చిరస్మరణీయులు, మొదటి భాగం/టిటూ మీర్
31
7. టిటూ మీర్
(1782-1832)
భారతావనిలో వలసవాదుల పాలన ప్రారంభమైన నాటినుండి బ్రిటిష్ శక్తులకు వ్యతిరేకంగా పలు తిరుగుబాట్లు జరిగాయి. ఈ పోరాటాల చరిత్రలో ప్రత్యేక స్థానం పొందిన వహాబి ఉద్యమానికి సమరశీలత జోడించి, చివరకు స్వాతంత్య్ర సమరంలో భాగంగా సాగిన పలు పోరాటాలకు ప్రేరణగా నిలచిన కార్యశారులు టిటూ మీర్.
బెంగాల్‌లోని నర్కేల్‌బరియా ప్రాంతంలోని హెదర్ పూర్ లేక చాంద్‌పూర్ లో 1782లో టిటూమీర్ జన్మించారు. తల్లి పేరు రొఖయాబి. తండ్రి పేరు మీర్ నిస్సార్ అలీ. సన్నకారు రైతు కుటుంబం. చిన్నతనంలో వస్తాదుగా పేర్గాంచిన ఆయన కుస్తీ పోటీలలో పాల్గొంటు మంచి వస్తాదు గా ఖ్యాతిగడించారు. పలు చిన్న చిన్న ఉద్యోగాలు చేశారు.1823 ప్రాంతంలో మక్కాను సందర్శించిన ఆయన ఇండియాలో వహబి ఉద్యమ వ్యవస్థాపకు లు సయ్యద్ అహమ్మద్ బరేల్వీని, ఫరాజి ఉద్యమ నిర్మాత హాజీ షరియతుల్లాను మక్కాలో కలిశారు. ఈ ముగ్గురు నాయకుల కలయిక బ్రిటిషర్లకు వ్యతిరేకంగా వహాబీ- ఫరాజీ ఉద్యమ స్రవంతులు పోరుబాటన ఉదృతంగా సాగటానికి ఉపయోగపడింది.
మక్కా నుండి తిరిగి వచ్చాక నర్కేల్‌బరియా దగ్గర గల హైదర్‌పూరులో స్థిరనివాసం ఏర్పాటు చేసుకుని, ధార్మిక ప్రచారం కోసం పర్యటనలు గావించిన టిటూ మీర్ ఈస్ట్
చిరస్మ రణయులు 32
ఇండియా కంపెనీ అధికారులు, జమీందారులు-మహాజనులు ప్రజల మీద సాగిస్తున్న అకృత్యాలను, దోపిడీని స్వయంగా చూశారు. ప్రజల ఆక్రందనలు విన్నారు. ఆ సమస్యల పరిష్కారం కోసం, దోపిడీ శక్తుల అట కట్టించేందుకు నిర్ణయించుకున్నారు. ఆ క్రమంలో శుద్ధ ధార్మిక ప్రచారంతోపాటుగా ప్రాపంచిక సమస్యల పరిష్కారం కోసం, పరాయి పాలకుల పెత్తనాన్ని తుడిచి పెట్టేందుకు టిటూమీర్ నడుంకట్టారు.
ఆ దిశగా ఉద్యమించిన టిటూమీర్ జమీందారుల దౌర్జన్యాల మీద ధ్వజమెత్తారు. క్రూరులైన జమీందారులకు మద్దతుగా నిలుస్తున్నఆంగ్లేయులను, పోలీసు -సైనిక బలగాలను సాయుధంగా ఎదాుర్కొన్నారు. ఈ మేరకు ప్రజల పక్షంగా పలు పోరాటాలకు ఆయన స్వయంగా నాయకత్వం వహించారు. ఈ కార్యకలాపాల నిర్వహణ కోసం పటిష్టమైన ప్రత్యేక వ్యవస్థలను కూడా ఏర్పాటు చేశారు. పలు ప్రభుత్వ కచ్చేరీల మీద, గడ్డం పన్ను అంటూ ముస్లింలను వేధించిన జమీందారుల ప్రాసాదాల మీద దాడులు జరిపారు. తొలిదశలో ఆచార సాంప్రదాయాలను అవమానపర్చారన్నకసితో జరిగిన దాడులు ఆ తరువాత దిశను మార్చుకున్నాయి. ఈ దాడులలో ఆంగ్లేయ సైన్యాలు, పోలీసు బలగాలు టిటూమీర్ అనుచరుల శౌర్యప్రతాపాలు, తెగువ ముందు నిలువలేక పరాజయాన్ని అంగీకరిస్తూ పలుమార్లు పలాయనం చిత్తగించాయి.
ఈ విజయాలతో ఆత్మవిశ్వాసం పెరిగిన టిటూమీర్ అనుచరులు ఆంగ్లేయాధి కారులకు తమ దాడుల సమాచారం ముందుగా తెలిపి మరీ వచ్చి ప్రభుత్వ కచ్చేరీల మీద, జమీందారుల మీద దాడులు నిర్వహించారు. ఈ చర్యల మూలంగా మతాలతో సంబంధం లేకుండా అన్ని మతాల, వర్గాల, పేద ప్రజానీకం వేల సంఖ్యలో ఆయన వెంట నడిచారు. ఆ కారణంగా భారీ సంఖ్యలో బలగాలు చేకూరటంతో, కార్యకలాపాలు మరింతగా విస్తరిచటం, శతృవు నుండి ప్రమాదం పొంచి ఉండటంతో, అనుచరులకు ఆశ్రయం కల్పించేందుకు నర్కేల్‌బరియాలో వెదురు కర్రలతో కట్టుదిట్టమైన కోటను నిర్మించుకున్నారు. అక్కడ సహచరులకు సాయుధ శిక్షణ కల్పించి సుమారు దశాబ్దం పాటు ఆంగ్లసైన్యాలను ఎదుర్కొంటూ కంపెనీ పాలకులను ఖంగుతిన్పించారు.
చివరకు 1831 నవంబర్ 19న, పోరాట ప్రవీణులుగా ఖ్యాతిగాంచిన ఆంగ్లేయ సైన్యాధికారులు భారీ బలగాలలో, ఆయుధాలతో అన్నివైపుల నుండి నర్కేల్‌బరియాలోని వహాబీల కోటను ముట్టడించగా శతృసైన్యాలతో వీరోచితంగా పోరాడుతూ తీవ్రంగా గాయపడి కుప్పకూలిపోయిన టిటూమీర్ చికిత్స పొందుతూ 1832వ సంవత్సరం ఆరంభంలో కన్నుమూశారు.
సయ్యద్ నశీర్ అహమ్మద్