంలో ఈ పెంటకోన్ట్‌ సంఘటనను మరోవిధంగా చూసేవారి ప్రశ్నలను నేను పట్టించుకోలేదు. మానవ హృదయంమీద భగవంతుని ప్రత్యక్షమహిమ కోనం వెదికాను. అది నాకు కనిపించింది. అదే నమయంలో క్రైన్తవం వైవు మూకుమ్మడి మార్పిడిని సాధ్యం చేసిన ప్రత్యేక పరిస్థితులను వరిశోధించడం పట్ల కూడా శ్రద్ధ వహించాను. నాకు అవీ దొరికాయి.

జనబాహుళ్యం మనసుమీదా, మేధ మీదా దేవుని ఆత్మపనిచేసే పద్ధతిని తెలుసుకోటానికి కేవలమూ చారిత్రక విమర్శనా పద్ధతులు సరిపోవు. విశ్వాసాల పరిధికి చెందిన వాటిని వివరించటానికి, విశ్లేషించటానికి హేతువు మాత్రం సరిపోదు. “దైవశక్తి" అన్నది ఒకటి ఉంది. అలా అనుకోవటంలో భగవంతుని నిగూఢ లీలల మీద విశ్వాసం గలవాడు తృప్పిపడతాడు. అయితే సామాజిక దృష్టి కోణం నుంచి మాదిగల ఈ మతాంతరాన్ని చూసేవాడు. ఆ విధంగా తృప్తి పడడు. అధి భౌతిక శక్తులను పక్కన పెట్టినా, విశ్లేషణకూ విమర్శకూ అందని ఏదో ఒక అంశం, పరిసరాలకు నంబంగించిన (వతి ఒక అంశాన్ని తీనుకొన్నవ్చటికి మిగిలిపోతుంది. ఆ అంశం క్రీన్తు నువార్తలో నిబిడీకృతమైన దైవశక్తి.

మాదిగ పల్లెల్లో ఉన్న సంప్రదాయాలతో విసుగెత్తిన వారు హిందూ గురువుల బోధనలతో ధార్మిక నత్యాన్వేషణ కొనసాగించారు. మిషనరి ఒంగోలుకు రాకముందే అలాంటి వారు ఒంగోలు మివన్‌కు కేంద్రబిందువులయ్యారు. ఈ అంశం గమనించాక నాకు విషయం అర్ధమైనట్లు అనిపించింది. వారి యోగి గురువుల నుంచి తెలుసుకున్నదానితో బహుదైవత్వాల నుంచి ఏకైక దైవత్వం వయిపు తొలి అడుగులు వేశారు. ఇది వారి ఉన్నతమైన ఆధ్యాత్మిక కాంక్షకు నూచనే కాని, అంతకన్న ముఖ్యమైనదేంటంటే, అంతటితో వారి ఆసక్తి, దాహం చల్లారలేదు. క్రీస్తు నువార్త వారికి చేరినప్పుడు వారి హృదయాలలోని కృతజ్ఞత క్రైస్తవ ఉద్యమానికి గొప్ప ఊపునిచ్చింది.

మాదిగలను క్రైస్తవం వైపు ఆకర్షించటంలో బాగా ప్రభావితం చేసిన మరో పరిస్థితి వారి బలమైన కౌటుంబిక బంధం. వారి పునాదులను శతాబ్బాలుగా కరువులు, కాటకాలు, యుద్దాలు తుడిచివేనినా మాదిగలు ఒక తెగగా తమ ప్రత్యేకత నిలబెట్టుకున్నారు. అస్పృశ్యులు (పరియాలు)గా నెట్టివేయబడినా భారతీయ సామాజిక జీవితంలోని అనేకానేక బృందాలలో వారు ఒక బృందంగా ఉండటం ఈనాటికీ మనం గమనించవచ్చు. మాదిగ సంప్రదాయం అనే విశిష్ట నంప్రదాయం వారికి ఉంది. వారి వాడలలో స్వయం విచారణాధికారం తెగపద్ధతులకు నంబంధించినది.

