చీనా - జపాను/ఆధునిక జపాను

36
చీనా

లును జపానులో దూరి ఇట్టిపత్రములు వ్రాయించుకొనెను.జపానులో పాశ్చత్యవస్తువులు వర్తకము ప్రబలజొచ్చెను. జపానుకు మిగిలిన దెల్లయు జపాను జాతీయభావమే.

అంతకుముందు జపానులో అనేక సేనా నాయకులు ఒక్కొక్కభాగమున కొక్కొక్కడధిపతియై ఒకరినొకరు నరకు కొనుచుండిరి.కేంద్రప్రభుత్వమగు పోగను వంశీయులు నామకః మాత్రమే ఉండిరి. మికడో అను బిరుదముగల ఆరాజునకు జపానునాయకులపై నెట్టిచర్యలను గాని తీసుకొనుటకు సాధ్యము కాకుండెను.అయినను అతను పవిత్రమూర్తిగా మాత్రము భావింపబడుచుండెను.కామోడోరుపెర్రీ చర్యల తరువాతను జపానులో ఒక అపూర్వ చైతన్యముదయించెను.మికాడోకు తిరిగీ పూర్ణాధికార మిాయబడెను.అతని జండాక్రింద నిలబడి విదేశీ ప్రభుత్వ ముల నెదురుకొనుటకు తక్కిన నాయకులెల్లరును నడుము కట్టుకొనిరి.దీనినే మొయిజీ శకము అందురు.ఇది 1865 తో ప్రారంభమాయెను.రాచరికముతో పాటు పాశ్చాత్యప్రాతినిధ్య రాజ్యాంగక్రమము కూడ ప్రతిష్ఠించబడెను. ఇప్పటి నుండియే జపానులో పారిశ్రామికవిప్లవము కూడా ప్రారంభమై దినదినాభివృద్ధి పొందజొచ్చెను.

పారిశ్రామికాభివృద్ధితో పాటు కార్మికుల కష్టములు కూడ పెరిగెను.పాశ్చాత్యదేశముల శుశ్రూషచేసి పరిశ్రామిక నైపుణ్యమును చేపట్టి ఉత్పత్తి నెక్కువచేసెనే గాని, ఈ ఉత్పత్తి కార్మికుల నెక్కువ కష్టపెట్టి తక్కువ కూలులిచ్చి
జపాను

హింసించుచుండుట వల్లనే సాధ్యమయ్యెనని పెక్కురితలంపు.పారిశ్రామికముగ మాత్రమే జపాను అభివృద్ధి పొందెను కాని వ్యావసాయకముగ మునుపటిస్థితిలోనే ఉండెను.వ్యవసాయకుల కష్టములు తగ్గలేదు, రాబడి హెచ్చలేదు.జపానులో తయారైన వస్తువులను కొనుక్కొని అనుభవించుటకు జపాను కార్మికకర్షకులకు సాధ్య ము కాదాయెను.ఈసరుకంతయు విదేశముల కెగుమతి కావలసినదే.విదేశపు మార్కెట్టులన్నియు పాశ్వాత్య ప్రభుత్వముల వశమునందుండెను.ఐరోపాయుద్ధము ధర్మమా అంటూ వాటి విజృంభణము పూర్తిగా చల్లరినప్పటి నుండియు జపానుసరుకు పరదేశములకు యెక్కువగా యెగుమతి కాజొచ్చెను.కాని లాభములు భాగ్యములు అన్నియును వర్తక జాతులకే తప్ప కర్షక కార్మికులకు యెక్కువగా లేకుండెను.కూలులు యెక్కువచేసీ చేయ డములో వారి లాభములు కూలి వారిపరిశ్రమలు మూలపడక మానవు,జపాను బాగుపడుటకెల్లయు కారణము తక్కువ కూలులిచ్చి యెక్కువ వస్తువు తయారుచేసి ఇతర దేశములకంటె సరుకును విదేశపుటంగళ్ళలో చౌకగా అమ్మి వాటిని గుత్తగొనుటయే కనుక జపాను కర్షకకార్మికులకు బాగుపడేయోగము లేదన వచ్చును.జపాను కీర్తిలో తాముకూడాభాగస్వాములమే యను గర్వము ఉంటున్నన్నాళ్ళు వారు దారిధ్యముతో నీల్గగలుగుదురు. కాని వర్గచైతన్యముదయించిన తరువాత ఇదిసాధ్యముకాదు.జపానులో వర్గ చైతన్యము కూడ ఉదయించినది.

