చిరస్మరణీయులు, మొదటి భాగం/ఖాన్‌ బహదూర్ ఖాన్‌

57

20. ఖాన్‌ బహదూర్ ఖాన్‌

(1787- 1860)

మాతృభూమిని పరాయి పాలకుల కబందహస్తాల నుండి విముక్తం చేసేందుకు తిరుగుబాటు శంఖారావం పూరించి, హిందూ-ముస్లిం ఐక్యసంఘటనతో స్వతంత్ర పాలన ఏర్పాటు చేసి, స్వాతంత్య్రోద్యమ చరిత్రలో సుస్థిర స్థానాన్ని సొంతం చేసుకున్న స్వదేశీ పాలకులలో రొహిల్‌ఖండ్‌ అధినేత ఖాన్‌ బహదూర్‌ ఖాన్‌ది ప్రత్యేక స్థానం.

ఆనాడు హిందూ-ముస్లింల ఐక్యతకు ప్రతీకగా నిలచిన ఖాన్‌ బహదూర్‌ ఖాన్‌ 1787లో జన్మించారు. బ్రిటిషర్లు కల్పించిన అధికార పదవిని వదులుకొని సుమారు 70 సంవత్సరాల వయస్కుడైన ఖాన్‌సాబ్‌ రణరంగ ప్రవేశం చేసి, 1857 మే 31న రోహిల్‌ఖండ్‌ రాజధాని బరేలిలో స్వతంత్ర బావుటాను ఎగురవశారు. రొహిల్‌ ఖండ్‌లోని ప్రజానీకమంతా ఏకమై ఖాన్‌ నాయకత్వంలో స్వతంత్ర పాలనకు ప్రాణ ప్రతిష్ట చేసి కంపెనీ పాలకులు, అధికారులను నట్టికరిపించారు.

ఈ సందార్భంగా రోహిల్‌ ఖండ్‌ ప్రజలను ఉద్దేశించి ఖాన్‌ బహదాూర్‌ మ్లాడుతూ భారతదేశ ప్రజల్లారా! అని సంబోధించటం చరిత్ర సృష్టించింది. మన పవిత్ర సాfiతంత్య్ర దినోత్సవం ఉదాయించింది. ఇంగ్లీషు వారు మోసాలకు పాల్పడవచ్చు. ముస్లింలకు వ్యతిరేకంగా హిందాువులనూ, హిందాువులకు వ్యతిరేకంగా ముస్లింలనూ రెచ్చగొడతారు. చిరస్మ రణయులు: 58

ముస్లింలారా ! మీరు పవిత్ర ఖురానును గౌరవిస్తున్నట్టయితే, హిందువుల్లారా ! మీరు గోమాతను ఆరాధిస్తున్నట్టయితే, మీలోని స్వల్ప విభేదాలను మరచి ధర్మయుద్ధంలో చేతులు కలపండి. ఒకే పతాకం కింద పోరాడండి. మన హిందూస్థాన్‌ మీద ఆంగ్లేయుల పెత్తనం సృష్టించిన మరకలను మీ రక్తంతో శుభ్రం చేయండి, అంటూ తన రాజ్యంలోని హిందూ-ముస్లిం జనసముదాయాలకు ఆయన పిలుపునిచ్చారు.

స్వతంత్రతకు ప్రతీక అయినటువంటి ఆకుపచ్చ జెండా రోహిల్‌ఖండ్‌లో రెపరెపలాడటం చూసి ఆంగ్లేయులు అదిరిపడ్డారు. మాతృ దేశాభిమానులైన రోహిల్లా ప్రజానీకం జాతి, మత ప్రసక్తి లేకుండా ఏకగ్రీవంగా ఖాన్‌ బహదూర్‌ ఖాన్‌ను తమ అధినేతగా అంగీకరించారు. అత్యంత నిజాయితీపరుడిగా ఖ్యాతిగాంచిన శోభారాం ప్రదాన మంత్రిగా, బ్రిటిష్‌ సెన్యంలోని స్వదేశీ సైనికులచే తిరుగుబాటు చేయించిన కార్యసాధకుడు మహమ్మద్‌ భక్త్‌ ఖాన్‌ సేనానిగా ప్రజా సముదాయం సమక్షాన బాధ్యతలు స్వీకరించారు. ఈ త్రయం ఎంతో దూరదృష్టితో, చక్కని అవగాహనతో, అద్వితీయ ధైర్యసాహసాలతో ప్రజలకు చక్క ని పాలనను అందచేస్తూ రోహిల్‌ఖండ్‌ వాసుల హృదయాలను చూరగొంది.

బరేలి రాజధానిగా రోహిల్‌ఖండ్‌ స్వతంత్య్ర రాజ్యాన్ని పషం చేసు కున్నాక హిందూ, ముస్లింల ఐక్యత కోసం ఖాన్‌ బహదూర్‌ ఖాన్‌ పలు చర్యలు చేపట్టారు. ప్రజానీకం మత మనోభావాలను గౌరవిస్తూ ముస్లింల పర్వదినాన హిందూ సోదరుల మనోభావాలను గౌరవిసూ, గోవుల ఖుర్బాని నిషేధించారు. ఖాన్‌సాబ్‌ స్పూరితో ముస్లింలకు వ్యతిరేకంగా హిందువులను మభ్యపెట్టి, రెచ్చగొట్టి, డబ్బు సంచులతో ప్రజల దేశభక్తిని కొనుగోలు చేసేందుకు ఆంగ్లేయులు సాగించిన ప్రయ త్నాలను ప్రజానీకం త్రిప్పికొట్టారు .ఈ విషయాన్ని స్వయంగా ఆంగ్లేయాధికారులే తమ నివేదికలలో పేర్కొన్నారు.

చివరకు అపార సెనిక బలగాలతో ఆంగేయ సెన్యాధిపతు లు బరేలిని చుట్టు మ్టుారు . ప్రజల మద్దాతుతో ఖాన్‌ చివరి నిమిషం వరకు పొరాడి, గత్యంతరం లేని పరిస్థితులలో కొద్దిపాి సైన్యంతో 1858 మే 5న బరేలీ నుండి నేపాల్‌ అడవుల్లోకి తప్పుకున్నారు. చివరకు ఆంగేయుల అనుకూలుడు నేపాల్‌ పాలకుడు జంగ బహుదాూర్‌ రోహిల్లా నేతను బ్రిీషర్లకు అప్పగించగా, విచారణ జరిపి ఖాన్‌కు, ఆయన తోపాటుగా తిరుగుబాటులో పాల్గొన్న 243 మందికి ఉరిశిక్ష విధించారు. ఆ శిక∆లను బరేలీలోని బ్రిీష్‌ కమీషనర్‌ పాత కార్యాలయం ఆవరణలో గల పెద్దా మర్రిచెట్టు వద్దా 1860 మార్చి 20న ఏకకాలంలో నిర్వహించడంతో సహచరులు, అనుచరులతోపాటుగా ఖాన్‌ బహదాూర్‌ ఖాన్‌ మా తుజేౌ సలాం అంటూ మాతృభూమిలో ఐక్యమయ్యారు.

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