ఒంగోలు మీషన్‌ తొలి దినాలలోకి వెళ్తే ఈ ప్రభావం వ్యాపించిన అనేక కేంద్రాలను నేను కనుగొన్నాను. అవన్నీ కుటుంబ కేంద్రాలే. ఈ విచిత్రమైన కొత్త మతం సంగతిని మొదటిసారి తీనుకువచ్చిన మనిషి ఫలానీ ఫలానీ మాదిగ కుటుంబానికి చెందినవాడుగా అతనిని గౌరవించి ఆలకించేవారు. ఆ తరువాత కుటుంబమంతా కలిసి ఈ మతం సత్యమైనదా, సరయినదా అని చర్చించేవారు. ఆ తర్వాత వచ్చే చిన్ని చిన్ని మత ద్వేషాలను కలిసికట్టుగా ఎదుర్శొనేవారు.

జీసన్‌ క్రీన్తును తెలుసుకొని, ఇంటికి వెళ్ళి, కుటుంబం చేత వెలియేయబడి, కొత్త మతానికి ప్రచారకులయిన వారు కూడా ఉన్నారు. వీరు తమ కుటుంబం తమతో రావాలని నిశ్చయించుకున్నవారు. కౌటింబికబంధం వారిమీద ఎంత బలమ్రైనదంటే విడిగా జీవించటమనేది అస్వాభావికంగా భావించబడేది, అరుదుగా జరిగేది.

ఇటువంటి కుటుంబ సంబంధాల ద్వారానే క్రైస్తవం తొందరగా వ్యాపించింది. సాంఘిక జీవితంలో అభివృద్ది చెందుతామన్న భావన కూడా ఇలాగే వ్యాపించింది. క్రైస్తవం వారి సామాన్య సామాజిక జీవితాలను మార్చివేయటంలో ఎంత శక్తిమంతమైనదో శూద్రులు గమనించారు. అది తెగ మొత్తానికి సామాజిక విముక్తి అని వారు అనుకున్నారు.

"ఈ మతం వల్ల వాళ్ళు బాగుపడ్డారు. మనమూ పిల్లలను చదివించి గౌరవం నంపాదించుకోవాలంటే మనకూ ఆ మతం సాయంజేస్తుంది". అనుకున్నారు శూద్రులు. ఇలా తెగల మధ్య ఉండే పోటీ స్వభావం క్రైస్తవానికి బలమైన జోడిగా పనిచేసింది. మాదిగలు నిస్సందేహంగా చాలా పురాతన జాతి. ద్రవిడుల కన్న ముందుగానే భారతదేశాన్ని నివాసం చేసుకొన్న కోలారియన్ తెగ సంతతివారు అయుండవచ్చు. దక్షిణభారతదేశంలో ఆదిమ జాతులలో మాదిగలు ఒకరు. ద్రవిడ జాతులు దపదపాలుగా వచ్చి కూడా ఉండవచ్చు. బహుశ మాదిగలు ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకున్న తొలి ద్రవిడ దండయాత్రీకులయి ఉండవచ్చు. ఈవాదానికి ఆధారంగా కొన్ని వాస్తవాలను చూపిస్తా. మాదిగల గాధలు, సంద్రాయాలలో ద్రవిడ జాతుల కుటుంబం పోలికలు కనిపిస్తాయి. వారి వాడలలో అదేవిధమయిన స్వయం నిర్ణయాధికారాలున్న ప్రభుత్వం చిన్న రూపంలోనైనా కనిపిస్తుంది. ద్రవిడ గ్రామీణ సమూహాలలో ఈ స్వయంపరిపాలనా పద్దతి ముఖ్యమైన లక్షణం. వారు ద్రవిడ జాతులకు ముందువారని చెప్పే వాదానికి ఆధారంగా నాకు ఇంతకన్న బలమైన రుజువులు లభించలేదు.