37
38
చీనా

వారు కల్లబొల్లి బోధనలతో ఊరకొనకున్నారు.సోవియట్టు సిద్ధాంతములు వారి తలలకు కూడ యెక్కుచున్నది.

జపానుకు పారిశ్రామిక విప్లవముతో పాటు విదేశములతో రంధికూడా యేర్పడినది.లంకాషైరు వర్తకము క్షీణించు ట వలన బ్రిటనుకు జపానుపై ఈర్ష్య పొడమినది.ఇరాకు, టర్కీ, పెర్షియా, కెన్యా, ఉగండా, రాష్ట్రములు జపాను వస్తువులనే కొనుట వలన బ్రిటిషు ఈర్ష్య మరియును వర్థిల్లినది.మెక్సికోలో కూడా జపానువస్తువులే ప్రాకుట వలన అమెరికాకు జపాను యెడల క్రోధము జనించినది.జపాను యెక్కడవెళ్లితే అక్కడ విదేశముల జండాలు ఎగురుచుండెను.జపాను జండాకూడా విశాలప్రపంచములో యెగురకున్నచో ఈ అంగళ్ళు దాని స్వాధీ నములో ఉండవు.ఈ విధముగా జపానుకు సామ్రాజ్యపిపాస జనించినది.ఇందుకై సైన్యవేద్ధి, నౌకావృద్ధి, వైమా నిక వృద్ధి చేసుకొనవలసి వచ్చినది. లాభములు గూబలలోనికి వచ్చినవి.ఆదా అయిన ధనమంతయు ఇందు కొరకే వ్యర్థమగుచున్నది.జపానుకు విదేశప్రభుత్వములతో నీవానేనాయను పరాక్రమముతో డీకొనగలశక్తి వచ్చిన దన్నమాట తప్ప మరేమియును మిగులకున్నది.నౌకాపరాక్రమములో గ్రేటుబ్రిటను, అమెరికా సంయుక్త రాష్ట్ర ము లతో సమానమైన స్థానము జపానుకు లభించిన నేమిగాక,ఇందుకై యెంత ధనము, జనము వమ్మగు చున్నదో ఊహింపవచ్చును.
జపాను

సైబేరియాలో ఒకప్పుడు జపాను సేనలు మిక్కుటముగ దిగినను, వానిని తిరిగీ తీసుకొని పోవలసి వచ్చెను. చీనాలో టనాకా గవర్నమెంటు పలుకుబడి హెచ్చి జపానుద్వేషము ప్రబలి జపానుదాడి ధిక్కరించబడుచున్నది. కొరియాలో జపాను ప్రతికూలతత్వము ప్రబలి జపాను కేప్టను నాకామూరా సంహరింపబడెను.దీనితో జపాను యుద్ధదాహము మరింత ప్రబలెను.యుద్ధము తప్ప ఈకార్యములను చక్కచేయగల సాధనము వేరేలేదని అది నిశ్చయించుకొనెను.చీనా జపాను రెయిల్వే కాన్ఫరెన్సు పుసికి పోవుటనే ఒకమిషగా తీసుకొని అది మరింత సైన్యవృద్ధి చేసుకొనెను.

మంచూరియా ఆక్రమణమునకది కంకణము కట్టుకొనెను. ఇందుకై జపానుకైన సైనికనావిక వ్యయములు 1930-31లో 442.8 మిలియను యెన్నులు.తరువాతి సంవత్సరములో ఈ వ్యయము 4546,697.2, 851.8, 937.3 గా పెరిగి 1935-36లో 1023.0యెన్నులాయెను.1934-35 లో జపాను చేసిన అప్పులు కాక ఆదాయములో నూటికి 70 వంతులు ఇందుక్రిందనే ఖర్చయ్యెను.ఇట్లే ప్రతి సంవత్సరమును అగుచుండె ను.పాశ్చాత్యపూంజీదారు ప్రభుత్వములో ఉన్నంత ప్రజాభిప్రాయగౌరమైనను జపానులో లేదు. అక్కడ సైన్యాధికారు లేదిచెపితే అదేమాట, ఎంత అడిగితే అంత ఇయ్యవలసినదే.ఈ విషయములో ఇటలీ,జర్మనీ ప్రభుత్వములను మించికూడ జపాను ఫ్యాసిస్టు అగుచున్నదనుటకు సందేహము లేదు. 40
చీనా-జపాను

