చర్చ:శ్రీ వివేకానంద సాహిత్య సర్వస్వం

తాజా వ్యాఖ్య: యూనికోడ్ మూలాల చేర్పు టాపిక్‌లో 5 సంవత్సరాల క్రితం. రాసినది: Arjunaraoc

శ్రీ వివేకానంద సాహిత్య సంపద కాపీరైటు సందిగ్ధం మార్చు

 Y సహాయం అందించబడింది

వివేకానందుని సంపూర్ణ సాహిత్యం ఆంగ్ల వికీసోర్సులో ఇక్కడ అందుబాటులో ఉంది. The Complete Works of Swami Vivekananda . అంటే వివేకానందుని సాహిత్యమంతా కాపీరైట్ గడువులు తీరి జనస్వామ్యంలో స్వేచ్ఛానకలు హక్కులతో ఉన్నయి. వీటిని ఎవ్వరైనా పంచుకోవచ్చు, లేదా ముద్రించచ్చు, వాణిజ్యపరంగా ఉపయోగించుకోవచ్చు. వీటి తెలుగు అనువాదము రామకృష్ణ మఠము 'లేవండి మేల్కొనండి' పేరిట నాల్గు వేల పుటలతో పది సంపుటాలను వెలువరించింది. వారి తక్కిన అన్ని ప్రచురణలలోనూ కాపీరైట్ గమనికలు ఉన్నను, , 'లేవండి , మేల్కొనండి' గ్రంధమునకు ఎటువంటి కాపీరైట్ గమనికలు వాడలేదు. అదీ కాక అసలు మూలం జనస్వామ్యంలో స్వేచ్ఛాహక్కులతో వుంది. కనుక ఒక చారిత్రక వ్యక్తి యొక్క బోధనలు మనం వాడవచ్చు. నేను ఆ గ్రంథాన్ని యూనికోడ్ లోకి దాదాపుగ మార్చడం పూర్తైనది. కనుక ఈ విషయమునపై మీ మీ అభిప్రాయాలను తెల్పగోరుచున్నాను.( గమనిక : అర్జున, Rajasekhar1961 , మొద. ) -- దామోదర (చర్చ)

చాలా గొప్ప విషయాన్ని తెలియజేసినందులకు ధన్యవాదాలు. కాపీహక్కుల గురించి "లేవండి, మేల్కొనండి" గ్రంథము గురించి రామకృష్ణ మఠము వారితో చర్చించి నిర్ధారణ చేసుకొంటే నేను మీకు సహాయం చేయగలను. వాడుకరి:Pavan santhosh.s తో కూడా ఈ విషయమై చర్చించండి.--Rajasekhar1961 (చర్చ) 06:31, 9 మార్చి 2017 (UTC)Reply
Rajasekhar1961 వాడుకరి:Pavan santhosh.s గారూ , నిర్ధారణకు ఎక్కడ సంప్రదించాలో నాకు తెలియడం లేదు. ఒక ప్రచురణ సంస్థ నకలు హక్కుల గమనికను ముద్రించకపోవడమనేది అన్ని సందర్భాలలో జరగదు.. అదీకాక స్వేచ్ఛాహక్కులు కల మూలానికి అనువాదం. కనుక అంగీకరించవచ్చని నమ్మకం ఉంది. వారిని ఎలాగైనా సంప్రదించి వివేకానందుని సాహిత్యాన్ని స్వేచ్ఛాహక్కులతో అందుబాటులో ఉంచడం ఎందుకు ఆవశ్యకమో, ఎందుకు ఉపయోగకరమో వివరించగలిగితే మంచిగ ఉంటది. ఈ విషయంలో మీలో ఎవరైనా వారికి అందుబాటులో ఉన్నవారు సహాయం చేయగలరు. నేను వారిని చరవాణి, ఈమయిల్ ద్వారా సంప్రదించుటకు ప్రయత్నిస్తాను. దామోదర (చర్చ) 16:19, 9 మార్చి 2017 (UTC)Reply
ఈ విషయం గురించి నేను పవన్ తో చర్చించాను. అతను మీకు మైల్ ద్వారా సంప్రదిస్తాడు. పవన్ కు వికీ నియమాల గురించి మంచి అవగాహన ఉన్నది. మరియు పెద్ద పెద్ద సంస్థలతో మాట్లాడే విధానం మీద అతను శిక్షణ పొందాడు. కాబట్టి మీరిద్దరూ కలసి రామకృష్ణ మఠము వారితో వ్యక్తిగతంగా మాట్లాడితే బాగుంటుంది. వికీసోర్స్ లో వివేకానందుని సంపూర్ణ సాహిత్యం అందించడంలో నేను తప్పకుండా సహాయం చేయగలను. మీ చొరవకు ధన్యవాదాలు.--Rajasekhar1961 (చర్చ) 07:12, 14 మార్చి 2017 (UTC)Reply
దామోదర గారికి, మూలకృతి నకలుహక్కులు తీరినా, అనువాదానికి వేరే నకలుహక్కులు అనువాదకర్తకి చేరివుంటాయి. వాటిని గురించి కనుక్కొని ముందు పని మొదలుపెట్టవచ్చు.--అర్జున (చర్చ) 05:29, 24 జూన్ 2017 (UTC)Reply
దామోదర గారికి, https://archive.org/search.php?query=creator%3A%28%E0%B0%B5%E0%B0%BF%E0%B0%B5%E0%B1%87%E0%B0%95%E0%B0%BE%E0%B0%A8%E0%B0%82%E0%B0%A6%29%20AND%20collection%3A%28digitallibraryindia%29 లో వివేకానంద పుస్తకాలున్నాయి. ఇటీవలి కాపీరైట్ల గురించి చర్చ పర్యవసానంగా DLI పుస్తకాలు తెలుగు వికీసోర్స్ లో చేర్చటం కొనసాగిస్తున్నాము. గమనించండి. సందేహాలుంటే అడగండి.--అర్జున (చర్చ) 05:52, 24 డిసెంబరు 2018 (UTC)Reply

