చంద్రగిరి
స్వర్ణముఖీ నదీ ప్రావాహక మార్గంలో ఉన్న హిమనగము, చంద్రనగములు ఉన్నాయి. హిమనగమును ఒరుసుకుంటూ స్వర్ణముఖీనది ప్రవహిస్తుండగా చంద్రనగము లోయలో చంద్రగిరి పేరుతో జనావాసము ఏర్పడింది.
చరిత్ర
మార్చు10వ శతాబ్ధం వరకు ఈ నగర చరిత్ర లభ్యం కావడం లేదు. కార్వేటి రాజు ఇమ్మడి నరసింహయాదవరాయలు ముందు నారాయణవరం రాజధానిగా చేసుకుని పాలనసాగించాడు. అక్కడ బలమైన కోటనిర్మాణానికి అవకాశం లేదు కనుక ఆయనకు తృప్తి కలుగలేదు. ఆ చింతతో ఆయన శ్రీవేంకటేశ్వరుని దర్శించి వెలుపలికి రాగానే ఒక గద్ద ఆయన ఎర్రటి తలపాగాకు ఆకర్షితమై దానిని తన్నుకు పోయి తీసుకుని పోయి చంద్రగిరి సమీపంలో జారవిడిచింది. గద్దను వెన్నంటి వెళ్ళిన రాజభటులు తలపాగాను తీసుకుని తిరిగి వచ్చి రాజుకు విషయం వివరించారు. నరసింహయాదవరాయలు అది తనచింతను తీర్చడానికి శ్రీవేంకటేశ్వరుడు చూపిన మార్గమని భావించి అక్కడ శత్రుదుర్భేధ్యమైన కోటను నిర్మించి రాజాధానిని అక్కడికి తరలించి పాలనకొనసాగించాడు.