జపాను సేనానయకు లెల్లరును పూర్వపుసామురేయి తరమునకు చెందినవారు.జపానుకు కొన్ని విజయములు కలిగేదాకా వీరు బ్రిటిషు సామ్రాజ్యముతో స్నేహముగా ఉండిరి.1904-5 సంవత్సరములో రష్యాపైని విజయము కలిగిన తరువాత జపాను ముక్కనులు తెరచి యేపాశ్చాత్యప్రభుత్వమును లక్ష్యము చేయక తనధీమా మిాదనే తాను వర్తించుచున్నది.దీనికంతటికిని కారణము జపాను ప్రభుత్వము యొక్క 30కేబినెట్టులలోను 11 మిలిటరీ ప్రధానుల(ప్రైముమినిష్టరులు)క్రిందను తక్కిన 19 సివిలు ప్రధానుల క్రిందను నుండుటయే.

జపానులో పార్టీలు
“ధనమూల మిదం జగత్” అని సామెత ఏ ప్రభుత్వము, పార్టీ, పరిశ్రమ, నావలు, సైన్యములు వర్థిల్లవలె నన్నను ధనము ప్రధానము.ఈధనము బ్యాంకుల ఆధీనము.ఈధనయుగములో బ్యాంకులు చేయలేని పని లేదు. ఒకచీటీ వ్రాస్తే యేపనిపడితే ఆపని అగును.ఏపలుకుబడి కావలస్తే ఆపలుకుబడి, పరపతి కలుగును. జపానులో రెండు ప్రధాన రాజకీయ పార్టీలు ఉన్నవి.ఒకటి మిన్సిటో, ఇంకొకటి సియూకాయ్‌, మొదటిదానికి మిట్సూయీ బ్యాంకు, రెండవ దానికి మిట్సుబీషి బ్యాంకు మూలాధారములు.మిట్సూయూ బ్యాంకు మూడు ధనవత్కుటుంబముల చేతులలో ఉన్నది.జపానులోగల పట్టు, ప్రత్తి, బొగ్గు, నూనె, చక్కెర యంత్ర
జపాను

ములు,వర్తకముల కన్నిటికి వీరు పెట్టుబడి దారులు, ఇతర పరిశ్రమలు,వానిలో ముఖ్యముగా నౌకానిర్మాణ పరిశ్రమ కంతటికిని మిట్సుబీషీ బ్యాంకు పెట్టుబడిదారు.మరిమూడు చిన్న బ్యాంకులును ఇవ్వియును కలసి సాన్వాబ్యాంకు అనుపేరిట ఒక సమ్మేళన బ్యాంకు లేక అమాల్గమేటెడు బ్యాంకుగా ఉన్నవి.

1928 లో వయోజన ప్రాతినిధ్యమేర్పడిన తరువాత ఈరెండు బ్యాంకులును ధనమును విరాళములను విరజల్లి నియోజకవర్గము నంతటిని స్వాధీనము చేసుకొనినవి.ఇవి రెండును ధన ప్రధానములైన పార్టీలే.కాని ధనాధి కారమునకు కూడ ఒకమితమున్నది.ఒక భయంకర పార్టీలేస్తే అది దానికి తలయొగ్గక తప్పదు.జపానులో ఇట్టి టెర్రరిష్టు పార్టీలెన్నో ఉన్నవి.వీటికి కూడా సామురేయి వంశీకులే నాయకులు.వీరు మధ్యయుగము నాటి ఫ్యూడలు ప్రభువుల సంతతి వారు.జెన్యోషా సంఘము(నల్ల సముద్రము సంఘము)1879 ప్రాంతమున కొరియా, మంచూరియా ఫిలిపైను దీవులలో రహస్యముగా యేజంట్లను పెట్టి పనిచేసి ఆదేశమును స్వాధీనము చేసుకొనుటలో కొంత సఫలమైనది.1901 ప్రాంతములో టోయామా అనునతడు కొకూరు యూకేయి,అనేక కాళసర్ప సంఘమును సృష్టించి రష్యాపై విజయమునకు దారి చూపించినాడు.వీరి యేజంట్లు చీనా, ఆఫ్గనిస్తానను, ఫిలిపైనులు, మంచూరియాలలో పని చేయుచుండిరి.మరియొక పార్టీ

