చిరస్మరణీయులు, మొదటి భాగం/మౌలానా ముహమ్మద్ హసన్
91
37. మౌలానా ముహమ్మద్ హసన్
(1851-1920)
ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామంలో ఉలేమాలు ఎంత అద్వితీయమైన పాత్ర పోషించారో ఆ తరువాత కూడా జాతీయోద్యమంలో అంత మహత్తర భాగస్వామ్యాన్ని అందించిన ఉలేమాలలో SHAIK-UL-HIND గా ఖ్యాతిగాంచిన మౌలానా ముహమ్మద్ హసన్ గణనీయులు.
ముహమ్మద్ హసన్ 1851లో ఉత్తర ప్రదేశ్‌లోని సహరనపూర్ జిల్లా బరేల్లి (Bareilly) లో జన్మించారు. తండ్రి మౌలానా జుల్పికర్ అలీ. స్వగ్రామంలో ప్రాథమిక విద్య పూర్తిచేసిన మహమ్మద్ హసన్ దేవ్‌బంద్‌లోని దార్-ఉల్-ఉలూం ప్రథమ విద్యార్థిగా చేరి తన అసాధారణ ప్రతిభ ద్వారా 1871లో ఆ విద్యాలయంలోనే ఆచార్యులయ్యారు. ఆ తరువాత 1888లో ప్రధానాచార్యునిగా పదోన్నతి లభించగా తన 75 రూపాయల జీతంలో 25 రూపాయలను విద్యాసంస్థ అభివృద్ధి నిధికి అందచేశారు.
బ్రిటిషర్ల బానిసత్వం నుండి మాతృభూమిని విముక్తం చేయాలన్న అంతర్గత లక్ష్యంతో ఏర్పడిన దార్-ఉల్-ఉలూం మహమ్మద్ హసన్ నేతృత్వంలో సమర్థులైన విముక్తి పోరాట సైనికులను తయారుచేసే కృషిని ఆరంభించి, పలు ఇతర సంఘాలను, సంస్థలను వివిధ ప్రాంతాలలో ఏర్పాటు చేసింది.
చిరస్మ రణయులు 92
1911 నుంచి అంతర్జాతీయ రాజకీయాలలో వచ్చిన మార్పుల నేపథ్యంలో తమ పధకాలను అమలు పర్చేదుకు మౌలానా హసన్ ఉద్యుక్తులయ్యారు. భారతదశ వాయవ్య సరిహద్దు ప్రాంతాలలోని గిరిజన ముస్లింల ద్వారా దాడిని ఆరంభించి, స్వదేశంలోని ప్రజలు, భారతీయ సైనికులను తిరుగుబాటుకు పురికొల్పాలని నిర్ణయించారు. ఈకార్యకలాపాలకు దేవబంద్‌ను కంద్రస్థానం చేసుకుని, డిల్లి, దినాపూర్, అమ్రోబ్, కరంచీ,ఛేదా, చకాల్, కాబూల్‌లలో శాఖలను ఏర్పాటు చేశారు. ఆ లక్ష్య సాధనకు బ్రిటిష్‌వ్యతిరేక శక్తుల నుండి సహాయం పొందేందుకు ప్రయత్నాలు ఆరంభించారు.
ఆ ప్రయత్నాలలో భాగంగా 1915లో తన శిష్యులు మౌలానా ఒబైదుల్లా సింధీ నాయకుడిగా ఒక ప్రతినిధి బృందాన్నిఆఫ్గనిస్థాన్ పంపి ఆ తరువాత 1916లో తానూ మక్కాకు పయనమయ్యారు. మక్కా చేరుకున్న ఆయన టర్కీ గవర్నర్ గాలిబ్‌పాషాను కలసి తన పథకాన్ని వివరించి సానుకూలత సాధించారు. బ్రిటిష్ సైన్యంలోని, భారతీయులను తిరుగుబాటుకు ప్రోత్సహిస్తూ గాలిబ్ రాసిన లేఖలు గాలీబ్ నామా గా చరిత్ర ప్రసిద్ధి పొందాయి. ఈ సందార్భంగా తిరుగుబాటును ప్రోత్సహిస్తూ సిల్క్ వస్త్రం మీదఇండియాకు పంపిన వర్తమానం కాస్తా సిల్క్ గుడ్డ కుట్రగా ఖ్యాతిగాంచింది.
మౌలానా ఆంతర్యాన్ని పసిగట్టిన ఆంగ్లేయులు ఆయనను నిర్బంధించి సుమారు నాలుగేండ్ల తరువాత 1920లో విడుదల చేశారు. మౌలానా హసన్ స్వదేశానికి రాగానే ఖిలాఫత్-సహాయ నిరాకరణోద్యామంలో ప్రవేశించి క్రియాశీలక పాత్ర పోషించారు. ఆక్రమంలో1920 అక్టోబర్ 29న అలీఘర్‌లో జాతీయ విస్వవిద్యాలయం (జామియా మిలియా ఇస్లామియా) శంఖుస్థాపన గావించారు. 1920 నవంబర్‌లో డిల్లీలో జరిగిన Jamiath-ul-Ulema సమావేశంలో ఉలేమాల నుద్దేశించి ప్రసంగిస్తూ, సామ్రాజ్యవాదా శక్తులకు వ్యతిరేకంగా మహోదృతంగా ఉద్యమించమని పిలుపునిచ్చారు.
భారతదేశంలోని ముస్లింలందరూ జాతీయోద్యమంలో పాల్గొనాలని, సహాయ నిరాకరణ ఉద్యమంలో చురుకైన పాత్రను నిర్వహించాలని, మతాల ప్రసక్తి లేకుండాభారతదశంలో నివశిస్తున్న వారంతా ఒక్కటేనన్న భావనతో కలసికట్టుగా బ్రిటిష్ పాలకులను తరిమివేసేందుకు సాగుతున్న జాతీయోద్యమంలో పాల్గొనాల్సిందిగా కోరుతూ ఉలేమాల ద్వారా మౌలానా ఫత్వా జారీ చేయించారు. ఆ క్రమంలో అనారోగ్యాన్ని కూడా లెక్క చేయక ఉద్యమ కార్యకలాపాలలో అవిశ్రాంతంగా పాల్గొనటం వలన ఆరోగ్యం మరింత క్షీణించి 1920 నవంబరు 30న మౌలానా ముహమ్మద్ హసన్ కన్నుమూశారు.
సయ్యద్ నశీర్ అహమ్మద్