చర్చ:వికీపీడియాలో రచనలు చేయుట

తాజా వ్యాఖ్య: అభివృద్ది చేయ విజ్ణప్తి టాపిక్‌లో 1 సంవత్సరం క్రితం. రాసినది: Kasyap

ఆంగ్లరూపంలో తాజా మార్పులకు సహాయం మార్చు

 
రూపం 9, డిసెంబర్ 16, 2013

,

ఈ రూపం 7, 12 డిసెంబర్ 2013 విడుదలైనదానిపై ఆధారపడింది. ఆంగ్ల ప్రతి మొబైల్ మార్పులు, సభ్యుల అభిప్రాయాలు లాంటి ఇంకా నాలుగు పేజీలతో తాజాగా విడుదలైంది. దానిలోగల కొత్త విషయాలు చూడండి. ఈ మార్పులు చేయాలంటే దీనిలో వాడిస సభ్యుల స్పందనలు కావాలి. అ‌వి సంబంధిత పేజీ .యొక్క చర్చలో రాయండి. ఆలాగే కొత్త పేజీలకు బొమ్మలు, పాఠ్య అనువాదం ఈ చర్చా పేజీలో రాయవచ్చు. --అర్జున (చర్చ) 09:12, 19 డిసెంబరు 2013 (UTC)Reply

బొమ్మలలో దోషాన్నిసరి చేశాను. భాస్కరనాయుడు గారి పుటపేజీలో స్పందనకు ధన్యవాదాలు.--అర్జున (చర్చ) 12:54, 21 డిసెంబరు 2013 (UTC)Reply
  • విశ్వనాధ్.బి.కె. గారి లాగానే నాకు అనిపించి WMFవారికి తెలిపాను. వారి ఇది ఖరారు చేశామని, మన తెలుగుప్రతికి మనకిష్టమైనది పెట్టుకోమని రాశారు. ఇక తెలుగు ప్రతి రూపలావణ్యం చేసేవారు కంప్యూటర్ కు మరియు ముద్రణాప్రతికి మెరుగైన రంగు ఎంపిక చేస్తే బాగుంటుంది. --అర్జున (చర్చ) 06:41, 23 డిసెంబరు 2013 (UTC)Reply

పుస్తకం శీర్షిక మార్చు

వికీపీడియాలో రచనలు చేయుట అనే శీర్షిక వికీపీడియాలో రచనలు చేయుట ఎలా? .... అని వుంటే బాగుండదా? ఎందుకంటే శీర్షిక అనగా అందులోని విషయం కొంత అవగహన కలిగించడమే గదా? --Bhaskaranaidu (చర్చ) 11:47, 21 డిసెంబరు 2013 (UTC)Reply

ఆంగ్లంలో Contributing to Wikipedia తో ప్రారంభమై తెలుగు రూపాంతరము ప్రారంభించిన తరువాత Editing Wikipedia గా మార్చారు. శీర్షిక క్లుప్తంగా వుండటం మంచిది. ఆంగ్లం ప్రశ్నార్ధకము వాడలేదు. ఆంగ్లముతో సాధ్యమైనంత దగ్గరిగా వుండటానికి ప్రస్తుతమున్న శీర్షికను నేను ఇష్టపడుతున్నాను. అధికశాతం సహసభ్యులు Bhaskaranaidu గారు ప్రతిపాదించిన దానికి మద్దతిస్తే మార్చటానికి నాకు అభ్యంతరము లేదు.--అర్జున (చర్చ) 03:51, 22 డిసెంబరు 2013 (UTC)Reply

పదాలు వాటి అర్థాలు మార్చు

ఈ రచనలో అనేక కొత్త తెలుగు మాటలు వున్నాయి. వాటి అర్థాలు చాల మందికి తెలియక పోవచ్చు. నామటుకు నాకు కొన్నిటి అర్థాలు తెలియడం లేదు.... కాకపోతే తెవికీ తో వున్న అనుభవంతో..... సందర్భాన్ని బట్టి అర్థం చేసు కుంటున్నాను. కొత్తవారికి ఇవి చాల వరకు అర్థం కావేమోనని అనిపిస్తుంది. కనుక, వ్యాసం చివరలో ఇందులో వాడిని పదాల పట్టికతో వాటి అర్థాలు (వివరంగా)కూడ చేర్చితే ఈ రచనకు మరింత పరిపూర్ణత కలుగు తుందని నా వ్వక్తిగ అభిమతం. ఇటువంటి అమరిక బయట మనం అక్కడక్కడా చూస్తుంటాం. ఎందుకంటే చిరకాలము ఇది మనందరికి ఒక handbook లా ఉపయోగ పడగలదు. ఈ రచన అన్ని విధాల చాల పరిపూర్ణంగా వున్నది. Bhaskaranaidu (చర్చ) 11:47, 21 డిసెంబరు 2013 (UTC)Reply

