చందమామ పిల్లల మాసపత్రిక/సంపుటము 1/జూలై 1947/చందమామ పజిల్
అబ్బాయిలూ, అమ్మాయిలూ!
మీరు పెద్దవాళ్ల సహాయం లేకుండా సొంతంగా ఆలోచించి ఈ పజిలు పూర్తి చేయాలి సుమా. అలా పూర్తిచేసి 58 పేజిలో ఉన్న జవాబుతో సరిచూసుకోండి. ఒక్క తప్పుకూడా లేకపోతే మీకు పది మార్కులు. ఒక తప్పుంటే ఆరు మార్కులు. రెండు తప్పులుంటే నాలుగు మార్కులు. మూడు తప్పులుంటే రెండుమార్కులు. నాలుగుగాని అంతకుమించిగాని తప్పులుంటే మాత్రం బండిసున్నా వచ్చినట్లే.
పోతే, దీన్ని పూర్తిచేసేపద్ధతి మీకు తెలుసునా ! నెంబరు అడ్డంలో మూడు అక్షరాలు వుండాలి. ఆధారములలో "బహుమతి" అని వుందా, దానికి మూడు అక్షరాల మాట ఏమైయ్యుండాలి అని ఆలోచించాలి. అప్పుడు "కానుక" వస్తుంది. అక్కడ 'కానుక' ఉంచండి.
అలాగే 1 నెంబరు నిలువు మూడు అక్షరాలు వుండాలి, దానిని వెతకటానికి "నాలుక మంట పుట్టించేది" ఏదా అని చూడాలి. దాని మొదటి అక్షరం "కా" - యిది ఏమబ్బా అని ఆలోచిస్తే "కారము" గుర్తుకు వస్తుంది. అట్లాగే తతిమ్మా గళ్లూ పూర్తిచేసి మీ మార్కులు నాకు చెప్పండి.
ఆధారములు అడ్డము: 1. బహుమతి. నిలువు: 1. నాలుక మంట పుట్టించేది 58 పేజీలో చిక్కుమాటకు జవాబు |
ఈ బొమ్మ, మాఊర్లో ఓ మేస్టరుది పిల్లలూ ఇతని మొహం చూశారా, ఎవరైన సరీగా ఆన్సరుచెప్తే ఇలాగే నవ్వుతాడు. కాని సరిగా ఆన్సరు చెప్పకపోతే అతని మొహం తిరగేసి చూడండి. ఎంత కోపంగా చూస్తున్నాడో. ఇల్లాంటి మేష్టర్లు ఉండకూడదు కదూ! బొమ్మ వేసినది: శీతాపతిరావు అన్నయ్య బరంపురం.
గొలుసుమాట చాలుచాలు - ఏమి చాలు? చందమామ సంపాదన: కాశేపల్లి శకుంతల, బందరు. |
ఎలికలకు ఇళ్లు ఈ సున్నాలో పది ఎలికెలు ఉన్నాయి. ఈ సున్నాలో మరిమూడు చిన్ని సున్నాలు గీసి, ఒక్కొక్క ఎలికెకు ఒక్కొక్క ఇల్లు వచ్చేటట్టుచేయాలి. చేయగలరా? లేకపోతే 58 పేజీలో చూడండి. మీకు తెలిసిపోతుంది. |
చెట్ల భాగాలు ఈ చదరంలో పన్నెండు చెట్లు ఉన్నాయి. ఈ భూమినీ, చెట్లనూ నలుగురు అన్నదమ్ములు సమానంగా పంచుకోవాలి. ఎవరికీ ఎక్కువ తక్కువ ఉండకూడదు. భాగించటం మీకు చేతకాకపోతే 58 వ పేజీ చూడండి తెలిసిపోతుంది. }} |
అబ్బాయిలూ, అమ్మాయిలూ!
మీరు మీ అక్కలూ, అమ్మలూ, అవ్వలూ పాడుతుంటే ఎన్నో పాటలు వినిఉంటారు. అవి కాగితంమీద రాసి పంపండి. అచ్చువేసి చిన్ని చిన్ని బహుమానాలు పంపుతాను. ఇంకా పిట్టకధలు, అమ్ముమ్మ చెప్పిన శాస్త్రాలూ అన్నీకూడా పంపండి. చక్కగా బొమ్మలతో అచ్చువేద్దాము. పంపుతారు కదూ? రచనలు ఈ క్రింది చిరునామాకు పంపండి.
సంపాదకుడు
చందమామ
37, ఆచారప్పన్ వీధి, మద్రాసు 1