ద్రావిడులు జాతి మూలాలకు సంబంధించి మేధావులు ఒక అంగీకారానికి వచ్చి వుంటే మానవజాతి కుటుంబంలో మాదిగల స్థానాన్ని నిర్ణయించటంలో ముందుకు వెళ్ళగలిగేవారం. కాని మనకు అనేక విరుద్ధ వాదాలు ఎదురవుతున్నాయి. పుర్రె లక్షణాలను బట్టి బ్లూమెన్ బాచ్, హెకెల్ యిద్దరూ ద్రవిడులు కకేషియన్లు కారు, మంగోలియనులూ కారు. ఆ రెండు జాతుల మధ్యలోని వారు అని కనుగొన్నారు. హెకెల్వాదం ప్రకారం ద్రవిడులు దక్షిణంవైపునుంచి భారత్లోకి వచ్చారు. ప్రస్తుతం హిందు మహాసముద్రంలో మునిగిపోయిన మానవుని తొలి భూమిగా ఆయన భావించే లెమూరియా ఖండం నుంచి వచ్చారు. డాక్టర్ లోగస్ శరీరధర్మశాస్త్రం ప్రకారం ద్రావిడులలో ఇండో- ఆఫ్రికన్ మూలాలు కనుగొన్నారు. స్కితియన్స్ రాకముందే భారతదేశంలో ఓ నీగ్రో జాతి వ్యాపించి ఉండేదని ఆయన అభిప్రాయపడ్డారు. డాక్టర్ కాడ్వెల్ శాస్త్ర పరీక్షను ఉపయోగించారు. ఆయన ద్రావిడులు ఉత్తరం వేపు నించి వచ్చారని అంటాడు. ద్రవిడ భాషా చిహ్నాలు వారి మార్గాన్ని తెలుపుతాయని అంటారు. ఆర్యులకు ముందే స్కితియన్లు వచ్చారు. ద్రవిడభాషలకు స్కితియన్ భాషా సమూహాలకు దూరపు సంబంధం ఉంది. అందువల్ల ద్రావిడులు స్కితియన్ జాతివారని ఆయన వాదిస్తారు. ఏమైనా ద్రవిడుల జాతి మూలాలు పూర్తిగా నిర్ధారించబడలేదు. ఇండో ఆర్యులు శుద్ధంగా కాకేషియన్ జాతివారని పండితులు అంగీకరించారు. బహుశా క్రీ॥పూ॥3000 ప్రాంతంలో ఇండో జర్మన్ జాతిలో సంస్కృతం మాట్లాడే ఒక శాఖ ఉత్తరం నుండి భారతదేశంలో ప్రవేశించారు. ఉత్తర భారతంలో యుద్ధాలు, దండయాత్రలు వారిని ముందుకు నడిపాయి. పురాతన ఋషులు ఋగ్వేద శ్లోకాలలో వేదాలలోని యుద్ధదేవుడిని ఇలా ప్రార్ధిస్తారు - ' ఓ ఇంద్రా! నీ ఆయుధం మాటలేని దస్యులను ఛేదించుగాక! సరిగ్గా మాట్లాడలేని ప్రజలను యుద్ధంలో వధించుగాక.” ఆ తరువాత కాలంలో ఇండో ఆర్యులు దక్షిణంగా వెళ్ళడం మొదలయినపుడు వారి చేతుల్లో ఆయుధాలు లేవు, పెదాలపై ఇంద్రునికి ప్రార్ధనలు లేవు. వాళ్ళు శాంతి జిత్తులను ఉపయోగించారు. ఆర్య ఋషులు దక్షిణపు అరణ్యాలలో నివాసం ఏర్పరచుకున్నారు. ద్రవిడులకి శిక్షకులుగా, స్నేహితులుగా అయారు. పురాతన ద్రవిడుల గురించి తెలుసుకోటానికి ఈ ఆర్య ద్రవిడ సంబంధాలకు ముందు ఎలాంటి ఆధారాలు లేవు. ద్రవిడులకు గల అనేక వనరుల కారణంగా గర్విష్టులయిన ఆర్యులు వారిని నిర్లక్ష్యం చేయలేకపోవటమన్నది సందేహాతీతమైనది. అపారమైన సంపద ఉంది. భద్రమైన నగరాలలో నివశిస్తున్నారు. ఆయుధాలతో యుద్ధం చేస్తున్నారు. రాజులు పరిపాలిస్తున్నారు. అంతస్సంబంధాలు గల నాలుగు భాషలను ద్రవిడులు