మీరు పేర్కొన్న పదాలు తెలియచేస్తే వాటిని చర్చించి చివరిపేజీలో చేర్చటం గాని లేక ఎలెక్ట్రానిక్ కాపీలో అదనపు పేజీలుగా వుంచటం కాని చేయవచ్చు. ముద్రణ ప్రతికి పేజీల పరిమితి వుంటుంది కాబట్టి, పుస్తకాన్ని మరీ పెద్దదిగా చేయలేము. --అర్జున (చర్చ) 03:53, 22 డిసెంబరు 2013 (UTC)Reply

ముద్రణ ప్రతి కి కావలసిన మెరుగైన ఛాయచిత్రాలు మరియు వికీ కృషికి వివరణ మార్చు

 
ఆంగ్లంలో విడుదలప్రతి

రహ్మానుద్దీన్ గారు ఆంగ్ల ప్రతిలో (ప్రక్కన చూపించినట్లు) లాగా దాదాపు 18 మంది వికీపీడియా సభ్యుల ఛాయాచిత్రాలు చేర్చవచ్చని నాకు ఫోన్ ద్వారా తెలిపారు. అందుకని ఇప్పటికే ఎంపికైన వారితో పాటు, కొలరావిపు విజేతలను కూడా చేర్చాలన్నా సలహాకు నేను సమ్మతించాను. అందువలన తెలుగు ప్రతి తయారీ కొరకు ఇప్పటికే ఎంపికైన సభ్యులు మరియు కొలరావిపు 2013 విజేతల నుండి వారి మెరుగైన ఛాయాచిత్రాలతో పాటు వికీలో కృషి చేయటానికి వివరణ కావాలి. రెండు మూడురోజులలో ఆ వివరాలు ఈ వ్యాఖ్యకు స్పందనగా చేర్చమని కోరుతున్నాను.--అర్జున (చర్చ) 05:09, 10 జనవరి 2014 (UTC)Reply

వైజాసత్య

నేను 2005 నుండి స్వచ్ఛందంగా వికీపీడీయాలో పనిచేస్తున్నాను. తెలుగు కంటే ఆంగ్లంలో బాగా పట్టు ఉన్నా, మాతృభాషపై అభిమానంతో స్థానిక వికీపీడియాలోనే ఎక్కువగా వ్రాస్తుంటాను. మంచి పరిశోధనాత్మక వ్యాసాలు వ్రాయటం ఇష్టం. మరుగునపడిపోయిన వ్యక్తులు, ఘటనల గురించి వెలికితీసి అందరికీ అందించటం నాకు సంతృప్తినిస్తుంది. అందుకే సాధారణంగా విస్మృత చారిత్రక వ్యక్తులను నా వ్యాసాలకు వస్తువులుగా ఎంచుకుంటూ ఉంటాను. వృత్తి రీత్యా పరిశోధకున్ని, ప్రవృత్తి రీత్యా శోధకున్ని. ఇవి రెండూ కలిసి నన్ను వికీపీడియన్ను చేశాయి.

ఈపబ్ లో లోపాలు మార్చు

  1. మూలంలో మీడియావికీ శీర్షికలు (== ==) వాడినందున మరియు వాటికి అధ్యాయాలు లేనందున పనిచేయటంలేదు.
  2. కేలిబ్రె లో fullstop బదులు చిన్న పెట్టె గుర్తు వస్తున్నది. (అన్ని తెలుగుఈ పబ్లకుబగ్ నమోదు చేశాను).-- moon+ రీడర్ ఆండ్రాయిడ్ లో సరిగానే వున్నది. calibre 2.54 లో సరిగానే వున్నది.అర్జున (చర్చ) 12:10, 12 ఏప్రిల్ 2016 (UTC)Reply
యాంకర్ వాడటంతో మరియు calibre నవీకరించడంతో పై సమస్యలు పరిష్కరించబడ్డాయి. --అర్జున (చర్చ) 10:36, 13 ఏప్రిల్ 2016 (UTC)Reply

అభివృద్ది చేయ విజ్ణప్తి మార్చు

2013 తరువాత చాలా మీడియా వికీ ద్వారా చాలా మార్పులు జరిగినవి, ఈ పుస్తకం చాలా స్వాగత సందేశాల్లో గైడుగా సూచించ బడుతున్నది, కావున గౌరవ రచయితలు నవీకరించగలరు నేనూ సహకరించగలను. Kasyap (చర్చ) 09:27, 19 జూలై 2022 (UTC)Reply

Return to "వికీపీడియాలో రచనలు చేయుట" page.