యూనికోడ్ మూలాల చేర్పు మార్చు

నమస్తే. వివేకానంద సాహిత్య సర్వస్వ మూలాలను యూనికోడ్ లో కింది గిట్ హబ్ ప్రాజెక్ట్ లో చేర్చాను. [[1] పుస్తకాలు_pdfs ఫోల్డర్ నందు కలవు. అన్ని పుటల html మూలాలు కలవు. ప్రతి పుటనందు తర్వాత, ముందు పుటలకు లంకెలు కూడా ఇవ్వబడ్డాయి. వరుస విరుపులు (line breaks) కూడా ఎందుకైనా భద్రపరచబడ్డవి. వాటిని తీసివెయ్యాలంటే -&nbsp;<BR> ను తొలగించి, ఆ తర్వాత &nbsp;<BR> ను స్పేస్ తోటి పునఃస్థాపించండి. ఇక <FONT> తోకలు కూడా వాడబడ్డాయి. వాటిని ఉపయోగించి విభాగాలను నిర్ణయించవచ్చు.

ఈ పేజీలనుండి వివిధ సంపుటాలను, ఆ సంపుటాలలో వివిధ గ్రంధాలను(భక్తి యోగం, జ్ఞానయోగం, మొదలగు) , వాటిలో వ్యాసాలను విభాగీకరించవలసి ఉన్నది. ఆ పని బహుశా వికీసోర్స్ లో గుంపు అందరం కలసి చేయవచ్చు. దామోదర (చర్చ) 07:10, 28 మార్చి 2017 (UTC)Reply

దామోదర మీ వ్యాఖ్య నేను ఇంతవరకు గమనించలేదు. పాఠ్యీకరణ చేయడానికి తెలుగు వికీసోర్స్ మెరుగని తలుస్తాను. మీరు తెలుగు వికీసోర్స్ గురించి తెలియక గిట్హబ్ లో ప్రారంభించారేమో తెలియదు. వికీసోర్స్ లో మీ కృషి కొనసాగిస్తారని ఆశిస్తాను.--అర్జున (చర్చ) 05:56, 24 డిసెంబరు 2018 (UTC)Reply
అర్జున గారూ.. గిట్ హబ్ నందు, యూనికోడ్ లోకి మార్చబడినల్ మూలాలు ఉంచబడ్డాయి. అవి అంతకు మునుపు నాన్ యూనికోడ్ ఖతిలో ఉన్న pdf నుండి సృజించబడ్డాయి. వాటిని వికీసోర్స్ లోకి ఏదైనా బాట్ ద్వారా ఎక్కించగలరు... దామోదర (చర్చ) 08:49, 22 మార్చి 2019 (UTC)Reply
@దామోదర మీరు సూచించిన పుస్తకము డిఎల్ఐ స్కాను లో కనబడలేదు. కావున మీరు దాని హక్కుదారుల అనుమతి తీసుకుంటేనే వికీసోర్స్ లో చేర్చగలుగుతాము. --అర్జున (చర్చ) 09:32, 22 మార్చి 2019 (UTC)Reply
Return to "శ్రీ వివేకానంద సాహిత్య సర్వస్వం" page.