చదువులోనే హరిని
ప|| చదువులోనే హరిని జట్టిగొనవలెగాక | మదముగప్పినమీద మగుడ నది గలదా ||
చ|| జడమతికి సహజమే సంసారయాతన యిది | కడు నిందులో బరము గడియించవలెగాక |
తొడరి గాలప్పుడు తూర్పెత్తక తాను | విడిచి మఱచిన వెనక వెదకితే గలదా ||
చ|| భవబంధునకు విధిపాపపుణ్యపులంకె | తివిరి యిందునే తెలివి తెలుసుకోవలెగాక |
అవల వెన్నెలలోనే అల్లునేరే ళ్లింతే | నివిరి నిన్నటివునికి నేటికి గలదా ||
చ|| దేహధారికి గలదే తెగనియింద్రియబాధ | సాహసంబున భక్తి సాధించవలెగాక |
యిహలను శ్రీవేంకటేశుదాసులవలన | వూహించి గతిగానక వొదిగితే గలదా ||
pa|| caduvulOnE harini jaTTigonavalegAka | madamugappinamIda maguDa nadi galadA ||
ca|| jaDamatiki sahajamE saMsArayAtana yidi | kaDu niMdulO baramu gaDiyiMcavalegAka |
toDari gAlappuDu tUrpettaka tAnu | viDici marxacina venaka vedakitE galadA ||
ca|| BavabaMdhunaku vidhipApapuNyapulaMke | tiviri yiMdunE telivi telusukOvalegAka |
avala vennelalOnE allunErE LliMtE | niviri ninnaTivuniki nETiki galadA ||
ca|| dEhadhAriki galadE teganiyiMdriyabAdha | sAhasaMbuna Bakti sAdhiMcavalegAka |
yihalanu SrIvEMkaTESudAsulavalana | vUhiMci gatigAnaka vodigitE galadA ||
బయటి లింకులు
మార్చుచదివి బతుకరో సర్వజనులు కదిసి నారాయణాష్టాక్షరమిదియే
సాధించి మున్ను శుకుడు చదివినట్టిచదువు వేదవ్యాసుడు చదివిన చదువు ఆదికాలపువైష్ణవులందరినోటిచదువు గాదిలి నారాయణాష్టాక్షరమిదియే
సతతము మునులెల్ల చదివినట్టిచదివు వెతతీరా బ్రహ్మ చదివిన చదువు జతనమై ప్రహ్లాదుడు చదివినట్టిచదువు గతిగా నారాయణాష్టాక్షరమిదియే
చలపట్టి దేవతలు చదివినట్టిచదువు వెలయ విప్రులు చదివిన చదువు పలుమారుశ్రీవేంకటపతినామమై భువి గలుగు నారాయణాష్టాక్షరమిదియే
cadivi batukarO sarvajanulu kadisi naaraayaNAShTAkSharamidiyE
saadhimci munnu SukuDu cadivinaTTicaduvu vEdavyaasuDu cadivina caduvu aadikaalapuvaiShNavulaMdarinOTicaduvu gaadili naaraayaNAShTAkSharamidiyE
satatamu munulella cadivinaTTicadivu vetatIrA brahma cadivina caduvu jatanamai prahlAduDu cadivinaTTicaduvu gatigaa naaraayaNAShTAkSharamidiyE
calapaTTi dEvatalu cadivinaTTicaduvu velaya viprulu cadivina caduvu palumaaruSrIvEMkaTapatinaamamai bhuvi galugu naaraayaNAShTAkSharamidiyE
/2011/02/annamayya-samkirtanalutatwamulu_6433.html
అన్నమయ్య పాటలు | |
---|---|
అ | ఆ | ఇ | ఈ | ఉ | ఊ | ఋ | ౠ | ఎ | ఏ | ఐ | ఒ | ఓ | ఔ | అం | అః | క | ఖ | గ | ఘ | ఙ | చ | ఛ | జ | ఝ | ఞ | ట | ఠ | డ | ఢ | ణ | త | థ | ద | ధ | న | ప | ఫ | బ | భ | మ | య | ర | ల | వ | శ | ష | స | హ | ళ | ఱ
|