మాట్లాడేవారు. అవి తమిళం, తెలుగు, కన్నడం, మళయాళం. ఆర్యుల ప్రభావం పడకముందు వారికి సాహిత్యం ఉందా అన్నది సందేహాస్పదం. శుద్ధమైన భావాలలో వారు వెనకబడి ఉండవచ్చుగాని, మిగిలిన అన్ని రకాల భావాలను వ్యక్తీకరించటానికి తగినన్ని సాధనాలు వారి భాషలకు ఉన్నాయి. వారు అనుభవంమీద ఆధారపడ్డ ప్రజలు. వలస వచ్చిన ఆర్యులు ద్రవిడ భాషలను నేర్చుకోవలసి వచ్చింది. స్థానిక భాషలలో సంస్కృతపదాలను ప్రవేశపెట్టడంతో తృప్తిపడవలసి వచ్చింది. ఈ రెండు జాతుల సామాజిక వ్యవస్థలలో చాలా అంతరం ఉంది. ఉత్తరాదికి చెందిన ఆర్యులు దక్షిణాది వలసలు ఆరంభించకముందే కుల వ్యవస్థ ఆర్యులలో పాదుకొంది. హెచ్చుతగ్గులకు సంబంధించి ద్రవిడులకు తెలిసిన భేధం ఒక్కటే. పాలకులు, ప్రజలు. ఈ భేదం అన్ని ఆదిమ సమాజాలలోనూ ఉన్నదే. బలమై బ్రాహ్మణ వారసత్యం ఆర్యులదైతే ద్రవిడుల పూజారులు స్వతస్సిద్ధంగా తమ మంత్ర తంత్రాలతో అందరి మన్ననలనూ పొందినవారు. ఆర్యులు చనిపోయిన వారిని దహనం చేసేవారు. విధవలలో మనర్వివాహం నిషేధించారు. మాంసాహారాన్ని రక్తం చిందటాన్ని అసహ్యించుకునేవారు. అందుకు బదులుగా ద్రవిడులు చనిపోయినవారిని ఖననం చేసేవారు, విధవలు పునర్వివాహం చేసుకొనేవారు. అన్ని రకాల మాంసాలు తినేవారు. రక్తం చిందకుండా, మద్యం విరివిరిగా వాడకుండా వారి పండగలు జరిగేవికావు. ఈ రెండు జాతులూ కలుసుకున్న కొత్తలో వారి ధార్మిక విధానాలలో శతృత్వం ఉండి ఉండవచ్చు. కొత్తగా నివాసాలు ఏర్పరచుకొన్న బ్రాహ్మణీయులు అతిశయోక్తులు నిండిన ప్రాచీనభాషలో ఈనేక నిందలు వేశారు. " ఆస్తికులు సర్వసంగ పరిత్యాగులు అయిన ఋషుల చెవులలో భయంకరమైన శబ్దాలు చేసిన అవిశ్వాసులైన ప్రాణులు అన్నారు. ఆశ్రమ ప్రాంతాలలోని దట్టమైన అడవులలో దాక్కుని ఈ భయానకమైన ప్రాణులు భక్తులను భయపెట్టడంలో ఆనందించేవారు యజ్ఞాలు చేసేటప్పుడు వచ్చేవారు, భాండాలని, పుష్పాలని, సమిధలని ఎత్తుకుపోయేవారు. యజ్ఞ సామాగ్రిని మైలపరిచేవారు. రక్తంతో ఆహారాలను ప్రసాదాలను కలుషితం చేసేవారు అన్నారు. తెగలు, జాతుల కలయిక, సంప్రదాయాలు మత పద్దతుల సమ్మిశ్రణంతో కూడిన ఆధునిక హిందూత్వానికి అది శైశవదశ. అప్పుడు మాదిగలు వారి వంతు వారు అనుభవించారు. వారి మాతంగి సంప్రదాయంతో వారు బాగా వెనుకబడిపోయారు. వృత్తి ద్వారా చర్మకారులైన మాదిగలు అస్పృశ్య (పరియా) తెగలలో చిట్టచివరివారయిపోయారు. అయినప్పటికీ ఈనాటి వారి ధార్మిక సామాజిక ఆచార వ్యవహారాలలో వేలాది సంవత్సరాల భారతదేశపు వేళ్ళు కనిపిస్తాయి. కనక క్రైస్తవానికీ, ఈ ప్రాచీన తెగకీ తొలికలయిక చాలా ప్రత్యేకమైనది.