41
42
చీనా-జపాను
సేనలలోతిరిగి వారికి దేశాభిమానము నూరిపోయుచున్నది.1931 నాటికి వీరిసంఖ్య 27,60,000 వీరుకాక జపాను రిజర్విష్టు సంగమని యింకటున్నది. వీరు జపానులోని బౌద్ధమతావేశపరుల సహాయముతో జపాను సామ్రాజ్యతత్వము పైని చక్రవర్తి పైని వీరత్వముతోకూడిన పూజ్యభావమును కుదుర్చుచున్నారు.ఓదోగికాయ్‌, డెయినిప్పను, కొకుసుకేయి మొదలగు సంఘములు జపానులో కార్మిక విప్లవ భావములు కలుగకుండా ప్రచారమును ప్రారంభించుచున్నవి.కొందరు పార్లమెంటు సభ్యులు వీనిలి సంస్థాపకులు.డేనినిప్పను సంఘము కార్మికులను పూంజీదారులకును స్నేహము గూర్చుటకై సియూకాయి పార్టీవల్ల స్థాపించబడినది.వేరెట్టి హత్యలు దోపిడులు క్రౌర్యములు చేసినను వీరికి శిక్షలుండవు.ఇవన్నీ జపాను ప్రభుత్వ సంరక్షణమునకై ఒనరించ బడి నవి.తోచినంత మాత్రమున చాలును.విశ్వవిద్యాలయములు వామపక్షములు చెలరేగకుండుటకై దోహదము చేయుచున్నవి.ఇటువంటి సంఘములు నేడు 600 ఉన్నవి.శ్రీమంతులు, భూస్వాములు, సేనానాయకులు అందరును వీరికి సహాయము చేయుచుందురు.ఈవిధమైన భయంకర సంఘముల కన్నింటికిని యేదోయొక రీతిని విప్లవ ప్రతికూల ధన్యాధ్యమిత వాదజాతీయ సంస్థలతోను మనుష్యులతోను సంబంధముండనేయున్నది.
జపాను
ఈ కారణము వలన జపాను జాతీయతా సంఘట్టనకు, గౌరవభంగమునకు, సైన్యవిజృంభణమునకు, ఆశా పోషణమునకు భంగకరమైనట్లు అనుమానము కలిగించిన యెందరో ధీమంతులు, రాజకీయవేత్తలు, కమ్యూని ష్టులు, చివరకు సేనానులుకూడ రహస్యముగ వధించబడిరన్న ఆశ్చర్యమేమి! వాషింగ్టను ఒడంబడిక వీరి కిష్టము లేదు గనుక హారా అనునతడు వధించబడెను.లండను నేవల్‌ కాన్ఫరెన్సు తీర్మానము వీరి కిష్టము లేదుకనుక హామాగూచీయనునతడు వధించబడెను.జాతిసమితితో స్నేహముగానుండి లొంగిపోవుచున్నారను అనుమానముచే ఇనూకాయ్‌మినోయే అనువారలు వధింపబడిరి.మంచూకోలో యుద్ధపన్నాగము లేమిా వద్దని జనరల్‌ నాగాటా అనాడట.ఇందువల్ల లెప్టినెంటు కర్నలు అయిజవా అతనిని వధించెను.ఈ కర్నలును విచా రణకు తెచ్చిరి.ఈవిచారణకు వామపక్షము వారందరూ ఇష్టముగా ఉండిరి.దక్షిణపక్షము వారికిది యిష్టము లేదు.అయినను వామపక్షము లేక యెడమపక్షము గనకే యెన్నికలలో విజయమువచ్చి వారి క్యాబినెట్టు స్థాపించబడినది.దక్షిణపక్షము లేక కుడుపక్షము వారును వారికి చెందిన యువక ఉద్యోగ సంఘము వారును, రక్తసమితి(లీగు ఆఫ్‌ బ్లడ్)వారును రహస్యముగా కుట్రలు పన్ని ఈ క్యాబినెట్టులోని ముగ్గురను వధించిరి. ఒకనికి అపాయకరమగు గాయముచేసిరి, ప్రధానియగు ఓకాడాయనుకొని అతని బావమరదిని చంపివేసిరి;గనుక ఓకడా మాత్రము మిగిలి 44
చీనా-జపాను

