చర్చ:శ్రీ రామాయణము

తాజా వ్యాఖ్య: 4 సంవత్సరాల క్రితం. రాసినది: దేవీప్రసాదశాస్త్రి

శ్రీ రామాయణము లిప్యంతరీకణ ను ప్రారంభించిన వాడుకరి:Ramesam54 గారికి, కొనసాగిస్తూ త్వరితగతిన పూర్తిచేయడానికి ప్రయత్నిస్తున్న దేవిశ్రీ, రామమూర్తి గార్లకు ధన్యవాదాలు. పుస్తక విభజన ఒక పద్ధతిలో ఉండడానికి ఒక లాజిక్ ఉంటే బాగుంటుంది. ప్రధానమైనది శ్రీ రామాయణము మొదటి స్థాయిగా అనుమతిస్తే కాండము రెండవ స్థాయిగా చేస్తే బాగుంటుందని నా అభిప్రాయము. (బాలకాండము లో అయోధ్యాకాండము ఉపవిభాగంగా బాగలేదు) సభ్యులు వారివారి ఆలోచనలు తెలియజేయమని మనవి.--Rajasekhar1961 (చర్చ) 06:46, 12 డిసెంబరు 2020 (UTC)Reply

రాజశేఖర్ గారికి, మీరు చెప్పినది సమంజసమే. దస్త్రాన్ని ఎక్కించినప్పుడు ఇచ్చిన పేరువల్ల ఈసమస్య. శ్రీరామాయణం - బాలకాండము అన్న సూచికని శ్రీరామాయణము - మొదటిసంపుటము అని మారిస్తే ఈసమస్య పరిష్కరింపబడుతుంది. అప్పుడు లింకు శ్రీరామాయణం కి మాత్రం ఇస్తే సరిపోతుంది. రెండవసంపుటము సూచికను చూడండి.--దేవీప్రసాదశాస్త్రి (చర్చ) 07:11, 12 డిసెంబరు 2020 (UTC)Reply

అసలు ఈగ్రంథం పేరు శ్రీరామాయణమే కాదు. గ్రంథకర్త ప్రకారం - వాల్మీకిరామాయణము. శ్రీ అన్నది సరస్వతీమహల్ వారు చేర్చిన గౌరవార్థకం.--దేవీప్రసాదశాస్త్రి (చర్చ) 07:18, 12 డిసెంబరు 2020 (UTC)Reply

శ్రీ రామాయణము - మొదటిసంపుటము/పీఠిక శ్రీ రామాయణము - మొదటిసంపుటము/బాలకాండము శ్రీ రామాయణము - మొదటిసంపుటము/అయోధ్యాకాండము File names should be changed thus.--దేవీప్రసాదశాస్త్రి (చర్చ) 07:35, 12 డిసెంబరు 2020 (UTC)Reply

శ్రీ రామాయణము - మొదటిసంపుటము తయారుచేసి; పేర్లు మార్చాను.ఒకసారి చూడండి.--Rajasekhar1961 (చర్చ) 12:23, 13 డిసెంబరు 2020 (UTC)Reply

ఇప్పుడు సరిపోయింది.--దేవీప్రసాదశాస్త్రి (చర్చ) 23:16, 13 డిసెంబరు 2020 (UTC)Reply

ఇందులోని మిగిలిన మూడు సంపుటాలను కూడా ఇలాగే మార్చాను. అయితే వీటికి సంబంధించిన Introduction, పీఠిక, విషయసూచిక లను వేరువేరుగా ఉంచాలా లేదా అనేది సమస్య. మీ విలువైన అభిప్రాయాన్ని తెలుపండి.--Rajasekhar1961 (చర్చ) 01:38, 14 డిసెంబరు 2020 (UTC)Reply

పీఠిక, విషయసూచికలు వేరేగానే ఉండాలి. --దేవీప్రసాదశాస్త్రి (చర్చ) 02:16, 14 డిసెంబరు 2020 (UTC)Reply

పూర్తిచేశాను. ఇక Introduction అన్ని సంపుటాలకు ఓకటే సమాచారమున్నదా వేరువేరుగా ఒకసారి చదివి నిర్ధారించాలి. అలాగే తప్పొప్పుల పట్టిక విషయం కూడా ఆలోచించండి.--Rajasekhar1961 (చర్చ) 06:00, 14 డిసెంబరు 2020 (UTC)Reply

నాలుగుపీఠికలలో కామన్ ఎలిమెంట్స్ లేవు. నేను పూర్తిగా చదివాను. తప్పొప్పులపట్టిక అనవసరం. సవరణలు డిజిటల్ ఎడిషన్ లో ఇన్కార్పొరేట్ చెయ్యడం అవసరం. అయోధ్యాకాండంలో కొన్నిపుటలు నేను సరిచేశాను. మిగిలినవికూడా చేస్తాను.--దేవీప్రసాదశాస్త్రి (చర్చ) 06:05, 14 డిసెంబరు 2020 (UTC)Reply

Preface కూడా ప్రతిసంపుటానికి ప్రత్యేకంగా ఉంది. ఇంక చెయ్యవలసిన మార్ప లేవీ లేవనుకుంటాను. Good Job!--దేవీప్రసాదశాస్త్రి (చర్చ) 06:10, 14 డిసెంబరు 2020 (UTC)Reply

Introduction ప్రథమసంపుటంలో మాత్రమే ఉంది.--దేవీప్రసాదశాస్త్రి (చర్చ) 06:19, 14 డిసెంబరు 2020 (UTC)Reply

I have incorporated all the errata into the main text. Yuddhakandamu requires further proofreading. Too many errors overlooked.--దేవీప్రసాదశాస్త్రి (చర్చ) 05:36, 15 డిసెంబరు 2020 (UTC)Reply

Return to "శ్రీ రామాయణము" page.