పోయెను. ఇదియంతయు, 1936 ఫిబ్రవరి 26 వ తేదిని జరిగినది.వీరు టోకియో ఆయువుపట్టుల నన్నింటిని మూడుదినములు స్వాధీనమునందుంచుకొనిరి.తరువాత ప్రభుత్వమునకు లొంగిపోయినను, వీరి షరతుల నన్నింటిని క్రొత్త ప్రధాని అంగీకరించిన తరువాతనే క్రొత్త క్యాబినెట్టు యేర్పడినది.జపాను ప్రభుత్వము వరుస ఈరీతిని ఉండును.

ఇవిగాక కొన్ని సక్రమాభివృద్ధి సంఘములు లేకపోలేదుకాని ఇవిలేచిన వెంటనే అణగ ద్రొక్కబడుచున్నవి. సేనుకాటయామా 1897 లో రైల్వే లేబరుయూనియనును స్థాపించి ఒకగొప్ప సమ్మెకట్టు నడిపించెను గాని 1900లో ట్రేడు యూనియను లెచ్చటను ఉండారాదని ఒక పోలిసు చట్టము ప్యాసు చేయబడెను.1912 లో టోకియా ట్రాము పనివారలు, గనుల పనివారలు, ఓడలపనివారలు, అచ్చాఫీసు పనివారలు, పడవప పని వారలు సమ్మెలుకట్టి కొంత విజయము నందిరి.1918 లో వ్యవసాయపు పనివారలు కూడా తిరగబడిరి.ఈ విధముగా ప్రజాఉద్యమములు కూడా జపానులో చెలరేగు చున్నవి.కాని గవర్నమెంటువారి చర్యలవల్లను, కుడి యెడమపక్షనాయకుల భేదాభిప్రాయముల వల్లను ఇవి బలవంతము కాజాలకున్నవి.అయినను 1932 జపాను ట్రేడు యూనియను కాంగ్రసు లెక్కెల ప్రకారము చూచిన యెడల నూటికి 79 గురు కార్మిక సంఘములవారు కాంగ్రెసులో నున్నట్లే తెలియుచున్నది.అయినను జపాను కార్మికులలో
జపాను

నూటికి పదిమంది యైనను అసలు కార్మిక సంఘములలోనే చేరలేదు.సోషలుడెమోక్రటికు పార్టీ, జపాను సోషలిష్టు పార్టీలలో మొదటిది స్థాపించబడిన వెంటనే అనగా 1891లోను, రెండవది స్థాపించబడిన మరుచటి సంవత్సరములో అనగా 1907 లోను అణగత్రొక్కబడినవి.1912లో స్థాపించబడినను అయికాయి సంఘము కొంత స్నేహసంప్రదాయముతో వర్తించుచున్న కారణమున అసలే అణగత్రొక్కబడకుండా కాస్త కొనయూపిరితో జీవించుచున్నది. 1936 ఫిబ్రవర్లో స్థాపితమైన మిన్సీటీ పార్టీ ప్రభుత్వములో ప్యాసిష్టు ప్రతికూల పక్షమువారు 204గురు ఉండగా అప్పొజిషను పక్షమువారు 174 గురు ఉన్నారు.ప్యాసిష్టులకు ప్రతికూలముగా వోటులిచ్చిన కొందరిమిాద బాంబులుకూడా విసరబడినవి.

జపానులో యేపక్ష ప్రభుత్వమటు ఉండనీ, అది సైన్యమునకు కావలసిన ఖర్చుల నన్నిటినీ చెల్లించుచుండ వలసినదే.వాణిజ్యమంత్రులందరూ, యుద్ధ, నావికా, మంత్రుల చేతులలో కీలు బొమ్మలు.జపానులో అన్నిటి కంటెను ప్రధానమగు పరిశ్రమ,యుద్ధపరికరముల పరిశ్రమయే, కనుకనే వారిధాటీ ఈరీతిని చెల్లుచున్నది.

45